WORLD FLAG COUNTER

Flag Counter

Friday 8 January 2016

BEAUTY TIPS IN TELUGU TO INDIAN WOMEN


  • సంవత్సరమంతా సన్‌ప్రొటెక్షన్‌ కలిగిన మాయిశ్చరైజర్‌ వాడాలి. ఇది రాసుకోవడం వల్ల అల్ర్టావైలట్‌ కిరణాలు చర్మాన్ని దెబ్బతీయవు. చలికాలంలో సూర్యుడు పలకరించేదే తక్కువ ఇక యువి కిరణాలు ఏం చేస్తాయి అనుకోవద్దు. ఎందుకంటే ఈ సీజన్‌లో కూడా యువి కిరణాల ప్రభావం చర్మంపై ఉంటుంది. చర్మం యవ్వనంగా కనిపించాలంటే ఎస్‌పిఎఫ్‌ కలిగిన మాయిశ్చర్‌ లోషన్లు సంవత్సరమంతా వాడాల్సిందే
  • ఉదయం స్నానం చేసేముందు కొన్ని నిమిషాలు శరీరాన్ని బ్రష్‌తో రుద్దాలి. ఇది ప్రతిరోజూ చేయాలి. ఇలా చేస్తే చర్మం యవ్వనంగా ఉంటుంది. చర్మంపై ఉండే వ్యర్థాలు బయటికి వస్తాయి. రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. దాంతో శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు విడుదలవుతాయి. పొడి బ్రష్‌తో పొడి చర్మం మీద రుద్దాలి. చర్మం తడిస్తే సున్నితంగా ఉంటుంది. బ్రష్‌ స్ర్టోక్స్‌ పాదాల దగ్గర్నించి ఇవ్వాలి. పాదం నుంచి గుండె వైపుకి పైవైపుకి రుద్దాలి.
  • స్నానం చేశాక బాడీ మాయిశ్చరైజర్‌ను రాసుకోవడం తప్పనిసరి. పొడి చర్మం వాళ్లయితే స్నానం తరువాత మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోవద్దు. శీతాకాలంలో చల్లగా ఉందని వేడి వేడి నీళ్లు స్నానం చేస్తుంటారు కదా. అది సమస్యను జటిలం చేస్తుంది. శరీరం తేమను కోల్పోయేలా చేస్తుంది. అలాకాకుండా చర్మం మృదువుగా ఉండాలంటే అందుకు కాస్త సమయాన్ని కేటాయించాల్సిందే.
  • శరీరంలోని వ్యర్థాల్ని బయటకు పంపేందుకు రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గిన విషయం మూత్రం రంగును బట్టి తెలుసుకోవచ్చు. అది రంగు మారిందంటే శరీరంలో తగినంత నీరు లేనట్టే.
  • మేకప్‌ వేసుకునే అలవాటు ఉంటే ఇంటికి రాగానే మేకప్‌ తీసేయాలి. ఇది సౌందర్య ప్రపంచంలో తప్పక పాటించాల్సిన గోల్డెన్‌ రూల్‌. ముఖం మీదకు చేరిన దుమ్ము, ధూళితో నిద్రపోతే చర్మానికి మీరే హాని చేసినట్టు. అందుకని నిద్రపోబోయే ముందు మేక్‌పను తప్పక తుడిచేయాల్సిందే. క్లెన్సింగ్‌ లోషన్‌ లేదా ఫేస్‌వాష్‌ వాడి మేకప్‌ తీసేయొచ్చు. మేకప్‌ తీశాక మాయిశ్చరైజర్‌ లేదా నచ్చిన నైట్‌క్రీమ్‌ రాసుకోవాలి.

No comments:

Post a Comment