WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 2 September 2014

LORD SRI RAMA'S ELDER SISTER NAME IS SANTHA



శ్రీరాముడికి కేవలం ముగ్గురు సోదరులు మాత్రమే ఉన్నట్టు ప్రతి ఒక్కరూ రామాయణంలో చదివే ఉంటారు. వారే లక్ష్మణ, భరత, శత్రుఘు్నలు. అయి తే, శ్రీరాముడికి శాం తా అనే సోదరి కూడా ఉన్నట్టు ఆధారం కూ డా ఉంది. ఈమె ఈ ముగ్గురు కంటే పెద్ద ది. దశరథ మహారా జు, కౌసల్యల కుమా ర్తె అయిన శాంతను రోమపాదుడు, వర్షిణి దంపతులు దత్తత తీ సుకున్నారు. ఆతర్వా త ఆమెఋష్యశృం గుడు వివాహం చేసు కుంది.దశరథ - కౌసల్య పుత్రిక అయిన శాం తను పిల్లలు లేని అంగదేశానికి చెందిన రాజు రోమ పాదుడు, వర్షిణిలు దత్తత తీసుకోవడం వెనుక చిన్నపాటి కారణం కూడా ఉంది. అయో ధ్యలో ఉన్న సమయంలో దరశరథ మహారాజు వద్ద వర్షిణి సంభాషిస్తూ.. శాంతను తమ కు దత్తత ఇవ్వాలని మాట వరుసకు కోరిందట. ఆ వెనువెంటనే మహారాజు ఏమాత్రం ఆ లోచన చేయకుండా వర్షిణి కోర్కెను సమ్మతించారు.

తాను ఇచ్చిన మాటకు కట్టుబడిన రఘుకులవంశ రాజు తన కుమార్తె శాంతను వారికి అప్పగించారు. ఆ తర్వాత ఆమె ఋష్యశృంగుడిని వివాహం చేసుకుని అంగదేశపు రాణి అయ్యింది. ఎంతో అందమైన శాంత వేదాలతో పాటు కళలు, చిత్రకళల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఐతే శాంత పాత్ర గురించి మరికొన్నిచోట్ల మరో రకంగానూ చెప్పబడింది.శ్రీరాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, శాంతా.


No comments:

Post a Comment