WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 16 December 2014

KNOW THE CHARACTER OF THE GREAT WARRIOR BHISHMA - MAHABHARATHA STORIES COLLECTION


భీష్మ ....ధర్మ పరిరక్షణ, నిత్య సంఘర్షణ.

సౌశీల్యం అంటే ఏమిటో అర్థం కాక, దానికుండాల్సిన లక్షణాలెలా వుంటాయో దానికోసం ఏ ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలనో అని అనుకునే వాడిని, కాని సౌశీల్యం అనేది ఒకే ఒక్క లక్షణం మీద ఆధారపడి వుంటుందన్న విషయం అదృష్టం కొద్దీ తెలిసింది.
ఆ ఒక్క లక్షణమే "మాట మీద నిలబడడం".

రాముడి తర్వాత చక్కగా సౌశీల్యం కనపడేది ఒక్క భీష్ముడిలోనే.

ధర్మ పరిరక్షణం కోసం ’నిత్య సంఘర్షణ’ భీష్మునిది .

జీవితమంతా కష్టాలే. అయినా ఎక్కడా నిరాశని, కర్తవ్యవిముఖతని దరిజేరనీయక, విరక్తికీ, వైరాగ్యానికి ఉండే తేడాని స్పష్టంగా చూపిన అవిశ్రాంత వైరాగ్యం భీష్మునిది.
అంతా తనవారైనా, తామరాకుపై నీటిబిందువులా ’సమూహంలో ఏకాంతం ’ భీష్మునిది.
తనవారు తనకేం చేసారన్న కనీస స్పృహ కూడా లేకుండా, నిరంతరం తనేంచేయాలో ఆలోచించే ’నిజమైన పెద్దరికం ’ భీష్మునిది.

కనీసం తన ఆక్రందనని కూడా ఎవ్వరిదగ్గరా వెలిబుచ్చుకోని సంపూర్ణ ’ఆత్మనిర్భరత’ భీష్మునిది.

ప్రతిజ్ఞ అంటే 'భీష్మప్రతిజ్ఞ' అనేలా ప్రతిజ్ఞకే వన్నెతెచ్చిన ఆదర్శం జీవితం భీష్మునిది.
అయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణున్ని సైతం ఆయుధం పట్టేలా చేసిన ’ధీరత్వం ’ భీష్మునిది.

భగవాన్ పరశురాముని శిష్యునిగా కదనరంగం లో సాక్షాత్ శివునిసైతం ఎదురొడ్డి నిలబడగల ’పరాక్రమం’ భీష్మునిది.

ధర్మం కోసం గురువు పరశురామునితోనే తలపడి విలువిద్యలో గురువుతోనే మెప్పు పొందిన ’గొప్పతనం’ భీష్మునిది.అర్జునుడంతటి వాడు తనని చంపలేక, శారీరకంగా, మానసికంగా అలిసి, తననే శరణు వేడిన అర్జునినికి తన మరణరహస్యాన్ని, వాత్సల్యం తో తనే చెప్పుకున్న ’త్యాగం’ భీష్మునిది.

ధర్మరాజే ఉత్కృష్టమైన ధర్మమంటే ఏంటో తెలుసుకోవడానికి భీష్మున్నే శరణు వేడిన ఉత్తమమైన ’ధర్మ పరాయణత్వం’ భీష్మునిది..

స్త్రీ ని శతృవుగా చేసుకున్నాకూడా ’చిరంజీవి గా మృత్యువుని శాసించి, మృత్యువుని వాయిదా వేయగలిగిన ’ వీరత్వం భీష్మునిది.

కుళ్ళిన శవాలతో ,
స్మశాన సమానంగా మారిన కురుక్షేత్రంలో,
దుమ్ము ధూలిలో,
పగలూ రేయిలో,
ఆపాదమస్తకం ఆయిధ గాయాలతో,
శరీరమంతా శరాలతో,
ఆరునెలల అంతిమ గడియలు,
పశ్చాత్తాపం తో పరితపించిన ’పరిణతి’ భీష్మునిది. విష్ణువు ముందే విష్ణువు ఆధ్వర్యంలోనే పాండవులకి ’విష్ణుసహాస్రనామాన్ని’ భొధించిన ’ఘనత’ భీష్మునిది.
ఎలా జీవించాలో మాత్రమే కాకుండా ఎలా మరణించాలో కూడా నేర్పిన ’సచ్చరిత్ర ’ భీష్మునిది.

No comments:

Post a Comment