WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 23 April 2016

STOP USING PAIN KILLERS REGULARLY WHICH LEADS TO SEVERE HEALTH DISORDERS


పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా.. వాటితో ప్రమాదమే!!

ఒళ్లు నొప్పులనో, తలనొప్పిగా ఉందనో… కొంతమంది నొప్పి రాగానే పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్స్ వాడుతుంటారు. చిన్న చితక నొప్పులే కదా అని మరికొందరు డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండా తాత్కాలిక ఉపశమనం కోసం మందులను వాడుతుంటారు. అటువంటి మందులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా… దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

తాజాగా పెయిన్ కిల్లర్స్ పై చేసిన పరిశోధనల్లో.. ఊహించిన దానికంటే ఎక్కువ ముప్పు నిర్ధారణ అయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మాత్రలతో అల్సర్లు, బీపీ పెరగడం తదితర ఇబ్బందులు ఎదురవుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌ పరిశోధకులు వివరించారు. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారు పెయిన్‌ కిల్లర్‌ మాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

నాన్‌ స్టెరాయిడల్‌ యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ డ్రగ్స్‌(ఎన్‌ఎస్ఏఐడీ)గా వ్యవహరించే ఈ మాత్రలను సాధారణ నొప్పుల నుంచి మొదలుకొని పలు రకాల వ్యాధుల నివారణకు వాడుతుంటారని చెప్పారు. కండరాలు, ఎముకల వ్యవస్థ, వాపు, నొప్పి తదితర ఇబ్బందులనుంచి రోగులకు ఉపశమనం కలిగించేందుకు వైద్యులు ఈ మాత్రలను సూచిస్తుంటారని… అయితే, ఈ చికిత్స దీర్ఘకాలంలో బీపీ పెరగడానికి, అల్సర్లకు దారితీస్తుందని వర్సిటీకి చెందిన మార్టెన్‌ స్కిమిడిట్‌ తెలిపారు.
రోగులకు ఉపశమనం కలిగించేందుకు ఎన్‌ఎస్ఏఐడీ మందులను రాసేముందు వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇకపోతే ప్రిస్కిప్షన్‌ లేకుండా అమ్మకాలు జరిపే విషయంలో ఆయా మాత్రల వాడకం గురించి కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని, డాక్టర్ల సలహా మేరకు మాత్రమే పెయిన్ కిలర్స్ వాడాలని సూచించారు.

No comments:

Post a Comment