chitika

WORLD FLAG COUNTER

Flag Counter

chitika

Wednesday, 9 December 2015

HINDU ARTICLES ABOUT ZODIAC SIGNS - RASULU - MESHA RAASI - MESHAM - ARIES IN TELUGU


మేషరాశి

మేషం

రాశులలో ఇది మొదటిది. సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. అశ్వని నక్షత్రము నక్షత్ర నాలుగు పాదాలు, భరణి నక్షత్రము నక్షత్ర నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రము నక్షత్రంలోని ఒక పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం మేక ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్థం కనుక ఇది మేషరాశి అయింది. సూర్యుడు ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరువాత వృషభరాశిలో ప్రవేసిస్తాడు.
మేషరాశి వారి గుణగణాలు
మేషరాశి వారి జీవితములో ఒడిదుడుకులు ఎక్కువ. అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యములో కష్టాలు అనుభవిస్తారు. యవ్వనములో స్నేహితులకు బంధువులకు దూర ప్రాంతాలకు వెడతారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురౌతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా అర్ధిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమౌతుంది. స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు ఎదురు చూస్తారు. బంధువర్గములో అస్థుల కొరకు వేచి ఉండే వారు అధికము. భార్య వైపు బంధువులు కొంత కాలము పెత్తనము సాగిస్తారు. అనేక కారణాల వలన మంచి వారిని ఆదరించ వలసిన అవసరము ఏర్పడుతుంది. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి ఔతారు. సాహస క్రీదల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతొ కలిగే విబేధాలు జీవితములో మలుపును తెస్తాయి. లిఖిత పుర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పింనంతగా తాము ఆచరించరు. మనోధైర్యముతో తిసుకునె సాహస నిర్నయాలు కలిసి వస్తాయి. అనుభ్వ లేకుండ చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్యరంగములో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడనికి ఇష్టపడరు. సొమరితనమంటే అయిష్టము. కుటుంబములో ఐక్యత ప్రశాంతత ఉన్నంత కాలము వెలుపలి ప్రపంచములో విజయపధంలో మనగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితములో రాణిస్తారు. సుభ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పుజల వలన సమస్యలను అధిగమించగలరు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్తకు భంగము లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయములో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసి పోతాయి. జ్యేష్ట సంతానము విషయములో జాగ్రత్త వహించాలి. ఆడంబరము లేని పూజలు, గుప్తదానాలు, మనోధైర్యము మేలు చేస్తాయి. సహాయ సహకారాలు కోరేవారు అందరూ అవకాస వాదులు కారని గుర్తించాలి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలసి వస్తాయి. గురువారము చెసే విష్ణు పూజలు మేలు చెస్తాయి.
మేషరాశి వారి లక్షణాలు
రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్త్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. క్షత్రియ రాశి కూడా అయినందున పురుషాహంకారంతో శక్తిమంతుడుగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు. దీనివల్ల మొండితనం అబ్బుతుంది. మాట నెగ్గించుకోవడంకోసం క్రూరత్వం వహించే అవకాశం ఉంది.
ఆచరించదగినవి
పూజించ వలసిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామీ అదృష్ట రంగు ఎరుపు సరిపడని రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్యలు 8 అదృష్ట రత్నము పగడము బరువు క్యారెట్లు 4 అదృష్ట వారము మంగళవారము పనికిరాని వారము బుధవారము రత్నము ధరించవలసిన వ్రేలు ఉంగరపు వ్రేలు రత్నము ధరించవలసిన లోహం వెండి దర్శించవలసిన దేవాలయం సుబ్రహ్మణ్యస్వామి గ్రహ తత్వము అగ్ని
జ్యోతిష సమాచారము
జ్యోతిష సమాచారము-మేషరాశి
అంశము లక్షణము
తత్వము మేషరాశి అగ్ని తత్వం అగ్ని.
లింగము పురుష రాశి
రాశి చర రాశి
రాశి విషమ రాశి
జంతువు పశు రాశి అని ఇతర నామాలు దీనికి ఉన్నాయి.
స్వభావము చతుష్పాద రాశి, క్రూర రాశిగా కూడా వ్యవహరిస్తారు.
రత్నము ఈరాశ్యధిపతి కుజుడు కనుక రత్నము పగడము.
రూపము ఈ రాశితో సంబంధం ఉన్న వారు మితమైన ఎత్తు కలిగి ఉంటారు.
జాతి జాతి క్షత్రియ
శబ్ధము శబ్ధములు అధిక శబ్దం
జీవులు జీవులు పశువులు వర్ణం
వర్ణము రక్త వర్ణం
దిక్కు దిశ తూర్పు దిశ
ప్రకృతి శరీర ప్రకృతి పిత్తం
సంతానం సంతానం అల్పం
అంగం కాల పురుషుని అంగం శిరస్సు
ఉదయము ఉదయం పృష్ఠ
సమయము సమయం రాత్రి అని జ్యోతిష శాస్త్ర వివరణ
నవాంశ పాదాలు
1. అశ్వినీ నక్షత్ర మొదటి పాదము.
2. రోహిణీ నక్షత్ర మొదటి పాదము.
3. పునర్వసు నక్షత్ర మొదటి పాదము.
4. మఖా నక్షత్ర మొదటి పాదము.
5. హస్తా నక్షత్ర మొదటిపాదము.
6. విశాఖా నక్షత్ర మొదటి పాదము.
7. మూలా నక్షత్ర మొదటి పాదము.
8. శ్రవణా నక్షత్ర మొదటి పాదము.
9. పూర్వాభద్ర నక్షత్ర మొదటి పాదము

Related Posts Plugin for WordPress, Blogger...

chitika