WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 3 February 2016

LIST OF NAMES OF GAYATHRI MATHA - IMPORTANCE AND POWER OF GODDESS GAYATHRI MATHA


ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”

గాయత్రికి అమ్మ వారికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి. 

1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య

ప్రతిపదార్ధం :
ఓం : ప్రణవనాదం భూః : భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌ భూవః : రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌ సువః : స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌ ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి. తత్‌ : ఆ సవితుర్‌ : సమస్త జగత్తును వరేణ్యం : వరింపదగిన భర్గో : అజ్ఞానాంధకారమును తొలగించునట్టి దేవస్య : స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను ధీమహి : ధ్యానించుచున్నాను ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి.

No comments:

Post a Comment