WORLD FLAG COUNTER

Flag Counter

Monday 15 September 2014

HUSBAND AND WIFE'S RELATIONSHIP ACCORDING TO HINDU PURANAS


మన భారతదేశ జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం:అరుంధతి-వశిష్ట జంట నక్షత్రాలు

వివాహ మహోత్సవ సంధర్భంలోనే భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారా అన్నట్లుంది ఈ ప్రక్రియ:: ఒక సారి చూడండి.. 

5,000 - 7,000 ఏళ్ళ క్రితమే జంట నక్షత్రాల గురించి మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులకు తెలుసు. అందుకే మన ఆధునిక శాస్త్రజ్ఞులు కనుగొన్న15వ అత్యంతకాంతివంతమైన నక్షత్రాన్ని మన వారు ఎప్పుడోగుర్తించగలిగారు.. మనము దీనినే జ్యేష్టా నక్షత్రం అంటున్నాము... ఇప్పుడు సైన్సు ఇది భూమి కంటే 40,000 రెట్లు పెద్దద(జ్యేష్టమ)ని గుర్తించగలిగింది.. ఈ జంట నక్షత్రాలను అరుంధతి-వశిష్ట నక్షత్రాలు అని పిలుచుకుంటున్నాం.. ఈ జంట నక్షత్రాలను మరింత ముందుకు తీసుకువెళ్ళి మన వివాహంలో ఒక తంతుకు కూడా ముడి పెట్టారు.. మామూలుగా అయితే ఒక గ్రహం వేరొక గ్రహం చుట్టూ మాత్రమే తిరుగుతాయి.. కానీ ఈ జంట నక్షత్రాలు మాత్రం ఒకదానిచుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి.. ఇంకా చెప్పాలంటే దస్తీ బిస్తీ అని తిరుగుతూ ఆడుతూ ఉంటాం చూడండి అలాగన్న మాట.. దీనినే ఒకరకంగా హోమగుండం చుట్టూ ఒకరి వేలు పట్టుకుని మరొకరు తిరిగినట్లుగా చూపుట, వివాహానంతరం ఈ జంట నక్షత్రాలను చూపుటలో భార్యా భర్తల మధ్య సoబంధం ఇలాచూపారేమోనని ఒక అభిప్రాయం.
అయితే 5,000 ఏళ్ళ క్రితమే ఎటువంటి టెలిస్కోప్ లు లేకుండా ఈ నక్షత్రాల భ్రమణ పద్దతులను అధ్యయనం చేయగలిగారంటే నిజంగా అద్బుతమే..

No comments:

Post a Comment