WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 25 March 2014

HEALTHY ADVANTAGES OF EATING CURD DAILY - NUTRITIOUS BENEFITS WITH CURD - TELUGU ARTICLE ON CURD



* 4,500 సంవత్సరాల నుండి ప్రజలు పెరుగును-తయారుచేసి-తింటున్నారు.నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ ఆహారపదార్ధం.ఇది ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలున్న ఒక పోషకాహారం.
* ఇది ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలను కలిగి ఉంది. పెరుగును యోగర్ట్ అని అంటారు .

* కొవ్వు తక్కువగా ఉండే పెరుగు లో లాక్తోబసిల్లై అధికం గా ఉంటాయి ,ఇవి మన పేగుల్లో సహజము గా ఉండే సూక్ష్మ జీవులు. ఇవి ప్రమాదకర బాక్టీరియాను సంహరిస్తాయి .
* పెరుగు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది .

* పాలలో కన్నా పుల్లటి పెరుగు లో కాల్సియం శాతం ఎక్కువ . కప్పు(250mg) పెరుగు లో370 mg కాల్సిం ఉంటుంది.

* విటమిన్ బి , పాస్ఫరస్ , పొటాసియం , మాంసకృత్తులు సంవృద్ధి గా ఉంటాయి .

* పుల్ల పెరుగు అరటిపండు తో కలిపి తింటే కడుపులో మంట తగ్గుతుంది .

* పుల్లటి పెరుగు మజ్జికలా చేసి జీలకర్ర , కరివేపాకు , చిటికెడు శొంఠి చేర్చి తీసుకుంటే వాంతి , డయేరియా తగ్గును .

* పెరుగు రక్తపోటును తగ్గించును అనే వాదన కుడా ఉన్నది .

* పొట్టచుట్టూ కొవ్వు.. పెరుగుతో తగ్గు కొంతమందికి కమ్మని పెరుగు లేనిదే భోజనం సంపూర్ణం అయినట్టు అనిపించదు. క్రమం తప్పని ఈ పెరుగు వాడకమే బరువు తగ్గడానికి భేషైన మార్గం.

* పెరుగుకి శరీర జీవక్రియలని చురుగ్గా ఉంచే శక్తి ఉందని అధ్యయనాల్లో తేలింది.

* రోజులో మూడు పూట్లా పెరుగు తినేవారు..శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలని అరవై శాతానికిపైగా తగ్గించుకోవడానికి అవకాశాలున్నాయి.

* అంతేకాదు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని ఎనభై శాతం తగ్గించి నాజూగ్గా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే పెరుగు వాడకాన్ని పెంచండి.

No comments:

Post a Comment