WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 30 January 2016

HOW TO TAKE CARE OF KIDNEYS - HEALTH TIPS FOR KIDNEYS


శరీరంలో ద్రవాలను సరైన స్థాయిలో ఉంచడం, శరీరంలోని రసాయనాల సమ తుల్యతను కాపాడటం, వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగించడం, వివిధ రకాల హార్మోన్లను విడుదల చేయడం. శరీరంలోని ద్రవాలు శరీరంలోని ద్రవాలను తొలగించడం లేదా నిలువరించడం మూత్రపిండాలు చేసే విధులలో ప్రధానమైనవి.
ఎక్కువ మందిలో కనిపించే సమస్య కిడ్నీలో స్టోన్స్‌. తీసుకునే ఆహారం, శరీరతత్వం వంటివి స్టోన్స్‌ ఏర్పడటానికి కారణమ వుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు గట్టిగా క్రిస్టల్‌ రూపంలో ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో గానీ, మూత్రనాళాల్లో గానీ ఏర్పడ తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లయితే నెఫ్రోలిథియాసిస్‌ అని, మూత్రనాళాల్లో ఉంటే యూరోలిథియాసిస్‌ అని అంటారు. కిడ్నీలో రాళ్ళు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. అయితే స్ర్తీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఏర్పడతాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారి లో ఈ సమస్య కనిపిస్తుంధీ
నొప్పి ఎప్పుడొస్తుంది ?
మూత్ర పిండంలో రాయి తయారవుతున్న సమయంలో ఏ బాధా ఉండదు. అందుకే ముందే గుర్తించలేరు. తయారయిన రాయి మూత్రనాళం ద్వారా బయటికి రాబోతున్న సమయంలో మాత్రమే నొప్పి వస్తుంది. వెన్నుభాగంలో మొదలయ్యే ఈ నొప్పి మామూలుగానూ కొన్ని సార్లు తీవ్రంగానూ ఉంటుంది. కొన్నిసార్లు, కూర్చోవడం, నిలబడటం, పడుకోవడం కూడా దుర్భరంగా మారుతుంది..
మూత్రనాళం సన్నగా ఉండడం వల్ల రాయి వెలుపలికి రాలేక పోవడం వల్ల కలిగే ఒరిపిడిలో ఈ నొప్పి వస్తుంది. మూత్రపిండాల్లో ఉన్నప్పుడు రాళ్లు చిన్నవిగానే ఉంటాయి. మూత్రాశయంలోకి చేరాక మాత్రం ఒకటి రెండు సెంటి మీటర్ల నుంచి దాదాపు చిన్న బంతి పరిమాణం దాకా పెరగవచ్చు. మూత్ర పిండం నుంచి రాయి మూత్రాశయంలోకి చేరగానే నొప్పి తగ్గిపోతుంది. కానీ, మూత్రాశయం నుంచి మూత్రనాళం ద్వారా బయటికి వచ్చే దశలో మళ్లీ నొప్పి తీవ్రమవుతుంది.
నీరు పళ్ల రసాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ స్పటికాలు, వ్యర్థపదార్థాలు సులువుగానే కొట్టుకుపోతాయి
మూత్రనాళంలో రాయి అడ్డుపడి నొప్పి పెరిగిపోతున్నప్పుడే శస్త్ర చికిత్స అవసరం రావచ్చు. రాళ్లు ఏర్పడటం వల్ల వచ్చే కిడ్నీ సమస్యలకు మంచి మందులు ఉన్నాయి. మందులతో రాళ్లు కరిగిపోవు గానీ, మూత్రనాళాన్ని మందులు విశాలం చేస్తాయి.దీని వల్ల ఒకటి రెండు సెంటీ మీటర్ల పరిమాణం గల రాళ్లు బయటికి వెళ్లిపోతాయి.
మందులు వేసుకుంటున్నప్పుడు రాళ్లు మూత్రంలో వెళ్లిపోతుంటాయి. వాటిని భ ద్రపరిచి పరీక్షలకు పంపడం చాలా అవసరం. పలు కారణాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. వైద్య పరీక్షల ద్వారా ఆ కారణమేమిటో తెలిసిపోతే అవి మళ్లీ రాకుండా అరికట్టడం కూడా సాధ్యమవుతుంది.
అయితే ఈ సమస్యను శాశ్వతంగా నివారించడం అన్నది కేవలం మందులతోనేకాదు. ఆహార పదార్థాల్లో చేసే మార్పులు కూడా ఇందుకు తోడ్పడతాయి. వీటన్నిటినీ మించి విరివిగా నీళ్లు తాగడం అన్నది మళ్లీ రాళ్లు రాకుండా చేసే గొప్ప విరుగుడు అని మరిచిపోవద్దు.

No comments:

Post a Comment