WORLD FLAG COUNTER

Flag Counter

Monday 18 January 2016

IMPORTANCE OF VUSIRI KAYA IN FESTIVAL - KARTHIKAMASAM SEASON


 సర్వ శుభాలనిచ్చే ఉసిరి

* ధాత్రీ వృక్షం అంటే ఉసిరి చెట్టు అని అర్ధం, కార్తీక మాసంలో ప్రతి రోజూ కానీ, పౌర్ణమి రోజూన కానీ ఉసిరిచెట్టును పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి.

* కార్తీకమాసంలో ఉసిరి చెట్టులో లక్ష్మీ సమేతంగా శ్రీమహావిష్ణువు నివాసముంటాడు.

* బ్రహ్మ ఆనందబాష్పకణాల నుంచి ఉసిరిక ఉద్భవించింది.

* ఉసిరికాయలతో నివేదన, ఉసిరి కాయలపై ఆవునేతితో దీపారాధన, ఉసిరి వనంలో అన్న సమారాధనలు చేయడం సాలగ్రామలను, దీపాలను దానం చేయడం వలన అఖండ అష్టయిశ్వర్య ప్రాప్తి, అనంత పుణ్యఫల ప్రాప్తి లభిస్తాయి.

* ఉసిరి చెట్టు మూలంలో శ్రీహరి, స్కందంలో రుద్రుడు, ఊర్ధ్వంలో బ్రహ్మ, శాఖాలలో సూర్యుడు, ఉపశాఖలలో దేవతలు ఆశ్రయించి ఉంటారు.

* కార్తిక పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును పూజించి, చిత్రాన్నాలను నివేదించి, మధ్యాహ్నం బంధుమిత్రులతో కలిసి ఉసిరి చెట్టు నీడలో వనభోజనం చేస్తే సకల పాపాలు తొలగిపోయి విష్ణులోకం పొందుతారు.

* కార్తిక మాసంలో వాతవరణ ప్రభావం వలన మనిషిలో ఉష్ణాంశము తక్కువై, త్రిదోషాలు వికృతి చెందుతాయి. తులసి వాసన, ఉసిరిక వాసన పీల్చుకోవడం వలన ఆరోగ్యం చేకూరుతుందనే నమ్మకం వనభోజనాలు ఏర్పాటు చేయడానికి నాంది పలికిందని పెద్దలు అంటారు.

No comments:

Post a Comment