chitika

WORLD FLAG COUNTER

Flag Counter

chitika

Monday, 3 October 2016

INFORMATION ABOUT SRI BRAMARAMBHA MALLIKHARJUNA SWAMY VARLA DEVASTHANAM - SRISAILAM - DASARA VUTHSAVALU 2016


శ్రీ శైలం. 

శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి దేవస్థానంలో
దసరా ఉత్సవాల్లో అమ్మవారి అలంకారం, స్వామి అమ్మవార్ల వాహనసేవల వివరాలు

స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు

01/10/2016న శైలపుత్రి అలంకారం.
భృంగివాహన సేవ.

02/10/2016న బ్రహ్మచారిణి అలంకారం. మయూరవాహన సేవ

03/10/2016న చంద్రఘంట అలంకారం. రావణవాహన సేవ.

04/10/2016న కూష్మాండ దుర్గ అలంకారం. కైలాసవాహన సేవ.

05/10/2016న స్కందమాత అలంకారం. శేషవాహన సేవ.

06/10/2016న కాత్యాయని అలంకారం. పుష్పపల్లకీ సేవ.

07/10/2016న కాళరాత్రి అలంకారం. గజవాహన సేవ.

08/10/2016న మహాగౌరి అలంకారం. నందివాహన సేవ.

09/10/2016న సిద్ధిదాయినీ అలంకారం. హంసవాహన సేవ.

10/10/2016న రాజరాజేశ్వరి అలంకారం. అశ్వవాహన సేవ.

11/10/2016న భ్రమరాంబాదేవి (నిజాలంకరణ) నందివాహనం సేవ ( ఆలయ ఉత్సవం).

INFORMATION ABOUT SRI DURGA MALLESWARA SWAMY VARLA DEVASTHANAM - INDRAKEELADHRI - DASARA MAHOTSAVAMULU 2016


విజయవాడ, ఇంద్రకీలాద్రి.

శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్ధానంలో
దసరా మహోత్సవములు – 2016.

శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు

ది:1-10-2016 – శనివారము-ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి-శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి.

ది:2-10-2016-ఆదివారము-ఆశ్వయుజ శుద్ధ విదియ-శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి.

ది:3-10-2016-సోమవారము-ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది)-శ్రీ గాయత్రి దేవి.

ది:4-10-2016-మంగళవారము-ఆశ్వయుజ శుద్ధ తదియ-శ్రీ అన్నపూర్ణా దేవి.

ది:5-10-2016-బుధవారము-ఆశ్వయుజ శుద్ధ చవితి-శ్రీ కాత్యాయని దేవి.

ది:6-10-2016-గురువారము-ఆశ్వయుజ శుద్ధ పంచమి-శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి.

ది:7-10-2016-శుక్రవారము-ఆశ్వయుజ శుద్ధ షష్ఠి-శ్రీ మహాలక్ష్మిదేవి.

ది:8-10-2016-శనివారము-ఆశ్వయుజ శుద్ధ సప్తమి-శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం).

ది:9-10-2016-ఆదివారము-ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) -శ్రీ దుర్గా దేవి.

ది:10-10-2016-సోమవారము- ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)-శ్రీ మహిషాసురమర్ధినీ దేవి.

ది:11-10-2016-మంగళవారము-ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)-శ్రీ రాజరాజేశ్వరి దేవి.

SARADA NAVARATHRULU - 1ST DAY - SRI SWARNAKAVACHALANKRUTHA SRI KANAKA DURGA DEVI ALANKARAM INFORMATION


శారదా నవరాత్రులు: ఇంద్రకీలాద్రి.

మొదటి రోజు అలకారం 1.

స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి.

శరన్నావరాత్రులలో పాడ్యమినాడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. దుష్ట రాక్షసుడైన మహిషాసురుడ్ని వధించిన దుర్గాదేవి కీలుడికిచ్చిన వరం కారణంగా భూలోకంలో కృష్ణానదీ తీరంలో వున్న కీల పర్వతం మీద వెలిసింది. అలా వెలసిన ఆ తల్లి ధగధగాయమానంగా కోటి సూర్య ప్రభలతో ప్రకాశిస్తూ, బంగారు వర్ణంలో మెరిసిపోతుందట. అలాంటి దివ్య మంగళమైన ఆ దేవి దివ్య స్వరూపాన్ని దర్శించిన దేవతలంతా దుర్గామాతను ‘కనకదుర్గా’ అని పిలిచారట. ఆనాటినుంచి దుర్గాదేవి కనకదుర్గగా ప్రఖ్యాతి చెందింది. కీలపర్వతం కాస్తా ఇంద్రకీల పర్వతంగా పేరుపొందింది. ఆ విధంగా కనకదుర్గ ప్రభలతో వెలసిన కనకదుర్గాదేవిని స్మరించుకోవడానికి దసరా మొదటి రోజున దుర్గాదేవికి కనకదుర్గ అలంకారాన్ని చేస్తారు. ఆ అలంకారంలో దుర్గాదేవి అష్ట భుజాలతో ‘తారాకాంతి తిరస్కారి నాసా భరణ భాసురా’ అన్నట్టు, తేజోమయ ముక్కుపుడకని ధరించి నిండైన పసిడి వర్ణ ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ కనకదుర్గగా దర్శనిమిస్తుంది.

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె

ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్ధ్హియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.

నైవేద్యం : చలివిడి,వడపప్పు,పాయసం.

SARADA NAVARATHRULU - 2ND DAY - SRI BALA THRIPURA SUNDARI ALANKARAM INFORMATION


శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి.

2. రెండవరోజు అమ్మవారి అలంకారము

బాలా త్రిపురసుందరీ దేవి.

"హ్రీంకారాసన గర్భితానల శిఖాం
సౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశధరాం
స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం
పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్"

శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మ వారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెట్టాలి. "ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పొంగలి నివేదన చెయ్యాలి. త్రిశతీ పారాయణ చెయ్యాలి.

నైవేద్యం - పొంగలి,తీపిబూంది,శెనగలు.

SARADA NAVARATHRULU - 3RD DAY - SRI GAYATHRI DEVI ALANKARAM INFORMATION


శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి.
3.మూడవరోజు అమ్మవారి అలంకారము.

శ్రీ గాయత్రీ దేవి.

"ముక్తా విద్రుమ హేమనీల
ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:
యుక్తామిందు నిబద్ధరత్న
మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!
గాయత్రీం వరదాభయాంకుశమ్
కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవింద
యుగళం హసైర్వాహంతీం భజే"

సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం , చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. "ఓం భూర్భావస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోన: ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. అమ్మవారికి అల్లపు గారెలు నివేదన చేయాలి. గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.

నైవేద్యం - అల్లం గారెలు,రవ్వకేసరి,పులిహోర.

AMAZING UNBELIEVABLE FACTS ABOUT OCTOBER 2016


800 ఏళ్ల తర్వాత అరుదైన అక్టోబర్ ఇది! 

- 3 పెద్ద పండుగలు, 5 శని, ఆది, సోమవారాలు


ఇది అక్టోబర్ మాసం. అయితే ఏంటి గొప్పా. ఏడాదిలో పన్నెండు నెలలు. అందులో అక్టోబర్ నెల ఒకటి అంటూ తక్కువగా తీసిపారేయ్యకండి.  ఇంతకీ దీని గొప్పతనం ఏమిటంటే.. ఇది 8 శతాబ్దాల తరువాత వచ్చిన అరుదైన నెల. కాకతీయుల పాలన కాలం నాటి నెల మళ్లీ వచ్చిందంటున్నారు.

863 ఏళ్ల క్రితం అంటే క్రీస్తు శకం 1153 వ సంవత్సరంలో వచ్చిన అక్టోబర్ నెలలో ఇలా అరుదైన రోజులు కలిసి వచ్చాయి. అమావాస్య, పౌర్ణమి ఒకే నెలలో రావడం ఒక విశేషం. ఈ నెల 11 న దసరా, 12 న మొహరం, 30 న దీపావళి.. ఇలా మూడు పండుగలు ఒకే నెలలో రావడం మరో ప్రత్యేకత. సాధారణంగా నెలకు నాలుగేసి వారాలు ఉంటాయి. కానీ ఈ అక్టోబర్‌లో మాత్రం శని, ఆది, సోమవారాలు ఐదేసి రావడం ప్రాధాన్యతగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో శనివారాలు (1, 8, 15, 22, 29 తేదీలు), ఆదివారాలు(2, 9, 16, 23, 30 తేదీలు), సోమవారాలు (3, 10, 17, 24, 31 తేదీలు) వస్తాయి. దసరా సెలవులతో పాటు ఐదు ఆదివారాలు, రెండవ శనివారం కలిపి దాదాపు 17 రోజులపాటు పాఠశాలలు, కాలేజీలు, కంపెనీలకు సెలవులే. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు పండగే.

ఈ నెలలో ఇంకెన్నో విశేషాలు..
- అక్టోబర్ 1 వ తేదీన ప్రపంచ శాఖాహార దినోత్సవం, ప్రపంచ వృద్ధుల దినోత్సవం, జాతీయ రక్తదాన దినోత్సవం, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, విజయవాడ కనకదుర్గ శరన్నవరాత్రులు ప్రారంభం.
- 2 జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి.
- 3 వరల్డ్ అర్కిటెక్చిర్ డే.
- 4 ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం,
- 5 అంతర్జాతీయ ఉపాధ్యా దినోత్సవం.
- 7 ప్రపంచ నవ్వుల దినోత్సవం.
- 8 భారత వైమానిక దళ దినోత్సవం.
- 10 జాతీయ తపాలా దినోత్సవం.
- 11 విజయ దశమి(దసరా), ప్రపంచ బాలికల దినోత్సవం.
- 12 మొహరం, సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు.
- 13 అంతర్జాతీయ ప్రకృతి వైఫరీత్యాల నిరోధక దినోత్సవం.
- 14 వరల్డ్ ఎగ్ డే.
- 15 అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం.
- 16 ప్రపంచ ఆహార దినోత్సవం, మహర్షి వాల్మికి జయంతి.
- 17 పేదరిక నిర్మూలన దినోత్సవం.
- 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.
- 24 ఐక్య రాజ్య సమితి వ్యవస్థాపక దినోత్సవం.
- 26 గృహహింస చట్టం అమలులోకి వచ్చిన రోజు.
- 29 నరక చతుర్ధశి,
- 30 దీపావళి, హోమి జె.బాబా జయంతి, ప్రపంచ పొదుపు దినోత్సవం.
- 31 ఏక్తా దివాస్ సర్థార్ వల్లబాయ్ పటేల్ జయంతి.

Saturday, 1 October 2016

SRI KALIKAYAM DEVISHATKAMఅంబ శశిబింబవదనే కంబుగ్రీవే కఠోరకుచకుంభే 
అంబరసమానమధ్యే శంబరరిపువైరిదేవి మాం పాహి

కుందముకులాగ్రదంతాం కుంకుమపంకేన లిప్తకుచభారాం ఆనీలనీలదేహామంబామఖిలాండనాయకీం వందే 

సరిగమపధనిసతాంతాం వీణాసంక్రాంతచారుహస్తాం తామ్
శాంతాం మృదులస్వాంతాం కుచభరతాంతాం నమామి శివకాంతాం

అరటతటఘటికజూటీతాడితతాలీకపాలతాటంకాం
వీణావాదనవేలాకమ్పితశిరసం నమామి మాతంగీమ్

వీణారసానుషంగం వికచమదామోదమాధురీభృంగమ్
కరుణాపూరితరంగం కలయే మాతంగకన్యకాపాంగమ్

దయమానదీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయామ్
వామకుచనిహితవీణాం వరదాం సంగీత మాతృకాం వందే

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి

ఇతి శ్రీకాలికాయాం దేవీషట్కం

A TRIBUTE TO MAHATMA GANDHIJI - GANDHI JAYANTHI 02-10-2016


గాంధీ జయంతి సందర్భంగా ఆయన కు నివాళులు అర్పించు చూ 

చిత్రం: మహాత్మ

రఘుపతి రాఘవ రాజరాం
పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం
సబ్ కో సమ్మతి దే భగవాన్

ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ
ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ

రామనామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత...
కర్మ యోగమే జన్మంతా ధర్మ క్షేత్రమే బ్రతుకంతా
సంభవామి యని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత
ఈ బోసి నోటి తాతా..
మనలాగే ఓ కన్న తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి
సత్యా హింసల మార్గాజ్యోతి.. నవశకానికే నాంది..

రఘుపతి రాఘవ రాజరాం
పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం
సబ్ కో సమ్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజరాం
పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం
సబ్ కో సమ్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత..ఆ
సిసలైన జగజ్జేత
చరకా యంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపటేనుగుల బంధించాడుర జాతిపిత ఆ
సంకల్ప బలం చేత
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేఛ్చాభానుడి ప్రభాత క్రాంతి
పదవులు కోరని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి..
ఇలాంటి నరుడొక డిలాటలంపై నడియాడిన ఈనాటి సంగతి
నమ్మ రాదని నమ్మకముందే ముందుతరాలకి చెప్పండి

సర్వజన హితం నా మతం
అంటరానితనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే
నా ఆయువంతా అంకితం..హే రాం...

Related Posts Plugin for WordPress, Blogger...

chitika