chitika

WORLD FLAG COUNTER

Flag Counter

chitika

Monday, 29 December 2014

PANDAVAS - SWARGAVAROHANA STORY IN TELUGU


పాండవ స్వర్గారోహణ - మానవజీవితమునకు అన్వయము. 

మనపురాణాలలో అంతర్గతముగా ప్రతి సన్నివేశములోను ఎదో ఒక అధ్యాత్మరహస్యము దాగి వుంటది.దానిని గమనించటమే మన పని. మహభారతములోని 18వ పర్వము స్వర్గారోహణపర్వము. కురుక్షేత్ర యుద్ధము ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన చేయ సాగాడు. కొంతకాలము గడిచినది. శ్రీక్రిష్ణుడు నిర్యాణము చెందాడు.బలరాముడు అస్తమించాడు. యాదవకులములో ముసలము పుట్టింది. అందరు స్వార్ధపురిత అలోచనలతో మెలగసాగారు.శ్రీకృష్ణ నిర్యాణముతో పాండవులు సర్వము కొల్పొయిన వారిలా బాధపడ్డారు.ఇంతలో వచ్చిన ఈ పరిణమాలు గమనించిన ధర్మజుడు తాముకూడా హిమాలయ పర్వతములు తద్వార స్వర్గారొహణమునకు పొవ నిశ్చయించాడు.ఈ విషయము మిగిలిన వారికి తెలిపి రాజ్యాన్ని తమ వారసులకు అప్పగించి తాము సర్వము త్యజించి హిమాలయములకు సాగిపొయారు.ఈ సమయములో పాండవులతో పాటు ఒక కుక్క వెంబడించింది.ఇప్పుడు మొత్తము 7రు అయినారు.అందరుకలసి ప్రయాణము సాగించారు.

పట్టణాలు,నగరాలు,గ్రామాలు,మైదానాలు,పర్వతపంక్తులు అన్ని దాటి హిమాలయ సానువులకు వచ్చారు. హిమాలయములను అధిరొహణ ప్రారంభించారు.కొద్ది దూరము వెళ్ళిన తరువాత ద్రౌపది పడిపొయినది అమె ప్రియుడైన అర్జునుడు అందోళన చెందాడు. కాని ధర్మరాజు వారి వంక కూడా చూడకుండా స్వర్గారొహణ మార్గములో పయనము సాగించాడు.ఇంతలో ద్రౌపది మరణించినది.అయినను ఆగలేదు.ఇలా ఒకరి వెంట ఒకరు నకులసహదేవులు,అర్జునుడు,భీముడు మృతిచెందారు కాని ధర్మరాజు వీరిగురించి తలచక తనమార్గములో తాను పయనిస్తున్నాడు.ఇంకను కుక్క ధర్మ్రాజును వెంబడిస్తునే వున్నది. స్వర్గ ద్వారమునకు కుక్క,ధర్మరాజు చేరుకున్నారు.అక్కడవున్న కావలి వారు ధర్మరాజుకు మాత్రము స్వాగతము చెప్పారు.కుక్కను నిరాకరించారు.కాని ధర్మరాజు నేను ఒక్కడిని ప్రయాణము సాగించలేదు నాతో సహ ప్రయాణికుడుగా ఇంత దూరము కుక్క వచ్చింది, కుక్కనుకూడా అనుమతిస్తేనే నేను రాగలను కాని ఒక్కడిని రావటము ధర్మవిరుద్ధము అవుతుంది కాబట్టి నేను ప్రవేశింపలేను అని నిరాకరించాడు. అంత కుక్క యమధర్మరాజుగా నాయినా!ధర్మరాజ అందరు నీ ధర్మనిరతిని పోగుడుతున్నారు పుత్రుడవైన నీవు ఎలా ధర్మమార్గము పాటిస్తున్నవో అని తెలుసుకునేందుకు ఈ చిన్నపాటి పరిక్ష నాయినా అని అశ్వీరదించి. నీవే కాదు నీతాలుకు అందరు స్వర్గలోకములో నీకై ఎదురు చూస్తున్నారు అని పలికి స్వర్గలోక ప్రవేశము కలిపించాడు.

ఇది మహభారతములోని స్వర్గారోహణపర్వములోని కధ సూక్ష్మముగా మరి మానవ జీవితానికి అన్వయము ఎలా? పుట్టిన ప్రతీజీవి మరణించక తప్పదు.ఈ విషయము తెలిసిన మానవుడు పరమాత్మను పై విశ్వాసముంచి భక్తి,శ్రద్ధలతో కోలవాలి. మరి మనకు అంత్యకాలము సమీపించినఫ్ఫుడు అనగా వృద్ధాప్యకాలములొ ముందుపోవునది అందము,రూప లావణ్యాలు.దీనికి గుర్తుగా ద్రౌపది మరణము. ఆతరువాత పోవునది ఆరోగ్యము,లివర్ మొదలగునవి చేడిపోవటము.దీనికి ప్రతికగా అశ్వనిదేవతల పుత్రులు నకుల సహదేవుల మృతి.ఆతరువాత పోవునది ఇంద్రియాలు అందుకే ఇంద్రకుమారుడైన అర్జునుడు మరణించటము.అతరువాత పోవునది శరీరములోని శక్తీ,బలము దీనికి ప్రతికగా వాయుపుత్రుడు శక్తికి ప్రతీక భీముడు మృతి.మరి స్వర్గాన్ని చేరింది ఎవరు విశ్వాసానికి ప్రతికగా నిలచిన కుక్క,జీవునకు ప్రతికగా నిలచిన ధర్మజుడు.మరీ జీవుని రమ్మని కుక్కను వద్దంటే ? విశ్వాసములేని స్వర్గము ఎందుకు అని తృణికరించటమే భక్తి తత్వము.అందుకే సమవర్తి అయిన యమధర్మరాజు స్వర్గలోక ప్రవేశము కల్పించాడు.

LIFE IS BEAUTIFUL


" జీవితం ఒక అవకాశం అయితే...!
దాన్ని వొదలకండి...!
ఒక బాధ్యత అయితే...!
నెర వేర్చండి ...!
ఒక ఆశయం అయితే...!
సాధించండి...!
ఒక శోకమైతే...!
తట్టుకోండి...!
ఒక పోరాటం అయితే...!
జయించండి...!
ఒక పయనం అయితే...!
సాగిపోండి "...!


KAMALA FRUIT BEAUTY TIPS IN TELUGU


మొటిమలు - నల్ల మచ్చలు తగ్గడానికి చిట్కా 

1) నారింజ పండు లేదా కమలా పండు తొక్కలను నీటిలో కడిగి శుభ్రం చేసుకొని , చిన్న ముక్కలుగా కట్ చేసి , మెత్తగా గ్రైండ్ చేయాలి. (నారింజ తొక్కలను ఎండబెట్టి , పౌడర్ లా కూడా నిల్వ చేసుకొని వాడుకోవచ్చు).
2) మెత్తటి పేస్టులో ఒక 1/4 కప్ పెరుగు కలిపి పేస్టులా తయారుచేయండి. ఇప్పుడు దీనిని ముఖం మొత్తం ప్యాక్ చేయండి , 20 మినిట్స్ వెయిట్ చేసి ముఖాన్ని కడుక్కోండి.
3) ఈ చిట్కాను వారానికి 3 నుండి 4 సార్లు వాడితే , మొటిమలు , మచ్చలు తగ్గడమే కాకుండా , ముఖం కాంతి సంతరించుకొంటుంది.

HEALTH WITH BITTERGOURD - KAKARAKAYA UPAYOGALU


కాకర కాయ చేదంటే.. అనారోగ్యం పాలైనట్లే?

అమ్మో కాకర కాయ చేదు అనుకుంటున్నారా? అయితే అనారోగ్యం పాలైనట్లే. కాకరలో తల నుంచి పాదాల వరకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారంలో అప్పుడప్పుడు కాకరను చేర్చుకోవడం ద్వారా అలెర్జీ, ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటివి దరిచేరవు.
కాకరలో కెలోరీలు తక్కువ. ఇందులో 80 శాతం నుంచి 90 శాతం వరకు తేమ ఉంటుంది. బి1, బి2, బి3, బి5, బి6, సి విటమిన్లతో పాటు పొటాషియం, మేగ్నీషియం, సోడియం, ఫాస్పరస్ వంటి ధాతువులు వున్నాయి. ఆకుకూరల్లో ఉన్న క్యాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా క్యాల్షియం ఉంటుంది.
100 గ్రాముల కాకరలో ఏముంది?
కొవ్వు - 0.17 గ్రాములు,
పీచు- 2.80 గ్రాములు
నియాసిన్ - 0.400 మి.గ్రాములు
క్యాల్షియం - 10. మి.గ్రాములు
సోడియం - 5 మి. గ్రాములు
పొటాషియం -296 మి.గ్రా

Saturday, 20 December 2014

GRANDFATHER TRAVEL JOKE IN TELUGUతాతగారి తాపత్రయం జోక్

80 ఏళ్ళ రామయ్య హైదరాబాద్ నుండి బస్సులో విజయవాడ వెళ్తూ 

బస్సు ఆగిన ప్రతిచోట దిగి మళ్ళీ ఎక్కి తరువాత ఊరువరకూ టిక్కెట్

 తీసుకుంటున్నాడు.

"ఏంటి తాతగారూ? ఒకేసారి విజయవాడ వరకూ టిక్కెట్టు 

తీసుకోవచ్చుగదా! 

ఇలా చీకటిమాటికి దిగుతూ ఎక్కడం దేనికి?" విసుగ్గా అన్నాడు కండక్టరు.

"నేను గుండెజబ్బు మనిషిని బాబూ! నా ప్రాణం ఏక్షణంలో అయినా 

పోవచ్చని డాక్టరు పదిసంవత్సరాల క్రితమే చెప్పాడు. 

ఒకేసారి బెజవాడకు టిక్కెట్ తీసుకుంటే సూర్యాపేటకు పోగానే 

ప్రాణంపోతే టిక్కెట్టు దండగ గదా" అన్నాడు రామయ్య.

TELUGU PURANA STORY OF GAJENDRA MOKSHAM IN TELUGUగజేంద్ర మోక్షము .!
.
.నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు
బైటకుక్క చేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
నీటి నుంచి బయటపడ్డ మొసలిని కుక్క కూడా బాధిస్తుంది. అదే నీళ్లలోని మొసలి ఏనుగును కూడా పీడించగలదు. ఈ అర్ధాన్ని తెలియచేసే పురాణగాథే భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ.
త్రికూట పర్వతం చుట్టు పక్కల, పర్వతం మీద దట్టమైన అరణ్యాలు లెక్కకు మించి ఉండేవి. అందు ఒకానొక అరణ్యంలో మదపుటేనుగుల సమూహం ఒకటి ఉండేది. ఆ గజమూహం స్వేచ్ఛగా అరణ్యాన విహరిస్తూ, చిన్న,చిన్న జలాశయాలలో నీటిని తమ తొండాలలో నింపుకుని, వీపులమీద జల్లుకుంటూ, పండ్లను, కాయలను తింటూ జీవిస్తుండేవి. ఆ ఏనుగు సమూహం యొక్క రాజు మిక్కిలి మదించినవాడై, గర్వంతో, అహంకారంతో విహరిస్తుండేవాడు. ఒకనాడు అరణ్యంలోని సరస్సులో తన పరివారంతో జలకాలాడటానికి ఆ గజేంద్రుడు ప్రవేశించగా, అచ్చటే ఉన్న మకరీంద్రుడు తన బలిష్టమైన దంతాలతో ఏనుగు కాళ్ళను పట్టుకున్నాడు. కరి భూచరజీవులన్నింటిలోకి పెద్దది. దాని పదఘట్టనతో అది జీవులను హతమార్చగలదు. బలమైన దంతాలతో పొడిచి, అతిశక్తివంతమైన తొండముతో చుట్టి విసిరివేసి చంపగలదు. కానీ నీటిలోని మొసలి గజేంద్రుని కంటే బలమైనది. అది గజరాజుని చీల్చి, తోకతో కొట్టి బాధించి మరణసదృశంగా చేయగలిగిందంటే అది స్థానబలంకాక మరియేమిటి?
తాను బలశాలినని గర్వపడే గజేంద్రుడు తన శక్తినంతా వినియోగించి మొసలి బారి నుండి విడిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు. గజేంద్రుని పరివారం నిలబడి చోద్యం చూడటం తప్ప మరియేమి చేయలేకున్నాయి. మొసలి గజమును నీటిలోకి, గజేంద్రుడు మకరిని బయటకు లాగుతూ వేయి సంవత్సరములు నిర్విరామంగా పోరాడాయి. క్రమం, క్రమంగా గజేంద్రుని శక్తి క్షీణించ సాగెను.
లావొక్కింతయులేదు ధైర్వము విలోలంబయ్యె ప్రాణంబులన్
ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చెతనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్పనితఃపరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్
రావే ఈశ్వరా! కావవే వరద సంరక్షించు భద్రాత్మకా!
అంటూ తనను రక్షించవల్సిందిగా ఆ శ్రీహరిని శరణువేడుకున్నాడు. భక్తుని ఆర్తనాదం విన్న హరి హుటాహుటిని వచ్చి తన సుదర్శన చక్కంతో మకరిని వధించి గజేంద్రుని రక్షించాడు.

NO KISS AUNTY BEATS JOKE IN TELUGUఅమ్మ: చిన్ను అంటికి ముద్దు ఇవ్వు.

చిన్ను:నెను పెట్టను.

అమ్మ: ఎందుకు.?

చిన్ను: ఉదయం నాన్న ముద్దు పెడితె కొట్టింది గా

ఆమ్మ: హ....

LOVE AND RELATIONS POETRY IN TELUGU


అర్చింపచేసుకోవాలని 
ఏనాడైనా అనుకున్నానా..
వెలకట్టలేని ఈ ఆభుషితాలు 
కావాలని అడిగానా..
అవేవీ కూడా 
నా మనసును చేరలేవు
అవన్నీ ఒట్టి ఆకర్షణలే!

రాళ్ళతో ఆడుతున్నానని
ఆ రాళ్ళపై- రాళ్ళే కదాని
ఎంతటి చిన్న చూపు నీకు
వాటిని నీ వెలకట్టలేని
అభూషితాలతో పోల్చి
హేళన చేస్తావు కదా...
నీవులేని సమయాన
అవే నాకు తోడుమరి!

ఇలను పూచిన పూవులతో
చెలిమి చేసేదానను..
నువ్వు తెచ్చిన నెలవంకను కాదని
ఆ పూలతో చెలిమి చేస్తున్నా
అనే కదా వాటిపై నీకింత కినుక
అలనాడు...
అలసిన నన్ను పోల్చింది ఆ
సంధ్యకు వాడిన పూవుతోనే కదా..
ఇంతలోనే ఎంత చిన్న చూపు
ఆ పూవుపై నీకు!

అర్థంలేని పొగడ్తల అగడ్తలలో నన్ను నేను
వెతుక్కునేలా చేసింది ఎవరు?
కమనీయ కల్పనల కవనసీమని
చూపిన నూవ్వే నన్ను వదిలి
పోయావు అర్ధం లేని
అర్ధశాస్త్ర కోవిదానికి
ఆ ధనం నవ్వుతున్నట్లుంటుంది
నువ్వు లేని నన్ను చూసి!

అనురాగమయిని చేసిన నువ్వే_
ఆటలాడుతున్నా అంటున్నావు..
కరడుగట్టిన నీ హృదిలో
కరుణ రేపిన "కల" ను
ఊసులాడాలని చెప్పి,
కడలి అడుగుకీ, ఆకాశం అంచులకీ
వెళ్ళటం ఏమార్చడమేగా..
నన్ను వదిలి నాకోసం వెళ్ళటం
"మనకోసమా"? ...

బంధాలు సంకెళ్ళని
బలహీనం చెసుకుంటున్నది నీవు..
బాధ్యతా,బరువులు తో
నన్ను మరచిన నేను
ఇహలోకాన్ని వీడి,
ఆకసపుటంచులకి ఏగటం అవసరమంటావా
ఇహంలో ఒకరికొకరం అన్న త్రుప్తి మిగుల్చుకోలేని
మనకి ఎందుకీ అర్భాటపు జీవితాలు!

బీడుభూమైనా, గడ్డిపూవైనా,గులకరాళ్ళయినా
ఇలలోని ఆనందంనందనందనమే
మనసుకి ఇష్టం.
అర్ధంలోనే బ్రతుకు అర్ధమున్నదని
అనుకుంటే..
మన మధ్య వున్న బంధానికి సయితం విలువలేదుగా..
ఈ బంధాలు అనుబంధాల మద్య
ఏమున్నదో తెలియదా నీకు -
మన "అనురాగం" ఈనాటిది కాదని
ఎన్నటికీ వుండాలని
అది "ఆత్మబంధమై" వుండాలన్నదే
కదా నా కోరిక.. @తులసి

TELUGU RAMAYANA PURANA STORY ABOUT AHALYA AND THE CURSE OF AHALYA


ఇంద్రుని వల్ల శాపగ్రస్తులైన అహల్య గాధ 

ప్రాచీన కాలంలో వున్న అస్పరసల పాత్ర ఎంతో అద్వితీయమైనది. సౌందర్యానికే ప్రతీకగా వర్ణిస్తూ ఎన్నో రకాల కథలు ప్రచురించబడ్డాయి. కేవలం అందగత్తెలే కాకుండా మంచితనం కలిగినటువంటివారి జీవిత చరిత్రలు.. మట్టిబొమ్మలు ప్రాణం పోసుకున్నట్టు అపురూపంగా వుంటాయి. ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ స్త్రీలకు ముగ్ధులయిపోయేవారు. అటువంటి మహోన్నత పాత్రలను కలిగిన స్త్రీలలో అహల్య ఒకటి. ఆమె మంచిగుణాల గురించి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం...

పూర్వం చతుర్ముఖుడు, గౌతమ మహర్షికి నిత్యం సేవలను అందించేందుకు, ఆయన ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు ఒక అప్సరసను ఏర్పాటు చేశాడు. ఆమె పేరు అహల్య. ఈమె సుగుణాలతో కూడిన సౌందర్యవంతమైన ఒక అందాల రాశి. ఈమె ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎంతో నిస్వార్థతతో, నిజాయితీగా నిత్యం గౌతమ మహిర్షికి సేవలను అందిస్తూ... ఎంతో అందంగా, సక్రమంగా నిర్వహించుకునేది. దాంతో ఈమె నిజాయితీని గమనించిన బ్రహ్మదేవుడు.. గౌతమునికి అహల్యే తగిన భార్య అని భావిస్తాడు.

అలా ఆలోచించిన మరుక్షణమే బ్రహ్మదేవుడు, ధ్యానం చేసుకుంటున్న గౌతమ మహర్షి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంటాడు... ‘‘ఓ గౌతమా! నేను నీకు పెట్టిన అన్ని పరీక్షలలోనూ నువ్వు గెలిచావు. ప్రసవిస్తున్న గోవుకి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే.. భూప్రదక్షిణతో సమానమైన పుణ్యం లభిస్తుంది. అటువంటి పుణ్యంతోపాటు ఎన్నో పుణ్యకారాలను సంపాదించుకున్నావు. అందుకు ప్రతిఫలంగా నేను నీకు అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను. అహల్యను మనస్సుతో స్వీకరించి, ధన్యుడివి అవు’’ అని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా.. బ్రహ్మదేవుడే దగ్గరుండి వనదేవతల సమక్షంలో వీరిద్దరి వివాహాన్ని (గౌతమ మహర్షి, అహల్య) జరిపిస్తాడు.

ఇలా జరిగిన వీరి వివాహనంతరం కొంతకాలానికి వీరిద్దరికి శతానందుకు అనే ఒక కొడుకు పుడతాడు. ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కొన్నాళ్ల తరువాత గౌతమ మహర్షి తపో దీక్షను చేపడతాడు. ఆ దీక్ష ప్రభావం ఎంతగా వుంటుందంటే.. ఏకంగా స్వర్గాన్నే కదిలించేలా వుంటుంది. దాంతో స్వర్గలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు ఒక్కసారిగా భయానికి గురవుతాడు. ఎక్కడ తన పదవి పోతుందేమోనన్న భయంతో.. అతని దీక్షను భంగం కలిగించాలని ఒక పన్నాగం పన్నుతాడు. దానికి దేవతలందరి సహాయాన్ని కూడా కోరుకుంటాడు.

అయితే అహల్య అందానికి ముగ్ధుడైన దేవేంద్రుడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. ఒకవైపు తన స్వర్గలోకాన్ని - దేవతలను కాపాడుకునేందుకు, మరోవైపు అహల్యను పొందాలనుకునేందుకు దేవేంద్రుడు ఒక తనదైన ఒక పన్నాగం పన్నుతాడు. దానిప్రకారం ఒకరోజు దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇంకా తెల్లవారుజాము కాకముందే కోడిరూపంలో వచ్చిన దేవేంద్రుడు గట్టిగా కూస్తాడు. దాంతో గౌతముడు ఒక్కసారిగా ఉలిక్కపడి లేచి, బ్రహ్మముహూర్తం సమీక్షించిందని అనుకుని, సూర్యభగవానుని అర్ఘ్యం ఇచ్చేందుకు బయటకు వెళతాడు. పవిత్ర నదీజలాన్ని తెచ్చుకునేందుకు నదివైపుగా వెళుతుండగా చుట్టుపక్కల కారు చీకటి కమ్మకుని వుంటుంది. అప్పుడు గౌతముడు తన మనసులో.. ‘‘కోడి కూసినప్పటికీ ఎక్కడా వెళుతురు జాడ కనిపించడం లేదు. ఇంకా తెల్లవారలేదులే’’ అని అర్థం చేసుకుని తిరిగి వెనక్కి ఆశ్రమానికి వెళతాడు.

గౌతముడు ఆశ్రమానికి చేరుకోగానే.. తన రూపంలో వున్న దేవేంద్రునిని అహల్యతో కలిసి వుండడాన్ని చూస్తాడు. దాంతో గౌతమ మహర్షికి ఎనలేని కోపం పొంగుకొని వస్తుంది. అవమానంతో కుంగిపోతున్న దేవేంద్రుడు, కోపంతో రగిలిపోతున్న మహర్షిని చూసి భయంతో తన అమరలోకానికి పరుగులు తీస్తాడు. అయితే ఇందులో అహల్య ఏ తప్పు లేకపోయినా.. ఇంద్రుని పక్కన వున్నందువల్ల గౌతమ మహర్షి కోపంతో ఆమెను శపిస్తాడు. ‘‘నువ్వు రాయిగా మారిపో’’ అంటూ క్షణికావేశంతో అంటాడు. అప్పుడు కూడా అహల్య తన భర్త మాటను శిరసావహిస్తూ ఏమీ అనుకోకుండా.. అతను విధించిన శాపాన్ని గౌరవంగా అంగీకరిస్తుంది.

ఇదంతా జరిగిపోయిన కొద్దిసేపటి తరువాత గౌతమ మహర్షి తన దివ్యదృష్టితో ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాడు. అహల్య తప్పు ఏమీలేదని గ్రహిస్తాడు. దానికి ఎంతో పశ్చాత్తాపపడుతూ.. ‘‘రాయిగా వున్న నువ్వు రాముడి పాదాలు తాకినప్పుడు తిరిగి స్త్రీ రూపాన్ని పొందుతావు’’ అని శాపవిమోచనాన్ని ప్రసాదిస్తాడు. అలా రాయిగా మారిపోయిన అహల్య శాప విమోచన పొందేందుకు రాముని రాక కోసం ఎదురుచూస్తూ తన కాలాన్ని గడిపింది. చివరికి చాన్నాళ్ల తరువాత రాముని పాదాలతో పునీతురాలై.. మళ్లీ స్త్రీ రూపాన్ని పొందుతుంది.

అదీ అహల్య గాధ. అహల్య ఎంతో సాత్వికురాలు కాబట్టి.. తన భర్త రూపంలో వచ్చిన ఇంద్రుడు సల్లాపాలు ఆడినప్పుడు కూడా.. తన భర్తేనని అనుకుని మురిసిపోయింది. అంతేకాని.. ఆమెకు ఇతర పురుషుల మీద వ్యామోహం అనేది అస్సలు వుండేది కాదు. తొందరపాటుతో భర్త శాపించినప్పటికీ దానిని అంగీకరిస్తూ తన భర్త మాటను దాటేయకుండా శిరసావహించింది. ఇదే అహల్య గొప్పతనం.

MAHABHARATHA STORY ABOUT THE GREAT WARRIOR AHBIMANYU IN TELUGU


కురుక్షేత్రంలో అభిమన్యుని సాహసం

పూర్వం ‘‘మహాభారతం’’లో పాండవులు, కౌరవుల మధ్య కొన్ని రోజులపాటు ‘‘కురుక్షేత్ర సంగ్రామం’’ (యుద్ధం) ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ యుద్ధంలో ఎందరో యోధులు తమ ప్రాణాలను వీడారు. ఈ యోధులలో భీష్మ పితామహుడు, కుంతి పెద్ద కుమారుడు కర్ణుడు, అర్జునుడి కుమారుడు అభిమన్యుడు వంటివారు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యంకోసం యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు. వీరిలో అర్జునుని కుమారుడు అయిన అభిమన్యుని పాత్రకు ఎనలేని గౌరవం లభించింది. అతి చిన్న వయస్సులోనే కురుక్షేత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వీడి, శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు. సుభద్ర, అర్జునుల కుమారుడయిన అభిమన్యుడు... తల్లి కడుపులో వున్నప్పుడే పద్మవ్యూహాన్ని ఛేధించే విద్య గురించి తెలుసుకున్నాడు. అటువంటి వీరుడైన అభిమన్యుని వైనం గురించి కొన్ని విశేషాలు...

కురుక్షేత్ర యుద్ధం మొదలైన మొదటి నుంచి ఎంతో భయంకరంగా సాగుతోంది. పాండవులు, కౌరవుల తరఫు నుంచి ఎందరో మహావీరులు, సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. అలా ఘోరంగా సాగిన యుద్ధం పదమూడవ రోజుకు చేరుకుంది. కౌరవులు, పాండవులను ఓడించేందుకు ద్రోణాచార్యుని సహాయంతో పద్మవ్యూహం పన్నాగం పన్నుతారు. ఎంతో క్లిష్టతరమైన ఈ వ్యూహాన్ని ఛేదించడంలో పాండవులు, వారి సైన్యం వెనకుండిపోతుంది. కౌరవులు పన్నిన వ్యూహంతో సైనికులను చంపుకుంటూ ముందుకు వెళ్లిపోతారు.

ఆ సమయంలో ధర్మరాజు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యుని సహాయం కోరుకుంటాడు. ధర్మరాజు, అభిమన్యునితో.. ‘‘అభిమన్యుడా..! ఈ భయంకరమైన పద్మవ్యూహాన్ని ఛేదించే విద్య కేవలం శ్రీకృష్ణుడు, మీ నాన్న అర్జునునికి, శ్రీకృష్ణుని కొడుకైన ప్రద్యుమ్నునికి, నీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ సమయంలో వీరెవ్వరూ ఇక్కడ లేరు. కాబట్టి ఈ వ్యూహాన్ని ఛేధించే మొత్తం భారం నీమీదే వుంది. సైన్యాధిపతి బాధ్యతలను స్వీకరించి, సైన్యాన్ని నీ వెంట తీసుకువెళ్లు’’ అని వేడుకుంటాడు.

దానికి సమాధానంగా అభిమన్యుడు.. ‘‘పెదనాన్న (ధర్మరాజు) గారు! నేను మీకు ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో పనికి వస్తానని ఏనాడు అనుకోలేదు. కానీ ఈరోజు నాకు ఇంతటి సౌభాగ్యం కలిగించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను వయస్సులో చిన్నవాడయినా.. వీరబలశాలి అయిన అర్జునుడు, సుభద్ర కుమారుణ్ణి. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించే విద్య గురించి నేర్చుకున్నవాణ్ణి. నేను కేవలం పద్మవ్యూహాన్ని ఛేధించి లోనికి వెళ్లే వరకు మాత్రమే విద్యను సంపాదించుకోగలిగాను. వెనక్కి వచ్చే మార్గం గురించి తెలుసుకోలేకపోయాను. అయినా నేను నేర్చుకున్న ఈ విద్యను ఉపయోగించి, మీకు సహాయం పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని చెబుతాడు.

ధర్మరాజుకు ఇచ్చిన మాట ప్రకారం అభిమన్యుడు ఎంతో ఉత్సాహంగా కౌరవులు పన్నిన పద్యవ్యూహాన్ని సునాయాసంగా ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతాడు. పాండవుల సేన కూడా అతనిని అనుసరిస్తూ కౌరవసేనను మట్టి కరిపిస్తూ వెళ్లారు. కొంత సమయం వరకు అభిమన్యుడు తను నేర్చుకున్న విద్యతో అపార ప్రతిభను ప్రదర్శించాడు. అది గమనించిన కౌరవ సేనులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎక్కడ వారు యుద్ధంలో ఓడిపోతారోనన్న భయం వారిలో ఒక్కసారిగా కలచివేసింది.

అప్పుడు శకుని ఎలాగైనా అభిమన్యున్ని చంపాలనే నెపంతో.. తన తెలివితేటలతో, మాటలతో అతనిని పొగడ్తలతో ముంచెత్తుతాడు. చిన్న వయస్సులో వున్న అభిమన్యుడు, శకుని మాటలతో ఉత్సాహాన్ని తగ్గించుకుంటాడు. అప్పుడు కౌరవ సైన్యం ఒక్కసారిగా అభిమన్యుని మీద విరగబడతారు. కత్తులు, బాణాలు, గదలతో అతని మీద విరుచుకుపడతారు. చిన్న వయస్సులోనే అభిమన్యుడు తన విద్యతో కౌరవ సైన్యాన్ని మట్టి కరిపించి, తను కూడా నేలకొరిగాడు. ఉన్న కొద్దిసమయం వరకు విజయవంతంగా పోరాడి.. చివరికి వీరస్వర్గాన్ని సొంతం చేసుకున్నాడు. ఎందరో యువసైనికులకు ఆదర్శంగా నిలిచాడు.

MAHABHARATHA PURANA KATHA - WHY DANCER URVASI CURSE ARJUNA AND HOW ARJUNA UTILISES THE CURSE IN AGNATHAVASAM AS BRUHANNALA


 ఊర్వశి, అర్జునున్ని ఎందుకు శపించింది?

పూర్వం మహా శివుడు, పరాక్రమవంతుడైన అర్జునుని విలువిద్యలను పరీక్షించాలని ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఆ నేపథ్యంలో శివుడు మహా కిరాతుకుని రూపంలో అర్జునుని మీద దాడి చేస్తాడు. అర్జునుడు అతనిని చూసి భయపడకుండా తన శక్తితో యుద్ధానికి దిగుతాడు. దీంతో శివుడు అర్జునుని శక్తియుక్తులను చూసి ఎంతో సంతోషిస్తాడు. అతనికి బహుమతిగా పాశుపతాస్త్రాన్ని కూడా ప్రసాదిస్తాడు శివుడు. అలాగే అర్జునుని లీలలను ప్రశంసిస్తూ ఇంద్రుడు, వరుణుడు, ముడు, కుబేరుడు కూడా అతనికి దివ్య అస్త్రాలను ఇస్తారు. ఆ శుభసందర్భంలోనే అర్జునుడు స్వర్గలోకానికి వెళతాడు.

అర్జునుడు స్వర్గలోకానికి వెళ్లగానే అక్కడ దేవతలందరూ ఇతనికి ఘనస్వాగతం పలుకుతారు. అతిధి మర్యాదలు నిర్వహించి ఇతనికోసం నృత్య ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ నృత్య ప్రదర్శనలో స్వర్గలోకంలోనే అపురూప సౌందర్యవతి అయిన ఊర్వశి ఎంతో అద్భుతంగా నాత్యం చేసి అందరినీ మెప్పిస్తుంది. ఆమె నాట్యాన్ని చూసిన అర్జునుడు కూడా కనురెప్పలను ఆర్పకుండా నిర్ఘాంతమయిపోయి, అలాగే చూస్తూ వుండిపోతాడు. అర్జునుడిని ఆ విధంగా గమనించిన ఊర్వశి కూడా సంతోషంతో ముగ్ధురాలయిపోతుంది. తన మోహంలో అర్జునుడు కూడా ముగ్ధుడయిపోయాడని ఆమె భావిస్తుంది.

ఇలా నృత్య ప్రదర్శన అయిపోయిన తరువాత అర్జునుడు సేద తీర్చుకోవడానికి తన గదిలో తూగుట ఊయలో విశ్రాంతి తీసుకుంటుంటాడు. అదే సమయంలో ఊర్వశి అక్కడికి చేరుకుంటుంది. ఆమెను చూడగానే అర్జునుడు విధేయతతో లేచి, ఆమె ముందు నిలబడతాడు. అర్జునుని మోహంలో పూర్తిగా మునిగిపోయిన ఊర్వశి సిగ్గుపడుతూ.. ‘‘అర్జునా! నీ చూపులు చూస్తుంటే నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావో అర్థమవుతోంది. నేను కూడా నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాను. నీ గురించి, నీ ధైర్యపరాక్రమల గురించి అందరి ద్వారా ఎంతగానో విన్నాను. అలాంటి నిన్ను ప్రత్యక్షంగా చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాను. నిన్ను ఎలాగైనా సంతోష పెట్టాలని ఇక్కడికి వచ్చాను’’ అని అంటుంది.

ఊర్వశి చెప్పిన మాటలకు అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యి... కొద్దిసేపటివరకు ఆలోచనలో పడిపోతాడు. ఆమెకు సమాధానంగా... ‘‘తల్లీ! నీ మాటలు నన్ను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచించగలిగావు. నువ్వు మా వంశస్థుడైన పురూరడివి భార్యవి.. అంతేకాకుండా ఇంద్రునికి ఇష్టసఖివి.. అలా చూస్తే నువ్వు నాకు తల్లితో సమానురాలివి. అటువంటిది నువ్వు నన్ను, నేను నిన్ను మోహించడం అనైతికం. దయచేసి నీ మనసులో వున్న ఆలోచనలను తొలగించేసుకుని, ఇక్కడి నుంచి వెళ్లిపో’’ అని చెబుతాడు.

అర్జునుడు ఇన్నేసి మాటలన్నా ఊర్వశి వాటిని పట్టించుకోకుండా తనను నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది. ‘‘దేవలోకంలో ఇటువంటి నీతులు, బంధాలు వుండవని... అప్సరసలు వుండేదే అందరినీ ఆనందింపచేయడానికి’’ అని చెబుతుంది. అయితే అర్జునుడు మాత్రం ఆమె మాటలకు, సౌందర్యానికి లొంగకుండా.. ‘‘నువ్వు ఎంత ప్రయత్నించినా నా మనసు నీ సౌందర్యం మీద మోహించదు. నేను నిన్ను అంగీకరించలేను. నువ్వు నాకు తల్లితో సమానం’’ అని పేర్కొంటాడు.

అర్జునుడి మాటలతో ఊర్వశి కోపం అవధులు లేకుండా దాటిపోతుంది. ఆవేశంతో రగిలిపోతూ.. ‘‘ఓరీ అర్జునా! ఈ దైవలోకంలో నన్ను ప్రతిఒక్కరు మోహించినవారే వున్నారు కానీ... ఎవ్వరూ నన్ను ఇంతవరకు తిరస్కరించలేదు. నాకు నేనుగా నిన్ను మోహించడానికి కోరుకుంటే.. నువ్వు నాతో ఇలా మాట్లాడుతావా..! ఈ పరాభవాన్ని నేను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఇంతగా అవమానించిన నీకు ఏదో ఒక శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు నన్ను మోహించలేదు కాబట్టి కొన్నాళ్లవరకు నపుంసకుడిగా జీవిస్తావు. నీ ధైర్యసాహసాలకు భిన్నంగా ఆడవాళ్లతో కలిసి జీవించాల్సి వస్తుంది. ఇదే నేను నీకు విధించే శాపం’’ అని చెబుతుంది.

అలా ఆ విధంగా అప్సరస ఊర్వశి, అర్జునునికి శాపం ఇచ్చిన కారణంగా ఒక ఏడాదిపాటు నాట్యాచారుడు బృహన్నల అవతారం ఎత్తవలసి వచ్చింది. మహిళలతో కలిసి జీవించాల్సి వచ్చింది. అయితే ఈ శాపమే అతనికి ఒక విధంగా కొన్ని సందర్భాలలో వరంగా కూడా మారింది.

Tuesday, 16 December 2014

TELUGU PURANA STORY OF MAHARISHI JAMADAGHNI AND THE STORY OF KARTHVEERYUDU AND PARASURAMUDUరాచ అహంకారానికి జమదగ్ని బలి

కన్ను మూసి తెరిచే లోపు తన ఆజ్ఞను పాటించిన పరశురాముణ్ని ప్రేమగా చూస్తూ దగ్గరకు తీసుకుని చెప్పాడు.

''తండ్రి మాటతో తల్లినే నరికిన పరశురామా! ఎంతటి క్లిష్టమైనవౖౖెనా సరే. నీక్కావలసిన వరాలు కోరుకో. తప్పక నెరవేరుస్తాను'' అన్నాడు.

అందుకు వినమ్రంగా తండ్రికి నమస్కరిస్తూ ''తండ్రీ! ముందుగా నా తల్లిని బతికించు. ఆపై నేను చేసిన మాతృ హత్యాపాతకం నుంచి నన్ను విముక్తుణ్ని చెయ్యండి. మహా బలపరాక్రమాన్ని, దీర్ఘాయుర్దా యాన్నీ ప్రసాదించండి'' అన్నాడు.

జమదగ్ని కుమారుడు అడిగిన వన్నీ ఆనందంగా ఇచ్చాడు. పరశురాముడు తల్లికీ, తండ్రికీ సాష్టాంగ నమస్కారాలు చేశాడు.

* కార్యవీర్యుని కథ

ఆ కాలంలో హైహయ వంశానికి చెందిన భూపతి కార్తవీర్యుడు అనూప దేశాన్ని పాలిస్తున్నాడు. కార్తవీర్యుడు వెయ్యి చేతులు, అపార పరాక్రమం కలవాడు. మహా వీరాధివీరు నిగా కీర్తిని పొందాడు.

సహస్రబాహుడనే పేరుతో విఖ్యాతి చెందిన కార్యవీర్యుడు ఒకరోజు అరణ్యానికి వేటకోసం వచ్చాడు. అక్కడ అనేక క్రూర మృగాలను వేటాడి బాగా అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు.

చతురంగ బలాలతో వచ్చిన కార్యవీర్యునకు తగిన అతిథి మర్యాదలు చెయ్యాలనుకున్నాడు మహర్షి.

అయితే, జమదగ్ని సేవలను నిర్లక్ష్యంగా అందుకుని ఆశ్రంలో ఉన్న వాళ్లతో అవమానపూరితంగా మాట్లాడాడు.

అయినప్పటికీ జమదగ్ని మహర్షి మారు మాట్లాడకుండా మౌనాన్నే వహించాడు.

మహర్షి మౌనాన్ని అలుసుగా తీసుకుని ఆశ్రమంలో పూలచెట్లను, ఫల వృక్షాలను విచక్షణా రహితంగా నరికే శాడు. నేలమట్టం చేశాడు.

ఆశ్రమవాసులకు, అతిథులకు, యజ్ఞవిధులకు అవసర మయ్యే హోమధేనువునూ, దాని లేగదూడను రాజ్యానికి తరలించమని తన సేనలకు చెప్పాడు.

చేయాల్సిన అనాలోచిత కార్యాలన్నీ ఆశ్రమంలో చేసి అనంతరం తన రాజ్యానికి బయలుదేరాడు కార్యవీర్యుడు.

కార్యవీర్యుడు ఆశ్రమంనుంచి వెళ్లిన కొద్దిసేపటికి ఆశ్రమ అవసరాలకోసం అరణ్యానికి వెళ్లిన పరశురాముడు తిరిగి వచ్చాడు.

ఆశ్రమమంతా అల్లకల్లోలంగా ఉంది. జరిగినదంతా తండ్రి ముఖత: విన్నాడు. కార్యవీర్యుడు తీసుకువెళ్లిన గోమాత గూరించి జమదగ్ని చాలా దు:ఖించాడు.

తండ్రి చెప్పినదంతా విన్న పరశురాముడు మహాగ్నిలా మారాడు. వింటినుంచి వెలువడ్డ బాణంలా కార్తవీర్యుని మీదికి వెళ్లాడు.

వెళ్లడమే తరువాయి కార్త వీర్యుని సైన్యంపై మహా ప్రళయ కాలంలో మేఘంలా శరవృష్టి కురిపించాడు.

పరశురాముని భీకరావేశానికి కార్యవీర్యుని సైన్యం గజగజ వణి కింది. చతురంగసేన ఇష్టమొచ్చిన దిశకు పరుగులు పెట్టింది.

దాంతో మహా ఆవేశంతో కార్తవీర్యుడు తన సహస్ర బాహువులతో పరశురాముని మీదకు వచ్చాడు. మహా దుర్వార శౌర్యంతో వచ్చిన కార్తవీర్యుని వెయ్యి చేతులను తన వాడి బాణాలతో కొట్టాడు పరశురాముడు. ఆ ధాటికి భీకర ఆర్తనాదాలు చేసినా కార్తవీర్యుడు మరింత ఉక్రోషంతో పరశురామునితో తలపడ్డాడు.

పరశురాముడు భయంకర సింహనాదం చేసి గండ్రగొడ్డలితో కార్తవీర్యుని తలను ఖండించాడు. విజయ దరహాసంతో ఎత్తిన గొడ్డలిని దించి ఆశ్రమానికి వచ్చాడు పరశురాముడు.

తమ తండ్రి కార్తవీర్యుడు హతమయ్యాడని తెలుసుకున్న అతని పుత్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. పగతో రగిలిపోయారు.

పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం కోసం వేచి చూసి సమయం రాగానే మహా బలగాలతో ఆశ్రమం మీదికి విరుచుకుపడ్డారు.

ఆశ్రమవాసులను కఠిన పదజాలంతో దూషించారు. తండ్రి నాశనం చెయ్యగా మిగిలిన వృక్షాలు, చెట్లనూ పెకలించి వేశారు. మూకుమ్మడిగా జమదగ్నిని బంధించారు. ఆ మహర్షి భీతిల్లి పరశురాముడిని ఎలుగెత్తి పిలిచాడు. ఆశ్రమంలోని మునులు శోకిస్తూ మహర్షిని ఏం చెయ్యవద్దని వేడుకో సాగారు.

అయినా విచక్షణా జ్ఞానం కోల్పోయిన కార్తవీర్యుని పుత్రులు కర్కశంగా జమదగ్ని మహర్షిని సంహరించారు.

వచ్చిన పని నెరవేరిందని కార్తవీర్యుని పుత్రులు చల్లగా తమ రాజ్యానికి జారుకున్నారు.

విచ్చలవిడిగా విచక్షణారహితంగా ఆశ్రమాన్ని పాడు చెయ్యడమే కాకుండా, భర్తను హతమార్చిన రాజబిడ్డల అరాచకత్వాన్ని ఆ సమయంలో ఏమీ చెయ్యలేక మరణిం చిన భర్తతలను ఒడిలో పెట్టుకుని రోదిస్తోంది రేణుక.

ఎక్కడో దూరంగా ఉన్న పరశురామునికి తండ్రి ఆర్త నాదం చెవిన పడింది. అంతే! ఏదో జరిగిందనుకుని హఠాత్తుగా అక్కడినుంచి ఎంతో వేగంతో ఆశ్రమానికి వచ్చాడు పరశురాముడు.

అయితే అప్పటికే జరగాల్సిన బీభత్సమంతా జరిగి పోయింది. తండ్రి దుస్థితి చూసి చలించిపోయాడు. తల్లిని ఓదార్చాడు పరశురాముడు.

జరిగిన ఘోరానికి పరశురామునిలో పౌరుషం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా ఆ నీచాధములపై ఆగ్రహం జ్వలించింది.

''హైహేయులారా! సకల ప్రాణికోటిని ప్రేమించే ఈ పుణ్యాత్ముని చంపేందుకు మీకు చేతులెలా వచ్చాయి? క్షత్రియ వంశమే అటువంటిది.

ఈ భూమిపై అసలు క్షత్రియ వంశమే ఉండకూడదు. మీ జాతి సమస్తాన్నీ నిర్మూలిస్తాను. ఇదే నా శపథం. నేల నాలుగు మూలలా ఉన్న రాజులందరుకూ ఇక రోజులు మూడినట్టే'' అని గట్టిగా ప్రతిజ్ఞ చేసి గండ్రగొడ్డలిని పైకి ఎత్తి క్షత్రియులపై విరుచుకు పడేందుకు బయలుదేరాడు.

అలా ఆవేశంతో బయలుదేరిన పరశురాముడు దొరికిన క్షత్రియుణ్ని దొరికినట్టుగా సంహరించాడు. పరశురామునికి భయపడి దాక్కున్న వారిని కూడా విడిచిపెట్టకుండా వెతికి మరీ బయటకు లాక్కొచ్చి హతమార్చాడు భార్గవరాముడు.

సమస్త భూమండలాన్నీ తన స్వాధీనం చేసుకున్నాడు. ఆపై అనేక యజ్ఞాలు చేశాడు. ఋత్విజులకు ఇచ్చే సంభావనగా ఐరావతాలు, పుండరీకమూ, వామనమూ, కుముదము, అంజనము, పుష్పదంతమూ, సార్వభౌమమూ, సుప్రతీకాలనే అష్టదిగ్గాలతో మోయబడుతున్న సకల భూమండలాన్నీ కశ్యపునికి దానం చేశాడు.

మనసు వికలమై వైరాగ్యంతో మహేంద్రగిరికి తపస్సుకోసం వెళ్లిపోయాడు.

అదీ ధర్మరాజా పరశురాముని కథ'' అంటూ వివరించాడు ఆకృతవ్రణుడు.

పరశురాముని స్వీయగాథను విన్న ధర్మరాజు పులకరించపోయాడు. ఆపై పరశురాముణ్ని చతుర్దశి నాడు దర్శించి సేవించి ధన్యుడయ్యాడు.

ఆపై దక్షిణదిశగా తన వారితో బయలుదేరి వెళ్లాడు ధర్మరాజు. అలా ఎంతో దూరం పయనించిన అనంతరం త్య్రంబకక్షేత్రాన్ని చేరుకున్నారు వారంతా. తన నీటి ప్రవాహంతో భూమండలాన్ని పునీతం చేసిన గోదావరి నదీమతల్లిని సేవించారంతా. ధర్మరాజు ఆవులను, బంగారాన్నీ విలువైన రతనాలను దానం చేశాడు అక్కడి విప్రులకు.

మరిన్ని దివ్య పుణ్యక్షేత్రాలను దర్శించాలన్న కోరికతో ముందుకు కదిలారు. ద్రవిడ రాజ్యంలోని అగస్త్య తీర్థాన్ని సేవించుకున్నాడు. ఆ పుణ్య తీర్థంలో అర్జునుడు చేసిన వెయ్యి గోవుల దానం గురించి అక్కడి వారివల్ల తెలుసుకుని ధర్మరాజు పరమానందం చెందాడు. సోదరుడైన అర్జునుణ్ని తలచుకుంటూ శూర్పారకమనే తీర్థం చేరుకున్నారు.

శూర్పారక క్షేత్రం వద్ద మహా పర్వతంలా పొడవుగా ఉన్న పరశురాముని వేదికని దర్శించి, అక్కడినుంచి ముందుకు సాగి సాగర తీరంలో ఉన్న దివ్యమైన ప్రభాస తీర్థాన్ని చేరుకున్నారు.

అక్కడ పన్నెండు రోజులపాటు గాలి నీరు ఆహారంగా తీసుకున్న ధర్మరాజు దక్షిణాగ్ని, గార్హపత్యం, ఆవహనీయం, సభ్యం, అవపథ్యం అనే పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు.

ప్రభాస తీర్థం యాదవ రాజ్య పరిధిలోనిది. తమ ప్రాంతానికి పాండవులు వచ్చారని తెలుసుకున్న బలరామ కృష్ణులు, వృష్టి వంశ నాయకులు వచ్చి పాండవులను కలిశారు. ప్రయాణ భారంతో అలసిసొలసి చిక్కిన పాండవులను కుశల ప్రశ్నలను వేశారు.

మహాభరణాలు, పీతాంబరాలతో వెలిగిపోయే పాండవులు జింక చర్మం, నారబట్టలు ధరించి కనపడడంతో మనసులోనే కలత చెందారు.

LORD SRI MAHA VISHNU AVATHARS STORIES IN TELUGU - ABOUT NARASIMHA AVATHAR, VAMANA AVATHAR, PARASURAMA AVATHAR, VEDAVYSYA AVATHARS


నరసింహ, వామన, పరశురామ, వేదవ్యాస అవతారాలు

01. నరసింహ అవతారం

చతుర్దశమ్ నారసింహమ్ బిభ్రత్ దైత్యేంద్రమూర్జితమ్ |
దదార కరజైరూరౌ ఏరకామ్ కఠకృద్ యథా ||

తరువాత పద్నాల్గవ రూపం నరసింహ అవతారం. ఇది హిరణ్యకశపుడి బలిసిన దేహాన్ని చీల్చి ప్రహ్లాదుణ్ణి కాపాడటం కోసం "దదార కరజైరూరౌ ఏరకామ్ కఠకృద్ యథా", గడ్డిని కత్తితో కోసిపడేసినట్లుగా తన గోర్లతో హిరణ్యకశపుడి దేహాన్ని చీల్చిపారేసాడు.

02. వామన అవతారం

పఙ్చదశమ్ వామనకమ్ కృత్వాగాద్ అధ్వరమ్ బకేః |
పదత్రయమ్ యాచమానః ప్రత్యాదిత్సుః త్రిపిష్టపమ్ ||

స్వర్గాన్ని తిరిగి ఇవ్వాలని దాన్ని లాగేసుకున్న బలిచక్రవర్తి నుండి, ఆయన దగ్గర ధాతృత్వం అనే గుణం ఉందికదా అని దానికి తగినట్లుగా ఒక యాచక అవతారాన్ని ధరించి ఆ బలి చక్రవర్తి యాగం చేస్తున్నటువంటి చోటికి వెళ్ళి మూడడుగుల స్థలం కావాలని కోరి స్వర్గాన్ని తిరిగి దేవతలకి ఇచ్చాడు. అలా వచ్చిన వామన స్వరూపం పదహైదవ అవతారం.

03. పరశురామ అవతారం:

అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మ ద్రుహోనృపాన్ |
త్రిః సప్త కృత్వః కుపితః నిఃక్షత్రామ్ అకరోన్ మహీమ్ ||

పదహారవ అవతారం పరశురామ అవతారం. ఈ అవతారంలో లోకాన్ని నాశనం చేసే దుష్ట ప్రభువుల్ని తొలగించి భూమి భారాన్ని తగ్గించాలని "త్రిః సప్త", ఇరవై ఒక్కసార్లు భూని చుట్టాడట. ఎక్కడెక్కడ దుష్ట ప్రభువులుంటే వారిని సంహరించిపారవేసాడు. లోకంలో క్షత్రియులనే లేకుండా చేయాలని బయలుదేరిన అవతారం అది.

04. వేదవ్యాస అవతారం:

తతః సప్తదశే జాతః సత్యవత్యామ్ పరాశరాత్ |
చక్రే వేదతరోః శాఖా దృష్ట్వా పుంసోల్ప మేధసః ||

తరువాత పదిహేడవ అవతారం వేద వ్యాస అవతారం. ఈ లోకంలో ఉండే మనుష్యుల బుద్ధి పలచబడి పోతుంది అని ఒక్క మహా వృక్షంగా రాశీభూతమైన వేదాన్ని విభాగం చేసాడు. అట్లా 1131 శాఖలుగా విభజించాడు. అందుకు ఆయన పరాశర మహర్షి యొక్క కుమారుడిగా సత్యవతీ దేవికి అవతరించాడు.

TELUGU PURANA STORY ABOUT VYTHARANI NADHI - VYTHARANI RIVER FLOWS IN HELLవైతరణీ నది

వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉన్నది. పాపములు చేసిన వారు చని పోయిన పిమ్మట ఈ నది దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహించును. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గూండా లోనికి వస్తారని ఇందులో పేర్కొన బడినది.

1. వర్ణన

ఈ నది అతి భయంకరమైనది, దీంట్లో నుండి వెళ్ళె సమయములో వచ్చే భాదకు పాపాలన్ని గుర్తుకు వస్తాయని పెర్కొనబడినది. ఈ నది కొన్ని వేల మైళ్ళా వెడల్పు కలిగి ఉన్నది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు వుండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో వుండే మాంసహారులన్ని వుండును.

వైతరణీ నదీ వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంది ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు(మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఖఃద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి చేరుతాడు. ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి.

గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రధమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు.

హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట.

2. దాటడానికి మార్గాలు

ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు గలవు. ఐతే ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే కేవలము పాపాలు చెసినవారు మాత్రమే ఈ నది గూండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చెయ్యని వారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారము గూండా రారు, ఇంకా చెప్పలంటే యమ లోకనికే రారు.

3. నది దాటాక

ఈ నది దాటిన పిమ్మట పాపులు దక్షిణ ద్వారము నకు చేరుకొందురు.
అబద్ధమాడిన వారు నరకాన్ని చవి చూడాల్సిందే
ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో?

STORIES OF LORD SRI MAHA VISHNU AVATHARS - SRI RAMA - BALARAMA - SRI KRISHNA - BUDDHA AND KALKI AVATHARS STORIES IN TELUGU


 రామ, బలరామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు

01. రామావతారం:

నర దేవతమాపన్నః సురకార్య చికీర్షయా |
సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాణి అనేకషః ||

దాని తరువాత దేవతలందరికీ ఏర్పడ్డ కష్టాలని తొలగించటానికి మనిషిగా అవతరించాడు. ఏం ఆశ్చర్యకరమైన పనులు చేసాడు, సముద్రాన్ని కూడా కోపించి నియంత్రించాడు చెప్పడానికి వీలుకానన్ని కృత్యాలు చేసాడు. ఇది మానవ అవతారం. ఇది పద్దెనిమిదవ అవతారం రామావతారం.

02 బలరామ-కృష్ణావతారాలు:

ఏకోనవింశే వింశతిమె వృష్ణిషు ప్రాప్య జన్మని |
రామకృష్ణావితిభువః భగవాన్ అహరద్భరమ్ ||

పంతొమ్మిది ఇరవైయవ అవతారాలు ఆయన అన్నతమ్ములుగా వచ్చాడు. శ్రీకృష్ణ బలరాములుగా యాదవుల్లో అవతరించి దుష్టసంహారం చేసి భూముకు ఏర్పడ్డ క్లేషాలని తొలగించాడు. ఇందులో ఒకటి సాక్షాదవతారం, మరొకటి జీవుణ్ణి ప్రధానం చేసుకొని వచ్చిన అవతారం. శ్రీకృష్ణుడిగా వచ్చింది సాక్షాదవతారం. బలరాముడిగా వచ్చినది అనుప్రవేశ అవతారం.

03. బుద్ధావతారం:

తతః కలై సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషామ్ |
బుద్ధో నామ్నాఙ్జన సుతః కీకఠేషు భవిష్యతి ||

ఇరవై ఒకటవ అవతారం బుద్ధావతారం. ఈ విషయం చెప్పేప్పుడు ఇంకా ఈ అవతారం రాలేదు. అందుకే సూతులవారు "భవిష్యతి", ఇది కాబోతోంది అని చెప్పారు. అంటే సూతులవారు శౌనకాదులకి ఉపదేశం చేసేవరకు బుద్ధావతారం జరగలేదు. కలియుగం ప్రారంభం అయినతరువాత లోకంలో ఉండే వారికి సంమోహం కలిగించేందుకు కలి యొక్క ప్రభావాన్ని లోకంలో వ్యాపింపజేయడం కోసం ఆయన జినుడి కుమారునిగా బుద్ధుడిగా కీకట దేశాల్లో అవతరిస్తాడు అని చెప్పాడు.

04. కల్కి అవతారం:

అథాసౌ యుగ సంధ్యాయామ్ దస్యు ప్రాయేషు రాజసు |
జనితా విష్ణు యశసః నామ్నా కల్కిర్ జగత్ పతిః ||

ఇరవై రెండవ అవతారం కూడా క్రమంగా వస్తుంది. ఈ కలియుగం అయిపోయాక యుగ సంధికాలంలో వస్తుంది. కలియుగం అయిపోయి కృత యుగం ప్రారంభం అవ్వాలి, అప్పుడు కల్కి అవతారం వస్తుంది. విష్ణు యశస్ అనే ఆయనకి పుడతాడు. కలియుగం మొత్తం నాలుగులక్షల ముప్పైరెండు వేల సంవత్సరాలు. ఇప్పుడు గడిచినది సుమారుగా ఐదువేల సంవత్సరాలు మాత్రమే. "యుగ సంధ్యాయామ్ దస్యు ప్రాయేషు రాజసు", అప్పుడు దేశాన్ని పాలించేవాళ్ళంతా దొంగలై పోతారు. ప్రజల్ని దోచుకు తింటారు. ఇప్పుడు ఇంకా అంతగా కాలం రాలేదు, ఇంకా మంచిగా పరిపాలన చేస్తాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఆనాటికి తెలిసి తెలిసి భయం లేక దోచుకు తింటారు. కలి పెరిగితే తప్పు జరుగుతుంటే ఇది తప్పు అని ఎవరికీ అనిపించదు, ఇది తప్పు అనేవాడు ప్రక్కన ఉండడు. ఇది ధర్మమని కానీ ఇది దైవమని కానీ ఎక్కడా మాటనే వినిపించని స్థితిని కలి ఆరంభం అయినట్లు అర్థం. అలా కొన్ని అవతారాలి సూతులవారు వివరించారు.

WHAT IS THE IMPORTANCE / ADVANTAGES OF HARATHI IN TEMPLES


హారతి వల్ల లాభము ఏమిటి?

గృహములోను, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేతప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. సుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగాకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటూవ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిచేసిన పోతుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.

TELUGU DEVOTIONAL ARTICLE ABOUT LORD SRI CHATHURMUKHA BRAHMA


అవతార క్రమంలో మొదటిదిగా 'చతుర్ముఖ బ్రహ్మా'

సూతులవారు భగవంతుడి అవతారాలను గురించి చెబుతున్నారు. ఒక ఇరవై రెండు అవతరాలను చెబుతారు. దశావతారాలు అని అంటుంటారు, అవి వీటిల్లో కొన్ని ఎంపిక చేసి చెప్పేవి మాత్రమే. భాగవతంలో కొంత లోనికి వెళ్తే ఇరవై నాలుగు అవతారాలని ప్రస్తావించారు. మరింత లోనికి వెళ్తే పది, ఇరవై రెండు, ఇరవై నాలుగు అని ప్రశ్నే కాదు అసలు అవతారాలకి లెక్కే లేదు అని చెబుతారు. కొన్ని ప్రధానమైన వాటిని తెలుసుకుంటే అవేమిటో కొంతనైనా తెలుస్తుందని కొన్నింటిని వివరించారు. కొందరు ఈ అవతారాలను చెప్పేప్పుడు మొదట జలంలో తిరిగేది, ఆపై జలంలో, నేలపై తిరిగేది, నేలపై తిరిగేది, మానవుడిగా చిన్న పరిణామం, ఆపై మనిషి అందులో ఒక ఉగ్ర రూపం, ఆపై శాంత రూపం ఇలా ఒక పరిణామాన్ని చెబుతారు, కానీ అది సరికాదు. ఈ క్రమంలో అవతారాలు రాలేదు. అవతారాల క్రమమేమిటో చెబుతారు సూతులవారు.
స ఏవ ప్రథమమ్ దేవః కౌమారమ్ సర్గమ్ ఆశ్రితః |
చచార దుశ్చరమ్ బ్రహ్మా బ్రహ్మచర్యమ్ అఖండితమ్ ||
పాలకడలిలో ఉన్న పురుష స్వరూపంలోంచి మొట్ట మొదటగా వచ్చాడు చతుర్ముఖ బ్రహ్మ. కనుక ఆ బ్రహ్మని మొట్ట మొదటి అవతారంగా చెబుతారు. పరమాత్మ యొక్క ఆది రూపం లేదా కారణ రూపం అనేది ఆయన సాక్షాత్తు ధరించినది. అదీ మొట్ట మొదటిది అని కూడా చెప్పుకోవచ్చు, కానీ అందులోంచే అన్నీ వస్తున్నాయి కనుక అది అవతారము అని చెప్పనక్కరలేదు. అది అవతారాల మూలం అని చెప్పవచ్చు. అందులోంచి చతుర్ముఖుడు మొదటగా వచ్చాడు, ఒక జీవాదిష్టమైన రూపంలో వచ్చాడు. కనుక చతుర్ముఖ బ్రహ్మ మొదటగా వచ్చిన అవతారం. ఒక పుణ్య విశేషం చేత ఒక జీవుణ్ణి తీసి నాలుగు ముఖాలుకల రూపాన్ని ఇచ్చి, నీ పేరు బ్రహ్మా, నీ కార్యం సృష్టి నీవుండే చోటు ఇది అని కర్తవ్యాన్ని అప్పగిస్తాడు.
జీవాదిష్టానమైన అవతారం చతుర్ముఖ బ్రహ్మది. అందులోంచి శనక సనందాది కుమారులు అనే ఒక నలుగురిని బయటికి తీసుకు వచ్చాడు. తాను బ్రహ్మగా పరమాత్మ యొక్క నాభీకమలంలోంచి బయటికి వచ్చి "బ్రహ్మచర్యమ్ అఖండితమ్ చచార దుశ్చరమ్ ", ఆయన కేవలం బ్రహ్మ చర్యాన్ని పాటించాడు. "అఖండితమ్", అంటే ఏదో కొంతకాలం అని కాదు ఎంతకాలమో చేసాడు. బ్రహ్మ చర్యం అంటే వేదాధ్యయనం. చాలా తీవ్రమైన తపస్సు. ఆ తపస్సుకు పరమాత్మ అనుగ్రహించి ఆయన ద్వారా సృష్టి కార్యాన్ని సాగించాడు పరమాత్మ. ఇది ఒక అవతారం.

HOW TO VIEW LORD SRI MAHA VISHNU IN MILK OCEAN - PALA KADALI LO UNNA PURUSHA SWAROOPANNI ETLA CHUDATAM


పాలకడలిలో ఉన్న పురుష స్వరూపాన్ని ఎట్లా చూడటం ?

ఈ సృష్టి చేసే చతుర్ముఖాదులనందరినీ వెలికి తీసిన ఆ పాలకడలిలో ఉన్న స్వామి స్వరూపం అది కేవలం విశుద్ధమైన సత్త్వ రూపం. ఎవరు చూసారు ఆ రూపాన్ని ? అంటే మీకూ మాకూ కనిపించే రూపం కాదది. అందులోంచి బయటకి వచ్చిన చతుర్ముఖునికి కూడా కనిపించదు. ఎప్పుడైన అవసరం ఏర్పడితే తాను విన్న వేదంలోంచి "సహస్ర శీర్షా పురుషః" అంటూ ఉపాసిస్తాడు. ఆ స్వరూపాన్ని ఆయన కూడా చూసాడో తెలియదు. ఎవరికీ ఎక్కడా కనిపించని దాన్ని ఉన్నది అని ఎట్లా అంటాం ? అట్లా ఎవరికీ కనిపించని దాన్ని తుచ్చము అంటారు, అలా తుచ్చమైన వాడు కాదు పరమాత్మ. ఎలా చూడటం అతణ్ణి ?

పశ్యంతి అదో రూపమ్ అదభ్ర చక్షుషా
సహస్ర పాదోరు భుజాననాద్భుతమ్ |
సహస్ర మూర్ధ శ్రవణాక్షి నాసికమ్
సహస్ర మౌల్యంబర కుండలోల్లసత్ ||

ఆయనని చూసిన వాళ్ళూ లేక పోలేదు. కళ్ళతో చూస్తేనే చూడటం అని కాదు అర్థం. కంటికి కనిపించేది మాత్రమే ఉన్నట్టని అర్థమా ? ఉప్పుని నీటిలో కలిపితే కంటికి కనిపిస్తుందా ? తెలుసుకోవాలంటే రుచి చూస్తే అది ఉందా లేదా తెలుస్తుంది. వాసనని చూడగలమా ? రుచిని చూడగలమా ? వాసనని కంటితో చూడలేం కనుక అది తెలిసేది ముక్కుకి. రుచిని చూసేది నాల్కతో. అలానే ఆ జగత్కారణమైన పరమాత్మనీ చూడవచ్చునా ? అంటే చూడవచ్చు. "అదో రూపమ్", ఆ అదోక్షజుడైన పరమాత్మ రూపాన్ని కూడా చూడ వచ్చును. ఎలా చూసేది ? మనస్సుతో చూడాలి.

ఆ మనస్సుతో ఎలా చూడాలి, ఏమిటి నియమం ? కంటి తో ఏవస్తువునైనా చూసేప్పుడు కంటికి ఏ అడ్డు ఉండనప్పుడు ఆ వస్తువు గోచరిస్తుంది. అట్లానే మనస్సుతో ఆ ఉన్న తత్త్వాన్ని చూడాలంటే మనస్సుని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఇది నియమం. "అదభ్ర చక్షుషా", విశుద్ధమైన జ్ఞానంతో మాత్రమే "పశ్యంతి" చూడగలం. విశుద్ధమైన మానస్సుచే మాత్రమే కనిపిస్తాడు. అలా చూసే వాళ్ళు ఎలా చూస్తారంటే, "సహస్ర పాదః ఒరు భుజ ఆనన అద్భుతమ్ సహస్ర మూర్ధ శ్రవణాక్షి నాసికమ్ సహస్ర మౌల్యంబర కుండలోల్లసత్ " ఆయనకి ఎన్నెన్ని వేల వేల చేతులు, వేల వేల పాదాలు, వేల వేల శిరస్సులు, వేల వేల నేత్రాలు, వేల వేల నాసికలు, రకరకాల కిరీటాలు, రకరకాల కుండలాలు, రకరకాల ఆభరణాలు. "పల పలవే ఆభరణం పేరుమ్ పల పలవే పలపలవే శోడివడుమ్ పల్వినిల్" అని అంటారు నమ్మాళ్వార్. అలా ఉంటుంది భగవంతుని రూపం.

PANDAVAS SWARGHAVAROHANA PARVAM TELUGU MAHABHARATHA STORYపాండవ స్వర్గారోహణ - మానవజీవితమునకు అన్వయము.

మనపురాణాలలో అంతర్గతముగా ప్రతి సన్నివేశములోను ఎదో ఒక అధ్యాత్మరహస్యము దాగి వుంటది.దానిని గమనించటమే మన పని. 

మహభారతములోని 18వ పర్వము స్వర్గారోహణపర్వము. 

కురుక్షేత్ర యుద్ధము ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన చేయ సాగాడు. కొంతకాలము గడిచినది. శ్రీక్రిష్ణుడు నిర్యాణము చెందాడు.బలరాముడు అస్తమించాడు. యాదవకులములో ముసలము పుట్టింది. అందరు స్వార్ధపురిత అలోచనలతో మెలగసాగారు.శ్రీకృష్ణ నిర్యాణముతో పాండవులు సర్వము కొల్పొయిన వారిలా బాధపడ్డారు.ఇంతలో వచ్చిన ఈ పరిణమాలు గమనించిన ధర్మజుడు తాముకూడా హిమాలయ పర్వతములు తద్వార స్వర్గారొహణమునకు పొవ నిశ్చయించాడు.ఈ విషయము మిగిలిన వారికి తెలిపి రాజ్యాన్ని తమ వారసులకు అప్పగించి తాము సర్వము త్యజించి హిమాలయములకు సాగిపొయారు.ఈ సమయములో పాండవులతో పాటు ఒక కుక్క వెంబడించింది.ఇప్పుడు మొత్తము 7రు అయినారు.అందరుకలసి ప్రయాణము సాగించారు.

పట్టణాలు,నగరాలు,గ్రామాలు,మైదానాలు,పర్వతపంక్తులు అన్ని దాటి హిమాలయ సానువులకు వచ్చారు. హిమాలయములను అధిరొహణ ప్రారంభించారు.కొద్ది దూరము వెళ్ళిన తరువాత ద్రౌపది పడిపొయినది అమె ప్రియుడైన అర్జునుడు అందోళన చెందాడు. కాని ధర్మరాజు వారి వంక కూడా చూడకుండా స్వర్గారొహణ మార్గములో పయనము సాగించాడు.ఇంతలో ద్రౌపది మరణించినది.అయినను ఆగలేదు.ఇలా ఒకరి వెంట ఒకరు నకులసహదేవులు,అర్జునుడు,భీముడు మృతిచెందారు కాని ధర్మరాజు వీరిగురించి తలచక తనమార్గములో తాను పయనిస్తున్నాడు.ఇంకను కుక్క ధర్మ్రాజును వెంబడిస్తునే వున్నది. స్వర్గ ద్వారమునకు కుక్క,ధర్మరాజు చేరుకున్నారు.అక్కడవున్న కావలి వారు ధర్మరాజుకు మాత్రము స్వాగతము చెప్పారు.కుక్కను నిరాకరించారు.కాని ధర్మరాజు నేను ఒక్కడిని ప్రయాణము సాగించలేదు నాతో సహ ప్రయాణికుడుగా ఇంత దూరము కుక్క వచ్చింది, కుక్కనుకూడా అనుమతిస్తేనే నేను రాగలను కాని ఒక్కడిని రావటము ధర్మవిరుద్ధము అవుతుంది కాబట్టి నేను ప్రవేశింపలేను అని నిరాకరించాడు. అంత కుక్క యమధర్మరాజుగా నాయినా!ధర్మరాజ అందరు నీ ధర్మనిరతిని పోగుడుతున్నారు పుత్రుడవైన నీవు ఎలా ధర్మమార్గము పాటిస్తున్నవో అని తెలుసుకునేందుకు ఈ చిన్నపాటి పరిక్ష నాయినా అని అశ్వీరదించి. నీవే కాదు నీతాలుకు అందరు స్వర్గలోకములో నీకై ఎదురు చూస్తున్నారు అని పలికి స్వర్గలోక ప్రవేశము కలిపించాడు.

ఇది మహభారతములోని స్వర్గారోహణపర్వములోని కధ సూక్ష్మముగా మరి మానవ జీవితానికి అన్వయము ఎలా? పుట్టిన ప్రతీజీవి మరణించక తప్పదు.ఈ విషయము తెలిసిన మానవుడు పరమాత్మను పై విశ్వాసముంచి భక్తి,శ్రద్ధలతో కోలవాలి. మరి మనకు అంత్యకాలము సమీపించినఫ్ఫుడు అనగా వృద్ధాప్యకాలములొ ముందుపోవునది అందము,రూప లావణ్యాలు.దీనికి గుర్తుగా ద్రౌపది మరణము. ఆతరువాత పోవునది ఆరోగ్యము,లివర్ మొదలగునవి చేడిపోవటము.దీనికి ప్రతికగా అశ్వనిదేవతల పుత్రులు నకుల సహదేవుల మృతి.ఆతరువాత పోవునది ఇంద్రియాలు అందుకే ఇంద్రకుమారుడైన అర్జునుడు మరణించటము.అతరువాత పోవునది శరీరములోని శక్తీ,బలము దీనికి ప్రతికగా వాయుపుత్రుడు శక్తికి ప్రతీక భీముడు మృతి.మరి స్వర్గాన్ని చేరింది ఎవరు విశ్వాసానికి ప్రతికగా నిలచిన కుక్క,జీవునకు ప్రతికగా నిలచిన ధర్మజుడు.మరీ జీవుని రమ్మని కుక్కను వద్దంటే ? విశ్వాసములేని స్వర్గము ఎందుకు అని తృణికరించటమే భక్తి తత్వము.అందుకే సమవర్తి అయిన యమధర్మరాజు స్వర్గలోక ప్రవేశము కల్పించాడు

VIKRAM AND BETHAL STORIES IN TELUGUభేతాళ కథలలో విక్రమార్కుడు ఎందుకు పట్టు వదలలేదు ? 

‘‘పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవ రూపంలోని భేతాళుడు రాజా..అచంచలమైన నీ దీక్ష ప్రశంసించదగినదే... కానీ ఎందుకీ పట్టుదల అని అడిగినప్పుడు నువ్వు వహించే మౌనం మాత్రం నాకు నిగూఢంగా ఉన్నది. నన్ను మోస్తున్న నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక కథ చెబుతాను విను...’’ ఎన్ని భేతాళకథలు చదివినా ప్రారంభం ఇదే. కథ మొదలవ్వడంతోనే విక్రమార్కుడు భేతాళున్ని భుజాన వేసుకొని నడవటం తో ప్రారంభమౌతుంది. ఇంతకీ విక్రమార్కుడు ఎవరు? భేతాళుడికి అతనికి సంబంధం ఏంటి? అసలు ‘విక్రమార్క-భేతాళ’ కథలకు ప్రారంభం ఏంటి... మరుగున పడ్డ ఆ మూల కథ ఏంటి? ‘భేతాళ కథల’ ఆధారంగా మూలాలను శోధిస్తే... భేతాళకథలను రచించింది గుణాడ్యుడు. ఈ కథ మొత్తం ఉజ్జయినీ రాజ్యంలో జరిగినట్టు గుణాడ్యుడి సంకలనం ప్రకారం తెలుస్తోంది.

ఉజ్జయిని సామ్రాజ్య పాలకుడు విక్రమార్కుడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకొని పరిపాలించేవాడు. తన పరిపాలనదక్షతతో కాళీమాతను ప్రసన్నం చేసుకొంటాడు విక్రమార్కుడు. విక్రమార్కుడి వంటి భూపాలుడు చిరకాలం ధరిత్రిని పాలించాలని, వెయ్యి సంవత్సరాల పాటు పాలించే వరాన్ని అనుగ్రహిస్తుంది ఆమె. విక్రమార్కుని మంత్రి భట్టి. ఇతడు విక్రమార్కుడి సోదరుడు కూడా. భట్టి తెలివితేటలతో రాజుగా విక్రముడి ఆయుష్షును రెండు వేల సంవత్సరాలకు పెంచుతాడు. భట్టి యుక్తితో విక్రమార్కుడు ఆరునెలలు రాజ్యపాలన, ఆరు నెలల దేశ సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొనేవాడు. ఇది విక్రమార్కుడి నేపథ్యం. ఉజ్జయినికి కొంత దూరంలో ఒక సన్యాసి ఘోర తపస్సు చేస్తుంటాడు. కఠోర దీక్షతో అతడు దేవీ అనుగ్రహాన్ని సంపాదిస్తాడు. లోకంలోని రాజులంతా తనకు సామంతులవ్వాలనేది అతని కోరిక. చావు లేకుండా తలచిందళ్లా జరిగేటట్లుగా చూడమని ఆమెను కోరతాడు. కాళికామాత అతని దురాశను మన్నిస్తూ భూత ప్రేతాదులకు అధిపతి అయిన భేతాళున్ని వంశం చేసుకొంటే నీ కోరిక తీరుతుందని చెబుతుంది.

భేతాళున్ని వశం చేసుకోవడానికి వందమంది రాజకుమారులను యజ్ఞంలో బలి ఇచ్చి తనకు సంతుష్టి కలిగించమంటుంది. వారిలో వందో వాడు బహుపరాక్రమంతుడై ఉండాలని కాళిక చెబుతుంది. ఆ సన్యాసి హోమం ప్రారంభించి మాయ మాటలతో రాజకుమారులను భద్రకాళి ఆలయానికి తీసుకొచ్చి బలిస్తుంటూ ఉంటాడు. అలా 99 మంది పూర్తవుతారు. వందోవాడి అన్వేషణలో ఉన్న సన్యాసికి విక్రమార్కుడి గురించి తెలుస్తుంది. విక్రమార్కుడి గురించి తెలుసుకొన్న మాంత్రికుడు ఉజ్జయినికి మకాం మారుస్తాడు. దేశ సౌభాగ్యం కోసం తాను యాగం చేస్తున్నానని దానికి ఒక వీరుడి సహాయం అవసరమని, తమ నుంచి ఆ సాయం ఆశిస్తున్నానని విక్రమార్కుడిని కోరతాడు. సన్యాసికి అభయం ఇస్తాడు విక్రమార్కుడు. తన యాగం పూర్తవ్వాలంటే భూత ప్రేతాలకు నిలయమైన మర్రిచెట్టుపై శవాకారంలో ఉన్న భేతాళున్ని హోమం వద్దకు తీసుకురావాలని సన్యాసి కోరతాడు. దీనికి విక్రమార్కుడు సమ్మతిస్తాడు. భే తాళుడిని తీసుకెళ్లడానికి వచ్చిన విక్రమార్కుడిని చూసి మర్రి చుట్టూ ఉన్న భూతప్రేతాలన్నీ యుద్ధం మొదలు పెడతాయి. వాటి నుంచి ఎంత పోరాటం ఎదురైనా పట్టువదలకుండా చెట్టుపై ఉన్న భేతాళుడిని భుజాలపై వేసుకొంటాడు...

* ఇది భేతాళుడి కథ...

శాపవశాత్తూ భేతాళుడు శవ రూపంలో చెట్టుపై ఉండిపోతాడు. ఇతడు పూర్వ జన్మలో తపఃసంపన్నుడైన బ్రాహ్మణుడు. కైలాసంలో మహాశివుడిని పార్వతీదేవి ఒక కోరిక కోరుతుందట. తనకు కథలు చెప్పమని, అవి ఇంతవరకూ ఎవరికీ తెలియనివి, ఎవరికీ ఎవరూ చెప్పుకోనివి అయ్యుండాలని పార్వతీ దేవి తన నాథుడిని కోరుతుంది. తన సఖి కోరిక మేరకు అద్భుతమైన కొన్ని కథలను చెబుతాడు మహాశివుడు. పార్వతీ పరమేశ్వరుల ఈ సంవాదాన్ని చాటుగా వింటాడు ఆ బ్రహ్మణుడు. ఎంతో ఉత్కంఠత ను కలిగించే ఆ అద్భుతమైన కథలను విన్న బ్రహ్మణుడు తీవ్ర ఉద్వేగానికి గురవుతాడు. ఆ కథలను తన మనసులోనే దాచుకోలేక వెంటనే తన భార్యకు చెప్పేస్తాడు. ఎవరికీ చెప్పకు అనే షరతు కూడా పెడతాడు. అయితే ఆమె బ్రహ్మణుడి వలే తాళలేక తన తోటి మహిళలందరికీ చెప్పేస్తుంది. వారి నుంచి అనేక మందిలో ఈ కథలకు ప్రాచుర్యం వస్తుంది. ఆ తర్వాత ఆ నోట ఈ నోట పడిన ఈ కథలు చివరకు పార్వతీ దేవి చెవిన పడతాయి. పరమశివుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందామె.

భూలోకంలో ప్రాచుర్యం పొందిన కథలను తనకు చెప్పి అవమానించావని శివుడిని నిందిస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించిన శివుడు బ్రహ్మణుడి వృత్తాంతాన్ని గ్రహిస్తాడు. తమ ఏకాంత సంవాదాన్ని విన్నాడనే కోపంతో, విన్న కథలను ఒక మేధావికి చెప్పి చిక్కు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే వరకూ భేతాళుడిగా ఉండిపొమ్మని శపిస్తాడు. అలా బ్రహ్మణుడు భేతాళుడిగా మారి విక్రమార్కుడి కోసం ఎదురుచూస్తుంటాడు. తనను గుహలోని మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లడానికి విక్రమార్కుడు భుజం మీద వేసుకోగానే... ‘రాజా నీకు శ్రమ తెలీకుండా ఒక కథ చెబుతాను, ఆలకించి నా సందేహాన్ని నివారించు. నీకు తెలీకపోతే సమాధానం ఇవ్వనక్కరలేదు కానీ, తెలిసీ సమాధానమీయకపోతే నీ తల పగిలి నూరు వక్కలవుతుంది’ అనే హెచ్చరికతో కథలు మొదలుపెడతాడు.

ఇక్కడ మరో షరతు ఉంది. మాంత్రికుడి కోరిక మేరకు భేతాళుడిని భుజం మీద వేసుకొన్నాక విక్రమార్కుడు మౌనంగా ఉంటేనే ఆ శవాన్ని గుహ వద్దకు చేర్చగలడు. అయితే భేతాళుడు అడిగే ప్రతి చిక్కు ప్రశ్నకు విక్రమార్కుడు సమాధానం చెప్పగలడు. దాంతో నోరు తెరవక తప్పదు. దీన్నే అవకాశంగా తీసుకొన్న భేతాళుడు తనకు శాపంగా ఉన్న కథలన్నింటినీ విక్రమార్కుడి చెప్పేస్తాడు. అంతేగాక మాంత్రికుడి నిజ స్వరూపం తెలిసింది భేతాళుడికి మాత్రమే. యజ్ఞంలో బలి ఇచ్చి తనకు సంతుష్టి కలిగించమంటుంది. వారిలో వందో వాడు బహుపరాక్రమంతుడై ఉండాలని కాళిక చెబుతుంది. ఆ సన్యాసి హోమం ప్రారంభించి మాయమాటలతో రాజకుమారులను భద్రకాళి ఆలయానికి తీసుకొచ్చి బలిస్తుంటూ ఉంటాడు. అలా 99 మంది పూర్తవుతారు. వందోవాడి అన్వేషణలో ఉన్న సన్యాసికి విక్రమార్కుడి గురించి తెలుస్తుంది.

* ఒక రాత్రిలోనే!

విక్రమార్కుడి కథల్లోని భేతాళుడు చాలా మంచి వాడు. మహారాజు సాహసంతో మురిసిపోయే భేతాళుడు విక్రమార్కుడు తనను తీసుకొని సన్యాసి దగ్గరకు వెళితే, అతడు రాజుని బలిస్తాడని భేతాళుడికి తెలుసు. గుణాడ్యుడు రాసిన బృహత్‌కథల ప్రకారం భేతాళ, విక్రమార్కుల సంవాదం అంతా ఒక రాత్రి జరిగినదే! మొత్తం భేతాళుడు 25 కథలను విక్రమార్కుడికి చెబుతాడు. అన్ని కథల చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పిన విక్రమార్కుడు చివరకు ఒక కథ విషయంలో ఓడిపోతాడు. విక్రమార్కుడు సమాధానం చెప్పలేని ఆ కథ గుణాడ్యుడు సంకలనంలో అలభ్యం అని పెద్దలు అంటారు. చివరి కథలో ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న విక్రమార్కుడికి భేతాళుడే హితబోధ చేస్తాడు. సన్యాసి క్రూర త్వం గురించి వివరిస్తాడు. హోమం వద్దకు చేరుకొన్న తర్వాత విక్రమార్కుడే సన్యాసిని కాళికకు బలిస్తాడు. ఆ తర్వాత భట్టి, భేతాళుల సాయంతో కాళికాదేవి ఆశీస్సులతో రెండువేల యేళ్లు ఉజ్జయిని పాలించి స్వర్గారోహణం చేస్తాడు విక్రమార్కుడు.

KNOW THE CHARACTER OF THE GREAT WARRIOR BHISHMA - MAHABHARATHA STORIES COLLECTION


భీష్మ ....ధర్మ పరిరక్షణ, నిత్య సంఘర్షణ.

సౌశీల్యం అంటే ఏమిటో అర్థం కాక, దానికుండాల్సిన లక్షణాలెలా వుంటాయో దానికోసం ఏ ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలనో అని అనుకునే వాడిని, కాని సౌశీల్యం అనేది ఒకే ఒక్క లక్షణం మీద ఆధారపడి వుంటుందన్న విషయం అదృష్టం కొద్దీ తెలిసింది.
ఆ ఒక్క లక్షణమే "మాట మీద నిలబడడం".

రాముడి తర్వాత చక్కగా సౌశీల్యం కనపడేది ఒక్క భీష్ముడిలోనే.

ధర్మ పరిరక్షణం కోసం ’నిత్య సంఘర్షణ’ భీష్మునిది .

జీవితమంతా కష్టాలే. అయినా ఎక్కడా నిరాశని, కర్తవ్యవిముఖతని దరిజేరనీయక, విరక్తికీ, వైరాగ్యానికి ఉండే తేడాని స్పష్టంగా చూపిన అవిశ్రాంత వైరాగ్యం భీష్మునిది.
అంతా తనవారైనా, తామరాకుపై నీటిబిందువులా ’సమూహంలో ఏకాంతం ’ భీష్మునిది.
తనవారు తనకేం చేసారన్న కనీస స్పృహ కూడా లేకుండా, నిరంతరం తనేంచేయాలో ఆలోచించే ’నిజమైన పెద్దరికం ’ భీష్మునిది.

కనీసం తన ఆక్రందనని కూడా ఎవ్వరిదగ్గరా వెలిబుచ్చుకోని సంపూర్ణ ’ఆత్మనిర్భరత’ భీష్మునిది.

ప్రతిజ్ఞ అంటే 'భీష్మప్రతిజ్ఞ' అనేలా ప్రతిజ్ఞకే వన్నెతెచ్చిన ఆదర్శం జీవితం భీష్మునిది.
అయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణున్ని సైతం ఆయుధం పట్టేలా చేసిన ’ధీరత్వం ’ భీష్మునిది.

భగవాన్ పరశురాముని శిష్యునిగా కదనరంగం లో సాక్షాత్ శివునిసైతం ఎదురొడ్డి నిలబడగల ’పరాక్రమం’ భీష్మునిది.

ధర్మం కోసం గురువు పరశురామునితోనే తలపడి విలువిద్యలో గురువుతోనే మెప్పు పొందిన ’గొప్పతనం’ భీష్మునిది.అర్జునుడంతటి వాడు తనని చంపలేక, శారీరకంగా, మానసికంగా అలిసి, తననే శరణు వేడిన అర్జునినికి తన మరణరహస్యాన్ని, వాత్సల్యం తో తనే చెప్పుకున్న ’త్యాగం’ భీష్మునిది.

ధర్మరాజే ఉత్కృష్టమైన ధర్మమంటే ఏంటో తెలుసుకోవడానికి భీష్మున్నే శరణు వేడిన ఉత్తమమైన ’ధర్మ పరాయణత్వం’ భీష్మునిది..

స్త్రీ ని శతృవుగా చేసుకున్నాకూడా ’చిరంజీవి గా మృత్యువుని శాసించి, మృత్యువుని వాయిదా వేయగలిగిన ’ వీరత్వం భీష్మునిది.

కుళ్ళిన శవాలతో ,
స్మశాన సమానంగా మారిన కురుక్షేత్రంలో,
దుమ్ము ధూలిలో,
పగలూ రేయిలో,
ఆపాదమస్తకం ఆయిధ గాయాలతో,
శరీరమంతా శరాలతో,
ఆరునెలల అంతిమ గడియలు,
పశ్చాత్తాపం తో పరితపించిన ’పరిణతి’ భీష్మునిది. విష్ణువు ముందే విష్ణువు ఆధ్వర్యంలోనే పాండవులకి ’విష్ణుసహాస్రనామాన్ని’ భొధించిన ’ఘనత’ భీష్మునిది.
ఎలా జీవించాలో మాత్రమే కాకుండా ఎలా మరణించాలో కూడా నేర్పిన ’సచ్చరిత్ర ’ భీష్మునిది.

BRIEF INFORMATION ABOUT SRI MATHYAGIRI SRI LAKSHMINARASIMHA SWAMY KSHETRAM


శ్రీ మత్సగిరి లక్ష్మినరసింహస్వామి క్షేత్రం 
తెలంగాణా ఎర్రమట్టి మాగాణాల్లో పరుచుకున్న తంగేడు;గూనుగు;మోదుగు పూల వనాలలో పచ్చని ప్రకృతి ఒడిలో వెలిసిన దివ్యక్షేత్రం.చుట్టూ" కాశ"గడ్డి భూములు...ఆ గడ్డిపై నుండి వచ్ఛే స్వచ్చమైన గాలి పరిమళాలు... ఆకాశాన్ని అంటేలా మహోన్నతంగా నిల్చున్న కొండలు.ఆ కొండలలో పచ్చని ప్రకృతి కాంతను ఒడిలో కూర్చుండబెట్టుకున్న కొండ 'వేములకొండ'.ఆ కొండపై చక్కటి గుండం(పుష్కరిణి).దానిలో మత్స్యాలు(చేపలు)....ఆ గుండం ఒడ్డునే మనకు మత్స్యావతారంలో నరసింహ స్వామి దర్శనమిస్తాడు.ఈ గుండంలోని చేపలు సాక్షాత్ భగస్వరూపాలు..వాటిలో కొన్ని విష్ణు నామాలతో దర్శనమిస్తాయి.అలా "త్రి"నామాలతో ఎవరికైతే దర్శనమిస్తాయో వారికి సాక్షాత్ భగవంతుడే దర్శణం అయినట్లు ప్రతీతి.అంతేకాదు గుండంలోని నీరు సైతం మహిమాన్వితమే...ఆ నీటిని పంటపొలాలొ చల్లితే పంటలు పుష్కలం పండుతాయని బలమైన నమ్మకం.పుష్కరినిలో స్నానం చేసి తడిబట్టలతో గర్భగుడి చుట్టూ మూడుప్రదక్షిణలు జేసి స్వామివారిని దర్శించుకొన్నట్లైతే పాపహరణం జరిగి పునీతులౌతారని పురాణాల ద్వారా తెలుస్తుంది.పూర్వకాలంలో మునులు ఈ కొండపై తపస్సు అచారించి భగవంతున్ని అవాహన చేసుకునేవారు.ఇంతటి మహిమాన్విత క్షేత్రం కాబట్టే సుదూర ప్రాంతాలనుండి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులౌతున్నారు.

ఈ క్షేత్రం నల్లగొండజిల్లా వలిగొండ మండలంలో మండల కేంద్రానికి 8 కి.మి దూరంలో కలదు.హైద్రాబాద్ నుండి ట్రైన్ మరియు బస్ సౌకర్యం కలదు.HEALTHY ADVANTAGES WITH USING CABBAGEమేలు చేసే క్యాబేజి

క్యాబేజిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సిలు క్యాబేజిలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి జీవక్రియ పనితీరును మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాక, కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్‌ ప్రమాదాలను తగ్గిస్తుంది. కండరాల ధృడత్వానికి, రక్తాన్ని శుద్ధిచేయడానికి, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచటానికి క్యాబేజి ఎంతో ఉపయోగం.క్యాబేజి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. మొటిమలు తగ్గాలంటే వారానికి రెండు సార్లు దీనిని ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.
అయితే ఉడికించిన క్యాబేజిని తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. ఉడికించడం వల్ల కొవ్వు శాతం చాలా తగ్గుతుంది. జలుబు నుంచి ఉపశమనం లభించాలంటే క్యాబేజిని బాగా ఉడికించి ఆ రసాన్ని సేవిస్తే ఫలితం ఉంటుంది. క్యాబేజి రసంతో అధిక బరువును దూరం చేస్తుంది. క్యాబేజితో క్యారెట్‌ తరుము చేర్చి ఉప్పు లేకుండా ఉడికించి ఆ నీటిని సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా శరీరానికి ఎన్నో విధాల మేలు చేస్తుందీ క్యాబేజి.

HEALTH TIPS WITH OLIVE OIL - TAKE OLIVE OIL REGULARLY IN FOOD STUFF WHICH PUT CHECK TO CANCER CHOLESTRAL ETC


ఆలివ్‌ ఆయిల్‌ను రోజూ ఆహారంలో చేర్చుకుంటే.

ఆరగ్యోం మీద, అందం మీద ఆసక్తి రెట్టింపు కావడంతో శరీరానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలని ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలా ప్రాచుర్యంలోకి వచ్చిందే ఆలివ్‌ ఆయిల్‌. అనేక పరిశోధనలు కూడా ఆలివ్‌ ఆయిల్‌ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని రుజువు చేశాయి కూడా. మరి అలాంటి ఆలివ్‌ ఆయిల్‌ ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. 

ఆలివ్‌ ఆయిల్‌ శ్యాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ తక్కువగా ఉండటంతో పాటు కార్బోహైడ్రెట్స్‌ కలిగి ఉంటుంది. ఇంకా మధుమేహనికి మేలు చేసే సోలబుల్‌ ఫైబర్స్‌ దీనిలో అధికంగా ఉన్నాయి. ఇది రక్తంలో షుగర్‌ను కంట్రోల్‌ చేస్తుంది. దాంతో ఎక్కువగా ఇన్సులిన్‌ తీసుకోవడం తప్పుతుంది. అంతేకాక, ఆలివ్‌ ఆయిల్‌ బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను క్రమబద్దీకరిస్తుంది. ఇవి శరీరంలో కొవ్వు పెరగకుండా రక్షణ కల్పిస్తాయి. ప్రతిరోజు ఆహారంలో రెండు చెంచాల ఆలివ్‌ ఆయిల్‌ చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం నిల్వలను పెంచి ఎముకలకు బలాన్ని చేకూర్చుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Related Posts Plugin for WordPress, Blogger...

chitika