chitika

WORLD FLAG COUNTER

Flag Counter

chitika

Thursday, 28 April 2016

DR KALAM'S SPEECH IN TELUGU ABOUT UNIVERSAL WATER CRISIS AND HOW TO SAVE WATER ON EARTH PLANETనీటి కరువు గురించి అబ్దుల్ కలాం గారి ప్రెజంటేషన్

ఈ రోజు ప్రపంచం ఎదురుకుంటున్న అనేక సమస్యల్లో ఒకటి నీటిఎద్దడి. 
అబ్దుల్ కలాం గారు నీటి కరువు గురించి ఒక ప్రెజంటేషన్ ఇచ్చారు. 
అది 2002 లో ఓ విదేశి మేగజైన్‌లో ప్రచురితమైంది. 
వారు భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించి, ఒక వ్యక్తి 2070 లో లేఖ రాస్తున్నట్టుగా చిత్రీకరించారు.
'ఇది 2070. నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను. కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది. నేను తీవ్రమైన మూత్రపిండ సమస్యలను ఎదురుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా నీరు త్రాగను..... త్రాగలేను, అంత నీరు ఇప్పుడు అంబాటులో లేదు.
నేను ఇక ఎక్కువ కాలం బ్రతకను, అదే నాకున్న పెద్ద భయం. ఇప్పుడున సమాజంలో అతి ఎక్కువ వయసున్న వ్యక్తులలో నేను కూడా ఒకడిని.
నాకు గుర్తుంది, అప్పుడు నాకు 5 ఏళ్ళు, అప్పడంతా పరిస్థితి వేరుగా ఉండేది. ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లు ఉండేవి, ఇళ్ళలో చక్కని తోటలు ఉండేవి, దాదాపు అరగంట పాటు షవర్ స్నానం చేసి ఆనందించేవాడిని. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు అంత నీరెక్కడుంది కనుక. అందుకే మేమిప్పుడు రసాయనపూత పూసిన టవల్స్‌తో శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాము. స్నానం చేయడమనేది అసలు లేనేలేదు. రసాయనాలతో శరీరం తుడుచుకోవడమే అందరూ చేస్తున్నారు.
ఇంతకముందు ఆడవాళ్ళకు అందమైన జుట్టు ఉండేది. కానీ ఇప్పుడు నీటి వాడకం తగ్గించడనికి అందరూ రోజు తల మొత్తం నున్నగా షేవ్ చేసుకుంటున్నారు. అప్పట్లో మా నాన్నగారు కారుని పైప్‌తో కడిగేవారు. ఇప్పుడా విషయం మా అబ్బాయికి చెప్తే, అంత నీరెలా వృధా చేస్తారంటూ నమ్మడంలేదు.
నాకు గుర్తుంది, నీటిని కాపాడండి, సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు, వాల్ పోస్టర్లు ఉండేవి, రేడియో, టి.వీ.ల్లో కూడా ప్రచారం చేసేవారు. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నీరనేది ఎప్పటి తరగని వనరని మాకు భావన ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే, నదులు, చెరువులు, బోర్లు, డ్యాములన్నీ పూర్తిగా ఎండిపోయాయి, లేదా పూర్తిగా కలుషితమయ్యాయి.
పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి, నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది. నీటి నుంచి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు మాత్రమే అధికశాతం ఉద్యోగ అవసరాలు తీరుస్తున్నాయి. వాటిలో పని చేసే కార్మీకులు డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకుంటున్నారు. నీరు కొనుక్కోవడమే గగనం అయ్యింది.
రోడ్డు మీద నీటి బాటిళ్ళు తీసుకువెళ్ళేవారిని చంపి, ఆ నీటిని దోచుకోవడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి. నీటిబాటిల్ కోసం అగంతకులు గన్‌తో భయపెడుతున్నారు. 80% ఆహారం అంతా కృతిమమే. నీరు లేకపోతే ఏం పండుతుంది?
గత రోజులలో కాస్త వయసున్న వ్యక్తి రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని సిపార్సు చేసేవారు. ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు త్రాగే 'అవకాశం' మాత్రమే ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ నీరు త్రాగనివ్వరు.
ఇప్పుడు మేము వాడి పడేసే బట్టలు ఉపయోగిస్తున్నాము. ఇంతకముందు వలే నేసిన బట్టలు వాడే రోజులు ఎప్పుడో పోయాయి. అటువంటి బట్టలు ధరించినా, వాటిని శుభ్రపరచడానికి నీరుంటే కదా.
ఇప్పుడు మేము డ్రైనేజి వ్యవస్థకు బదులుగా సెప్టిక్ ట్యాంకు వాడుతున్నాము. ఎందుకంటే డ్రైనేజి వ్యవస్థకు కూడా నీరు అవసరం.
జనాల యొక్క బాహ్యరూపం చాలా భయంకరంగా ఉంది. ముడతలు పడి, డిహైడ్రేషన్ కారణంగా కృశించి, అతినీలలోహిత కిరణాల కారణంగా శరీరం మొత్తం కురుపులు పడి, ఓజోన్ పొర లేని కారణంగా చాలా దారుణమైన చర్మవ్యాధులతో జనం తారసపడుతున్నారు. చర్మక్యాన్సర్, వాతప్రకోపిత రోగాలు, మూత్రపిండ సంబంధిత వ్యాధులే మరణాలకు ముఖ్యకారణాలు.
చర్మం అధికంగా పొడిబారడం వలన 20 ఏళ్ళ యువకులు 40 ఏళ్ళ వారిలా కనిపిస్తున్నారు. శాస్త్రవేత్తలు పరిశోధించినా, ఎటువంటి మార్గం కనుగొనలేకపోతున్నారు. నీటిని ఉత్పత్తి చేయలేము, చెట్లు, పచ్చదనం తగ్గిన కారణంగా ప్రాణవాయువు నాణ్యత తగ్గిపోయింది. ఆధునికతరాల వారి మేధాశక్తి దారుణంగా క్షీణించిపోయింది.
పురుషుల వీర్యకణాల్లో కూడా తేడాలు సంక్రమించాయి. ఆ కారణంగా కొత్తగా పుట్టే పిల్లలు అనేక అవయవ లోపాలతో, రోగాలతో పుడుతున్నారు.
గాలి పీలుస్తున్నందుకు గానూ ప్రభుత్వం ఇప్పుడు మా దగ్గరి నుంచి డబ్బులు వసూల్ చేస్తోంది. 137 కూబిక్ మీటర్ల గాలి మాత్రమే తీసుకునే అవకాశం ఇస్తోంది. ప్రజల ఊపిరి తిత్తులు ఎప్పుడో చెడిపోయాయి, అందుకే ఇప్పుడు సౌరశక్తితో నడిచే యాంత్రికమైన ఊపిరి తిత్తులు కనుగొన్నారు, వాటిని వెంటిలేటేడ్ జోన్స్ అనే ప్రత్యేక స్థలాల్లో అమరుస్తారు. డబ్బులు కట్టలేని వాళ్ళని వెంటిలేటేడ్ జోన్స్ నుండి వెళ్ళగొడతారు. అక్కడ కూడా ప్రజలు పీల్చే గాలి మంచిదేమీ కాదు, కానీ ఏదో పూటగడుస్తుందంతే.
కొన్ని దేశాల్లో ఇప్పటికి నదుల పక్కన పచ్చని మైదానాలు ఉన్నాయి. కానీ వాటిని రక్షించడం కోసం దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం అక్కడ ఉంది. నీరు ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది, బంగారం, వజ్రాలకంటే విలువైనదిగా అయిపోయింది.
నేనుడే చోట వృక్షాలు అసలే లేవు, ఎందుకంటే అక్కడ వర్షాలు అస్సలుకే పడవు. ఎప్పుడైన వర్షం పడినా, అది యాసిడ్ వర్షమే అవుతుంది. 20 వ శతాబ్దంలో పరిశ్రమలు చేసిన కాలుష్యం, అణు ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతిన్నది. అప్పట్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు, కానీ ఎవరూ వినలేదు, విన్నా పట్టించుకోలేదు.
నా కొడుకు, నా యవ్వనం గురించి మాట్లాడమన్నప్పుడు పచ్చని బైళ్ళ గురించి, అందమైన పువ్వుల గురించి, వానల గురించి, నదులు, డ్యాముల్లో ఈత కొట్టడం గురించి, చేపలు పట్టడం గురించి, కడుపు నిండుగా నీరు త్రాగడం గురించి, ప్రజల ఆరోగ్యం గురించే మాట్లాడుతాను.
అప్పుడు వాడు 'నాన్నా! ఇప్పుడు నీళ్ళెందుకు లేవు?' అని అడగ్గానే నా గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది. నాకు కలిగే అపరాధభావం నుంచి బయటపడలేను. ఎందుకంటే నా తరమే పర్యావరణవినాశనానికి దోహదపడింది, ఎన్ని హెచ్చరికలు చేసిన బేఖాతరు చేసింది. ఇప్పుడు నా పిల్లలు దానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవం ఇక ఎంతో కాలం ఉండదు. పర్యావరణ విధ్వంసం దారుణమైన స్థితికి చేరుకుంది, ఇప్పుడేమి చేసినా ఫలితం ఉండదు.
కాలంలో వెనక్కు వెళ్ళి మానవాళికి ఎలా చెప్పాలని ఉంది. ఈ భూమాతను కాపాడటానికి ఇంకా మనకు సమయం మిగిలే ఉందని. కానీ అదెలా సాధ్యం.
మీ అబ్దుల్ కలాం
ఇంకా సమయం మిగిలే ఉంది, భూమాతను, ప్రకృతిని కాపాడటానికి. రండి చేయి, చేయి కలుపుదాం. 


DAILY USEFUL KITCHEN ITEMS WHICH REDUCES OVER WEIGHT - HEAVY WEIGHT LOOSING TIPS WITH FRUITS OILS VEGETABLE - REGULAR DIET


బరువు తగ్గాలంటే...!

బరువు తగ్గేందుకు అటుఇటు పరుగులు పెట్టి... ఏవేవో చేసి... నీరసం వచ్చి ఆ ప్రయత్నాలన్నీ మానేయడమే తప్ప ఫలితం లేదని బాధపడేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే బరువు తగ్గేందుకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరంలేదు. ఇంట్లోనే బరువు తగ్గే టెక్నిక్స్‌ ఉన్నాయంటున్నారు గ్రాండ్‌మాస్‌. అయితే వాటిని ప్రతిరోజూ క్రమంతప్పకుండా పాటించాలి. ఆరోగ్య సమస్యలుంటే వైద్యుల సలహా తీసుకున్న తరువాతే వీటిని పాటించాలి.

* నిమ్మరసం - తేనె: ఒక టీస్పూన్‌ తేనె, అరచెక్క నిమ్మరసాల్ని ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో కలుపుకుని రోజులో ఎక్కువసార్లు తాగాలి.

* నిమ్మరసం: ఒబెసిటీ పనిపట్టాలంటే వట్టి నిమ్మరసం తాగినా గట్టి ఫలితమే ఉంటుంది. ఈ పద్ధతిలో ఏం చేయాలంటే మొదటిరోజు కేవలం నీళ్లు మాత్రమే తాగాలి. రెండో రోజు మూడు నిమ్మకాయల రసాన్ని, నీళ్లలో కలిపి ఆ రోజంతా తాగాలి. అలా రోజుకి పన్నెండు నిమ్మకాయల రసం తాగే వరకు చేయాలి. ఆ తరువాత నిమ్మకాయల సంఖ్యను నెమ్మదిగా తగ్గిస్తూ తిరిగి మూడు నిమ్మకాయలకు చేరుకునేవరకు తాగాలి. మొదటి రెండు రోజులు కాస్త నీరసంగా అనిపిస్తుంది. కాని ఏం పర్వాలేదు తరువాత మామూలు అయిపోతుంది.

* క్యాబేజి: బరువు తగ్గేందుకు క్యాబేజీ చాలా బాగా పనిచేస్తుంది. క్యాబేజీలో ఉండే టార్టారిక్‌ ఆమ్లం కార్బోహైడ్రేట్‌, చక్కెరల్ని కొవ్వుగా మారకుండా నిరోధిస్తుంది. అందుకని భోజనానికి బదులుగా క్యాబేజీ సలాడ్‌ని తింటే ఫలితం ఉంటుంది.

* టొమాటో: ఒకటి లేదా రెండు టొమాటోలను బ్రేక్‌ఫా్‌స్టగా తినాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు నెలలు చేస్తే సురక్షితంగా బరువు తగ్గొచ్చు.

* రాగులు: త్వరగా బరువు తగ్గాలంటే రాగులు దిబెస్ట్‌. రాగులు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అందుకని కార్బోహైడ్రేట్స్‌ శోషించుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. రాగులతో చేసిన వంటకాలు తింటే కడుపులో దండిగా అనిపించి త్వరగా ఆకలి కాదు. దాంతో లోపలికి తీసుకునే కాలరీలు తగ్గిపోతాయి. ఈ ప్రయోజంతో పాటు వీటిలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, విటమిన్‌ బి1, విటమిన్‌ బి2 వంటివి కూడా ఉంటాయి.

* బొప్పాయి: రాత్రి భోజనం బదులుగా బొప్పాయి సూప్‌ను రెండు లేదా మూడు నెలలు తీసుకుంటే బరువు తగ్గుతారు.

* రేగిపండ్లు: రాత్రిపూట గుప్పెడు రేగు ఆకులను నీళ్లలో నానబెట్టి ఉదయం లేచాక పరగడుపున ఆ నీళ్లు తాగేయాలి. ఇలా ఒక నెలరోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* అల్లం: పలుచగా కోసిన తాజా అల్లం ముక్కను భోజనానికి కొన్ని నిమిషాల ముందు నోట్లోపెట్టుకుని చప్పరించాలి. లేదా చిన్న అల్లం ముక్కను తురిమి నిమ్మరసం, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని చిటికెడు తీసుకుని తరచుగా నోట్లో వేసుకుని చప్పరిస్తుండాలి.

• భారం తగ్గించే డైట్‌

బరువు తగ్గాలనుకునే వాళ్లు లిక్విడ్స్‌ లేదా జ్యూస్‌లను వారం నుంచి పది రోజులు తాగాలి. దాంతోపాటు నాలుగు లేదా ఐదు రోజులు అన్ని పండ్లు తినాలి.
ఆరెంజ్‌, ద్రాక్ష, నిమ్మ, క్యాబేజి, సెలరీలను లిక్విడ్‌ డైట్‌లో భాగంగా తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఉపవాసం పూర్తయ్యాక సమతులాహారాన్ని తీసుకోవాలి. అందులో గింజధాన్యాలు, కాయగూరలు, పండ్లు, చిరుధాన్యాలు, నట్స్‌, తాజా జ్యూస్‌లు తప్పక ఉండాలి. ఇలా చేయడం వల్ల తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా ఉండొచ్చు.

బరువు తగ్గాలంటే పూర్తిగా మానేయాల్సిన ఆహారం బటర్‌, చీజ్‌, చాకొలెట్‌, కేక్స్‌, మీగడ, వేపుళ్లు, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉన్న బ్రెడ్‌, కుకీలు, బంగాళాదుంపలు, పంచదార వంటివి.

సహజ ఆహారాన్ని తీసుకోవాలి. సైక్లింగ్‌, వాకింగ్‌, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలు చేయాలి. ఇవి బరువుని అదుపులో ఉంచుతాయి. యోగ, శ్వాస సంబంధిత వ్యాయామాలు బరువు తగ్గించడంలో, తగ్గిన బరువు పెరగకుండా ఉంచడంలో సాయపడతాయి.

వీటన్నింటితో పాటు ఆందోళన, భయం, కోపం, అభద్రత వంటి భావాలను వదిలేసి జీవితాన్ని సానుకూలంగా గడపాలి.

HOT SUMMER 2016 SKIN CARE BEAUTY TIPS WITH FRUITS AND VEGETABLE IN TELUGUవేసవిలో చర్మ రక్షణకోసం

రోజురోజుకీ భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. వేడి బారిన పడి చర్మం పగిలిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు తలెతుతాయి. వీటినుంచి బయట పడాలంటే ఈ సమ్మర్‌ ఫ్రూట్స్‌ను తినాలి. 

పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇందులో సి- విటమిన్‌ పుష్కలం. ఇది తింటే చర్మానికి మంచిది.

బ్లాక్‌ బెర్రీస్‌, సా్ట్రబెర్రీ్‌సలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. దీని వల్ల చర్మం పాడవదు.

విటమిన్లు, మినరల్స్‌ పైనాపిల్‌లో అధికంగా ఉంటాయి. ఇందులోని బ్రొమలిన్‌ చర్మంపై వచ్చిన బొబ్బలు మంటపెట్టకుండా కాపాడుతుంది.

నిమ్మ, బత్తాయి పండ్లు, నారింజ, ద్రాక్ష పండ్లలో ఎక్కువగా సిట్రస్‌ ఆమ్లం ఉంటుంది. సి-విటమిన్‌తో పాటు అమినో యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా ఉంచుతాయి.
కీరా దోసకాయల్లో నీటిశాతం ఎక్కువ. శరీరానికే కాదు చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కీరాను తినాలి.

సమ్మర్‌లో టొమాటోలు తినటం వల్ల చర్మంపైన ముడతలు తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఎండాకాలంలో కూల్‌డ్రింక్స్‌ కంటే కొబ్బరి నీళ్లు తాగటం మంచిది. కొబ్బరినీళ్లు తాగితే ఎండబారిన పడ్డ శరీరం దెబ్బతినదు. మృదువుగా ఉంచుతుంది.

Tuesday, 26 April 2016

VEMULAWADA BHIMA KAVI - OM KARAM


యో వేదా దౌస్వరః ప్రాక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః |
తస్య ప్రకృతిలీనస్య యః పరస్సభీమలింగేశ్వరః ||
ఓంకారం విశ్వాన్ని విచ్చిన్నంకాకుండ కాపాడుతుంది, వేదవిజ్ఞానం విశ్వంలోని మానవులకు జ్ఞానాన్ని పంచుతుంది మరియు జీవనగమనాన్ని తెలుపుతుంది. ఓంకారం, వేదవిజ్ఞానం మానవ జీవితాలకు అనుసందానంగా, మార్గదర్శకంగా ఉన్నాయి.
“ ఓంకారం పరమశివుడి ప్రతిరూపం, వేదం బ్రహ్మ స్వరూపం ”
పరమాత్ముడు సృష్ఠిస్థితలయకారకుడు, ఈ సృష్ఠిలో జీవి తమ జీవనగమనంలో ముఖ్యంగా మానవజీవనంలో స్థబ్దత వచ్చిన ప్రతిసారి పరమాత్ముడు మానవరూపంలో అవతరిస్తున్నాడు, మానవజన్మ ఆవశ్యకతను తెలియపరుస్తున్నాడు.
అందులో భాగంగానే భరతఖండంలో రాజ్యహింసలు జరుగుతున్న తరుణంలో, ప్రజలు ప్రకృతి విపత్తులతో సతమతమవుతున్నప్పుడు పరమేశ్వరుడి ప్రతినిధిగా, ప్రతిరూపంగా తూర్పు గోదావరి జిల్లా, కరప మండలంలో గల వేములవాడ గ్రామమున శ్రీమతి మాచమ్మ మరియు శ్రీ సోమనాథమాత్యులు దంపతులకు ధ్రాక్షరామ భీమేశ్వర వరప్రసాదంగా ఒక మగ శిశువు జన్మించాడు. ధ్రాక్షరామ భీమేశ్వర వరప్రసాదంగా బిడ్డ జన్మించాడు కాబట్టి ఆ బిడ్డకు భీమన్న అని నామకరణం చెసారు.
ధ్రాక్షరామ భీమేశ్వర వరప్రసాదంగా, ప్రతిరూపంగా ఈ భువిపై మానవరూపాన జన్మిచాడు కాబట్టి జనజాగృతి చెయదలచి మెదటి దశలో కవిగా(వేములవాడ భీమకవి) తన పద్యకుసుమాలద్వారా మానవజన్మ ఆవశ్యకతను తెలియపరిచాడు. మలిదశలో పరమేశ్వరుడి ప్రతిరూపం భీమలింగేశ్వరుడిగా దేశాటనం చేస్తూ చివరగా అనంతపురం జిల్లా, విడపనకల్లు మండలం, గడేకల్లు గ్రామములో జీవసమాధినోందా

Monday, 25 April 2016

THE ORIGIN OF HANUMAN CHALISA PRAYER - IMPORTANCE OF LORD HANUMAN PRAYER - HANUMAN CHALISA


హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? ఎందుకోసం
ఆపదలుబాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమయిన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము.
వారణాసిలో నివసిస్తూవున్నసంత్ తులసీదాస్ : రామనామగాననిరతుడయిబ్రహ్మానందములోతేలియాడుతుండేవారు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలువెల్లువలవుతుండేవి. వారిప్రభావమువలన ప్రభావితులయిన జనం వారిద్వరా రామనామ దీక్ష తీసుకుని రామనామరసోపాసన లో తేలియాడుతుండేవారు. ఎంతోమంది ఇతర మతాలకుచెందిన భక్తులుకూడా రామనామ భజనపరులుకావటం జరుగుతున్నది. ఐతే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాలపట్లమాత్రమే మొండి పట్టుదలకల ఆ మతగురువులకు ఇది కంటగింపుగా వున్నది. వారు తులసీదాసు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మనమతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషావారికి పంపుతుండేవారు.
ఇదిలాఉండగా వారణాసిలో వున్న ఒక సదాచారవంతుడయిన గృహస్తు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం చేసాడు. వారిద్దరూ చిలకా గోరింకలులా వారిద్దరూ అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తున్నారు. కానీ కాలానికి ఈ సుఖ దు:ఖాల తో పనిలేదు కదా ! విధివక్రించి హఠాత్తుగా ఆయువకుడు కన్ను మూసా డు. ఆ అమ్మాయి గుండెపగిలి ఘోరంగా విలపిస్తున్నది. తలబాదుకుంటూ విలపిస్తున్న ఆతల్లిశోకానికి అందరిగుండెలూ ద్రవించిపోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవుకనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు. శవ్వాన్ని పాడెమీద పనుకోబెట్టి మోసుకుని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళనీయకుండా అడ్డంపడి రోదిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని వుండగా శవ యాత్రసాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగనే సాగుతుంది. శవవాహకులు ఆశ్రమం దాటే సమాయానికి అక్కడ ఇంటివద్ద పట్టుకున్నవారిని విదిలించుకుని మృతుని భార్య పరుగుపరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమములోకి పరుగిడి, ధ్యానస్తులైవున్న తులసీదాసుగారి పాదాలపైన వాలివిలపించటం మొదలెట్టింది.
గాజులు , కాలి అందెల శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. దానితో ఆయువతి మరింత బిగ్గరగా ఏడుస్తుండటం తో కనులుతెరచిన సంత్ , అమ్మా ! నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లీ ! ఎందుకిలా దు:ఖిస్తున్నావని అడిగారు. అప్పుడామె తండ్రీ ! నాలాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్ధమయినేదని బాధపడుతున్నాను అని దు:ఖిస్తూ పలికింది. అమ్మా నా నోట రాముడు అసత్యం పలికించడే ! ఏమయినదమ్మా ! అని అనునయించాడు. తండ్రీ ! ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో నాతలరాత నాపసుపుకుంకుమలను మంటలలో కలిపేందుకు వెళుతున్నదని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళీ శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్య కొద్దిగా ఆపండి ,అని ఆపి ఆశవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు.
దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది. అదిచూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. దీనితో ఆయనగురించి మరింత ప్రాచుర్యం జరిగి ,తండోపతండాలుగా జనం వారినిదర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువయినది.
ఇదే అదనుగా భావించిన ఇతరమత గురువులు ఢీల్లీ పాదుషావారికి స్వయముగా వెళ్ళి ,తులసీదాస్ రామ నామము గొప్పదని చెబుతూ మన మతస్తులను ,అమాయకులను మోసంచేస్తున్నాడని, పలుఫిర్యాదులు చేసారు. దానితో ఢిల్లీ పాదుషా విచారణకోసం సంత్ గారిని ఢిల్లీ దర్భారుకు పిలిపించారు.
తులసీదాస్ గారూ మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట. నిజమేనా ? అని పాదుషా ప్రశ్న.
అవునుప్రభూ ! సృష్టిలోని సకలానికీ ఆధారమయిన రామనామ మహిమను వర్ణించ నెవరితరము.?
అలాగా? రామనామముతో దేనినయినా సాధించగలమని చెబుతున్నారట నిజమేనా?
అవును ! రామనామము తో సాధించనిదేమున్నది.
మరణాన్ని సహితం జయించకలదని చెప్పారట?
అవును ప్రభూ ! రామనామానికి తిరుగేమున్నది.
సరే ! మేమిప్పుడొక శవాన్ని తెప్పిస్తాము ,దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి ,అప్పుడు నమ్ముతాము.
క్షమించాలి ప్రభూ! జననమరణాలు జగత్ప్రభువు ఇచ్చాను సారంగా జరుగుతాయి . మనకోరికలతో కాదు.
చూడు తులసీదాస్ జీ మీరు మీమాటను నిలుపుకోలేక మీరుచెప్పే అబద్దాలను నిరూపించుకో లేక ఇలాంటి మాటలు చెబుతున్నారు . మీరామనామము ,మీరుచెప్పినవి అబద్దాలని చెప్పండి వదలివేస్తాము అని పాదుషా ఆగ్రహించాడు.
రామనామము దాని మహిమ సత్యమని పలికిన తులసీదాస్ మోసగాడిగా భావించిన పాదు\షా చివరికి తులసీ నీకు చివరి అవకాశం ఇస్తున్నాను .రామనామము మహిమ అబద్దమని చెప్పి ప్రాణాలుదక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని మొండిగా ఆజ్ఞా పించాడు. అప్పుడు తులసీదాసు ఈ విపత్కర పరిస్తితిని కల్పించిన నువ్వే పరిష్క్రించుకోవాలని మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన మగ్నుడయ్యాడు. అది తనను ధిక్కరించటమని భావించిన పాదుషా ,తులసీ దాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు.
అంతే ! ఎక్కడనుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీ దాసును బంధించవచ్చే సైనికులవద్ద ,ఇతర సైనికులవద్ద ఆయుధాలు లాక్కుని వారికేగురిపెట్టి, అందరినీ కదలకుండా చేసాయి. సభికులు ,ఏకోతి మీదపడి కరుస్తుందోనని హడలిపోతూ వున్నారు. ఈ కలకలానికి కనులువిప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది . దీనికి కారణమేమిటాని చుట్టూ చూడగా , సిమ్హద్వారము మీద ఆసీనులై వున్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో ఒడలు పులకించిన సంత్ ...... జయ హనుమాన జ్ఞాన గుణసాగర............ అంటూ 40 దోహాలతో ఆశువుగా వర్ణించాడు.
దానితో ప్రసన్నుడయిన పవనసుతుడు, తులసీ నీ స్తోత్రంతో మాకు ఆనందమయినది నీకేమ్ కావాలో కోరుకో అని అన్నారు.
అయితే మహాత్ములెప్పుడూ తమస్వార్ధంకోసం కాక లోకక్షేమం కోసము మాత్రమే ఆలోచిస్తారు కనుక , తండ్రీ ! ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమివ్వాలని విన్నవించుకున్నాడు.
దానితో మరింతప్రియం కలిగిన స్వామి , తులసీ మాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ఈస్తోత్రంతో మమ్మెవరు స్తుతించినా వారిరక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు.
అప్పటినుండి ఇప్పటివరకు హనుమంతుని చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై నెరవేరుస్తూనేవున్నది.

జయ హనుమంత మహా బలవంత.


ANCIENT INDIAN AYURVEDIC MEDICINE - TURMERIC - NUMBER OF BENEFITS WITH TURMERIC USAGE - REDUCES MEMORY LOSS PROBLEM - CONTROLS BLOOD PRESSURE ETC


భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు
వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీ బయోటిక్‌, కాన్సర్‌ నిరోధక, ఇన్‌ఫ్లమేషన్‌ నిరోధించేవి, ట్యూమర్‌ కలుగకుండా వుండే, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కలిగి ఉన్న వందలాది పరమాణువులున్నాయి
ఎన్నో వ్యాధులకు మందు :
మొటిమలు : జామ ఆకులు పసుపు తో కలిపి నూరి రాయాలి ,
కఫము : వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి . కఫము తగ్గుతుంది .
రక్త శుద్ధి : ఆహారపదార్ధాలలో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది .
దగ్గు ,జలుబు : మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టాలి ,
నొప్పులు , బెనుకులు : పసుపు , ఉప్పు , సున్నము కలిపి పట్టువేయాలి .
డయాబెటిస్ : ఉసిరి పొడి తో పసుపు కలిపి బీర్లో కరిగించి తాగాలి .మధుమేహవ్యాధి అదుపులో ఉంటుంది. చిన్న గ్లాసు నీళ్ళ లో ఒక పసుపు కొమ్ము చేసి రాత్రంతా నానబెట్టి ... పొద్దునా లేచేక పసుపు కొమ్ము తేసేసి నీల్లలు ఒక చెంచా తో బాగా కలిపి పరగడుపున తాగితే చాలు చెక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది . ఈ నీళ్లు కొలెస్టిరాల్ ను , రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది .
తలతిరుగుడు : పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవాలి .
అల్జిమార్ వ్యాధి : పసుపు లో ఉండే "కర్కుమిన్ " అనే పదార్ధము మతిమరుపును అరికడుతుంది.


LORD SRI SUBRAHMANYESWARA SWAMY THATHWAM


సుబ్రహ్మణ్య తత్వం 

మనుజులకు అతి దగ్గరగా ఉండువాడు సుబ్రహ్మణ్యుడు .
భూమి యందు పుట్టి నడయాడు మనుజులకి ,
వారి వారి అవసరాలకు తీర్చుటకే ఆవిర్భవించిన రూపం ...స్కంద రూపం .
ఋణ విముక్తి స్వరూపం ,
భార్య,భర్తల ఆకర్షణీయ రూపం...సుబ్రహ్మణ్యేస్వరం ,
సంతాన భాగ్యములిచ్చి,ఇరువురులకి పు:న్నామ విముక్తి కరుడు ఈ మహనీయుడు ..
కాల సర్ప దోష నివారణ కు రాహు,కేతువుల అంశయై ,
అంశ గా నిలబడిన వాడు కుమారా స్వరూపుడు ఇతడే ...
సకల నమ్మిన భక్తులకు కల,యిల లోన సర్పరూపంబున్,
దర్శన మిచ్చి దరికి చేర్చుకునే వాడు...
పార్వతీ పరమేశ్వర కుమారుడు కార్తికేయుడు...
మంగళమని మహామంగళ కరమైన స్వరుపంబుతోడ ,
ఇరువురుల రక్షణాత్మ స్వరూపమే గణేశ,సుబ్రహ్మన్యుడు ,
సకలములకు తన అంశ గా నిలిచి,
నవగ్రహములలో కుజుడు,రాహు కేతువులుగా నడయాడుతూ
భూదేవి అంశగా,మరియు నరసింహుని అంశ గా
జనజ్జనని అంశ స్వరూపమై నాగేన్ద్రుడిగా ,నాగదేవతగా ,
మన బిడ్డలని రక్షిస్తూ నడయాడుతున్న షణ్ముఖుడు ఇతడే ...
సర్వ సైన్యాధ్యక్షుడిగా వుంది మనుజులకు,
శరీర కాంతి చెవిపోటుకి కారణ రూపుడు ఇతడే ...శరవణభవుడు....
వివాహములో,మాంగల్య యోగంబులకు తన వద్దకు రప్పించుకుని,
తన అర్చన యోగంబులనిచ్చి, ఇంట మంగళ ప్రధముడుగా నడయాడువాడు ,
ఆ సర్వ మంగళ స్వరూపిణి కుమారుడే సుబ్బారాయుడు.
ఆవుపాలు ,తేనె ,చలిమిడి,బియ్యపు నూక ,అరటి పళ్ళు,
ఇవి అన్నియు వడ్డించి ......ఆది .,మంగళ .....
పౌర్ణమి ,షష్టి,కృత్తికా నక్షత్రము తిథులలో ఆరాధనా చేసి
అనంత రూపుడై , నడయాడు సుబ్రహ్మణ్యుడే ...
మనకి సర్ప రూపుడు ,సందర్శనాత్మ రూపుడు ఇతడే....
ఇన్నిటికి దగ్గరగా వుండే వల్లి,దేవసేనా సమేత ,సుబ్రహ్మణ్యేశ్వరుడు

VISWA NATA CHAKRAVARTHY - DR S.V.RANGA RAO - TOLLYWOOD LEGENDARY ACTOR


పులి ..పులి.. బెబ్బులి పులి 
విశ్వ నట చక్రవర్తి..యశస్వి..ఎస్ వి .ఆర్ జయంతి 

హాస్య పాత్రల్లో చతు రంగారావు...!!
దుష్టపాత్రల్లో క్రూ రంగారావు...!!
ప్రతినాయక పాత్రలలో భయంక రంగారావు...!!
హాయిగొలిపేసన్నివేశాలలో టింగు రంగారావు
శ్రుతి మించని రొమాన్సులో పూల రంగారావు...!!
సినీనిర్మాతలకు డబ్బులన్దించే కొంగుబంగా రంగా రావు...!!
దయ జాలి పాత్రలలోఎంతో ఉదా రంగా రావు...!!
ఆంధ్ర ప్రజలకళాత్రుష్టన తీర్చిన నదీ తీ రంగారావు..!!
ఆయన శైలీ ఠీవీ అన్యులకు కోరంగారావు ...!!!
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు...!! 
చిత్రసీమలో అహం,అసూయ లకు ఎంతో దూ రంగారావు ..!! 
తెలుగువారికి భగవంతుడిచ్చిన అద్భుత వ రంగారావు ..!!
తెలుగు కళామతల్లి మేడలో మెరిసే అద్భుత హా రంగారావు...!!


SRI HANUMANTHUNI PRADHIKSHANALU - LORD HANUMAN PRAYER IN TELUGU


శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు

శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు
హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమదాలయానికి వెళ్లిన ప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణ న మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లో కాలు చదువు కొనాలి. సకల రోగ, భూత ప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్ట కి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొంద న వారెంద రో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధ లో ఉన్న ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వానిని లెక్కించుటకు వాడుట మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చతువ వలసిన ధ్యానం ' శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'
శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసిచివరిలో స్వామికి విశేషర్చన జరిపించి'' మయాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వర దో భూత్వా మామాభిష్ట సిద్దం ద దాతు'' అని జలమును అక్షత లతో వదలి పెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం,
శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
ఆచరణ: భక్తులకు ఏ బాధలు కల్గినా నియమాలు చెప్పి వారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వార తోలగునట్లు చేయాలి. హనుమత్పు దక్షిణ ధ్యానం శీలాఫలకం పై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెల్పాలి.
అభి షేకం
పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కావున ఆయనకు అభిషేకం ఇష్టం. అందునా మన్యు సూక్త భిషేకంచే పర మానంద భరితుదౌతాడు. కోరికలి తీ రుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర నాడు తప్పక చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగల్గుట మరీ మంచిది.
ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెల్పి ప్రతి పర్వది నానా దాతల ద్వారా అభిషేకం జారి పింపజేయాలి.


CHANDAMAMA STORY ABOUT POWER IN TELUGU


చందమామ కధ.!
.
పూర్వం విష్ణు శర్మ అనే ఒక రాజుండే వాడు.అతడికి విపరీత మయిన కథల పిచ్చి.తన ఆస్థానం లో వున్న వారి నందరినీ కథలు చెప్పమని సతాయించేవాడు.అందరికీ విసుగై పోయింది. మంత్రి రాజుతో సంప్రదించి రాజుకు కథలు చెప్పడానికి ఎవరైనా రావచ్చుననీ తగిన బహుమానం యివ్వ బడుతుందనీ టముకు వేయించాడు.
ఎంతమందో వచ్చి ఆయనకు ఎన్నో కథలు వినిపించేవారు.ఎన్ని చెప్పినా ఆయన యింకా చెప్పమని అడిగే వాడు.అతనికి విసుగే వుండేది కాదు.ఎంత మంది వచ్చినా రాజును తృప్తి పరచ లేక పోయారు.నాకు కథలు చెప్పి తృప్తి పరిస్తే సగం రాజ్యమిస్తాను లేకుంటే మరణ శిక్ష అని ప్రకటించాడు.కొంత మంది యువకులుసగం రాజ్యం ఆశతోవచ్చారు ఆ యనను సంతృప్తి పరచలేక మరణించారు.ఆఖరుకు మరణ భయం తో ఎవరూ రావడం లేదు.రాజు మంత్రిని పదే పదే ఈ విషయం గురించి సతాయించే వాడు.

ఒకనాడు ఒక బీద బ్రాహ్మణుడు నేను మీకు కథ చెప్తానని వచ్చాడు.సరే నని రాజు కూర్చున్నాడు.ఆ బ్రాహ్మణుడు కథ చెప్పడం మొదులు పెట్టాడు.ఒక వూరిలో ఒక రైతు ఉండేవాడు అతను తనపొలం లో జొన్నలు పండించాడు.ఆ సారి వర్షాలు బాగా పడి విపరీత మైన పంట పండింది.ఆ రైతు ఒక పెద్ద గోదాము కట్టించి వంద పుట్ల జొన్నలను అందులో వుంచాడు.దాన్నిఅన్ని పక్కలనుంచీ మూసివేసినా ఒక మూల చిన్న కంత వుండి పోయింది.అది ఒక పిట్ట చూసింది.ఆ కంత లోనుంచి లోపలి పోయి తనముక్కున ఒక గింజ కరుచుకొని పోయింది మళ్ళీ వచ్చి ఒక గింజ ముక్కున కరుచుకొని పోయింది యిది చూసి మిగతా పిట్టలు కూడా వచ్చి ఒక్కో గింజా ముక్కున కరుచుకొని పోతూ వున్నాయి.ఒక పిట్టా ఒక గింజ,ఒకపిట్టా 

ఒకగింజ అంటూ అదే మాట చెప్తూ వచ్చాడు దినాలు గడుస్తున్నా అదే చెప్తూ వున్నాడు.రాజుకు విసుగు పుట్టింది తరువాతి కథ చెప్పకుండా యిదేమిటి?అని విసుక్కున్నాడు.అందుకు అతను మహారాజా!మరి అన్ని పుట్ల ధాన్యం అయిపోవాలికదా! ఆ తరువాతే మిగతా కథ అని మరీ ఒక పిట్టా ఒక గింజ అని మొదులు పెట్టాడు..రాజుగారికి తల బొప్పి కట్టింది.యింక చాలించు మహా ప్రభూ అన్నాడు.అందుకు వాడు 

ఎలా చాలించేది ప్రభూ!చాలిస్తే నా చావు తప్పదు కదా! అని మరీ మొదులు పెట్టాడు.రాజుకు విసుగు పుట్టి
యిక మీదట కథలు చెప్పమని అడగను నీకు అర్ధ రాజ్యం యిస్తాను దయచేసి యింక చాలించు అన్నాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా అన్నారు బాగుంది.యింకేప్పుడూ కథలు చెప్పమని ఎవరినీ యిబ్బంది పెట్టకండి.అని అర్ధ రాజ్యం నాకేమీ వద్దు కొంత ధనం యిప్పించండి చాలు అన్నాడు.అప్పుడు రాజు అతనికి 

జీవితానికి సరి పడా ధనం యిచ్చి పంపించాడు.అందరూ ఈ కథల పీడ వదిలించి నందుకు ఆ బ్రాహ్మడిని అభినందించి ఊపిరి పీల్చు కున్నారు..అప్పటి నుండీ ఆ రాజు బుద్ధి తెచ్చుకొని ప్రజానురంజకంగా పరిపాలించాడు.

అధికారం చేతిలో వుంది కదా! అని ఎవరు కూడా ప్రజలను,తనక్రింది అధికారులనూ సతాయించ కూడదు.ఏ విషయం లోనైనా సరే.

Saturday, 23 April 2016

BRIEF INFORMATION ABOUT WORLD FAMOUS ANDHRAs KOHINOOR DIAMOND IN TELUGU


 కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపద

కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, మొత్తం భారతదేశంలో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము (కోహ్=పర్వతం, నూర్=కాంతి).

* ఉపోద్ఘాతము

కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము. ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కినది. 1877లో విక్టోరియా మహారాణి హిందూదేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది. అన్ని ప్రఖ్యాత వజ్రాలవలె కోహినూరు వజ్రము చుట్టూ పలు కథలు, కథనాలు అల్లబడ్డాయి. ఇది ధరించిన మగవారికి శాపముగా, ఆడువారికి మేలు చేకూర్చునట్లు చెప్పబడుతుంది.

* చరిత్ర

భారతదేశంలో
భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూరు. కోహినూరు వజ్రం తెలుగునాట కొల్లూరు గనులులో ఈ ప్రఖ్యాతమైన వజ్రం లభించింది. మాల్వా రాజు మహలక్ ‌దేవ్‌ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఆయన చేతిలో క్రీ.శ.1300లో ఈ వజ్రం ఉండేదని, క్రీ.శ.1305లో వింధ్యకు నర్మదకు మధ్యభాగాన్ని దాదాపు వేయి సంవత్సరాలు పరిపాలించిన మాల్వా పాలకవంశాన్ని తుదకు అల్లాఉద్దీన్ జయించి అక్కడి ధనరాశులన్నిటితో పాటుగా కోహినూరును కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.

ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు. ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్‌తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు. తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్దిరోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసినా వజ్రాన్ని నిలపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు.

ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది.
బాబర్ తన కుమారుడు, సామ్రాజ్యవారసుడూ అయిన హుమాయున్‌కి ఇచ్చారు. హుమాయున్ దానిని అంత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు. 1530లో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరాల్లో హుమాయున్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షేర్షా తిరుగుబాటు వల్ల 1539-40 నవంబరు నెలలో రెండుమార్లు యుద్ధం చేసినా హుమాయున్ అతనిపై ఓటమిచెందారు. హుమాయున్ రాజ్యాన్ని పరిమితం చేసుకని, ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు.

అప్పట్లో ఈ వజ్రాన్ని చేజిక్కించుకునేందుకు మార్వాడ్ రాజు రాజా మాల్దేవు రాజ్యం దగ్గరలో హుమయూన్ ఉన్నప్పుడు ఎలాగైనా దీన్ని సాధించాలని ప్రయత్నించారు. అందుకోసం బాబర్‌ నామాలో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ "ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది' అన్నాడు. తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు. 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్‌ వశమై 'బాబర్‌ వజ్రం'గా పేరు పొందింది. మొఘల్‌ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు.

మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు. మహమ్మద్‌ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి, తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు. అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్‌ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్‌షాకు ధారాదత్తం చేస్తాడు. నాదిర్‌షా దాన్ని చూడగానే కోహ్‌ - ఇ- నూర్‌ (కాంతి శిఖరం) అని అభివర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది.

* భారతదేశం నుంచి ఇంగ్లాండ్‌కు

చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్‌ ద్వారా బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది. సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.

తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్‌ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. ఈ కారణంగా కోహినూర్‌ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947 మరియు 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.

* వెలుగులకొండ విశేషాలు

01. బ్రిటిష్‌రాణి కిరీటంలో రెండువేల ఎనిమిదివందల వజ్రాల మధ్య రారాజులా వెలిగిపోతున్న కోహినూర్‌ వజ్రాన్ని, సుల్తాన్‌గంజ్‌ బుద్ధ విగ్రహాన్ని ఇవ్వాలంటూ భారత్‌ చేసిన ప్రతిపాదనను బ్రిటన్‌ తోసిపుచ్చింది.

02. కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారు ఉన్నారు.
బ్రిటిష్‌ రాజకుటుంబం కోహినూరు వజ్రాన్ని ఆ ఇంటి పెద్దకోడలికి వారసత్వ కానుకగా ఇస్తోంది.

03. బాబర్‌ చక్రవర్తి నూట ఎనభైఆరు క్యారెట్ల బరువైన ఆ వజ్రం ఖరీదు 'ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం పెట్టినంత' అన్నాడట.

04. ఆల్బర్ట్‌ యువరాజు దానిని సానబట్టిస్తే రెండువేల వజ్రాలు అరిగిపోయాయి. బరువు నూటఅయిదు క్యారెట్లకు పడిపోయింది.

STOP USING PAIN KILLERS REGULARLY WHICH LEADS TO SEVERE HEALTH DISORDERS


పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా.. వాటితో ప్రమాదమే!!

ఒళ్లు నొప్పులనో, తలనొప్పిగా ఉందనో… కొంతమంది నొప్పి రాగానే పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్స్ వాడుతుంటారు. చిన్న చితక నొప్పులే కదా అని మరికొందరు డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండా తాత్కాలిక ఉపశమనం కోసం మందులను వాడుతుంటారు. అటువంటి మందులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా… దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

తాజాగా పెయిన్ కిల్లర్స్ పై చేసిన పరిశోధనల్లో.. ఊహించిన దానికంటే ఎక్కువ ముప్పు నిర్ధారణ అయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మాత్రలతో అల్సర్లు, బీపీ పెరగడం తదితర ఇబ్బందులు ఎదురవుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌ పరిశోధకులు వివరించారు. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారు పెయిన్‌ కిల్లర్‌ మాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

నాన్‌ స్టెరాయిడల్‌ యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ డ్రగ్స్‌(ఎన్‌ఎస్ఏఐడీ)గా వ్యవహరించే ఈ మాత్రలను సాధారణ నొప్పుల నుంచి మొదలుకొని పలు రకాల వ్యాధుల నివారణకు వాడుతుంటారని చెప్పారు. కండరాలు, ఎముకల వ్యవస్థ, వాపు, నొప్పి తదితర ఇబ్బందులనుంచి రోగులకు ఉపశమనం కలిగించేందుకు వైద్యులు ఈ మాత్రలను సూచిస్తుంటారని… అయితే, ఈ చికిత్స దీర్ఘకాలంలో బీపీ పెరగడానికి, అల్సర్లకు దారితీస్తుందని వర్సిటీకి చెందిన మార్టెన్‌ స్కిమిడిట్‌ తెలిపారు.
రోగులకు ఉపశమనం కలిగించేందుకు ఎన్‌ఎస్ఏఐడీ మందులను రాసేముందు వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇకపోతే ప్రిస్కిప్షన్‌ లేకుండా అమ్మకాలు జరిపే విషయంలో ఆయా మాత్రల వాడకం గురించి కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని, డాక్టర్ల సలహా మేరకు మాత్రమే పెయిన్ కిలర్స్ వాడాలని సూచించారు.

BRIEF HISTORY OF ACHARYA NAGARJUNA


ఆచార్య నాగార్జునుడు

'ఆచార్య నాగార్జునుడు (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. కనిష్క చక్రవర్తి సమకాలికుడైన అశ్వఘోషుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి మాధ్యమిక సూత్రములను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశమునకు మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు . ప్రజ్ఞాపరమిత సూత్రములు కూడ నాగార్జునుడే రచించాడని అంటారు. నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడ అంటారు.

* జీవితం

నాగార్జునుని జీవితము గురించి మనకు చాల తక్కువగా తెలియవచ్చింది. ఛైనా, టిబెటన్ భాషలలో నాగార్జునుని జీవిత చరిత్ర ఆతని మరణము తరువాత పలు శతాబ్దములు గడచిన పిదప వ్రాయబడింది. కొన్ని ఆధారములను బట్టి ఈతడు అంధ్ర దేశమునకు చెందిన వైదీక బ్రాహ్మణుడు. నాగార్జునుడు బాల్యంలోనే సన్యసించి హిందూ తత్వశాస్త్రాన్ని ఆభ్యసించాడు. ఆ తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు. నాగార్జునుడు విదర్భకు చెందినవాడని మరియొక అభిప్రాయము. వేదశాస్త్రములలో పాండిత్యము సంపాదించి హిమాలయములలో విస్తృతముగా పర్యటించి బౌద్ధము పట్ల ఆకర్షితుడై నలందా చేరాడు. అచట ప్రఖ్యాత ఆచార్యుడు రాహులభద్ర వద్ద శిష్యరికము చేసి నలందాలోనే అచార్యునిగా పలు సంవత్సరాలు బోధించాడు. పిదప కృష్ణానదీ లోయలోని శ్రీపర్వతము చేరి స్థిరపడ్డాడు. దగ్గరలోని ధాన్యకటకములోని విశ్వవిద్యాలములో ముఖ్య అచార్యునిగా బోధలు చేశాడు.

నాగార్జునుని అభిప్రాయము ప్రకారము బుద్ధ భగవానుడే మాధ్యమిక పద్ధతికి కారణభూతుడు. కలుపహణ అభిప్రాయమును బట్టి నాగార్జునుడు మొగ్గలిపుత్త తిస్స వారసుడు, మాధ్యమిక పద్ధతిలో బుద్ధుని మౌలిక బోధలను పునరుజ్జీవనము చేసిన మహనీయుడు.

* ఆంధ్ర దేశంతో అనుబంధం

ఈయన చేత ప్రభావితుడైన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, శ్రీ పర్వతం (నాగార్జున కొండ) పై ఒక బౌద్ధ విద్యాలయమును కట్టించి, నాగార్జునుడిని అధ్యాపకునిగా నియమించాడు. ఈ విద్యాలయం నాగార్జునుని ప్రతిభ వల్ల జగత్ప్రసిద్ధిని పొందింది. ఈ విద్యాలయములో చదువుకొనుటకు అనేక దేశాలనుండి విద్యార్థులు వచ్చేవారు.

* నాగార్జునుని రచనలు

నాగార్జునుడు వ్రాసిన ముఖ్య గ్రంథాలు:

01. మూలమాధ్యమికకారిక
02. మహాప్రజ్ఞానపరమితశాస్త్ర
03. ద్వాదశనికాయశాస్త్ర
04. దశభూమివిభాసశాస్త్ర
05. శూన్యతాసప్తతి
06. యుక్తిసస్తిక
07. విగ్రహ వ్యవర్తని
08. సుహ్రిల్లేఖ
09. రత్నావళి

వీటిలో 1 మరియు 7 మూల సంస్కృతములో దొరికాయి. 2 మరియు 3 చైనీస్ అనువాదాలుగా లభించాయి. 2 మరియు 3 తప్ప మిగిలినవన్నీ టిబెటన్ అనువాదాలుగా ఉన్నాయి. నాగార్జునుడు తొలుత సంస్కృతము, పిదప పాళీ భాషలలో వ్రాశాడు. రచనలలో నికాయ సిద్ధాంత ప్రభావము గలదు.

GEETHA GOVINDHAM - TELUGU PRAYER FOR LORD SRI KRISHNA


జయ జయ దేవ హరే ..........-జయదేవ(గీత గోవిందం) .!
.
శ్రిత కమలాకుచ మండలా........ద్రుత కుండలా....ఈ కలిత లలిత వనమాల....
జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే....
||జయ జయ||
దినమణి మండల మండనా......భవ ఖండనా......ఈ మునిజన మానస హంసా
||జయ జయ||
కాళియ విష ధర గంజనా..........జన రంజన........ఈ యదుకుల నళిన దినేశా
||జయ జయ||
మధు ముర నరక వినాశనా......గరుడాసనా.......ఈ సురకుల కేళి నిదానా
||జయ జయ||
అమల కమల దళ లోచనా........భవ మోచనా.....ఈ త్రిభువన భవన నిదానా
||జయ జయ||
జనక సుతా కృత భూషణా........జిత దూషనా......ఈ సమరశమిత దశకంఠా
||జయ జయ||

అభినవ జలధర సుందరా.........ద్రిత మంధరా......ఈ శ్రీముఖ చంద్ర చకోరా
||జయ జయ||
తవ చరణే ప్రణతావయా...........ఇతి భావయా.....ఈ కురు కుశలం ప్రణతేశూ
||జయ జయ||
శ్రీ జయదేవ కవేరిదం...............కురుతేముదం.....ఈ మంగళ ఉజ్వల గీతం
||జయ జయ||

అర్ధ్ధం :

లక్ష్మీదేవి ని వక్షస్థలమునందు,కర్ణములకు కుండలాలను,మెడలో తులసిమాలను ధరించిన హరీ నీకు జయము జయము....
.
ప్రచండ సూర్యునివలే ప్రకాశిస్తూ,ఆలోచనలను ఖండిస్తూ,మునుల హృదయాలలో హంసవలె విహరించే హరీ నీకు జయము జయము
.
కాళియుని విషాన్ని హరించి,జనరంజకుడవై,యదుకుల రత్నమై వెలిగే హరీ నీకు జయము జయము....
.
మధు-ముర రాక్షసులను వధించి,గరుత్మంతుని అధిరోహించి,దేవలోకాన్ని రక్షించిన హరీ నీకు జయము జయము....
.
కలువరేకుల వంటి కన్నులతో,భవమోచన కలిగించే,త్రిభువన నాధుడవైన హరీ నీకు జయము జయము....
.
జానకి దేవిని చేపట్టి,అధర్మాన్ని జయించి,రావణుడిని వధించిన హరీ నీకు జయము జయము...
.
నీలమేఘ శ్యాముడవై,మంధర పర్వతాన్ని మోసి, చంద్రుని వలె అందమైన ముఖారవిందాన్ని కలిగిన హరీ నీకు జయము జయము...
.
నీ చరణారవిందాలకి ప్రణమిల్లుతూ,నీ కరుణా కటాక్ష వీక్షణాలు కోరుతూ...జయదేవుడు నీకై వ్రాసిన,మంగళకరమైన గీతం ఈ గీతం....
.
హరీ నీకు జయము జయము...శ్రీ హరీ నీకు జయము జయము..

VAMU HEALTH BENEFITS IN TELUGU


వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది
వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఆహారం జీర్ణం కానపుడు 'కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది' అని పెద్దలు అంటూంటారు. సాధారణంగా వామును చక్రాలలో (జంతికలు, మురుకులు) వాడుతుంటారు. వాము జీర్ణశక్తికి మంచిది. వాము జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా, అది చేసే మేలు మాత్రం పెద్దది
ఔషధోపయోగాలు
వాంతులు: వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
జ్వరం: వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
అజీర్ణం: వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
దంత వ్యాధులు: వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
వాత వ్యాధులు: వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.
గొంతులో బాధ: వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.
మూత్రాశయంలో రాళ్ళు: వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగార్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.
చనుబాలు వృద్ధి: ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.
జలుబు, తలనొప్పి: జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.
ఆస్తమా: ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.
గుండె వ్యాధులు: గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
కీళ్ళ నొప్పులు: వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
కాలిన గాయాలకు: కాలిన గాయాలకు ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది.
దంత సమస్యలకు: పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి.
దగ్గు: దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదుRelated Posts Plugin for WordPress, Blogger...

chitika