WORLD FLAG COUNTER

Flag Counter

Friday 27 November 2015

SUN RAYS HEALTH TIPS TO ALL LIVES ON EARTH


భూమండలములో సకల ప్రాణికోటికి జీవదాత ఆ సూర్యభగవానుడు. అనాది నుండి సూర్యభగవానుని కొలవటం హిందువుల ఆచారం. మన పూర్వీకులు ప్రాతఃకాలాన్నే సూర్యనమస్కారములు, సాయంకాలం సంధ్యావందనం ఆచరించేవారు. కాని నేటి బిజీలైఫ్‌లో ఈరోజు ఎంతమంది సూర్యోదయం చూస్తున్నారు. ఒకవేళ లేచినా ఆఫీసులకు వెళ్లటానికి పరుగులే సరిపోతుంది. దైవముగా కాని, మండే అగ్నిగోళముగా గాని కొలవబడి పిలువబడుచున్న సూర్యుని గురించి, ఆ కిరణాల వలన ఎటువంటి ప్రయోజనాలో తెలుసుకుందాం.
సూర్యుడి ఘనపరిమాణం రమారమి రెండువేల ఆరువందల ఎనభై రెండు కోట్ల కోట్లు ఘనపు మైళ్లు. సూర్యుడి ఉపరిత వైశాల్యం సుమారు రెండు లక్షల కోట్ల చదరపు మైళ్లు మించి యున్నది. భూమి నుండి దూరం తొమ్మిదికోట్ల ముప్పై లక్షల మైళ్లు. సూర్యగ్రహవ్యాసం ఎనిమిది లక్షల మైళ్లు, సూర్యకాంతి ప్రాణధారణ శక్తితో నిండి ఉన్నదని, సూర్యకిరణములందు నాలుగువేల తరగతుల శక్తులున్నవని ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
సూర్యగ్రహం ప్రతి ఒక్క క్షణమునకు అరవైకోట్ల టన్నుల హైడ్రోజన్‌ను హీలియంగా మార్చి నలభై ఐదు లక్షల టన్నుల సూర్యకాంతిని ఉత్పత్తి చేస్తున్నది.
సూర్యునిలోని ఈ చైతన్యశక్తి అంతయు అణగారిపోయినచో భూలోకమంతయు సర్వనాశనమైపోవును.
అంతటి అద్భుతశక్తి గల సూర్యభగవానుని అన్ని శక్తులలోను శ్రేష్టునిగా భూలోకవాసులమైన మనం కృతజ్ఞతతో ఆరాధించుట వలన సనాతన ధర్మ సాంప్రదాయము కాక, ఆధునిక కాలపరిస్థితుల దృష్ట్యా కూడ ఎంతో అవసరం. మన మానవ లోకానంతటికి సూర్యుడే ఉచిత వైద్యుడు, చికిత్సకుడు, ఔషధ ప్రదాత, రోగనిరోధకుడు, అన్నిటిని మించిన అన్నదాత. అట్టి సూర్యుని కృతజ్ఞతతో మన ప్రయోజనం కొరకు సేవించుటకు ఏ శాస్త్ర సమ్మతి అవసరం లేదు. ఉదయం ప్రసరించే కిరణాలలో విటమిన్‌డి ఉన్నది. విటమిన్‌ డి లోపిస్తే చిన్నపిల్లలు రికెట్స్‌ వ్యాధికి గురవుతారు. అటువంటి పిల్లల కాళ్లకు వెన్నపూస రాసి లేతసూర్యకిరణాలు తగిలేలా చేస్తే రికెట్స్‌ వ్యాధి నయమవుతుంది.
సూర్యకిరణాలలో అల్ట్రావయొలెట్‌ కిరణాలు కూడా ఉన్నాయి. బొల్లి వ్యాధి చికిత్సతో బొల్లి మచ్చలకు మందురాసి మచ్చలమీద సూర్యకిరణాలు ప్రసరింపచేస్తారు.
అప్పుడు సూర్యకిరణాలలో ఉన్న అల్ట్రావయొలెట్‌ కిరణాల మందు కలిపి చర్మంలో మెలనిక్‌ ఉత్పత్తిచేస్తారు. అందువల్ల బొల్లిమచ్చలు క్రమేపి రంగు మారతాయి.ఈ విధానం అల్లోపతి, ఆయుర్వేదంలోనూ ఉంది. మానవచర్మం దిగువభాగంలో ఎర్గోస్టెరాల్‌ అనే క్రొవ్వు పదార్థం ఉంటుంది. చర్మానికి సూర్యరశ్మి సోకినపుడు ఈ ఎర్టోసెరాల్‌ విటమిన్‌ డిగా పరివర్తన చెంది రక్తంలోనికి స్వీకరించబడుతుంది.
సూర్యరశ్మి వలన రక్తంతో హిమోగ్లోబిన్‌ స్థాయి సరిగ్గా ఉంటుంది. పుట్టిన పసిబిడ్డలకు డి విటమిన్‌ లోపిస్తే రికెట్స్‌ వ్యాధి సోకు తుంది కనుక ప్రాతఃకాలాల సూర్యోదయ లేతకిరణాలు పసిబిడ్డ మీద ప్రసరింపచేయాలి. ఈవిధముగా చేస్తే పసిబిడ్డ రికెట్స్‌ వ్యాధి బారి నుండి తప్పించుకోగలుగుతాడు.
మూడు, నాలుగు సంవత్సరాలు వచ్చేవరకు పసిబిడ్డలకు నువ్ఞ్వలనూనె కాని, వెన్నకాని, ఆలివ్‌ ఆయిల్‌ కాని వంటికి రాసి ఉదయం ఎండలో వదిలివేయటం మంచిది. వాళ్లు హాయిగా అరగంట ఆడుకున్న తరువాత లోపలికి తీసుకువచ్చి గంట తరువాత గోరువెచ్చని నీటిలో స్నానం చేయించండి. సాయంకాలం నీరెండలో ఆడుకోనివ్వండి. ఈవిధముగా చేస్తే మీ బిడ్డకు కావలసినంత 'డివిటమిన్‌ రోగనిరోధ కశక్తి లభిస్తుంది. తల్లిగా మీ బిడ్డ పట్ల మీ కర్తవ్యం నెరవేర్చండి. ఎన్ని పనులున్నా మీరు మీ బిడ్డపట్ల అశ్రద్ధ చేయవద్దు. అందుకే మన పెద్దల కాలంలో మగవారు సూర్యనమస్కారాలు, సంధ్యావందనాలు చేసేవారు. ఆడవాళ్లు ప్రాతఃకా లాన్నే తులసిమొక్కకు ప్రదక్షిణాలు చేసేవారు. ఆస్ట్రేలియా దేశాలలో ఎప్పుడో కాని సూర్యభగవానుని దర్శనం కాదు. ఆఫ్రికా దేశంలో సూర్యభ గవానుడు ఎప్పుడూ మండిపోతూనే ఉంటాడు. కాని మనదేశంలో సూర్య భగవానుడు చల్లని చూపులు ఎప్పుడూ ఉంటాయి. మనమే సక్రమముగా ఉపయోగించుకోవడం లేదు. అనేక దేశాలలో ప్రజలు నదీతీరానికో, సము ద్ర తీరానికో పరుగులు తీస్తారు. లేకపోతే హాయిగా కుర్చీలోనో, ఇసుక లోనో పడుకుని రిలాక్స్‌ అవుతారు. ఒంటికి ఆయిల్‌ మసాజ్‌ చేసుకుని సూర్యకాంతిలో తిరగడమో, యోగాసనాలు వెయ్యడమో చేస్తున్నారు. కాని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం. కళ్లకు సంబంధించిన సర్వ దోషాలను హరించడంలో సూర్యుని వంటి సహకారి లేడు.


No comments:

Post a Comment