WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 6 July 2016

CHINA WOMEN BEAUTY TIPS WITH RICE WATER - PESALU - GREEN TEA - PUDINA


అందానికి చైనా సూత్రాలు ....!

చైనా అమ్మాయిలు తమ సౌందర్య పోషణకు సహజ సిద్ధమైన పదార్థాలనే ఎక్కువగా వాడతారు. మార్కెట్లలో లభించే రకరకాల క్రీముల కంటే వీటికే ప్రాధాన్యమిస్తారు..

* బియ్యం నీళ్లు: ముఖం అందంగా కనిపించాలంటే.. ముందు అది పరిశుభ్రంగా ఉండాలి. అందుకోసం ఖరీదైన ఉత్పత్తులేవీ వాడరు. బియ్యం నీళ్లనే టోనర్‌గా ఎంచుకుంటారు. అదెలాగంటే పాలిష్‌ చేయని బియ్యాన్ని ముందుగా నీళ్లలో నానబెడతారు. కాసేపటికి నీళ్ల రంగు తెల్లగా పాలలా మారుతుంది. ఆ నీటిలో దూదిని ముంచి తుడుచుకుంటే ముఖం పరిశుభ్రంగా... ప్రకాశవంతంగా తయారౌతుంది.

* పెసలు: వీటిని కొన్ని శతాబ్దాలుగా ముఖానికి పూతలా వాడుతున్నారు చైనీయులు. బాగా నానబెట్టిన పెసల్ని మెత్తగా రుబ్బి ముఖానికి పూతలా వేసుకుంటారు. అరగంటయ్యాక కడిగేసుకుంటారు. ముఖం నిగారింపు సంతరించుకోవడమే కాదు, మొటిమలు కూడా తగ్గుతాయి.

* గ్రీన్‌ టీ: దీన్ని చర్మ, కేశసంరక్షణకు మాత్రమే కాదు... పొద్దునే లేచి మూడు, నాలుగుకప్పులు తాగేస్తారు.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వార్థక్యపు ఛాయల్ని నివారిస్తాయి. జీవక్రియల వేగాన్నీ పెంచుతాయి.

* మర్దన: మనం మర్దనని కేవలం విశ్రాంతికీ, ఒత్తిడి నివారణ కోసమనే అనుకుంటాం. కానీ చైనీయులు మాత్రం మర్దన వల్ల శరీరానికి రక్తప్రసరణ సజావుగా సాగుతుందనీ, శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయనీ భావిస్తారు. అందుకే తరచూ మర్దనకు ప్రాధాన్యం ఇస్తారు.

* పుదీనా: చైనా అమ్మాయిల అందానికి కారణం పుదీనానే. వీరు గుప్పెడు పుదీనా ఆకుల్ని ముద్దలా చేసి ముఖానికి రాసుకుంటారు. కాసేపయ్యాక కడిగేస్తారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తారు.
పసుపు: మన దేశంలో సౌందర్య సంరక్షణలో ఎక్కువగా పసుపు వాడుతుంటాం. చైనీయులు కూడా దీనికి అంతే ప్రాధాన్యం ఇస్తారు. చర్మంపై ముడతల్ని నివారించేందుకు, శరీరఛాయను మెరుగుపరిచేందుకు పసుపును ఎంచుకుంటారు. రెండు చెంచాల పసుపులో చెంచా తేనె, కాసిని బాదం పాలు చేర్చి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటారు. పదిహేను నిమిషాల తరవాత కడిగేస్తారు. ఇలాంటి చిన్నచిన్న చర్యల ద్వారానే వారు తమ చర్మ సౌందర్యాన్ని పెంచుకుంటారు.

No comments:

Post a Comment