WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 28 November 2015

SYMPTOMS OF BRAIN STROKE - TYPES OF BRAIN STROKE - PRECAUTIONS TO BE TAKEN - DOCTORS ADVISE


రక్తనాళంలో కలిగిన అవరోధం కలిగినప్పుడు స్ట్రోక్ అని పిలువుబడుతుంది.ఆకాల మరణాలకు స్ట్రోక్ మరణం మూడవ ప్రధాన కారణంగా ఉంటుంది. దీనికి సత్వర చికిత్స అందించకుంటే మెదడులో కణాలు త్వరగా నిర్వీర్యం అవటం ప్రారంభిస్తాయి. ఈ స్ట్రోక్ లక్షణాలు కలిగి ఉంటే, ఆలస్యం లేకుండా అత్యవసర వైద్యసహాయాన్ని తీసుకువటం ఉత్తమం.

లక్షణాలు అకస్మాత్తుగా ఒకవైపు శరీరం మొద్దుబారుట లేదా శరీరంలో బలహీనత ఏర్పడుట.
ఈ లక్షణాలు సంభవిస్తే అత్యవసర వైద్య సదుపాయాన్ని సంప్రదించడం అవసరం.
స్ట్రోక్ పరీక్ష : స్ట్రోక్ అని అనుమాన కలిగినప్పుడు ఈ చిన్న పాటి పరీక్ష దీనిని నిర్థారించాటానికి ఉపయోగపడగలదు.
1. ముఖంపై చిరునవ్వుకు ప్రయత్నించడం, దీనిద్వారా ముఖంలో ఒకవైపు ముఖంలో నవ్వు కనబడక శుష్కించుకు ఉండటం.
2. రెండు చేతులు పైకి ఎత్తడం. ఒకవైళ ఒకవైపు చేయి పైకి లేపలేకపోవడం
3. ఒక వాక్యాన్ని చెప్పడం. ఈ ప్రయత్నంలో పదాలు సక్రమంగా పలకలేకపోవడం ఇందులో ఏ ఒక్క కారణం కనిపించినా, పరిస్థితి తీవ్రంగా ఉన్నదని భావించి వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రయత్నించాలి.

స్ట్రోక్ సంభవించినప్పుడు ప్రతి నిమిషం చాలా విలువైనది. మెదడులో ఆక్సిజన్ క్షీణిస్తున్నప్పుడు క్రమక్రమంగా కణాలు మరణించడం అరంభమవుతాయి. కణాల రక్తం గడ్డల ను కరిగించేందుకు మందులు ఉన్నాయి. కానీ ఈ మందులు స్ట్రోక్ సంభవించిన మూడు గంటల లోపు వాడాలి. ఒక్కసారి మెదడులో ఒక్కకణం మరణించినచో ఆ కణానికి సంబం ధించిన అవయవాలు పని చేయటం ఆగిపోతాయి. దీనితో దీర్ఘకాలిక అంగవైకల్యం సంభవించే అవకాశం ఉంది. స్ట్రోక్ లక్షణాలు ఎవరికైనా వచ్చినప్పుడు ముందుగా ఎటువంటి స్ట్రోక్‌కు గురయ్యారు అనేది నిర్థారించాలి. స్ట్రోక్‌లలో రెండు విధాలు కలుగుతాయి. వీటిని ఒకే విధంగా చికిత్స అందించలేము. సిటిస్కాన్ ద్వారా స్ట్రోక్ రక్తనాళాలు బ్లాక్ అవటం వలన లేదా రక్తనాళాలు చిట్లడం వలన సంభవించిందా అనేది కనుగొవచ్చు. ఇతర పరీక్షల ద్వారా ఈ డామేజ్ శరీరంలో ఏ ప్రాంతంలో జరిగింది. అనేది గుర్తించవచ్చు.

ఇస్కామిక్ స్ట్రోక్ : సంభవించే స్ట్రోక్‌లలో ఇది ప్రధానమైనది. ప్రతి 10 స్ట్రోక్‌లలో 9 ఈ విధమైన స్ట్రోక్ కిందికే వస్తున్నట్లు గుర్తించారు. ఇందులో మెదడు లోపల రక్తపు గడ్డ మెదడుకు రక్త సరఫరాకు అంతరాయం కల్పిస్తుంది. ఈ రక్తపు ముద్ద అక్కడే ఏర్పడవచ్చు. లేదా శరీరంలో ప్రయాణించి ఒక క్టిష్టమైన ప్రదేశానికి వచ్చి అడ్డు పడవచ్చు.

రక్తస్రావ కారక స్ట్రోక్ : ఈ రక్త స్రావ కారక స్ట్రోక్ సాధారణంగా తక్కువ వ్యక్తులలో సంభవిస్తుంది. కానీ ప్రమాదకరమైనది. మెదడులోని బలహీన రక్తనాళం పగిలిపోయినప్పడు ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. దీని కారణంగా మెడడులో రక్తం ప్రవహిస్తూ నివారణ చేయలేకపోయే సందర్భాలు కలటవచ్చు.

మీనిస్ట్రోక్: మెదడుకు రక్తం ప్రవహించే నాళాలు తాత్కాలికంగా మూసుకుపోయి. తరువాత తిరిగి రక్త ప్రవాహం పునరుద్ధరించబడుతుంది. దీనిని మీనిస్ట్రోక్ అంటారు. ఈ లక్షణాలు మీకు కలిగితే వెంటనే వైద్యుని సంప్రదించడం అవసరం. ఈ స్ట్రోక్‌ను నివారించుటకు సరి అయిన వైద్య సదుపాయాలు కలవు.

స్ట్రోక్ కలగటానికి కారణాలు : కోవ్వు ,కొలేస్ట్రాల్ , కాల్షియం ఇతర పదార్థాలు రక్త ప్రవాహం కలిగే నాళాలలో ఫలకు లాగా ఏర్పడి రక్త ప్రవాహన్ని అడ్డుకుంటాయి. దీని మూలంగా కాల క్రమేణా ఫలకం పరిణామం పెరిగి రక్తపు ముద్దల మాదిరిగా ఏర్పడాతాయి. ఈ గడ్డకట్టిన రక్తపు ముద్దనాళంలో ఒక సంకుచిత స్థానంలో చిక్కుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డు తగిలి స్ట్రోక్ ఏర్పడేందుకు కారణమవుతుంది. ఇదే రక్తపు గడ్డ అడ్డు పటడం మూలంగా రక్త ప్రవాహం ధాటికి రక్త నాళాలు చిట్లిపోయి స్ట్రోక్‌కు కూడా కారణమవుతుంది.

నష్టకారకాలు : కొన్ని తీవ్ర పరిస్థితుల వలన స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. వాటిలో 1. అధిక రక్తపోటు, 2. అధిక మద్యపాన సేనన, 3.మధుమేహ వ్యాధి, 4. స్థూలకాయత, 5. ధూమాపానం, 6. వ్యాయామం చేయలేకపోవటం, 7. అధికంగా కొవ్వు, కొలేస్ట్రాల్ ఉన్న వంటకాలను తినడం, 8 ఉప్పును అధికంగా సేవించడం తద్వారా రక్తపోటు పెరగడం. వీటిని నియంత్రించడం వలన గుండె పోటును నివారించవచ్చు. కొన్ని కారణాలు స్ట్రోక్ రావడాన్ని నివారించలేవు. వీటిలో వయస్సు మీదపడటం , వంశపారంపరిక స్ట్రోక్ లక్షణాలు వంటివి అనివార్య కారణాలు . అలానే పురుషులలో ఎక్కువ శాతం స్ట్రోక్ కలిగే అవకాశం ఉంది. కానీ స్ట్రోక్ కారణంగా మరణాలు మహిళలో అధికశాతం కలగటం గమనించవచ్చు.

No comments:

Post a Comment