WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 18 December 2013

CALCIUM IS ESSENTIAL FOR THE FORMATION AND MAINTENANCE OF BONES AND TEETH - FOOD SOURCES OF CALCIUM INCLUDE DAIRY PRODUCTS, GREEN LEAFY VEGETABLES, AND SALMON AND SARDINES




ఎముకల ధృడత్వానికి, ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అవసరమవుతుంది. చిన్నపిల్లల నుంచి, వృద్ధుల వరకు కాల్షియం ఎంత తీసుకోవాలన్నదీ వైద్య సలహా తీసుకుంటే మంచిది. టీనేజ్‌ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు కాల్షియం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఎముకల సాంద్రత పెరగడానికి తగినంత కాల్షియం కావాలి. కాల్షియం లోపం ఏర్పడితే ఎముకలు అతి త్వరగా విరగడం, ఫెళుసుగా మారటం జరుగుతుంది. అందువల్ల కాల్షియం లభించే పదార్థాలేమిటో తెలుసుకుని, వాటిని తీసుకుంటే శరీరానికి కాల్షియంలోపం ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు. రాజ్‌మా, రాగులు, శనగలు, పెసలు, మినుములు లాంటి గింజ ధాన్యాలలోనూ, ములక్కాడలు. బీన్స్‌, సోయాబీన్‌, మెంతికూర, తోటకూర, పాలకూర, కోతిమీర, కరివేపాకు లాంటి ఆకుకూరలు, తాజా కాయకూరల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. బాదం, ఎండు ద్రాక్ష, వేరుశెనగ కాయలు లాంటి వాటిలోనూ నిలవ పచ్చళ్లు, ఊరగాయలు, ఉప్పు అధికంగా వాడిన ఫాస్ట్‌ఫుడ్స్‌, స్నాక్స్‌ అప్పడాలు, ఒడియాలు లాంటివి తక్కువగా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే, ఆ పదార్ధాల్లో ఉండే సోడియం కాల్షియాన్ని నష్టపరుస్తుంది. నిద్రలేమికి, ఒత్తిడి, ఆందోళన లాంటివి కూడా కాల్షియం స్థాయిని తగ్గిస్తుంది. మెనోపాజ్‌ స్థితికి చేరుకున్న మహిళల్లో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల ఎముకలు త్వరగా విరుగుతాయి. వృద్దాప్యంలో ఉన్నవారు ఆహార పదార్ధాల్లో ఉప్పును తగ్గించి తినడం ద్వారా కాల్షియం లోపాన్ని నివారించవచ్చు. శరీరంలో కాల్షియం స్థాయి తగ్గితే వారిలో రక్తపోటు సమస్య కూడా ఏర్పడవచ్చు కనుక, కాల్షియం, సమృద్ధిగా లభించ టానికి పాలు, పెరుగు తీసుకోవడం మంచిది. చిన్న వయస్సు నుంచే కాల్షియం లభించే పదార్థాలు తీసుకుంటే, వయస్సు పెరుగుతున్నా కాల్షియంలోపం ఏర్పడకుండా ఉంటుంది.


No comments:

Post a Comment