WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 22 February 2014

PREGNANCY - NO SLEEP - DEPRESSION PROBLEMS - REMEDIAL MEASURES


గర్బిణీ సమయంలో గురక రావడం సాధారణ విషయం. అలాగని అన్ని వేళల గురక గర్భిణీల లక్షణంగా భావించ కూడదు. ఎందుకంటే గురకకి కడుపులో పెరుగుతున్న బిడ్డకి సంబంధం వున్నట్టుగా తాజా పరిశోధనల్లో గుర్తించారు. అందువల్ల గురక సమస్యగా మారినపుడు గైనకాలజిస్ట్‌తో సంప్రదించడం అవసరం. నిద్రకు గురక సంబంధించిన విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు అతిగా బరువు పెరిగినా, లేదా రక్తహీనత వున్నా, శ్వాసనాళానికి సంబంధించిన సమస్యలు తలెత్తడం వల్ల గురక వస్తుంది. ఈ గురక వల్ల నిద్రకు భంగం కలుగు తుంది. ఇంకా ఇతరత్రా కారణాలవల్ల కూడా గర్భిణీలకు నిద్రపట్టని స్థితి వుంటుంది. అందువల్ల గర్భిణీ మహిళలకు నిద్రపట్టడం సమస్యగా మారినపుడు వైద్యులను సంప్రదించడం అవసరం.

గర్భిణీ సమయంలో డిప్రెషన్‌ :

గర్భిణీ స్త్రీలకు నిద్రపట్టకుండా చేసేవాటిలో డిప్రెషన్‌ కూడా ఒక ప్రధాన కారణం. సాధారణంగా గర్భంతో వున్న మహిళల్లో వచ్చే రసాయనిక మార్పులు కారణంగా 13శాతం మంది డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం వున్నట్లు నిపుణులు నిర్దారించారు. గర్భిణీలలో ఐరన్‌ లోపం ఏర్పడటం సహజం. అయితే ఐరన్‌కు, మెదడుకు చాలా అవినాభావ సంబంధం వుంది. ఐరన్‌ లోపం మెదడులో తయారయ్యే అత్యంత కీలకమైన డొఫమైన్‌ అనే రసాయనికంపై ప్రభావం చూపిస్తుంది. దాంతో మూడ్‌ డిసార్డర్‌ ఏర్పడి, డిప్రెషన్‌కు గురవుతారు. గర్భిణీలు డిప్రెషన్‌కు గురికావడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవించడం లేదా పుట్టే పిల్లలు వుండవలసిన బరువు కంటే తక్కువగా వుండటం జరుగుతుంది. గర్భిణీ సమయంలో డిప్రెషన్‌ నివారించకపోతే ఆ ప్రభావం పుట్టబోయే పిల్లలపై కూడా పడుతుంది.

సాధారణంగా డిప్రెషన్‌ నివారణకు వినియోగించే అన్ని రకాల మందులు గర్భిణీలకు వినియోగించకూడదు. ఈ మందులు గర్భిణీలకే కాకుండా పుట్టబోయే పిల్లలపై కూడా దుష్ప్రభావం చూపిస్తాయి. హాయిగా నిద్ర పట్టడానికి వారికి అను కూలంగా వుండే దిండ్లు, పరుపు ఉపయోగించాలి. పడుకొనేపక్క సౌకర్యంగా వుండేపక్షంలో నిద్ర పట్టక పోవ డానికి సంబంధించిన అనేక సమ స్యలు తొలగి పోతాయి. వీటన్నింటితో పాటు ప్రధానంగా నిద్రపట్టక పోవడానికి డిప్రెషన్‌ కారణ మని నిర్ధారణకు రావడానికి మందు యాంగ్జయిటీ డిసార్డర్‌ కారణం కాదని నిర్ధారించు కోవాలి. ఎటు వంటి చికిత్స చేయాలన్న గర్భిణీ ఆమోదం తోనే నిర్వహించాల్సి వుంటుంది. అంతే కాకుండా మందులు వాడాల్సి వస్తే వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.

ప్రసవం తరువాత తలెత్తే నిద్రలేమి :

గర్భిణీ స్త్రీలలో ప్రసవం తర్వాత నిద్రపరమైన ఇబ్బందులు పసిపిల్లల సంరక్షణలో భాగంగానే తలెత్తుతాయి. కాని ప్రసవం తర్వాత స్త్రీలలో ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (తీవఎ) దశలో పట్టే నిద్ర తగ్గిపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రసవం తర్వాత డిప్రెషన్‌కు గురయ్యే మహిళల్లో కూడా ఇదే తరహా సమస్య ఎదురౌతుంది. మొత్తం రాత్రి సమయంలో నిద్రపోయే సమయం తగ్గిపోతుంది. ప్రసవం తర్వాత తల్లిగా మారిన మహిళలో మత్తును కలిగించే హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ మార్పులో ప్రొగెస్టోరోన్‌ కీలక పాత్ర వహిస్తుంది. పుట్టిన పిల్ల 12-16 వారాల తర్వాత నుంచి నిద్ర పోవడం ప్రారంభిస్తారు. వారు నిద్రపోవడం ప్రారంభమైన తర్వాత మాత్రమే స్త్రీలలో మత్తును కలిగించే హార్మోన్‌ పూర్తిస్థాయిలో తయారు కావడం ప్రారంభమై వారు సంపూర్ణంగా నిద్రపోయే పరిస్థితి ఏర్పడుతుంది. బహుసా తల్లిబిడ్డ మధ్య వుండే సృష్టి రహస్యం ఇదే కాబోలు. డిప్రెషన్‌ నివారించడం వల్ల కూడా నిద్ర సమస్యను నివారించవచ్చుననే భావన కూడా వుంది. నిజానికి ప్రసవం తరువాత మొదటి నెలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం వుంటుంది. ఈ డిప్రెషన్‌ మూడు నెలల వరకు వుండవచ్చు. సహజంగా తన పాప హాయిగా నిద్రపోతుందని భావించినపుడు మాత్రమే తల్లి నిద్రపోతుంది. అందువల్ల తల్లి మూడ్‌ డిసార్డర్‌ వల్ల కూడా నిద్రకు ఇబ్బంది కలిగే అవకాశం వుంటుంది. బాలింతలు నిద్రపట్టకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇటువంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది.

పాలివ్వడం వల్ల:

బిడ్డకు తన స్తన్యం ద్వారా పాలివ్వడంవల్ల కూడా బిడ్డ తల్లులకు నిద్ర ఇబ్బంది ఏర్పడుతుంది. నిజానికి బిడ్డకు పాలివ్వడం వల్ల తలెత్తే సమస్యపై ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం జరగలేదు. బిడ్డపక్కనే పడుకొని వుండటం వల్ల తన అజాగ్రత్త కారణంగా తన కాలు.. చేయి బిడ్డపై పడి, ఊపిరాడక బిడ్డ చనిపోతుందేమోనన్న భయం కొంతమంది తల్లులకు ఉంటుంది. ఈ భయం వల్ల కూడా తల్లులు సరిగా నిద్రపోలేరు. ఈ భయంతో అతిజాగ్రత్త తీసుకోవడం, అతి జాగ్రత్త వల్ల భయంతో తప్పులు చేయడం, ఆ తప్పులకు బాధపడటం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల పసిపిల్లలను తల్లిపక్కనే పడుకోబెట్టడం కంటే తల్లి పడక పక్కనే ఊయలలో బిడ్డను పడుకోబెట్టడం ద్వారా ఈ భయం కొంత మేరకు నివారించవచ్చు.

తల్లి బిడ్డకు పాలివ్వడం ప్రారంభించిన తర్వాత తల్లిబిడ్డ మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది.ఈ అనుబంధంవల్ల కొంతమందిలో బిడ్డకు హాని కలుగు తుందనే భయం తొలగిపోయే అవకాశం వుంటుంది. అయితే ఈ భయం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం బిడ్డకు పాలిచ్చిన తర్వాత పక్కనే వుండే ఊయలలో పడుకోబెట్టటం ఉత్తమంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


No comments:

Post a Comment