WORLD FLAG COUNTER

Flag Counter

Friday 5 February 2016

CRYSTAL TORTOISE / BRONZE TORTOISE STATUE FOR PUJA IN HOMES


తాబేలు ప్రతిమ ని ఇత్తడిలో గాని ,క్రిష్టల్ లో గాని తీసుకొని దానిని ఇత్తడి ప్లేట్ లో గాని,పింగాణి లేదా గాజు పాత్రలోగాని నీటిని పోసి తాబేల్ ని ప్లేట్ తో సహా ఉత్తరం దిక్కున ఉంచాలి.ప్రతిరోజు ఉదయాన్నే ప్లేట్లో ఉన్న నీటిని తీసివేసి కొత్త నీటిని పోసి ఉత్తరం దిక్కున ఉంచాలి.ప్లేట్ లో నీటిని పోసేటప్పుడు మన మనస్సులో ఉన్న కోరికలను మనస్సులో తలచుకుంటు నీటిని పోయాలి.
తాబేలు నీటిలో ఉంటే ఎక్కువ రోజులు బ్రతుకుతుంది.కాబట్టి తాబేలుని నీటిలో ఉంచటం వలన తాబేలుకి సహజ వాతావరణంలో ఉంచాము అన్న అనుభూతి కలుగుతుంది.బ్రతికి ఉన్న తాబేలుని కూడ ఎక్వేరియంలో ఉంచి ఉత్తరం దిక్కున ఉంచవచ్చు
తాబేలు ని విష్ణు భగవానుడి స్వరూపంగా కొలుస్తారు.వాస్తు శాస్త్రం రీత్యా ఉత్తరం దిక్కు బుధుడికి చెందిన దిక్కు అని ,ఉత్తరం కుబేర స్ధానంగా భావిస్తారు.జోతిష్యశాస్త్రం లో బుధగ్రహానికి అదిదేవుడు విష్ణు భగవానుడు. ఉపయోగాలు ;-
1) తాబేలుని నీటిలో ఉంచి ఉత్తరం దిక్కున ఉంచటం వలన బుధగ్రహా దోషాలు తొలిగిపోతాయి.
2)తాబేలు ఉన్న ఇంటి లో పిల్లలు అందరు మంచి విద్యతో విద్యావంతులుగా ఎదుగుతారు.మంచి వాక్శుద్ది తో భావప్రకటన చేయగల సామర్ధ్యం కలిగి ఉంటారు.
3)తాబేలు ఉన్న ఇంటిలో వాస్తు దోషాలు ఉంటే కొంత వరకు దోష నివారణ జరుగుతుంది.ఆ ఇంటిలో ఉన్న మనుషులకు మానసిక ప్రశాంతత కలుగుతుంది.
4)తాబేలు ఉన్న ఇంటిలో ధనానికి ఎటువంటి లోటు ఉండదు.
5)తాబేలు షాపులలో ఉంచటం వలన వ్యాపారాభివృద్ధి ఉంటుంది.

No comments:

Post a Comment