WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 16 December 2014

HOW TO VIEW LORD SRI MAHA VISHNU IN MILK OCEAN - PALA KADALI LO UNNA PURUSHA SWAROOPANNI ETLA CHUDATAM


పాలకడలిలో ఉన్న పురుష స్వరూపాన్ని ఎట్లా చూడటం ?

ఈ సృష్టి చేసే చతుర్ముఖాదులనందరినీ వెలికి తీసిన ఆ పాలకడలిలో ఉన్న స్వామి స్వరూపం అది కేవలం విశుద్ధమైన సత్త్వ రూపం. ఎవరు చూసారు ఆ రూపాన్ని ? అంటే మీకూ మాకూ కనిపించే రూపం కాదది. అందులోంచి బయటకి వచ్చిన చతుర్ముఖునికి కూడా కనిపించదు. ఎప్పుడైన అవసరం ఏర్పడితే తాను విన్న వేదంలోంచి "సహస్ర శీర్షా పురుషః" అంటూ ఉపాసిస్తాడు. ఆ స్వరూపాన్ని ఆయన కూడా చూసాడో తెలియదు. ఎవరికీ ఎక్కడా కనిపించని దాన్ని ఉన్నది అని ఎట్లా అంటాం ? అట్లా ఎవరికీ కనిపించని దాన్ని తుచ్చము అంటారు, అలా తుచ్చమైన వాడు కాదు పరమాత్మ. ఎలా చూడటం అతణ్ణి ?

పశ్యంతి అదో రూపమ్ అదభ్ర చక్షుషా
సహస్ర పాదోరు భుజాననాద్భుతమ్ |
సహస్ర మూర్ధ శ్రవణాక్షి నాసికమ్
సహస్ర మౌల్యంబర కుండలోల్లసత్ ||

ఆయనని చూసిన వాళ్ళూ లేక పోలేదు. కళ్ళతో చూస్తేనే చూడటం అని కాదు అర్థం. కంటికి కనిపించేది మాత్రమే ఉన్నట్టని అర్థమా ? ఉప్పుని నీటిలో కలిపితే కంటికి కనిపిస్తుందా ? తెలుసుకోవాలంటే రుచి చూస్తే అది ఉందా లేదా తెలుస్తుంది. వాసనని చూడగలమా ? రుచిని చూడగలమా ? వాసనని కంటితో చూడలేం కనుక అది తెలిసేది ముక్కుకి. రుచిని చూసేది నాల్కతో. అలానే ఆ జగత్కారణమైన పరమాత్మనీ చూడవచ్చునా ? అంటే చూడవచ్చు. "అదో రూపమ్", ఆ అదోక్షజుడైన పరమాత్మ రూపాన్ని కూడా చూడ వచ్చును. ఎలా చూసేది ? మనస్సుతో చూడాలి.

ఆ మనస్సుతో ఎలా చూడాలి, ఏమిటి నియమం ? కంటి తో ఏవస్తువునైనా చూసేప్పుడు కంటికి ఏ అడ్డు ఉండనప్పుడు ఆ వస్తువు గోచరిస్తుంది. అట్లానే మనస్సుతో ఆ ఉన్న తత్త్వాన్ని చూడాలంటే మనస్సుని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఇది నియమం. "అదభ్ర చక్షుషా", విశుద్ధమైన జ్ఞానంతో మాత్రమే "పశ్యంతి" చూడగలం. విశుద్ధమైన మానస్సుచే మాత్రమే కనిపిస్తాడు. అలా చూసే వాళ్ళు ఎలా చూస్తారంటే, "సహస్ర పాదః ఒరు భుజ ఆనన అద్భుతమ్ సహస్ర మూర్ధ శ్రవణాక్షి నాసికమ్ సహస్ర మౌల్యంబర కుండలోల్లసత్ " ఆయనకి ఎన్నెన్ని వేల వేల చేతులు, వేల వేల పాదాలు, వేల వేల శిరస్సులు, వేల వేల నేత్రాలు, వేల వేల నాసికలు, రకరకాల కిరీటాలు, రకరకాల కుండలాలు, రకరకాల ఆభరణాలు. "పల పలవే ఆభరణం పేరుమ్ పల పలవే పలపలవే శోడివడుమ్ పల్వినిల్" అని అంటారు నమ్మాళ్వార్. అలా ఉంటుంది భగవంతుని రూపం.

No comments:

Post a Comment