WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 3 September 2014

DETAILED ARTICLE ON ANDHRA TRADITIONAL JANTA KOLATAM



కోలాటం మన సంప్రదాయం
లయ ప్రకారం రెండు భాగాలుగా నిలబడిన కేంద్రం నుంచి మరో కేంద్రానికి ఒకరి తర్వాత మరొకరు వరస క్రమంలో తిరగడంతో ఈ తాళ్ళన్నీ అల్లబడిన జడలాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం.

ఒక రకమైన సాంప్రదాయక సామూహిక ఆట. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధం... ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కర్రముక్కలు పట్టుకొని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కలను వేరొకరి చేతికర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు మరియు స్ర్తీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు అబ్దుల్‌ రజాక్‌ అనే చరిత్రకారుడు వర్ణించాడు. విజయనగర శిధిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు. జడకొప్పు కోలటంతో గ్రామదేవతలైన ఊరడమ్మ , గడి మైశమ్మ , గంగాదేవి , కట్టమైసమ్మ , పోతలింగమ్మ , పోలేరమ్మలకు ప్రార్థనలు నిర్వహిస్తారు.

దాండియా: దసరా నవరాత్రుల సంబరాలలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన దాండియా కూడా కోలాటంలాగానే రంగురంగుల కర్రలతో రాధాకృష్ణుల గీతాలతో నృత్యాలు చేస్తారు. ఎక్కువగా ఉత్తరభారతదేశంలో ఈ దాండియా ఆట ప్రాచుర్యం పొందింది. శ్రీకృష్ణుడు బృందావన గోపికలతో ఎంతో హృద్యంగా దాండియా ఆడినట్లు వారి నమ్మకం. ఆంధ్రాలో కోలాటం నృత్యరీతి చాలా ప్రాచీనమైనది. నాడు రాజులు, మహరాజులు కళాపోషకులుగా ఉండి ఈ నృత్యాన్ని ఆదరించేవారు. కాలక్రమేణా ఈ నృత్యానికి ఆదరణ నెమ్మదిగా తగ్గిపోతోంది. ఇప్పటికీ సంప్రదాయనృత్యాలలో భాగంగా ఈ కోలాట నృత్యాన్ని అభినయిస్తుంటారు. 

ఆట విధానం : కోలాటం పట్ల ఆసక్తి ఉన్న కొందరు ఒక బృందంగా ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి ఇష్ట దేవతా ప్రార్ధన చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుణ్ణి కోలన్న పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళు ఇందులో ఉంటారు. ఆటగాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది.

No comments:

Post a Comment