WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 3 September 2014

ARTICLE ON ANCIENT INDIAN TRADITION AND CULTURE ABOUT PAGATI VESHAGALLU


కనుమరుగువుతున్న పగటి వేషాలు
కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతీ కులాన్ని గురించి తెలియచేస్తూ ఆ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి. పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటిగడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు. పగటి వేషాల్లోనే ప్రత్యేకత, ప్రావీణ్యత కలిగిన వేషం అర్థనారీశ్వర వేషం. ఒక వ్యక్తి మధ్యలో తెర కట్టుకొని ఒకవైపు నుండి పార్వతి, మరోవైపునుండి శివుడుగా అలంకరణ చేసుకొని ప్రదర్శనలిస్తాడు.

జానపదుడి వీధి ప్రదర్శన-పగటివేషాలు జానపదకళలు ఆదరణ తక్కువ కావడంచేత చాలా కళలు భిక్షుక వృత్తిగా మారిపోయాయి. బుర్రకథ, వీధినాటకం, యక్షగానం వంటి కళారూపాలు భిక్షుకవృత్తిగా మారిపోయిన దశ కనిపిస్తోంది. అలాంటి కళారూపాలలో పగటివేషాలు ఒకటి. చాలా జానపద కళారూపాలు మతపరంగానో, కులపరంగానో, వాయిద్యాలపేరతోనో పిలువబడితే కేవలం ప్రదర్శనా సమయాన్ని బట్టి పిలువబడేది పగటివేషాలు కళ. అనేకమైన వేషాలు ప్రదర్శింపబడడంచేత, కేవలం పగటిపూటనే ప్రదర్శింపబడడంచేత ఇవి పగటివేషలయ్యాయి. పగటి వేషాలనే పైటేషాలని కూడా అంటారు. పగటి వేషాలు జానపద కళారూపాల్లో ప్రముఖమైనవి. యక్షగానం, వీధినాటకాలనుండి బ్రోకెన్‌ డౌన్‌ మిత్‌ అన్న వాదం ప్రకారం వీధినాటకాలే పగటివేషాలుగా మారాయని పరిశోధకుల అభిప్రాయం. ప్రదర్శించే వేళను బట్టి, సమయాన్ని బట్టి వీటికి పగటివేషాలని పేరు వచ్చింది. కేవలం పగటిపూట మాత్రమే వీటిని ప్రదర్శిస్తారు. పగటివేషాలను, సంచారి పగటి వేషాలని, స్థానిక పగటివేషాలని విభజించవచ్చు. సంచారి పగటివేషాల వాళ్ళు దాదాపు సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తుంటారు. వీళ్ళనే బహురూపులు అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్లో నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. జానపద కళలూ చాలా వరకు యాచక వృత్తిగా మారిపోయాయి. అట్లా మారిన వాటిలో పగటివేషాలు ఒకటి. వచ్చిన సంభావన అందరూ సమానంగా పంచుకుంటారు. వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ద వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి. ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కానీ ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవన విధానంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. 

ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కానీ ఉదయమే ఈ విధవ మోహం చూడలేమని ఈ వేషంతో మా యింటి వద్దకు రావద్దని చెప్పడం మూలాన ఈ వేషం వేయడంలేదని కళాకారులు వివరించారు. అలాగే కులాలకు, మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఈ వేషం మేకప్‌ వేయడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా ఈ మేకప్‌ ఉండాలి కాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని కళాకారులు చెబుతారు. ఒకే వ్యక్తి స్ర్తీ , పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్య విషయం కాదు. పగటి వేషాలు చారిత్రకత జనవ్యవహారంలో...వాడుకలో ఉన్న కథలను బట్టి పగటివేషాలు రాజు కళింగ గంగుకథ, సంబెట గురవ రాజు కథ, విజయనగర రాజుల కథలు ప్రస్తావనలోకొస్తాయి. పగటి వేషాలకు సైతం చారిత్రకాధారాలున్నాయి. శాతవాహనుల పరిపాలనా కాలం నుండే ఈ కళారూపం ఉందని, హాలుని గాధాసప్తశతిలో దీని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది.

పగటివేషాలు - వర్గీకరణ : ఇతివృత్తం ఆధారంగా పగటి వేషాలను ఐదు విధాలుగా విభజించవచ్చు. 
1. మతపరమైనవి: ఆదిబైరాగి వేషం, చాతాది వైష్ణవ వేషం, కొమ్ము దాసరి వేషం, హరిదాసు వేషం, ఫకీరు వేషం, సహెబుల వేషం. 
2. కులపరమైనవి: బుడబుక్కల వేషం, సోమయాజులు-సోమిదేవమ్మ వేషం, బోడి బ్రాహ్మణ స్ర్తీ వేషం, వీరబాహు వేషం, గొల్లబోయిడు వేషం, కోయవాళ్ళ వేషం, దేవరశెట్టి వేషం, దేవాంగుల వేషం, ఎరుకలసోది వేషం వంటివి. 
3. పురాణపరమైనవి: జంగం దేవర వేషం, శక్తి లేదా శూర్పణఖ వేషం, అర్థనారీశ్వర వేషం వంటివి. 
4.జంతు ప్రదర్శన పరమైనవి: గంగిరెద్దుల వేషం, పాములోళ్ల వేషం తదితరములు...
5. ఇతరములు: పిట్టలదొర వేషం, చిట్టి పంతులు వేషం లాంటివి.


No comments:

Post a Comment