WORLD FLAG COUNTER

Flag Counter

Friday 27 November 2015

TIPS FOR USAGE OF KITCHEN ITEMS FOR BEAUTY CARE TO WOMEN


వంటింట్లోనే సౌందర్యం

మాయిశ్చరైజింగ్:అప్పుడప్పుడూ చేతులకూ, పాదాలకు మాయిశ్చరైజింగ్ లోషన్ గానీ, బేబీ లోషన్‌గానీ పట్టిస్తుండాలి. వంటింట్లో అలసిపోయిన స్త్రీలు వెంటనే విశ్రాంతి తీసుకుంటూ కనురెప్పలపై దోసకాయ ముక్కల్ని చక్రాలుగా కోసి కాసేపు వుంచుకోవడం మంచిది. దీనివలన కళ్ళు మంటలు తగ్గుతాయి. స్త్రీలు ఇంట్లో శ్రమించినా ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం పూట తేలిక వ్యాయామం చేయడం చాలా అవసరం.

ప్రశాంతంగా ధ్యానం: జాగింగ్, వాకింగ్, సిటప్స్. స్టమక్ ఎక్సర్‌సైజ్‌లు, షోల్డర్ ఎక్సర్‌సైజ్‌లు, బాక్‌బోన్ నెక్ ఎక్సర్‌సైజులు స్త్రీలు గాఢంగా ఊపిరి పీల్చుతూ, మెల్లగా వదులుతూ చేయాలి. ప్రతిరోజూ కాసేపు నిర్మలంగా కూర్చుని ధ్యానం చేయడం కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మహిళలు శరీర సౌందర్యాన్ని పెంపొందించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే అందంగానే కాక ఆరోగ్యంగాను ఉంటారంటున్నారు ఆరోగ్యనిపుణలు. దీంతో మీ శరీర రంగులో మార్పులు సంభవించి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

పొడిచర్మం కలవారికి: పొడిబారిన చర్మం కలవారు అరటిపండు, తేనె మరియు పెరుగును కలిపిన పేస్ట్‌ను ముఖానికి పూసి 15 నిమిషాలపాటు ఉంచండి. చర్మం గతంలోకన్నా మెరుగ్గా తయారవుతుందంటున్నారు బ్యుటీషియన్లు.

మీ ముఖం ఆయిలీ స్కిన్ అయితే విటమిన్ సి (పుల్లటి పండ్లు) కలిగిన పండ్ల గుజ్జును ముఖానికి పూస్త్తే ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలుంటే వాటిని తొలగించేందుకు ఒక చెంచా పసుపును పాలలోకాని లేదా నీటిలోకాని కలపి సేవించండి. దీంతో మీ ముఖంపై మచ్చలు మటుమాయం అంటున్నారు ఆరోగ్యనిపుణులు.
కొబ్బరి నీళ్లతో ఫలితం: శరీరంలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటే పిగ్మెంటేషన్ లేదా చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి గాను ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు సేవిస్తుంటే ఫలితం ఉంటుంది.
వంటింట్లో సౌందర్య సాధనాలు: ముఖ సౌందర్యం కోసం వంటింట్లోనే బోలెడు చిట్కాలా? అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమేనండి. సహజంగా ఉండే మన ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మన వంటింట్లో ఉండే దినుసులే మన అందాన్ని మెరుగులు దిద్దడానికి తోడ్పడతాయి.

చర్మంపై ఎక్కువగా కనిపించే సమస్య మృతకణాలు. ఇవి పేరుకుంటే చూడడానికి ముఖం కాస్త జిడ్డుగా, మురికిపట్టినట్టుగా ఉంటుంది. ఇలాంటప్పుడు ముఖానికి చక్కటి ఫేషియల్ చేయించుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. కానీ ఇలాంటి ఫేషియల్‌ను వేసుకోవడానికి బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ప్రయత్నించండి.

వంటసోడాతో: వంటసోడాలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా రుద్దిచూడండి. కొద్దిసేపటికి చర్మంపై మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది. అలాగే అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్‌ను ముఖంపై రుద్దిచూడండి. దీనివల్ల కూడా మౄఎతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తూ ఉంటుంది.

ఆలివ్ ఆయిల్‌తో: అలాగే ఆలివ్ ఆయిల్‌లో కొద్దిగా కాఫీ గింజల పొడి వేసి దాన్ని ముఖంపై రుద్దినా కూడా మృతకణాలు తొలగిపోతాయి. అలాగే బొప్పాయి, అరటిపండు గుజ్జు రుద్దినా, లేదా కొద్దిగా తేనె, పెరుగు కలిపి రుద్దినా ముఖంపైని మృతకణాలు తొలగిపోయిన చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. ముఖం, శరీరం నిగనిగలాడుతూ ఉండాలంటే ప్రతిరోజు ఉసిరికాయ తినాలి. ఉసిరిక శరీరానికి నునుపు మాత్రమే కాదు మెరుపు కూడా ఇస్తుంది.

* చర్మం చిట్లి బిరుసెక్కినట్లుగా ఉంటే శరీరానికి పెరుగు రాసి, అరగంట ఆగిస్నానం చేయండి. ఆ భాద నుండి విముక్తి కలుగుతుంది.
* చర్మం మీది ముడతలు పోవాలంటే కొద్ది రోజులపాటు ప్రతిరోజూ ఉదయం
చేమంతి పూవులతో సున్నితంగా మర్థన చేయాలి.
* జుట్టు నిగనిగలాడుతూ మెరవాలంటే కోడిగ్రుడ్డులో సోనను మరియు అరటి పండును బాగా కలిపి, ఆ పేస్టును పావుగంట ఆగి శుభ్రంగా తలస్నానం చేయాలి.

No comments:

Post a Comment