WORLD FLAG COUNTER

Flag Counter

Monday 16 May 2016

SUMMER HOT SKIN CARE TIPS IN TELUGU - HOW TO PROTECT YOUR SKIN FROM SUMMER HOT SUN


మండే ఎండలు .... ఎండే చర్మం

ఇది ఎండల కాలం.. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సూర్యతాపానికి నేరుగా ప్రభావితమయ్యేది మన చర్మం. అధిక ఉష్ణోగ్రత.. రేడియేషన్లతో కూడిన సూర్యకిరణాలు చర్మాన్ని పలు సమస్యల పాలు చేస్తాయి. మనం ఎండలోకి వెళ్లినప్పుడు సూర్యకాంతిలోని అతినీలలోహిత (అల్ట్రావయొలెట్) కిరణాలు నేరుగా చర్మ కణజాలంలోకి దూసుకుపోయి, చర్మాన్నికష్టాల పాలు చేస్తాయి. ఈ మండే ఎండల్లో చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో చెబుతున్నారు నిపుణులు...

ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం నల్లబడుతుందనడంలో నిజం లేకపోలేదు. మన చర్మం నల్లగా లేదా తెల్లగా ఉండడానికి కారణం చర్మంలో ఉత్పత్తయ్యే మెలనిన్ అనే వర్ణకపదార్థం. చర్మానికి నలుపు రంగు రావడానికి కారణం ఇదే. మన శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఎండలోకి వెళ్లినప్పుడు అతినీలలోహిత కాంతి ఈ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. ఫలితంగా అధిక మోతాదులో మెలనిన్ ఉత్పత్తయి చర్మం అంతటా విస్తరిస్తుంది. తద్వారా చర్మం నలుపుదేలుతుంది. అందుకే ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు చర్మం నల్లగా వడలిపోతుంది.

• చిరాకెత్తించే చెమట కాయలు

వేసవి కాలంలో చెమట ఆరిపోకుండా తిరిగి శరీరంలోకే ఇంకిపోయి, చర్మం పై పొరల్లో నిలిచిపోతుంది. ఫలితంగా స్వేదగ్రంథుల నాళాలు మూసుకుపోతాయి. దీనివల్ల ఆ ప్రదేశంలో చెమట బిందువులే చర్మంపై బుడిపెల్లా ఏర్పడుతాయి. వీటినే చెమటకాయలంటాం. ఇవి మరి కాస్త పెద్దవైతే ఎర్రని బిళ్లల్లా మారిపోతాయి. ఆ తరువాత విపరీతమైన దురద, మంట మొదలవుతుంది. చెమటకాయలు రాపిడికి గురయినప్పుడు వాపు రావచ్చు. ఈ స్థితిలో ఇన్‌ఫెక్షన్లకు లోనయ్యే అవకాశం ఎక్కువవుతుంది.

ఇన్‌ఫెక్షన్లకు దారిమండే ఎండలు..ఎండే చర్మం శరీరంలో వేడి, తడి కలిసి ఉండే ప్రదేశాల్లో ఫంగస్ వృద్ధి చెందుతుంది. తొడలు, భుజాల కింద, పిరుదుల మధ్య ఫంగస్ ఎక్కువగా పెరుగుతుంది. వేసవి తీవ్రతతో పాటు ఈ భాగాలు ఎక్కువ ఒరిపిడికి గురవుతుంటాయి. పైగా, గాలి కూడా సరిగా అందక చెమట అధికంగా వస్తుంది. వేడితో పాటు తడి కూడా సమానంగా ఉండడం వల్ల వేసవి కాలంలోనే ఫంగస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. జంతువులు, నీటి ద్వారానే కాకుండా ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఇన్‌ఫెక్షన్ ఉన్న వ్యక్తి దుస్తులను ఇతరులు ధరించడం వల్ల కూడా ఫంగస్ సోకే అవకాశం ఉంది.

• ఎండతో ముడతలా?

చర్మం ముడుతలు పడడానికి వయసు పెరగడం ఓ ప్రధాన కారణమైతే మండించే ఎండ మరో ముఖ్య కారణం. ఎండ వేడిమి వల్ల చర్మంలోని ఎలాస్టిక్ కణజాలం దెబ్బతింటుంది. ఇది చర్మాన్ని బిగువుగా పట్టి ఉంచుతుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఈ కణజాలం పట్టు తప్పి చర్మం బిగువు సడలిపోయి ముడుతలు ఏర్పడడానికి దారితీస్తుంది. దీన్నే సోలార్ ఎలాస్టోసిస్ అంటారు. తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థే దాడిచేయడం వల్ల కొందరు ఆటోఇమ్యూన్ వ్యాధులకు గురవుతారు. సిస్టమిక్ ల్యూపస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులున్న వారిలో చర్మం, శ్వాసకోశాలు, గుండె, కాలేయం, కిడ్నీ వంటి ప్రధాన అవ యవాలన్నీ దుష్ప్రభావానికి లోనవుతాయి. ఇలాంటి వారు ఎండలో తిరిగితే ఈ వ్యాధి మరింత తీవ్రమవుతుంది. వంశానుగతంగా వచ్చే చర్మ వ్యాధులు కూడా ఎండవేడిమికి తీవ్రమవుతాయి.

• సెగగడ్డలు

సాధారణంగా మన చర్మం మీద నిరంతరం పలురకాల బ్యాక్టీరియాలు నిలిచి ఉంటాయి. చర్మం దృఢంగా ఉన్నంత కాలం అవి పైపైనే ఉండిపోతాయి. అయితే వేసవిలోని అధిక ఉష్ణోగ్ర త కారణంగా వచ్చే చెమట వల్ల చర్మం మెత్త బడుతుంది. ఇదే అదనుగా బ్యాక్టీరియాలు చర్మం లోపలికి చర్మం లోపలికి ప్రవేశిస్తాయి. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వల్ల చర్మం మీద గడ్డలు తయారవుతాయి. వీటినే సెగ గడ్డలు అంటారు.

• నగలతో అలర్జీ

మెడలో గొలుసు వేసుకున్నా, చేతులకు గాజులు ధరించినా, వేలికి ఉంగరం పెట్టుకున్నా కొంతమందిలో దురదతో కూడిన అలర్జీ కనిపిస్తుంది. సాధారణంగా బంగారు ఆభరణాలతో ఈ సమస్య రాదు. కానీ నికెల్, కోబాల్ట్, రాగి ఆభరణాలు ధరిస్తే మాత్రం అలర్జీ కనిపిస్తుంది. ఎండవే డిమికి ఈ లోహాలు కరిగిపోతాయి. ఈ సమయంలో లోహంలోని యాంటీజన్స్ చెమట రంధ్రాల ద్వారా శరీరంలోకి వెళ్లి అలర్జీలకు దారి తీస్తాయి.

• నలుపు.. రక్షణ కవచం

తెల్లగా, పసిమిఛాయలో ఉండేవాళ్లలో వేసవి చర్మ సమస్యలు మరింత ఎక్కువ. చర్మంలో ఉండే మెలనిన్ అతినీలలోహిత కిరణాలు చర్మకణాల లోపలికి చొచ్చుకుపోకుండా కాపాడుతుంది. తెలుపు వర్ణంలో ఉండేవాళ్లు తక్కువ మెలనిన్‌ను కలిగివుండడం వల్ల అతినీలలోహిత కాంతి చాలా సులువుగా కణంలోపలికి వెళ్తుంది. ఫలితంగా వీళ్లు చర్మసమస్యలకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఇలాంటివారిలో చర్మక్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చర్మంలోపలికి చొచ్చుకుపోయే అతినీలలోహిత కిరణాలు కణాల్లోని జన్యువులపైన ప్రభావం చూపి క్యాన్సర్‌కు కారణమవుతాయి. ఇటీవల ఓజోన్ పొర బాగా పలుచబడుతున్న కారణంగా మన దేశంలోనూ చర్మ క్యాన్సర్ల సంఖ్య పెరుగుతోంది.

• ఇలా రక్షించుకోండి...

మామిడి పండ్లలో వీటిలో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఎండ తీవ్రతను తట్టుకునే శక్తిని పెంచుతుంది. పైగా ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉంటాయి. ఫ్రీ-రాడికల్స్‌తో వచ్చే పలు రకాల సమస్యకు ఇవి విరుగుడుగా పనిచేస్తాయి. మామిడి పండ్లు తినడం వల్ల సెగ గడ్డలు వస్తాయనుకుంటారు చాలామంది. ఇది కేవలం అపోహే. ఈకొబ్బరి నీళ్లు, పండ్లరసాలు, మొలకెత్తిన ధాన్యాలతో పాటు, టొమాటో, క్యారెట్ రసం, మజ్జిగ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కూల్‌డ్రింక్స్ వద్దు.

వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి. తెలుపు రంగు సూర్యరశ్మిని నిరోధిస్తుంది. అందుకే తెలుపు రంగు దుస్తులు, తెలుపు రంగు గొడుగునే వాడాలి. లోదుస్తులు కూడా కాటన్‌వే ధరించడం మేలు. ఈప్రతి రోజూ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం ద్వారా ఎండ తగిలినా అల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మం లోపలికి చేరకుండా ఈ సన్‌స్క్రీన్ అడ్డుకుంటుంది. అయితే ఒకసారి వేసుకున్న సన్‌స్క్రీన్ రెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇది రాసుకోవాలి. ముఖానికే కాకుండా మెడ, చేతులకు కూడా రాసుకోవడం మంచిది. అయితే ఎస్‌పిఎఫ్ విలువ 30 ఉన్న సన్‌స్క్రీన్‌లు వాడడం ఉత్తమం.

చాలామంది ఎక్కువసార్లు సబ్బుతో రుద్ది, ముఖానికి రకరకాల క్రీములు పట్టిస్తుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎండాకాలంలో ముఖానికి క్రీములు ఏవీ వాడకపోవడం ఉత్తమం.

No comments:

Post a Comment