WORLD FLAG COUNTER

Flag Counter

Monday 3 October 2016

AMAZING UNBELIEVABLE FACTS ABOUT OCTOBER 2016


800 ఏళ్ల తర్వాత అరుదైన అక్టోబర్ ఇది! 

- 3 పెద్ద పండుగలు, 5 శని, ఆది, సోమవారాలు


ఇది అక్టోబర్ మాసం. అయితే ఏంటి గొప్పా. ఏడాదిలో పన్నెండు నెలలు. అందులో అక్టోబర్ నెల ఒకటి అంటూ తక్కువగా తీసిపారేయ్యకండి.  ఇంతకీ దీని గొప్పతనం ఏమిటంటే.. ఇది 8 శతాబ్దాల తరువాత వచ్చిన అరుదైన నెల. కాకతీయుల పాలన కాలం నాటి నెల మళ్లీ వచ్చిందంటున్నారు.

863 ఏళ్ల క్రితం అంటే క్రీస్తు శకం 1153 వ సంవత్సరంలో వచ్చిన అక్టోబర్ నెలలో ఇలా అరుదైన రోజులు కలిసి వచ్చాయి. అమావాస్య, పౌర్ణమి ఒకే నెలలో రావడం ఒక విశేషం. ఈ నెల 11 న దసరా, 12 న మొహరం, 30 న దీపావళి.. ఇలా మూడు పండుగలు ఒకే నెలలో రావడం మరో ప్రత్యేకత. సాధారణంగా నెలకు నాలుగేసి వారాలు ఉంటాయి. కానీ ఈ అక్టోబర్‌లో మాత్రం శని, ఆది, సోమవారాలు ఐదేసి రావడం ప్రాధాన్యతగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో శనివారాలు (1, 8, 15, 22, 29 తేదీలు), ఆదివారాలు(2, 9, 16, 23, 30 తేదీలు), సోమవారాలు (3, 10, 17, 24, 31 తేదీలు) వస్తాయి. దసరా సెలవులతో పాటు ఐదు ఆదివారాలు, రెండవ శనివారం కలిపి దాదాపు 17 రోజులపాటు పాఠశాలలు, కాలేజీలు, కంపెనీలకు సెలవులే. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు పండగే.

ఈ నెలలో ఇంకెన్నో విశేషాలు..
- అక్టోబర్ 1 వ తేదీన ప్రపంచ శాఖాహార దినోత్సవం, ప్రపంచ వృద్ధుల దినోత్సవం, జాతీయ రక్తదాన దినోత్సవం, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, విజయవాడ కనకదుర్గ శరన్నవరాత్రులు ప్రారంభం.
- 2 జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి.
- 3 వరల్డ్ అర్కిటెక్చిర్ డే.
- 4 ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం,
- 5 అంతర్జాతీయ ఉపాధ్యా దినోత్సవం.
- 7 ప్రపంచ నవ్వుల దినోత్సవం.
- 8 భారత వైమానిక దళ దినోత్సవం.
- 10 జాతీయ తపాలా దినోత్సవం.
- 11 విజయ దశమి(దసరా), ప్రపంచ బాలికల దినోత్సవం.
- 12 మొహరం, సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు.
- 13 అంతర్జాతీయ ప్రకృతి వైఫరీత్యాల నిరోధక దినోత్సవం.
- 14 వరల్డ్ ఎగ్ డే.
- 15 అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం.
- 16 ప్రపంచ ఆహార దినోత్సవం, మహర్షి వాల్మికి జయంతి.
- 17 పేదరిక నిర్మూలన దినోత్సవం.
- 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.
- 24 ఐక్య రాజ్య సమితి వ్యవస్థాపక దినోత్సవం.
- 26 గృహహింస చట్టం అమలులోకి వచ్చిన రోజు.
- 29 నరక చతుర్ధశి,
- 30 దీపావళి, హోమి జె.బాబా జయంతి, ప్రపంచ పొదుపు దినోత్సవం.
- 31 ఏక్తా దివాస్ సర్థార్ వల్లబాయ్ పటేల్ జయంతి.

No comments:

Post a Comment