WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 14 January 2014

CULTURAL IMPORTANCE OF SOUTH INDIAN FESTIVAL SANKRANTHI - ARTICLE IN TELUGU ON SANKRANTHI FESTIVAL CELEBRATIONS

సంక్రాంతి సందడులలో భాగంగా పల్లె వాతావరణం జంట సన్నాయిల నాదం మధ్య 
డూడూ బసవన్నల అద్భుత విన్యాసాలతో ,హరిదాసుల హరినామ సంకీర్తనలతో 
వీధులన్నీసందడులతో పల్లెసీమ పండుగ శోభను సంతరించుకుంటుంది


భోగి పండుగ రోజున సాయంత్రం 7 సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పళ్ళు 
పోస్తారు.రేగు పండ్లతో పాటు పూలు ,చెరకు ముక్కలు ,డబ్బుల నాణాలు 
పిల్లల తల పై ధారగా పోస్తారు .ఈ పళ్లలో వున్న గుజ్జు చంద్ర తత్వానికి ,రేగు పండు గింజ భూ తత్వానికి ప్రతీక .సూర్య చంద్రులు ,భూమాత యొక్క శక్తి యుక్తులు పిల్లలకు అందాలనే ఆకాంక్ష ఈ వేడుకలో కన్పిస్తుంది .


సంక్రాంతి పండుగలో మొదటిరోజైన 'భోగి ''రోజున ఇంట్లోని పిల్లలకు ఆరోగ్యాన్ని మేధోశక్తిని ప్రసాదించమని సూర్య భగవానుడిని వేడుకుంటాము తెల్లవారుజామునే పిల్లలందరిని నిద్ర లేపి ఇంటిలోని పనికిరాని వస్తువులను అన్నింటిని కుప్పగా పేర్చి భోగిమంటలు వేస్తారు ...పిల్లలందరూ ఆ మంట చుట్టూ కూర్చుని వెచ్చ 
దనాన్నిపొందుతారు ...ఆ తరువాత తలంటు స్నానాలు చేస్తారు .సూర్య భగవానుడుని ఆరాదిస్తే అందరూ దేవతలను పూజించినట్లేనని ఈ భోగి మంట యొక్క పరమార్దం ..


తల్లి ముగ్గులు పెడుతూ ఆడపిల్లలకు సృజనాత్మకత కళా వైభవాన్ని నేర్పే విధానం 
ఈ పండుగలో మనకు కన్పిస్తుంది .తెలవారుజామునే లేచి మగువలు తీర్చే రంగు రంగుల అందాల ముగ్గులు ,వాటి పై బంతి పూలతో అలంకరించిన గోబ్బెమ్మలు,నవధాన్యాలు,ఆ రంగవల్లుల చుట్టూ తిరుగుతూ ఆనందంగా పాడుకునే గొబ్బిపాటలు ఈ పండుగలో విశేషంగా అందరినీ ఆకర్షిస్తుంది ...

ధనుర్మాసం ప్రారంభమైనప్పటినుండి ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటి ముంగిళ్ళలో రంగవల్లులు వేస్తూ ''నెలపట్టు''పడతారు .కనుము రోజున రథం ముగ్గుతో ఈ 
నెలపట్టు ను విడుస్తారు .ఈ సంప్రదాయం ఈనాటిది కాదు .శ్రీ కృష్ణుని చెల్లెలు 
సుబద్ర ఆనాడే ముగ్గులతో యుద్ద వ్యూహాలను చూపించిందని పురాణ గాధలు 
తెలియచేస్తున్నాయి

సంక్రాంతి పండుగలో బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణ .చుట్టూ ప్రక్కల ఇళ్లలోని ముత్తైదువులను ,ఆత్మీయులను పిలుచుకొని బొమ్మల కొలువును వేడుకగా 
చేసుకుంటారు .చిన్నప్పుడే పిల్లలకు మానవత్వ విలువలతో పాటు పురాణాలను 
సాంప్రదాయాలను తెలియచేసే క్రమంలో ఈ వేడుక జరుపుకుంటారు

No comments:

Post a Comment