WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 28 November 2015

KARTHIKA MASAM SIVA PUJA INFORMATION - SIVA SHADKSHARA STHOTRAM


మన్మథుని బూడిద చేసిన పరమశివుడు పార్వతిపై అనురాగాన్ని పెంచుకొని శివకుమారోదయానికి సుముఖత వెల్లడించాడు. శివకుమారుడు తన సేనతో వెళ్లి ముల్లోకాలను గడగడలాడించే తారకాసురుని సంహరించాడు.
ఏ ఆయుధం చేతకూడా మరణించకూడదనే వరాన్ని సంపాదించి లోకాలన్నింటినీ అతలాకుతలం చేస్తూ త్రిపురాసురులు నానాహింసచేస్తుంటే పరమశివుడే తరలివచ్చి సునాయాసంగా త్రిపురులను సంహరించాడు.
దేవదానవులు కలసి అమృతోత్పాదన చేద్దామన్న సంకల్పంతో మేరువు కవ్వంగా చేసుకొని క్షీరసాగరాన్ని మధిస్తున్న సమయంలో హాలాహలం పుట్టి లోకాలన్నింటా చిమ్మచీకటిని ఆవరింపచేస్తుంటే పరమశివుడే పూనుకొని ఆ హలాహలాన్నంతా తన కంఠాన పట్టిఉంచాడు. ఇట్లాంటి పరమశివుడు పరమదయాళువు భోళాశంకరుడు. ఓమ్ నమశ్శివాయ అంటే చాలు కొద్దినీళ్లను తలపై పోస్తే చాలు అమితంగా ఆనందపడి వరాలను కురిపించేకైలాసవాసుణ్ణి కొలవడానికి కార్తికం అత్యంత పవిత్రమైంది.
తెల్లవారు జామునే స్నానమాచరించాలి. వేడి నీటి స్నానం చేయరాదు. పగలు నిద్ర పోకూడదు. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల పిండితో, స్ర్తిలు తులసి చెట్టు మొదల్లోని మృత్తిక (మట్టిని) పూసుకొని స్నానమాచరించాలి. ‘తులరాశింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని పర్వత ద్రవ రూపేణ సానం పూర్భావేత్తదా’ అనే శ్లోకం పఠిస్తూ స్నానమాచరించాలి. ఇవన్నీ కార్తిక మాసంలో చేయాల్సిన విధులు.
శ్రీమహావిష్ణువు కృష్ణుడై పుట్టిన నాటినుంచి రాక్షస సంహారం చేస్తూ శిష్టులను తన భక్తులను కాపాడుతున్న కృష్ణుణ్ణి ‘కార్తిక దామోదరుడు’ అన్న పేరుతో కార్తికంలో స్మరిస్తే చాలు అనుకొన్న కోరికలన్నీ ఈడేరుతాయ. పరమశివుని ధ్యానంలో శ్రీమన్నారాయణుడు, నారాయణుని ధ్యానంలో పరమశివుడు ఉంటాడన్న విషయానికి తార్కాణంగా దామోదర ప్రీత్యర్థం అంటూ దీపాలను వెలిగిస్తారు. దీపాలు, వస్త్రాలు, ఇలా దేనినైనా దానం ఇవ్వడం వలన అధికమైన పుణ్యాన్ని అటుశివుడు ఇటు విష్ణువు అనుగ్రహిస్తారు. ప్రతి ఇంట్లో ఉంటే తులసి కోట ముందు రోజు చేసే దీపారాధన కార్తికంలో మరింత పుణ్యాన్నిస్తుంది. తులసీ వనంలో ఐదు పద్మాలను రచించి వాటిమీద దీపంప్రజ్వలనం చేసినవారికి ఇహపరాల్లో సంపదకు కొదువవుండదు.
ఈ మాసంలో ప్రత్యేకంగా శ్రీమన్నారాయణుని తులసీ దళాలు, జాజిపువ్వులతో పూజించాలి. పరమశివుడిని జిల్లేడు పూవులు, మారేడు దళాలతో పూజించాలి. సాలగ్రామాన్ని గంథంతో గరికతో, కుశలతోపూజించాలి. ఇలా చేసినవారు పాప విముక్తులౌతారు అంటుంది కార్తిక పురాణం.
పరమశివునకు పంచామృతములతో అభిషేకము చేసినట్లయతే అశ్వమేధ యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. కార్తిక మాస నియమ నిష్టలు ఆచరించినవారికి అటు శారీరక ఆరోగ్యం, ఇటు పుణ్యము రావడమే కాదు మానసిక వికాసంకలుగుతుంది. కార్తిక పున్నమినాడు మూడువందల అరవైవత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. జ్వాలతోరణాన్ని నిర్వహిస్తారు. త్రిపురసంహారిని స్మరించడం కూడా జన్మరాహిత్యాన్ని కలిగిస్తాయ.
ఈ కార్తికమాసమంతా శివకేశవుల అభిషేకాలు, అర్చనలు, వ్రతాలు, దీపదానములు, కార్తిక పురాణ పఠనంతో గృహాలు, దేవాలయాలు కళకళలాడుతూ వుంటాయి. ఆవునేతితోవెలిగించిన దీపాలను దానం చేసిన వారికి జన్మజన్మల పాపాలు నశిస్తాయ. దీపదానం వల్ల యజ్ఞం చేసినంత ఫలమూ వస్తుంది.
సంవత్సరమంతా కూడా శివుని స్మరించనివారు, దేవాలయదర్శనం చేయనివారు, అపనిందలువేసేవారు, అబద్దాలు ఆడేవారు సైతం ఈ కార్తికంలో దీపదానం చేయడం, దీపం వెలిగించడం వల్ల అజ్ఞానం నశించి పరమశివుని అనుగ్రహం లభించి ఇక నుంచి వారు జ్ఞానవంతులు అయ్యే అవకాశం ఉంది. సర్వాధికారి సర్వవ్యాపి అయన భగవంతుని గూర్చి ఎరుకను తెలుసుకొనే నైపుణ్యవంతులు కూడా అవుతారు.

No comments:

Post a Comment