WORLD FLAG COUNTER

Flag Counter

Friday 8 January 2016

BOLD BEAUTIES MAKE UP TIPS IN TELUGU


ముఖం బొద్దుగా ఉండేవారు ముందుగా కళ్ల మేక్‌పపై శ్రద్ధ చూపాలి. కళ్లు పెద్దగా కనిపించేట్టు మేకప్‌ చేసుకోవాలి. కళ్ల మొదట్లో లైట్‌ కలర్‌ షేడ్‌ వేసుకోవాలి. ఐలాషెస్‌ని కర్లర్‌తో వంపు తిప్పాలి. ఇటువంటి ముఖ కవళికలున్న వారు క్యాట్‌-ఐ మేకప్‌ వేసుకోవడం వల్ల ముఖం సన్నగా, అందంగా కనిపిస్తుంది. కనుబొమలు మరీ సన్నగా కాకుండా ఒక మోస్తరు మందంగా ఉండేట్టు చూసుకోవాలి. దీనికోసం బ్లాక్‌ లేదా డార్క్‌ బ్రౌన్‌ పెన్సిల్‌ని వాడాలి. చెంపలు, గడ్డం మీద బ్రష్‌తో షిమ్మర్‌ పౌడర్‌ రాసుకోవాలి. దీనివల్ల కూడా ముఖం కొంచెం పొడవుగా సన్నగా కనిపిస్తుంది. అలాగే ముక్కుకు చర్మం రంగుకన్నా కొద్దిగా ముదురు రంగు కాంటూర్‌ పౌడర్‌తో మేకప్‌ వేయాలి. పెదాలకు న్యూడ్‌ కలర్‌ లిప్‌స్టిక్‌ వేస్తే లుక్‌ బాగుంటుంది. అలా నచ్చకపోతే లేత రంగు లిప్‌గ్లాస్‌, లిప్‌బామ్‌లు అయినా అందంగా కనిపిస్తాయి.

No comments:

Post a Comment