WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 23 April 2016

BRIEF HISTORY OF ACHARYA NAGARJUNA


ఆచార్య నాగార్జునుడు

'ఆచార్య నాగార్జునుడు (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. కనిష్క చక్రవర్తి సమకాలికుడైన అశ్వఘోషుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి మాధ్యమిక సూత్రములను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశమునకు మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు . ప్రజ్ఞాపరమిత సూత్రములు కూడ నాగార్జునుడే రచించాడని అంటారు. నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడ అంటారు.

* జీవితం

నాగార్జునుని జీవితము గురించి మనకు చాల తక్కువగా తెలియవచ్చింది. ఛైనా, టిబెటన్ భాషలలో నాగార్జునుని జీవిత చరిత్ర ఆతని మరణము తరువాత పలు శతాబ్దములు గడచిన పిదప వ్రాయబడింది. కొన్ని ఆధారములను బట్టి ఈతడు అంధ్ర దేశమునకు చెందిన వైదీక బ్రాహ్మణుడు. నాగార్జునుడు బాల్యంలోనే సన్యసించి హిందూ తత్వశాస్త్రాన్ని ఆభ్యసించాడు. ఆ తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు. నాగార్జునుడు విదర్భకు చెందినవాడని మరియొక అభిప్రాయము. వేదశాస్త్రములలో పాండిత్యము సంపాదించి హిమాలయములలో విస్తృతముగా పర్యటించి బౌద్ధము పట్ల ఆకర్షితుడై నలందా చేరాడు. అచట ప్రఖ్యాత ఆచార్యుడు రాహులభద్ర వద్ద శిష్యరికము చేసి నలందాలోనే అచార్యునిగా పలు సంవత్సరాలు బోధించాడు. పిదప కృష్ణానదీ లోయలోని శ్రీపర్వతము చేరి స్థిరపడ్డాడు. దగ్గరలోని ధాన్యకటకములోని విశ్వవిద్యాలములో ముఖ్య అచార్యునిగా బోధలు చేశాడు.

నాగార్జునుని అభిప్రాయము ప్రకారము బుద్ధ భగవానుడే మాధ్యమిక పద్ధతికి కారణభూతుడు. కలుపహణ అభిప్రాయమును బట్టి నాగార్జునుడు మొగ్గలిపుత్త తిస్స వారసుడు, మాధ్యమిక పద్ధతిలో బుద్ధుని మౌలిక బోధలను పునరుజ్జీవనము చేసిన మహనీయుడు.

* ఆంధ్ర దేశంతో అనుబంధం

ఈయన చేత ప్రభావితుడైన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, శ్రీ పర్వతం (నాగార్జున కొండ) పై ఒక బౌద్ధ విద్యాలయమును కట్టించి, నాగార్జునుడిని అధ్యాపకునిగా నియమించాడు. ఈ విద్యాలయం నాగార్జునుని ప్రతిభ వల్ల జగత్ప్రసిద్ధిని పొందింది. ఈ విద్యాలయములో చదువుకొనుటకు అనేక దేశాలనుండి విద్యార్థులు వచ్చేవారు.

* నాగార్జునుని రచనలు

నాగార్జునుడు వ్రాసిన ముఖ్య గ్రంథాలు:

01. మూలమాధ్యమికకారిక
02. మహాప్రజ్ఞానపరమితశాస్త్ర
03. ద్వాదశనికాయశాస్త్ర
04. దశభూమివిభాసశాస్త్ర
05. శూన్యతాసప్తతి
06. యుక్తిసస్తిక
07. విగ్రహ వ్యవర్తని
08. సుహ్రిల్లేఖ
09. రత్నావళి

వీటిలో 1 మరియు 7 మూల సంస్కృతములో దొరికాయి. 2 మరియు 3 చైనీస్ అనువాదాలుగా లభించాయి. 2 మరియు 3 తప్ప మిగిలినవన్నీ టిబెటన్ అనువాదాలుగా ఉన్నాయి. నాగార్జునుడు తొలుత సంస్కృతము, పిదప పాళీ భాషలలో వ్రాశాడు. రచనలలో నికాయ సిద్ధాంత ప్రభావము గలదు.

No comments:

Post a Comment