WORLD FLAG COUNTER

Flag Counter

Friday 27 November 2015

LIVE LIFE HAPPILY WITH YOGA EVER AND FOREVER


అన్ని జన్మలలోనూ మానవజన్మ ఉత్కృష్టమైన జన్మ. మానవుడు బుద్ధిజీవి. అతడు ధర్మార్థ,కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సాధించవలసి ఉన్నది. మానవులకు ధర్మసాధనాలలో శరీరమే మొట్టమొదటి సాధనం. శరీరమాద్యంఖలు ధర్మసాధనమ్‌ అని పండితుల వాక్కు. మానవుడు చతుర్విధ పురుషార్ధాలను సాధించాలంటే దానికి సరైన ఆరోగ్యమే మూలం.
ధర్మార్థ కామ మోక్షాణాం ఆరోగ్యం మూల ముత్తమమ్‌
ఆరోగ్యం సక్రమంగా లేకపోయినట్లయితే ఇటు శారీరకంగానే కాక అటు మానసికంగా కూడా దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే దానికి ఆరోగ్యసాధన మొట్టమొదటి సాధనం.మానవుడు ముందుగా ఆధ్మాత్మికమైన జ్ఞానాన్ని సంపాదించాలి. ఆధ్యాత్మిన జ్ఞానం లేకపోవటం వలన కలిగే దుఃఖాన్ని మానవుడు నివారించుకోగలిగినప్పుడే అతడు ముముక్షువు అవుతాడు. ముముక్షువుకు యోగసాధన అనివార్యం అయినట్టిది.భగవద్గీతలో సమత్వం యోగః అనీ కర్మకౌశలం యోగంః అని యోగం రెండు విధాలుగా నిర్వచింపబడింది. సుఖదుఃఖాలను, శీతోష్ణాలను, మానావమానాలను సమానంగా పరిగణించటమే యోగం అని అర్థం. సమత్వం కలవాడే స్థితప్రజ్ఞుడుగా పరిగణింపబడతాడు.ఒక పనిని అత్యంత నైపుణ్యంతో చేయటమే యోగం అన్నారు. అభ్యాసం వలన, ఏకాగ్రత కుదరటం వలన ఒక పనిని అత్యంత సామర్థ్యంతో నెరవేర్చవచ్చు.

యోగశ్చిత్తవృత్తి నిరోధకః అని పతంజలి మహర్షి ఇచ్చిన నిర్వచనం. చిత్త వృత్తిని నిరోధించటమే యోగం.
యోగాంగాలను అనుష్ఠించటం వలన అశుద్ధి నశించి జ్ఞానప్రకాశం కలుగుతుంది. ''యోగాంగా నుష్ఠానాదశుద్ధి క్షయే జ్ఞాన దీప్తిః వివేక ఖ్యాతిః అనే సూత్రంలో అది వివరింపబడింది.కాబట్టి బుద్ధి జీవి అయిన మానవుడు నిరంతరం యోగసాధన చేస్తూ శరీరాన్నీ, మనస్సునూ కాపాడుకుంటూ దాని ద్వారా సామాజికమైన ఆరోగ్యాన్ని కూడా చేకూర్చవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు. అటువంటి ఆరోగ్యవంతమైన సమాజం వలన దేశసౌభాగ్యం చేకూరుతుంది. యోగసాధన చేసేవారు ముఖ్యంగా 3వర్గాలకు చెందినవారు. మోక్షప్రాప్తికై యోగమార్గాన్ని అనుసరించేవారు మొదటి వర్గం. వీరికి ఇహలోక సుఖాలపై ఆసక్తి ఉండదు. రెండవ వర్గం వారు శారీరక, మానసిక ఆరోగ్యాలను సర్వదా కాపాడుకోవటానికై ఆసనాలను అభ్యాసం చేసేవారు. వీరికి ఆరోగ్యమే ప్రధానం. ఇక మూడవ వర్గానికి చెందినవారు కేవలం వ్యాధి నివారణే ధ్యేయంగా కలిగి ఆసనాలను అభ్యసించేవారు.పై మూడు విధాలుగా ఏవిధంగా ఆలోచించినప్పటికీ ఆసన, ప్రాణాయామాది యోగసాధన వలన అన్ని వర్గాల వారికీ మేలు కలుగుతుందనటం అక్షరసత్యం. సంపూర్ణ వ్యక్తిత్వం - అంటే శారీరకమైన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడ యోగ సాధన వలన సాధ్యమవుతుంది.యోగాసనాలకు ఇతర వ్యాయా మాలకు చాలా భేదం ఉంది. ఇతర వ్యాయామాలకు సాధనాలు అవసరం. దాని వలన శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆహారం దానికి తగినట్లుగా తీసుకోవలసి వస్తుంది.


No comments:

Post a Comment