WORLD FLAG COUNTER

Flag Counter

Thursday 14 August 2014

HAPPY INDEPENDENCE DAY 15-08-2014


నా ప్రియమైన భారతదేశ సాహోదరి, సాహోదరులకు ముందుగా

 మన కోసం మన దేశం కోసం పోరాడి తమ ప్రాణాలను కూడ లేకచేయకుండా 

శాంతియూతంగా యుద్ధం చేసి పోరాడిన ప్రతి ఒకరినీ మరియు 

ముందుండి నడిపించిన మహత్ములనూ స్మరిస్తూ అందరీకి 

స్వాతంత్ర్య దినోత్సావ శుభాకాంక్షలు.....!
జై హింద్

Monday 11 August 2014

PRAYER TO LORD GANESHA WITH CLAY STATUE - WHY - SCIENTIFIC REASON BEHIND GANESHA POOJA - DETAILS IN TELUGU


మట్టి గణపతి మోరియా

మహా గణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను మన పూర్వీకులు పొందుపరిచారు. వినాయక చవితి పూజా విధిలో ఈ సూత్రాలను పాటిస్తుంటాం.

-కొత్త మట్టితో వినాయకున్నితయారు చేయడం 

-ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయడం

-నవరావూతుల అనంతరం పత్రితో సహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం.
శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. నలుగు పిండితో తయారైన బొమ్మకు ఆది శక్తి పార్వతీదేవి ప్రాణవూపతిష్ఠ చేసింది. అనంతరం ఏనుగు తలను అతికించి ఆది దేవుడు పరమేశ్వరుడు పునః ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి యుగాలు మారుతున్నా, కాలం మార్తున్నా మహాగణపతి పూజలందుకుంటూనే ఉన్నాడు. సమాజంలో అనేక వర్గాల వారుంటారు. వారందరినీ కలిపి మానవత్వమే మహా మతం అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ. ఈ సృష్టిలో సర్వజీవులు సమానమే అని చాటిచెప్పడమే వినాయక జనన రహస్యం. మానవరూపంలో ఉన్న వినాయకునికి ఏనుగు తలను అమర్చడం, మూషికుడిని (ఎలుకను) వాహనంగా అమర్చడంలోనే సర్వవూపాణులు సమానమనే అర్ధం చెబుతోంది. హారంగా ఔషధ మొక్కల ఆకులు తినడంలోనే పర్యావరణ రహస్యం దాగుంది.

మట్టి వినాయకుడు-అసలు రహస్యం 

వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. అలా చేయాలనే ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయనే ఆలోచన చేసేవాళ్లు. అందుకే అలా జరుగకుండా ఉండాలంటే చెరువులు, కుంటల్లో పూడికలు తీయాలి. నీరు నిల్వ ఉండాలే కానీ అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు. వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంటుంది. కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే. ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు. అలా చేసేందుకు ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు.

పత్రిపూజ-రహస్యం 

గణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా వస్తుంది. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం కూడా చెబుతోంది. పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవి ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. ఔషధపవూతాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటి వల్ల ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు. ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో, వారం రోజులో వాడమని చెప్పినట్లుగానే పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారని చెబుతుంటారు.

నిమజ్జనం-అసలు రహస్యం 

నవరావూతుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదంటే కుంటలోనూ నిమజ్జనం చేయడం కూడా ఆచారంగానే వస్తుంది. చెరువులు, కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న పర్యావరణ పరమ రహస్యం.


Thursday 7 August 2014

WHAT IS THE MEANING OF ASTA SIDDHULU - ANIMA - MAHIMA - GARIMA - LASHIMA - PRAPTHI - PRAKAMYAM - EESWITHAM - VASITWAM ARE CALLED AS ASTA SIDDHULU ACCORDING TO INDIAN PURANAS



అష్ట సిద్ధులు అంటే ఏమిటో తెలపండి?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం

ప్ర : అష్ట సిద్ధులు అంటే ఏమిటో తెలపండి?
జ : యోగసాస్త్రంలో ఎనిమిది సంఖ్యను ‘ మాయ ‘ కు సంకేతంగా చెబుతారు. తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకక్గా చెబుతారు. భగవద్గీతలో అష్టవిధమాయల ప్రస్తావన కనిపిస్తుంది. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి. పంచభూతాలకు పంచేంద్రియాలు ప్రతీక గనుక మన శరీరమే ఒక ‘ మాయామహలు ‘ గా గ్రహించాలి.

అష్టమాయల వల్లనే అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి. అష్టమాయల్ని జయించాలంటే – ” ఓం నమోనారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఆశ్రయించాలని పెద్దల మాట. అలా ఆశ్రయించిన ప్రహ్లాదుడు, ద్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు, ద్రౌపతి, అర్జునుడు – ఇలా ఎందరో భక్తులు సదా గట్టేక్కారు.

శ్రీదత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా చెప్పారు. తమ భక్తులకు వారి అనుగ్రహం ఉంటుందన్నారు.

“విభూతిర్భూతి హేతుత్వాద్భసితం తత్త్వ భాస్యత్” – అష్ట ఐశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధుల్ని విభూతులని కూడా అంటారు. ఇంతకీ ఏమిటీ అష్టసిద్ధులు?

అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదీ అష్టసిద్ధులు.

మోక్షమార్గాన ప్రయాణించే సాధకుణ్ని ప్రలోభ పెట్టి, పక్కదోవపట్టించి, ఒక్కోసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెబుతారు.

సిద్ధులు లభించగానే బుద్ధులు మారిపోతాయి. అహంకారం ఆవహిస్తుంది. విచక్షణ నశిస్తుంది. నిగ్రహం నీరుకారిపోతుంది. ఇలాంటి దుస్థితి కలగరాదని కోరుకునే వారు అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తారు. లేదా వాటిని కేవలం సిద్ధులకోసమే యోగం అభ్యసిస్తారు. వాటిని ప్రదర్శిస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు. ఇవన్నీ మొక్షప్రాప్తికి ఆటంకాలే!

దేవభూమిగా వినుతించే హిమలయాల్లో అక్కడ క్కడ మంచు గుహల్లో తపస్సులో నిమగ్నులైన ఋషులు కనిపిస్తుంటారు. ఒక గుహలో జీవానందుడు, సత్యానందుడనే ఇద్దరు ఋషులు బహుకాలం తప్పస్సు చెయ్యగా, అప్రయత్నంగా ఇద్దరికీ అష్టసిద్ధులు లభించాయి. జీవానందుడు తనకు లభించిన సిద్ధులతో తబ్బిబ్బై, వాటిని ప్రదర్శించాడానికి జనసీమల్లోకి వెళ్ళాడు. సత్యానందుడు తన సిద్ధుల్ని శివార్పణంచేసి తన తపస్సు కొనసాగించాడు.

జీవానందుడు అష్టసిద్ధుల ప్రదర్శనతో ప్రజలచేత బ్రహ్మరథం పట్టించుకున్నాడు. ఒక పెద్ద ఆశ్రమం, అనేకమంది శిష్యులతో ఆడంబర జీవితం గడపసాగాడు. అతని దగ్గరకు రాజు, రాజోద్యోగులు, రాణి, ఆమె సఖులు ఇట్లా ఉన్నత వర్గాలవారు వస్తూపోతుండటంతో జీవానందుడు తనను తానే భగవత్స్వరూపుడిగా ప్రకటించుకుని అనేక పూజలు, సేవా సపర్యలు సాగించుకుంటూ విలాసమయ జీవితానికి అలవాటుపడ్డాడు. ఇలా ఉండగా మహారాణి వచ్చిన సమయంలో జీవానండుడి శిష్యవర్గం లోని ఒక పూర్వాశ్రమ చోరుడు, ఆమె మెడలోని విలువైన హారం దొంగిలించాడు. ఇంకేముంది? గందరగోళం, రాజభటులు తనిఖీలు చేయ్యటం, ఆభరణం ఆశ్రమంలోనే దొరకడంతో, జీవానందుడి సహితంగా అందరికీ కారాగా శిక్షపడింది. జీవానందుడి ఆశ్రమం మూతపడింది. శిక్ష పూర్తిచేసుకున్న జీవానందుడు నేరుగా హిమలయాల్లో ఉన్న తన గుహకుచేరుకున్నాడు. అక్కడ సత్యానందుడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతని సమీపంలో ఒక సహజ హిమలింగం కనిపించింది. గుహనిండా పరిమళాలు గుబాళిస్తున్నాయి. జీవానందుడు తన అనుభవాలు చెప్పి, సత్యానందుడి అనుభవాలు అడిగాడు.

“నేను నాకు లభించిన అష్టసిద్ధుల్ని ఈశ్వరార్పణ చేశాను. నా తపస్సు కొనసాగించాను. ఇదుగో ఈ శివలింగం ఉన్నచోటనే పరమశివుడు ప్రత్యక్షమై సాయుజ్యభక్తిని ప్రసాదించాడు. నేనిప్పుడు కనులు తెరిచినా, మూసినా, సర్వత్రా శివరూపాన్నే చూస్తున్నాను” అన్నాడు సత్యానందుడు.

జీవానందుడు పశ్చాత్తాపపడి, సత్యానందుణ్ని తన గురువుగా స్వీకరించి, తానుకూడా ఈశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రంగా తపస్సు చెయ్యసాగాడు. మరెన్నడూ అష్టసిద్ధుల ప్రలోభాలకు జీవానందుడు లోనుకాలేదు.

SWAMY SARANAM AYYAPPA PUJA DETAILS - ARTICLE IN TELUGU ABOUT LORD AYYAPPA PUJA STEP BY STEP DETAILS


అయ్యప్ప పూజ

దీక్షలో పాటించవలసిన నియమాలు :

దీక్షా కాలమందు బ్రహ్మచర్యము పాటించవలెను.
ప్రతి దినము ఉదయము సూర్యోదయమునకు ముందు సాయంకాలము సూర్యుడు అస్తమించిన తర్వాత చన్నీటి స్నానము ఆచరించవలెను.
శుభ, అశుభ కార్యములందు పాల్గొనరాదు.
గురుస్వామి ఆజ్ఞలను పాటించవలెను.
శాఖాహారము మాత్రమే భుజించవలెను.
శవము ఎదురైన వెంటనే తలస్నానము చేయవలెను.
మత్తు పానీయములు సేవించరాదు.
నల్ల దుస్తులు మాత్రమే అయ్యప్పలకు శ్రేష్టము.
కుల, మత బేధములు పాటించరాదు.
ధూమపానము తాంబూలములు సేవించరాదు.
ఇరుముడి కట్టుకొనుటకు 41 రోజుల దీక్ష పూర్తి చేసి ఉండవలెను.
దీక్షా కాలములో ఏ విధమైన అనుమానము వచ్చినను గురుస్వామివారిని అడిగి తెలుసుకొనవలెను.
దీక్షలో ఉన్న అయ్యప్పలు తమ శక్తి కొలది తోటి అయ్యప్పలకు ఇంటి యందు భిక్ష పెట్టవలెను.
అహంకారము, ఆడంబరములు వదలి మామూలు జీవితము గడుపవలెను.
ఉదయం, సాయంకాలము తప్పక శరణుఘోష చేయవలెను.
ప్రతి అయ్యప్ప రాత్రివేళల్లో అయ్యప్పకు పవళింపుసేవ చెయ్యాలి.
ఎన్నిసార్లు అయ్యప్పను దర్శించిన వారైనా తోటి అయ్యప్పలను గౌరవించవలెను.
స్త్రీలలో బాలికలు 10 సం. లోపు పెద్దలకు 50 సం.లు పైబడి వయస్సు ఉన్నవారు మాత్రమే మాలాధారనకు అర్హులు.
బహిష్టు అయిన స్త్రీని చూడడము, వారి మాటలు వినడము చేయరాదు. అటుల చూచిన వెంటనే స్నానము చేసి శరణుఘోష పలుకవలెను.
41 రోజుల వ్రత దీక్షలో పూర్తిగా ఆధ్యాత్మిక చింతన అలవరుచుకొనవలెను.
గోళ్ళు తీయుట, వెంట్రుకలు కత్తిరించుట చేయరాదు.
ఆహారం సేవించునపుడు సాధ్యమైనంత వరకు ఉప్పు, కారం తగ్గించవలెను.
భోజనము ఒక పూట మాత్రమే ( మధ్యాహ్నం ) చేయవలెను.
ప్రతివారిని " స్వామి " అని మాత్రమే సంభోదించవలెను. పిల్లలను " మణికంఠ " అని సంభోదించవలెను.
బాలికలను, స్త్రీలను 'మాత' అని, భార్యను 'మాలికాపురత్తమ్మ' అని సంభోదించవలెను.
రాత్రి అల్పాహారం లేదా పాలు పండ్లు మాత్రమే తీసుకొనవలెను.
పాదరక్షలు ధరించరాదు. చిరుతిళ్ళు తినరాదు. ఏ విధమైన చెడుఅలవాట్లు ఉండరాదు.
పడుకునేటప్పుడు పరుపు, దిండ్లు ఉపయోగించరాదు. చాపమీద మాత్రమే పడుకొనవలెను.
దీక్షలో వారు వారి ఇంటిలో ఎవరైనా మరణించిన వారి వద్దకు వెళ్ళరాదు. అటుల వెళ్ళవలసి వచ్చిన, మాలను గురుస్వామితో తీయించి స్వామి ఫొటోకి వేయవలెను. ఆ సంవత్సరము అతను శబరిమల యాత్ర చేయరాదు.
స్వామి దీక్షలో ఉన్నప్పుడు పగలు ఎంత మాత్రము నిద్రించరాదు.
నిరంతరం శరణుఘోష జపించవలెను. "స్వామియే శరణం అయ్యప్ప" అను వేదమంత్రోచ్ఛారణ నిరంతరము జపించవలెను.
తాను చేయు ప్రతికార్యమును , ప్రతి జీవిలోను అయ్యప్ప భగవానుని దర్శించుచుండవలెను.
ప్రతి స్త్రీ (భార్యసైతము) దేవి స్వరూపమే.
అయ్యప్ప ఎల్లపుడు విభూది, చందనం, కుంకుమ బొట్టులతో విలసిల్లుచూ, అస్కలిత బ్రహ్మచర్యము అవలంభించవలెను.
ఎదుటివారిని తన యొక్క మాటల, చేతల వలన గాని నొప్పించక ఎల్లపుడూ దయ, శాంతమును కలిగి యుండవలెను.
'మానవ సేవయే మాధవ సేవ' అన్న సూక్తిని మరువక తోటివారికి సాధ్యమైనంత వరకు సహాయ పడుట అయ్యప్ప కర్తవ్యము.
నియమములను క్రమం తప్పకుండా ఆచరించు భక్తులను శబరిమల సన్నిధానమందు పదునెట్టాంబడి నెక్కు అర్హత కలుగును. భగవత్ సాక్షాత్కారము లభించును. శబరి యాత్ర ఫలితమును పొందగలరు.
కన్నెస్వాములకు కొన్ని ముఖ్య సూచనలు :

అయ్యప్పలు వ్యర్థ ప్రసంగములు చేయరాదు.
అయ్యప్పలు చెప్పినట్లు యాత్రలో అనుసరించవలెను. కాని బృందాన్ని వదలి ముందుకు నడవరాదు. ఆ భక్త సమూహంలో తప్పిపోయిన గుర్తు పట్టడం చాలా కష్టమౌతుంది.
ఇరుముడి నెత్తిపై పెట్టుకున్న తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు. వస్తానని కాని, వెళుతున్నాని కాని, కుటుంబసభ్యులకు కాని మరెవ్వరికి చెప్పరాదు.
ఇరుముడిని శిరస్సుపై వుంచుకుని చిరుతిళ్ళు తినుట వంటివి చేయరాదు.
ఇరుముడిని కన్నె అయ్యప్పలు ఎట్టి పరిస్థితులలోను దించుకొనరాదు. అవసరమైతే బృందంలోని అయ్యప్పలే ఇరుముడిని క్రిందకు దించుతారు. బృదంలోని వారు కాక యాత్ర చేసే వేరే అయ్యప్పలెవరైనా సాయం చేయవచ్చును.
కన్నె అయ్యప్పలలో భక్తితో మహత్తర శక్తి నిబిడీకృతమై వుండుట వలన ఉత్సాహముతో ఉరకలు వేయడానికి మనసు ఆరాటపడుతుంది. కాని ఎట్టి పరిస్థితులలోనూ బృందాన్ని విడిచి వెళ్ళకూడదు.
యాత్రలో తినిబండారాలను అందరికీ పంచి పెట్టి తినాలి..
స్వామి శరణుఘోషను చెప్పుకుంటూ నడకను సాగించాలి.
యాత్రలో మనసును అయ్యప్పస్వామి పైనే లగ్నము చేయాలి.
యాత్రలో ఆలయములు, పుణ్యక్షేత్రములు దర్శించేటప్పుడు అందరితో కలసి దర్శించవలెను. కాని వేరుగా పూజలు జరపించరాదు. అందరితో కలసి వెళ్ళాలి. ఎవరిదారిన వారు వెళ్ళకూడదు.
స్నానము చేయునపుడు విలువైన వస్తువులు, డబ్బు మిగిలినవన్నీ అందరితో బాగా పరిచయము ఉన్న అయ్యప్పలకు ఇచ్చి వెళ్ళాలి.
కన్నె అయ్యప్పస్వాములు బృదంతో కాకుండా ఎప్పుడూ యాత్ర చేయరాదు. ఒంటరిగా కూడా వెళ్ళకూడదు.
సాటి అయ్యప్ప కనిపించనప్పుడు " స్వామిశరణం " అని చెప్పాలి. ఎవరినీ కూడా పేరుతో పిలవకూడదు. వారి వారి పేరు చివర 'అయ్యప్ప' అని కానీ 'స్వామి' అని కాని పిలవవలెను.
విద్యార్థులు, ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు విధి నిర్వహణలో అశ్రద్ధ చేయరాదు. పూజలకు, భజనలకు అవకాశము లేని యెడల చింతించక, వారి వారి విధులు నిర్వహిస్తూనే శరణు ఘోష మనసులో తలచుకున్నా చాలు.
పూజా, భజన సమయాలలో ఒంటి మీద చొక్కా ఉంచుకోకూడదు. తువ్వాలును మాత్రం నడుముకు చుట్టుకోవాలి.
అయ్యప్పలు లుంగీ పంచను పైకి మడచి కట్టుకోరాదు. ఒక వేళ విధి నిర్వహణలో అడ్డుగా ఉంటే పైకి కట్టుకొనవచ్చును.
మాలవేసినపుడు, భజన పూజ నిర్వహించునపుడు ఇరుముడి కట్టినపుడు , మాల తీయునపుడు, గురుస్వామికి అయ్యప్పలు వారి శక్తి కొలది దక్షిణ చెల్లించవలెను.
అయ్యప్పలు సాటి అయ్యప్పలకు ,గురుస్వాములకు, తల్లిదండ్రులకు పాదనమస్కారములు చేయవలెను.
అయ్యప్పలు గుడిలోనికి వెళ్ళగానే ఒంటిపై చొక్కావిప్పి స్వామివారిని దర్శించాలి.
మాలాధారణ మంత్రము :

మాలను ఇతరులకు వేయునపుడు గురుస్వాములు ఈ మంత్రమును చెప్పవలెను.
జ్ఞానముద్రాం శాస్తృముద్రాం గురుముద్రాం నమామ్యహం |
వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం |
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |
గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం |
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం |
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |
అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం |
విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం |
ఊరుజం వాపురం చైవ భైఅరవద్వన్న సేవితం |
విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం ||
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ||
మాల విసర్జన మంత్రం :

మాల ధరించుటకు మంత్రమున్నట్లే మాలా విసర్జనమునకు మంత్రము గలదు. శబరిమల నుండి తిరిగి రాగానే ఇంటి ముంగిట కొబ్బరికాయ కొట్టి లోనికి ప్రవేశించి పూజా మందిరం లేక శ్రీవారి మండపం ముంగిట కర్పూరం వెలిగించి శరణుఘోషలు చెప్పి గురుస్వామికి దక్షిణ తాంబూలాదులు యొసంగి మాల విసర్జన మంత్రమును చెప్పి గురుస్వామి గారిచే మాల తీయించుకొనవలెను. అపూర్వ మచలా రోగా ద్దివ్య దర్శన కారన |
శాస్తృ ముద్రాద్మహాదేవ దేహిమే వ్రతమోచనం ||
దీక్షాపరులకు గమనిక

అయ్యప్ప దీక్షాపరులు పూజవిధానము మెదట గణపతిని పూజించి అనంతరము బ్రహ్మణ్యస్వామి ని అయ్యప్పస్వామిని విధిగా పూజిచవలెను. శరణుఘోష, శ్రీ అయ్యప్ప నినాదాలు, మరియు శ్రీ అయ్యప్ప స్వామి పంచరత్నములు విశేషాంశములలో పొందుపరిచినాము గమనింపగలరు.

LIST OF NAMES OF CHIRANJEEVULU - WHO DOES NOT HAVE DEATH IN HIS LIFE TIME ACCORDING TO HINDU PURANALU - NAMES OF ASTA VIDHA CHIRANJEEVULU ?



అష్టవిధ చిరంజీవులు అంటే ఎవరు ?

భారతీయ పురాణాలలో ఎనమండుగురు వ్యక్తుల్ని చిరంజీవులు గా పేర్కొన్నారు . 

చిరంజీవి అంటే చనిపోయినా బ్రతికున్నట్లు భావన . 

మ్రుతన్జీవి అంటే బ్రతికున్నా చనిపోయినా వాని కింద లెక్క .

పురాణ చిరంజీవులు :

1. అశ్వద్ధామ ,

2. బలిచక్రవర్తి ,

3. వ్యాసమహర్షి ,

4. హనుమంతుడు ,

5. విభీషణుడు ,

6. కృపాచార్యుడు ,

7 . పరశురాముడు ,

8. మార్కండేయ

Friday 1 August 2014

ADVANTAGES OF USING RED SANDALWOOD


శృంగార సామర్థ్యాన్ని పెంచే ఎర్రచందనం

భారతీయ పురాతన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్న ఎంతో విలువైన సమాచారాన్ని మనం పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాము. భారతీయ పూరాతన వైద్యవిధానాలను, వనమూలికల ఔషద గుణాలను విదేశీయులు మనకంటే ఎక్కువగా వాడుకుంటున్నారు. అలాగే మనదేశంలో లభించే అత్యంత ఖరీదైనది ఎర్రచందనం శృంగార పురషులకు గొప్ప ఔషదంగా చైనీయులు, జపాన్ వారికి ఇప్పుడు విరివిగా వాడుతున్నారు. ఎందుకంటే భారతీయ ఎర్రచందనానికి ఔషద గుణాలతోపాటు శృంగార సామర్థ్యాన్ని పెంచే లక్షణం కూడా ఉంది. ఈ విషయం తెలిసిన చాలా మంది విదేశీయులు తమ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎర్రచందనం పౌడర్ ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్ ను రోజుకు 5 గ్రాముల చొప్పున పాలల్లో గాని, తేనెలో గాని కలుపుకొని పడుకోవడానికి ఒక గంట ముందు తీసుకొంటే శరీరంలో లైంగిక హార్మోన్లు ఉత్పత్తి పెరుగి లైంగిక ప్రేరణను ఎక్కువగా కలగజేస్తుందట. ఎర్రచందనం గుణాలు తెలిసిన చైనా,జపాన్ వంటి విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఎన్ని కోట్ల రూపాయలైనా ఎర్రచందనం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. చైనా, జాపాన్ ల్లో పెళ్లి జరగాలంటే ఎర్రచందనం తప్పని సరిగా ఉండవలసిందేనట. ఈ రెండు దేశాలు ఏటా కనీసం 800 వందల టన్నుల ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి. 

HEALTHY IMPORTANCE OF DRINKING COW MILK


ఆవు పాలు గురించిన వివరణలు
భారత దేశీయ ఆవు పాలు శరీర నిర్మాణమునకు అత్యవసరమైన ఆహారము.
ఆవుపాలయందు మాంసకృత్తులు, కొవ్వులు, కార్బోహైడ్రేట్‌లు, విటమిన్లు, సేంద్రీయ లవణములు (Minerals) కలవు. ఆవు పాలలోని మాంసకృత్తులయందు దేహనిర్మాణమున కవసరమగు యాసిడ్స్ (Amino Acids) కలవు. అవి చాలా తేలికగా జీర్ణమగు ఆల్బుమిన్ (Albumin) రూపములో ఉండును.పాలయందలి కొవ్వు-వెన్న రూపములో సూక్ష్మాతి సూక్ష్మమైన కణములుగా విభజింపబడి ఉండును. ఆవు పాలయందలి కార్బోహైడ్రేట్‌లు అతితేలికగా జీర్ణమగు లాక్టోస్‌ రూపములో ఉండును. ఆవుపాలయందు రోగనిరోధక శక్తిని అధికముగా పెంచు విటమిన్‌ "ఎ" అధికముగా ఉండును. ఈ పాలలోని "డి" విటమిన్‌ వలన ఎముకలు బలపును. బి కాంప్లెక్స్‌, బి12 విటమినులతో నాడుమండలము బలపును. ఆవుపాలయందు శరీరధాతు నిర్మాణమునకు ఉపయోగపు కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, సోడియం ఉన్నాయి. భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన "స్వర్ణనాడి" (సూర్యకేతు నాడి) అనే సూక్ష్మ నాడు ప్రవాహ శక్తి కేంద్రము ఉన్నది. సూర్యకిరణములు ఆవు మూపురముపై పినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని "కెసీిన్‌" అనే ఎంజైమ్‌ను తయారుచేసి దానిని ఆవు పాలలో పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి, వెన్న పసుపుపచ్చని పసిమి రంగుతో ఉంటాయి.