WORLD FLAG COUNTER

Flag Counter

Friday 27 November 2015

HOW TO PUT CHECK LONELINESS WITH WORK - HOW TO LIVE A HAPPY LIFE WITH DAILY WORK - TIPS TO FIND BEAUTY IN THE UGLIEST DAYS


ఒంటరిగా ఉండడమంటే చాలా ఇబ్బంది పడతారు కొంతమంది. బోర్‌ కొడుతోంది అనే మాట కూడా చాలా మంది నోట వింటుంటాం. బోర్‌ కొట్టడమనేది సైకాలజీ ఫీలింగ్‌గానే భావిస్తున్నారు మానసిక నిపుణులు. ప్రతివారికీ ఏవో కొన్ని అభిరుచులు ఉంటాయి. అలా ఒంటరిగా ఉన్నప్పుడు చేయాల్సిన పనులు కూడా ప్రతి ఒక్కరికీ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. మనకిష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుందే గానీ బోర్‌ అనిపించదు కదా! అలాంటప్పుడు బోర్‌ ఫీల్‌ కావడం ఎందుకు?
అసలు మీరు ఒక్కరుగా ఉన్న సమయం మిమ్మల్ని మీరు చదువుకోవడానికి, ప్రశ్నించుకోవడానికి, మీ చిన్ననాటి జ్ఞాపకాలు, మీరు చేసిన తప్పులు, గొప్ప పనులు ఎన్నో గుర్తుచేసుకోవచ్చు. మీ ఆలోచనలు, ఆశయాలు, అభిప్రాయాలు ఇవన్నీ కలగలసిన మీలో ఉన్న మరో మనిషి గుర్తు చేస్తుంది. మీకెప్పుడూ తోడుగా ఉండి ముందుకు సాగిపోవడానికి అవసరమయ్యే శక్తిని, ఉత్సాహాన్ని నింపడానికి కావలసినవి మీలోనే తప్పకుండా ఉంటాయి. మీతో మీరు సౌకర్యంగా ఉండగలిగితే ఈ బోర్‌ అనే మాటకు అర్థమే ఉండదు. వేరొకరు ప్రశ్నిస్తే ఓర్చుకో లేని ఎన్నో ప్రశ్నలు, వేరొకరు అభినందిస్తే రుచించని ఎన్నో అభినందనలు, మరెన్నో జాగ్రత్తలు మీరు వింటారు. మీ తోడుగా ఉన్న మీలో ఒకరు చెబుతున్నారు కాబట్టి కచ్చితంగా వింటారు, ఆనందిస్తారు, పాటిస్తారు. ఏకాంతంగా ఉండటం ఒంటరిగా ఉండటం ఒకటి కాదు.
మీలోకి మీరు తొంగి చూసుకోలేనపుడే ఒంటరితనం ఆవరిస్తుంది. లేదంటే మీకు ఒంటరి తనం గురించి ఆలోచించేంత సమయం కూడా ఉండదు. అంతే కాదు ఇలా ఒంటరి సమయాన్ని ఏదో కోల్పోతున్న భావన మీ గురించి ఆలోచించడంతో క్రమేపి తగ్గుముఖం పడుతుంది. మీ గురించి ఎంతో సమాచారాన్ని మీకు అందిస్తుంది.


No comments:

Post a Comment