WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 12 December 2015

FOOD GRAINS TIPS TO DIABETES PATIENTS


మధుమేహుల కోసం 'మధురాజ్'! 

• తక్కువ గ్లూకోజు సూచీ వరి రకం గుర్తింపు 
• వచ్చే నెలలో వరి ధాన్యం విత్తనాల పంపిణీ 
• ఛత్తీస్‌గఢ్‌లోని ఐజీఏయూ పరిశోధకుల ఘనత 

రాయ్‌పూర్: మధుమేహులకు 'మధురమైన' వార్త. ఆలస్యంగా జీర్ణమవుతూ, రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా వెళ్లేలా చేసే.. అంటే గ్త్లెసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉండే కొత్తరకం బియ్యాన్ని ఛత్తీస్‌గఢ్ పరిశోధకులు గుర్తించారు. దీని పేరు మధురాజ్-55. తిన్న తర్వాత ఆహారం ఎంత వేగంగా గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుందనేదాన్ని గ్త్లెసిమిక్ ఇండెక్స్ సూచిస్తుంది. రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఐజీఏయూ) ప్రొఫెసర్ డాక్టర్ గిరీశ్ చందెల్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం గుర్తించిన కొత్తరకం బియ్యం మధుమేహులకు, మధుమేహం ముప్పు గలవారికే కాదు.. అందరికీ ఎంతగానో మేలు చేయగలవని నిపుణులు భావిస్తున్నారు. ''గత కొన్నేళ్లుగా గ్త్లెసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే వరి ధాన్యం రకాన్ని గుర్తించటానికి, అభివృద్ధి చేయటానికి ప్రయత్నిస్తున్నాం. ఆశ్చర్యకరంగా ఛత్తీస్‌గడ్‌లో సంప్రదాయంగా సాగు చేస్తున్న 'చపతి గుర్‌మటియ' అనే రకం వరి ధాన్యంలోనే దీన్ని గుర్తించాం'' అని చందెల్ తెలిపారు. మనదేశంలో చాలామంది అన్నం తినేవారే కావటం వల్ల ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుందని వివరించారు. పరిమితికి మించిన గ్త్లెసిమిక్ ఇండెక్స్ బియ్యం తినటం మధుమేహులకు హాని కలిగిస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని తాము పరిశోధన చేపట్టామని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ కౌన్సిల్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో ఎలుకలకు ఈ బియ్యాన్ని తినిపించి సమాచారాన్ని సేకరించామన్నారు. మధుమేహం గల ఎలుకలను ఎంచుకొని కొన్నింటికి కొత్తరకం బియ్యాన్ని, మరికొన్నింటికి రక్తంలో గ్లూకోజును నియంత్రించే మందును ఇచ్చి పరిశీలించామని.. ఇందులో బియ్యం ప్రభావం స్పష్టంగా బయటపడిందన్నారు. ''కొత్తరకం బియ్యం గ్త్లెసిమిక్ సూచీ 55గా ఉన్నట్టు తేలింది. ఇది మధుమేహులకు మేలు చేస్తుంది. అందువల్ల వాణిజ్యపరంగా విక్రయించటానికి దీనికి 'మధురాజ్-55' అని పేరు పెట్టాం'' అని చందెల్ వివరించారు. దీంతో వండిన అన్నం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందువల్ల రక్తంలోకి గ్లూకోజు కూడా నెమ్మదిగా వెళ్తుంది. 6.5 కోట్ల మంది మధుమేహులు గల మనదేశంలో మధుమేహాన్ని కట్టడి చేయటానికిది దోహదం చేయగలదని చందెల్ పేర్కొన్నారు. అధిక దిగుబడినిచ్చే దీని రుచి మిగతా బియ్యం మాదిరిగానే ఉంటుందన్నారు. ఈ వరిధాన్యం విత్తనాలను 2016, జనవరిలో రైతులకు పంపిణీ చేయనున్నట్టు ఐజీఏయూ ఉప కులపతి డాక్టర్ ఎస్.కె.పాటిల్ తెలిపారు. వచ్చే ఖరీఫ్‌లో దీని ఉత్పత్తి ఆరంభం కావొచ్చన్నారు.

No comments:

Post a Comment