WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 27 January 2016

QUICK BEAUTY TIPS FOR WOMEN IN TELUGU


రాత్రి రాస్తే.. ఉదయాన్నే అందం...!

ఒక్కోసారి రాత్రికి రాత్రే అందం రెట్టింపు అయిపోతే బావుణ్ణు అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే ఏ పెళ్లి వేడుకకో, పార్టీకో వెళ్లాల్సి వస్తుంది. అందం అనేది రోజుల్లోనే మెరుగవ్వదు కాని.. ఇలా పొద్దున్నే వేడుకలకు వెళ్లాలనుకునే వాళ్లు.. ఆ ముందు రోజు రాత్రి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..
తక్కువ టైమ్‌లోనే ముఖ సౌందర్యాన్ని వెలుగులీనేలా చేసే గుణం అలొవీర సొంతం. జ్యూస్‌ లేదా జెల్‌ ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీదున్న చిన్న చిన్న గాయాలు, మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. జెల్‌ రాసుకున్న గంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అందరి ఇళ్లలో ఎప్పుడూ సిద్ధంగా ఉండే క్రీమ్‌ వాజెలిన్‌. రాత్రి పడుకోబోయే ముందు కాళ్లు, చేతులకు రాసుకోవాలి. మునివేళ్లతో మెల్లగా మసాజ్‌ చేసుకుని.. చేతులకు కాటన్‌బట్టతో తయారైన గ్లౌజులు, కాళ్లకు ఉతికిన సాక్సులు వేసుకుంటే తడి ఆరిపోదు. పొద్దున్నే చర్మం నిగనిగలాడుతుంది. చర్మం సున్నితంగా తయారవుతుంది.
శరీరంలోని అన్ని భాగాల గురించి మనం పట్టించుకుంటాం కాని కనురెప్పల గురించి పెద్దగా పట్టించుకోము. అందుకనే మీరు రాత్రి పడుకునే ముందు.. కనురెప్పలకు ఒక టేబుల్‌ స్పూన్‌ ఆముదం పట్టించుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా, బలంగా తయారవుతాయి. రాత్రి పడుకునే ముందు తాజా కొబ్బరినూనెను ముఖానికి పట్టించుకోవాలి. ముఖరక్తనాళాల్లో రక్తం సాఫీగా సాగేందుకు చిన్నపాటి మసాజ్‌ కూడా అవసరం. దీనివల్ల ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. వయసుతో పాటు వచ్చే ముడతలు అంత త్వరగా రావు.
చలికాలం, వర్షాకాలంలో దప్పిక తక్కువ. కాబట్టి మంచినీళ్లు ఎక్కువగా తాగరు. దానివల్ల శరీరం మొత్తం డీ హైడ్రేట్‌ అవుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు మంచి నీళ్లను తప్పక తాగాలి. ఆ చిన్న అలవాటే శరీరాన్ని డీ హైడ్రేట్‌ కాకుండా చూస్తుంది.
ఆల్మండ్‌ ఆయిల్‌లోకి కాస్త నిమ్మరసం కలుపుకుని.. ముఖానికి, కళ్లకింది భాగంలో రాసుకుంటే బెటర్‌. దీనివల్ల ఉదయాన్నే ముఖం చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కళ్లు నీరసంగా కనిపించవు.

No comments:

Post a Comment