WORLD FLAG COUNTER

Flag Counter

Thursday 18 September 2014

GODDESS SRI ADHIPARASAKTHI PRAYER IN TELUGU


శ్రీ చక్ర సింహాసిని , కటాక్షించు దాక్షాయణి
కారుణ్య రూపిణి మాత భవానీ ,
యెద లోన నెలకొన్న శ్రీ శివానీ ,
శరణం మమ , శరణం మమ 
శరణాగతి నీకే "శ్రీ జననీ "
వేయి నామముల నిను పూజించనా
"అమ్మా ." అని పిలుపున అర్చిన్తునా
అనుదినమూ నిన్నే సేవింతునా
నీ ఆరాధనలో తరియింతునా
చిరునవ్వు లోలికేటి "నీ ప్రియ వదనం"
అభయమ్ము లిచ్చేటి "అమృత హస్తం"
ఎంత చూసినా తనివి తీరనీ మంగళ రూపమ్ ,
నే మోకరిల్లి చేతునా :"అభివందనం"
నీ పాదాలపై మెరియు పూ మాల గానో
నీ చెంత వెలిగేటి ఓ జ్యోతి గానో
నీ కోసమై కరుగు కర్పూర మల్లెనో
ఒక చిన్ని భాగ్యం నా కీయవమ్మా
నీ సేవలో నాకు ముక్తి నీయమ్మా
"అమ్మకు" అక్షర సుమాంజలి "

No comments:

Post a Comment