WORLD FLAG COUNTER

Flag Counter

Sunday 22 February 2015

GREAT INDIAN TEMPLES - THIRUKKARA KUNDRAM AS PAKSHI THIRDHAM


తిరుక్కుర కుండ్రం "పక్షితీర్థం" అయ్యిందిలా

సరిగ్గా మధ్యాహ్నంపూట 12 గంటలకు ఒక పదిహేను నిమిషాలు ముందుగా ఒక అర్చకుడు చిన్న బిందె నిండుగా పరమాన్నం పట్టుకుని వస్తాడు. ఆలయానికి ఆనుకుని ఉండే దడి అవతల ఉండే విశాలమైన ఖాళీ స్థలం మధ్యలో తన పక్కన బిందె పెట్టుకుని కూర్చుంటాడు. పైన ఆకాశంలో కొన్ని పక్షులు ఎగురుతూ ఉంటాయి.

అర్చకుడు అవేమీ పట్టించుకోకుండా బిందెమీద ఉంచిన పళ్లాన్ని చేతిలోకి తీసుకుని చిన్న గరిటెతో శబ్దం చేస్తూ కూర్చుంటాడు. అంతే పై నుంచి రెండు పక్షులు వచ్చి ఆయన పక్కన వాలతాయి. ఆయన బిందెలో ఉన్న పరమాన్నంలోంచి రెండు టీస్పూన్లతోనూ తీసి ఆ పక్షుల ముందు ఉంచుతాడు. అవి ఆ పరమాన్నంలో రెండు, మూడుసార్లు ముక్కు ముంచి వెళ్లిపోతాయి.

అందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా...? ఇందులోనే అసలు విశేషమంతా ఉంది మరి. పైన చెప్పుకున్న పక్షులు కాశీ, రామేశ్వరం యాత్ర చేస్తూ, మధ్యలో పూజారి ఇచ్చిన పరమాన్నం రుచిచూసిన ప్రాంతంలో ఆగుతాయని అక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతం "పక్షితీర్థం"గా ప్రసిద్ధిగాంచింది.

ఈ పక్షితీర్థం చెన్నయ్ నగరానికి దక్షిణంగా చెంగల్పట్టు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వెళ్లే దారిలో ఉంటుంది. నిజానికి ఈ ఊరి అసలుపేరు "తిరుక్కుర కుండ్రం". ఇక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంటుందన్న విషయమే చాలా మందికి తెలియదు. ఈ ఆలయం ప్రాంగణంలోపల పెద్ద పుష్కరిణి కూడా ఉంటుంది.

ఈ ఆలయంలోని స్వామి పేరు "భక్తవత్సలేశ్వరుడు", అమ్మవారి పేరు "త్రిపురసుందరి". ఈ ఆలయంలోని శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. పక్షితీర్థం సందర్శించే యాత్రికులు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా చూసి తరించాల్సిందే. అదలా ఉంచితే... మహాబలిపురం సందర్శించేవారుగానీ, చెంగల్పట్టు నుంచి నేరుగా వచ్చేవారుగానీ ఉదయం 11 గంటలలోపు ఈ పక్షితీర్థానికి చేరుకోవాల్సి ఉంటుంది.

పక్షితీర్థం ఊరి మధ్యలో ఉన్న మెయిన్‌రోడ్డును ఆనుకుని ఒక కొండ ఉంటుంది. ఈ కొండమీదకే పక్షులు వస్తుంటాయి. సుమారు 500 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండను వేదగిరి అని పిలుస్తుంటారు. కొండమీద వేదగిరీశ్వరాలయం అనే పేరుతో ఒక శివాలయం ఉంటుంది. కాగా.. ఇక్కడి అమ్మవారిని చుక్కాలమ్మగా స్థానికులు కొలుస్తుంటారు.

వేదగిరిపైన వేదగిరీశ్వరాలయం మినహా మరేమీ ఉండదు. ఈ ఆలయాన్ని పదిగంటల తరువాత తెరుస్తారు. ఇక్కడి స్వామివారికి, అమ్మవారికి నిత్యపూజలు అయిన తరువాతే అర్చకుడు ప్రసాదాన్ని బిందె నిండా నింపుకుని గుడికి ఆనుకుని ఉండే దడికి అవతల కూర్చుని, పై నుంచి వచ్చే రెండు పక్షులకూ ప్రసాదాన్ని ఇచ్చే దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు, భక్తులు దడికి అవతల నిలబడి తదేకంగా చూస్తూంటారు. పక్షులు ప్రసాదాన్ని తిని వెళ్తున్న దృశ్యాన్ని కళ్లారా చూసిన వారు దేవుడి మహిమవల్లనే ఇలా జరుగుతోందంటూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో కీర్తిస్తారు.

రెండు పక్షులు వచ్చి ప్రసాదాన్ని తిని వెళ్లిన తరువాత.. ఆ అర్చకుడు ఆ ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు, సందర్శకులకు ఒక్కో టీస్పూన్ చొప్పున 5 రూపాయల రుసుమును వసూలు చేసి మరీ పంచుతాడు. అయితే ఆ పక్షులు ప్రతిరోజూ సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకే వస్తాయని చెప్పలేం. ఒక్కోరోజు అసలు రాకపోవచ్చును కూడా..! కాబట్టి పక్షితీర్థం వెళ్లదల్చుకునేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకుని వెళ్ళాల్సి ఉంటుంది.



ARTICLE IN TELUGU ABOUT THE GREAT TEMPLE IN TAMILNADU - PAKSHITHEERDHAM


పక్షితీర్థం

పక్షితీర్థం తమిళనాడు కు చెందిన ఒక పుణ్యక్షేత్రం. ఇది చెంగల్పట్టు నందు కలదు. ఇక్కడ గల కొండపైకి ప్రతి రోజు రెండు పక్షులు వచ్చి ప్రసాదాన్ని తిని వెళుతుంటాయి.

* స్థల పురాణం

కృత యుగములో ఒకసారి సర్వ సంగ పరిత్యాగులైన ఎనిమిది మంది మహామునులకు ప్రపంచ భోగములను అనుభవించవలెననే కోరిక కలిగింది. ఇక్కడ వెలసిన కొండపై తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. వారు నిజము చెప్పడానికి తటపటాయిస్తూ మాకు మీ సేవయే కావాల న్నారు. కానీ శివుడు వారి మనసులందు కోరిక గమనించి ఎనిమిది మందినీ ఎనిమిది పక్షులై జన్మించ మన్నాడు. ఒక్కొక్క యుగము నందు ఇద్దరు రెండు పక్షాల చొప్పున ప్రతి రోజూ గంగా స్నానము ఆచరించి తన ప్రసాదాన్ని తినిపోతూ ఉండమన్నాడు.ఆ తరువాత జన్మమున మోక్షం పొందగలరని చెప్పి అదృశ్యం అయ్యాడు.

అలా శంకరునిచే ఆజ్ఞాపించబడిన పక్షులే కృతయుగంలో పూష విధాతల పేరుగల పక్షులయ్యాయి. త్రేతాయుగమున జటాయువు, సంపాతి అనే పక్షులుగా ద్వాపర యుగమున శంభుగుప్త, మహా గుప్తులనే పక్షులయ్యాయి. కలియుగమున శంబర శంబరాదులనే పక్షులై ప్రతి దినము గంగాస్నానము చేసి ఈ కొండపైకి వచ్చి పోతుంటారని స్థల పురాణం చెబుతుంది.

యాత్రికులు ఉదయాన్నే పక్షితీర్థంలో స్నానం చేసి కొండ ఎక్కి స్వామికి పండ్లు, పూలు, కర్పూరం మొదలైనవి సమర్పిస్తారు. దేవాలయ పరివారం ఈ విరాళాలను స్వీకరించి చక్కెర పొంగలి, నేయి పాత్రలను స్వామికి సమర్పించి పూజా కార్యక్రమాలను నెరవేరుస్తారు. తరువాత పూజారులు ఒక పక్క, భక్తులు ఒక పక్క కూర్చుని ఉంటే ఆకాశ మార్గాన రెండు పక్షులు వచ్చి చక్కెర పొంగలి తిని నేతిని తాగేసి పోతుంటాయి. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు.

LORD SRI KRISHNA PRAYER - GOVINDHASTAKAM IN TELUGU


గోవిందాష్టకం 

సత్యం ఙ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ |
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ |
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ || 1 ||
మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ |
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ |
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకమ్ |
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ || 2 ||
త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ |
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ |
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ |
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ || 3 ||
గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ |
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ |
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ |
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 4 ||
గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ |
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ |
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ |
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ || 5 ||
స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ |
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ |
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 6 ||
కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ |
కాళిందీగతకాలియశిరసి సునృత్యంతమ్ ముహురత్యంతమ్ |
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ || 7 ||
బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహమ్ |
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ |
వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ |
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ || 8 ||
గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః |
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః |
గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ||

Friday 20 February 2015

SHAVING TIPS TO MEN - BEAUTY TIPS TO MEN IN TELUGU


షేవింగ్ తర్వాత గడ్డం రఫ్ గా మారిందా ?

 
1) పురుషులలో చర్మం షేవింగ్ తర్వాత రఫ్ గా మారిపోతుంది. అలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుంది.

2) షేవింగ్ చేసుకొనేటప్పుడు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ డెటాల్ కలిపి ఉపయోగించాలి. దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ కాదు. కురుపులు లాంటివి రావు.

3) రఫ్ స్కిన్ పోవాలంటే ఒక టమాటో సగం తీసుకొని గడ్డం మొత్తం రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ పోతుంది. స్కిన్ మృదువుగా అవుతుంది.

4) లేదంటే కలబంద గుజ్జులో రోజ్ వాటర్ కలిపి గడ్డం మొత్తం మసాజ్ చేసుకోవాలి. 20 మినిట్స్ వెయిట్ చేసి శుభ్రం చేసుకోవాలి.

5) పొడి చర్మం ఉన్నవారు కొంచెం కొబ్బరి నూనె లేదా బాదాం నూనె వేడి చేసి గడ్డం మొత్తం మసాజ్ చేసుకోవాలి.

6) పాలలో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి తరచుగా మసాజ్ చేస్తే గడ్డం దగ్గర నలుపు పోతుంది.

Thursday 5 February 2015

ARTICLE ON TELUGU BLOCK BUSTER OLD MOVIE - MALLESWARI AND ITS CINEMA NEWS IN TELUGU


మనసున మల్లెల మాలలూగెనే' (మల్లీశ్వరి)

ఆనాటి సినిమాలకు ఈనాటి సినిమాలకు ఎంతో తేడా ఉంది. పాత సినిమాల గురించి చెప్పుకోవాలంటే ఎన్నోమంచి చిత్రాలు ఉన్నాయి. ఎప్పటికి గుర్తుండి పోయే మధురమైన ఆణిముత్యం మల్లీశ్వరి. బి.ఎన్.రెడ్డిదర్శకత్వంలో రామారావు, భానుమతిల నటన వెరసి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా రూపుదిద్దుకున్న చిత్రం ఇది. ఈ సినిమా విడుదలై 64ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ నిత్యనూతనంగా, సంగీత సాహిత్యాల అందాల భరిణగా ఉంటుంది. మల్లీశ్వరి... తెలుగు సినీ జగత్తులో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కళాఖండం. దర్శకుడిగా బి.ఎన్. రెడ్డినీ, గేయ రచయితగా కృష్ణశాస్త్రినీ, సంగీత దర్శకుడిగా సాలూరు రాజేశ్వరరావునీ చిరస్మరణీయం చేసిన అజరామర చిత్రం. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై సెట్టింగులు, వస్త్రాలంకరణ పరంగా ప్రఖ్యాత 'మొఘల్-ఎ-ఆజమ్'కు ఏమాత్రం తీసిపోదని విమర్శకుల అభినందనల్ని అందుకున్న ఆణిముత్యం. అందుకే విడుదలై అరవై సంవత్సరాలు దాటినా 'మల్లీశ్వరి' నిత్యనూతనం. మిగతా దర్శకులతో పోలిస్తే బి.ఎన్. రెడ్డి భిన్నంగా కనిపిస్తారు. ఆయన తీసిన ప్రతి చిత్రమూ కళాఖండమన్న పేరు ఆర్జించింది. కేవలం పదకొండు చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. అన్నిట్లోనూ 'మల్లీశ్వరి' పెద్ద ఖ్యాతిని తెచ్చుకుంది.భారతి మాసపత్రిక 1944 మే సంచికలో ప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు రాసిన 'రాయల కరుణకృత్యం' అనే నాటిక ఆ తర్వాత రేడియోలో ప్రసారమైంది. దాన్ని విన్న బి.ఎన్. రెడ్డి దాని ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు. అలాగే ఆ సమయంలోనే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రికలో దివాన్ షరార్ రాసిన 'ది ఎంపరర్ అండ్ ద స్లేవ్ గర్ల్' కథ కూడా ఆయనకు నచ్చింది. ఆ నాటికనూ, ఈ కథనూ మేళవించి ఆయన 'మల్లీశ్వరి' కథను తయారు చేయించారు.

ఈ చిత్ర కథాంశాన్ని ఓసారి మననం చేసుకుందాం. హంపీ విజయనగర సామ్రాజ్యంలోని వీరాపుర గ్రామంలో బావామరదళ్లయిన నాగరాజు, మల్లీశ్వరికి ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆర్థికంగా కాస్త పైచేయి అయిన మల్లి తల్లి నాగమ్మకు వారి పెళ్లి ఇష్టంలేదు. దాంతో డబ్బు సంపాదించడానికి నగరానికి వెళ్తాడు నాగరాజు. ఒక వర్షపు రాత్రి సత్రంలో మల్లి నాట్యాన్ని మారువేషంలో తిలకించిన శ్రీకృష్ణదేవరాయలు ఆమె ఇంటికి పల్లకీ పంపించి రాణివాసానికి రప్పిస్తాడు. రాణివాసంలోని స్త్రీలను పరపురుషులెవరూ చూడరాదనేది నియమం. డబ్బు సంపాదించి వచ్చిన నాగరాజుకు మల్లి రాణివాసానికి వెళ్లిపోయిన సంగతి తెలిసి పిచ్చివాడైపోతాడు. ఆమె రూపాన్ని శిల్పాలుగా చెక్కుతాడు. నాగరాజు పనితనం చూసి ఆస్థాన శిల్పాచారి అతణ్ణి నందనోద్యానవనంలో శిల్పాల్ని చెక్కేందుకు నియమిస్తాడు. అనుకోకుండా ఒకరోజు తోటలో కలుసుకున్న నాగరాజు, మల్లి అక్కణ్ణించి పారిపోవాలనుకుంటారు. అదే సమయానికి ఉషా పరిణయం నృత్యగానంలో మల్లి పాల్గొనాల్సి వస్తుంది. సాహసంతో అంతఃపుర ప్రవేశం చేసిన నాగరాజును సైనికులు బంధించి ఖైదుచేస్తారు. విచారణ జరిపిన మహారాజు ప్రేమికులిద్దర్నీ ఒకటిచేసి, వారికి స్వేచ్ఛాజీవితం ప్రసాదిస్తాడు.అందరూ అపురూప తారలే నాగరాజు, మల్లీశ్వరి పాత్రల్లో ఎన్టీ రామారావు, భానుమతి అపూర్వ అభినయం ప్రదర్శించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్రవేశారు. వారి చిన్నప్పటి పాత్రలు వేసింది వెంకటరమణ, మల్లిక. ఈ వెంకటరమణ సుప్రసిద్ధ చిత్రకారుడు, దర్శకుడు బాపుకు స్వయాన బావమరిది. నిజానికి మల్లి పాత్రకు మొదట ఎవరైనా కొత్త తారను తీసుకుందామని రేవతి అనే అమ్మాయిని ఎంపిక చేసుకుని కూడా, బరువైన ఆ పాత్రకి ఆమె న్యాయం చేయలేదని భావించారు బి.ఎన్. అప్పటికే దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందుతున్న భానుమతి వైపు మొగ్గుచూపారు. ఆయన నమ్మకాన్ని భానుమతి ఏ
స్థాయిలో నిలబెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదివరకు 'షావుకారు'లో జానకి తండ్రిగా వేసిన శ్రీవత్స ఇందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో గంభీరంగా నటించారు. మల్లి తండ్రి నారప్పగా దొరస్వామి, మల్లి మావయ్య హనుమంతప్పగా వంగర వెంకటసుబ్బయ్య, మల్లి తల్లి నాగమ్మగా ఋష్యేంద్రమణి, నాగరాజు తల్లి గోవిందమ్మగా వెంకుమాంబ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.

రేడియోలో వచ్చిన 'రాయల కరుణకృత్యం' నాటికలో మల్లీశ్వరిగా నటించిన టి.జి. కమలాదేవి 'మల్లీశ్వరి'లో భానుమతి నెచ్చెలి జలజ పాత్ర చేయడం విశేషం. అప్పట్లో రేడియోలో బాగా పాపులర్ అయిన 'బాలానందం' కార్యక్రమాన్ని నిర్వహించే 'బాలన్నయ్య' న్యాపతి రాఘవరావు ఇందులో రాయల ఆస్థానకవి పాత్రలో నటించారు. అదివరకు వాహినీ సంస్థ తీసిన ప్రతి చిత్రంలోనూ నటించిన చిత్తూరు నాగయ్య ఇందులో కనిపించరు. ఈ సినిమా షూటింగయ్యాక ఇందులో తను నటించలేదనే బాధను నాగయ్య వ్యక్తం చేయడంతో బి.ఎన్. ఆయన్ను మరో రకంగా సంతృప్తిపరిచారు. సినిమా ఆరంభంలో వచ్చే నేపథ్య వ్యాఖ్యానం చెప్పింది నాగయ్యే. తొలిసారిగా ఈ చిత్రానికి మాటలు, పాటలు రాశారు దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఆయన సినీ జీవితంలో మాటలు రాసిన ఒకే ఒక చిత్రమిది. 'మల్లీశ్వరి' విడుదలైనప్పుడు ఆ చిత్రాన్ని ప్రజామిత్ర పత్రికలో సమీక్షిస్తూ "ఈ చిత్రంలో పాటలకు సాహిత్య గౌరవం లభించింది'' అని ప్రశంసించారు ప్రసిద్ధ రచయిత తాపీ ధర్మారావు. నిజమే. అప్పటిదాకా వచ్చిన సినిమా పాటలకంటే భిన్నంగా 'మల్లీశ్వరి' పాటల్ని సాహితీ సౌరభంతో ప్రబంధ శృంగార సారాన్ని సినీ సాహిత్యపరంగా మలిచిన విశిష్ట రచయిత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఇందులోని గీతాలు ప్రణయ భావపరంపరకు పట్టంగట్టిన నిత్యనూతన సౌరభాల్ని వెదజల్లిన మల్లెల మాలికలు. కృష్ణశాస్త్రి రాసిన పాటలకు సాలూరు రాజేశ్వరరావు బాణీలు కట్టారు.మ్యూజిక్ కంపోజింగ్‌కు ఆయన ఆరు నెలల సమయం తీసుకున్నారు. బాణీలు సాలూరువి అయితే, ఆర్కెస్ట్రా నిర్వహించింది అద్దేపల్లి రామారావు. అందుకే టైటిల్స్‌లో సంగీత దర్శకులుగా ఇద్దరి పేర్లూ ఉంటాయి. సాలూరు తన కెరీర్ మొత్తం మీద అపురూపంగా చెప్పుకున్న చిత్రాలు రెండే. ఒకటి 'చంద్రలేఖ', రెండు 'మల్లీశ్వరి'. హంపీ విజయనగర సామ్రాజ్య వైభవానికి అద్దంపట్టే ఈ చిత్రంలో అసలు కథానాయిక సంగీతమేనంటే అతిశయోక్తి కాదు. 'మనసున మల్లెల మాలలూగెనే', 'కోతీ బావకు పెళ్లంట', 'పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి', 'ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు', 'నెల రాజా వెన్నెల రాజా', 'ఎందుకే నీకింత తొందర' వంటి పాటలన్నీ అపురూప రాగ హారాలే. కాఫీ రాగంలో భానుమతి ఆలపించిన 'పిలచిన బిగువటరా..' తెలుగు సినిమా పాటల్లో చిరస్థాయిని సాధించింది. మల్లీశ్వరిని రాణివాసానికి పంపే ఘట్టం తెలుగు సినిమా చరిత్రలోనే గుండెలు బరువెక్కించే అద్భుత కరుణ రసాత్మక ఘట్టం.దాన్ని అలా చిత్రించిన బి.ఎన్. రెడ్డినీ, ఆ ఘట్టంలో అభినయించిన దొరస్వామి, ఋష్యేంద్రమణి, భానుమతి, వెంకుమాంబనీ, ఆ సెట్‌ని రూపొందించిన ఎ.కె. శేఖర్‌నీ, అన్నింటికీ మించి హంపీ విజయనగర శిల్పవీణలు ఆ సన్నివేశాలకి నేపథ్యంగా మూర్ఛనలు చేస్తున్నాయా అనిపించే నేపథ్య సంగీతం, అందులో రాజేశ్వరరావు చూపిన ప్రతిభ, చరిత్ర జ్ఞానం తెలుగువారు మరవలేనివి. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆది ఎం. ఇరానీ పక్షవాతంతో కెమెరాని హ్యాండిల్ చేసే స్థితిలో లేకపోవడంతో ఆపరేటివ్ కెమెరామన్‌గా బి.ఎన్. సోదరుడు కొండారెడ్డి అద్భుత పనితీరు కనపర్చారు.ఈ చిత్ర నిర్మాణానికి అయిన వ్యయం రూ. ఆరు లక్షలు. అప్పట్లో అది అత్యంత భారీ బడ్జెట్. 1951 డిసెంబర్ 20న తొలిసారి విడుదలై ఒక్క విజయవాడలో మాత్రమే వంద రోజులు ఆడిన ఈ సినిమా మూడేళ్ల తర్వాత రెండో విడుదలలో మరింత విజయం సాధించింది. ఆంధ్రదేశంలో కంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 'మల్లీశ్వరి'కి ఎక్కువ ఆదరణ లభించింది. బీజింగ్‌లో జరిగిన తూర్పు ఆసియా చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై ప్రశంసలు పొందిన ఈ చిత్రం 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్‌తో 15 ప్రింట్లతో చైనాలో విడుదలై ఆ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు పుటల్లో నిలిచింది.

GREATNESS ABOUT INDIAN ARCHITECTURE ABOUT THANJAVUR BRUHADESWARA TEMPLE IN TELUGU SCIENCE FACTS


 మీకు తెలుసా ?

తంజావూరు బృహదీశ్వరాలయము 216 అడుగుల ఎత్తు .. 

ఈ ఆలయం పై వర్షం పడినప్పుడు శిఖరం నుంచి క్రిందవరకు నీటిని

 ఒకచోటకు వచ్చేలా చేసి అక్కడనుంచి ఒక గొట్టం ద్వారా కోనేరు / 

భూమిలోపలకి పంపేల ఏర్పాటు చేసారు . 

1000 సంవత్సరాల క్రితమే మనవాళ్ళు ఎంత గోప్పగా ఆలోచించారో చూడండి

GODDESS SRI DURGA DEVI STHOTRAMULU IN TELUGU


దుర్గా స్త్రోత్రములు-దేవి స్తోత్రములు

అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడిఁ బుచ్చిన యమ్న, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గమా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్‌
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మీ సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.
హరికింబట్టపుదేవి పున్నెముల ప్రోవర్థంపు బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్‌ తో నాడు పూఁబోడి, తా
మరలందుండెడిముద్దురాలు, జగముల్‌ మన్నించునిల్లాలు, భా
సురతన్‌ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్‌ నిత్యకల్యాణముల్‌
భాగవతం: లక్ష్మీదేవి స్తోత్రం – దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి; రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి; సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు; వాణితోను కల్యాణితోను క్రీడించే పూబోడి; అరవింద మందిరంగా గల జవరాలు; అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న; చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి; ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రహించు గాక.
గాయత్రీ మంత్రము
ఓం భూర్భవస్సువః |
తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి |
ధియోయోనః ప్రచోదయాత్‌ ||
అష్టాదశ పీఠములు
లంకాయాం శాంకరీదేవి, కామాక్షీ కాంచికాపురీ
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపూరీ జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొళహాపురీ మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరకా
ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా
ఓడ్యాయాం గిరిజాదేవీ, మాణీక్యే దక్షవాటికా
హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్య గౌరికా
వారణాసీ విశాలాక్షీ, కార్మీరేతు సరస్వతీ
అష్టాదశ శక్తి పీఠాని యోగినా మతి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం
సర్వ రోగ హరం దివ్యం సర్వ సంపత్కరం శుభం
శారదా స్తుతి
శంఖ త్రిశూల శరచాప కరాం త్రినేత్రాం
తిగ్నేతరాంసు విలసత్కీ రీటాం
సంహస్థి తామసుర సిద్ధ నుతాంచ
దుర్గాం దుర్గానిభాం నమామి
పార్వతీ పార్థన
మృణాలవాల నిలయా వేణీ బంధ కపర్ధిని
హారాను కారిణి పాతు లీలయా పార్వతీ జగత్‌
వాగర్ధా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
పార్వతీ దేవి ధ్యానశ్లోకం
సర్వమంగళ మాంగళ్యే శివేసర్వార్ధసాధకే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవిజ్ఞాన సిద్ధ్యర్ధం భికాం దేహి చ పార్వతి
మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః
బాంధవా శ్శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్‌
పార్వతీ స్తోత్రము
ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యాన కేళి కల కంఠీం
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీమ్‌
లలితా పరమేశ్వరీ మహామంత్రం
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
శ్రీ దుర్గా స్తోత్రములు


Wednesday 4 February 2015

MINIMALLY INVASIVE SURGERY FOR BACK PAIN - ARTICLE AND ANALYSIS


వెన్నుపాముకు సంబంధించిన శస్తచ్రికిత్సల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు మినిమల్లీ ఇన్వేసివ్‌ స్పైన్‌ సర్జరీ. సంప్రదాయిక సాధారణ స్పైన్‌ సర్జరీల కన్నా ఇది అత్యంత ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న సాధారణ స్పైన్‌ సర్జరీ వల్ల శరీరంపై ఎక్కువగా అంటే పెద్ద కోత పెట్టాల్సి వస్తుంది. తద్వారా చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కూడా గాయపడి దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తస్రావం ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ పద్ధతిలో ఆపరేషన్‌ అయిన రోగికి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడుతుంది. శస్తచ్రికిత్స అయిపోయిన తరువాత కోలుకోవడానికి ఎక్కువ రోజులు పడుతుంది. పేషెంటు లేచి తన రోజువారీ పనులను మామూలుగా చేసుకోవడానికి కొన్ని నెలల నుంచి ఓ ఏడాదైనా పట్టవచ్చు. 

మినిమల్లీ ఇన్వేసివ్‌ స్పైన్‌ సర్జరీ 
ఓపెన్‌ స్పైన్‌ సర్జరీ కన్నా అత్యధిక ప్రయోజనాలందించే ప్రత్యామ్నాయ చికిత్స మినిమల్లీ ఇన్వేసివ్‌ స్పైన్‌ సర్జరీ(ఎంఐఎస్‌ఎస్‌). శస్తచ్రికిత్సలో నొప్పిని తగ్గించడమే కాకుండా అతి త్వరగా పేషెంటు కోలుకునేలా చేసే ఆధునికి శస్తచ్రికిత్స ఇది. మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీలకు ప్రత్యేకమైన ఆధునిక పరిజ్ఞానం కావాలి. ఈ విధానంలో వెన్నుపాముకి ఒక చిన్న రంధ్రం పెడతారు. దీన్నే కీహోల్‌ అంటారు. ఇది కేవలం ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనిద్వారా చాలా తక్కువ కండరం, కణజాలాన్ని కోస్తారు. కాబట్టి ఇది సురక్షితమైనది. 

ఎక్కువమందిలో అతిసాధారణంగా కనిపించే నడుంనొప్పికి ప్రధాన కారణం డిస్‌‌కలో సమస్యలు. వీటిలో కూడా డిస్క్‌ పక్కకు జారిపోవడం వల్ల సయాటికా నొప్పి చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల నడుమునొప్పితో పాటు నడుము నుంచి కాలు వైపు ఈ నొప్పి పాకుతూ ఉంటుంది. నడిచినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. కాళ్లు తిమ్మ్లిక్కడం, మొద్దుబారడం కనిపిస్తుంది. అంతేకాదు, పేగులు, బ్లాడర్‌ల పనితీరులో కూడా సమస్యలు వస్తాయి. ఈ సమస్యకు కీహోల్‌ సర్జరీ వరంలా పనిచేస్తుంది. 

శరీరంపై చిన్న కోత మాత్రమే ఉంటుంది కాబట్టి ఎక్కువ గాయం కాదు. 
రక్తవూసావం ఎక్కువగా ఉండదు. 
శస్తచ్రికిత్స కోసం చిన్న రంధ్రం మాత్రమే పెడతారు కాబట్టి అది పెద్ద గాయం కాకుండా త్వరగా మానిపోతుంది. 
సుపవూతిలో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి త్వరగా ఇంటికి వెళ్లిపోవచ్చు. ఉద్యోగానికి ఎక్కువ రోజులు సెలవు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆర్థికంగా కూడా ఎక్కువ నష్టం ఉండదు

STOMACH BEAUTY MASSAGE TIPS FOR WOMEN


కడుపు భాగంలో మడతలు మీ సాందర్యాన్ని నాశనం చేస్తున్నాయి, పలు క్రీములు వాడి విసిగిపోయారా, ఆందోళణ చెందకుండి. ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధ వనరులను సద్వినియోగం చేసుకుని నవయువ్వన్నంగా నిలవండి. హోర్మోన్లలో మార్పులు, శరీరం వాస్తవ బరువును కోల్పొయిన సందర్భాల్లో మడతలు ఏర్పడతాయి. అయితే వీటిని నియంత్రించి, మృదువైన చర్మాన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు సమగ్ర ఆహార ప్రణాళికను పాటించాలి. 

ముఖ్యంగా విటమిన్‌ ‘సీ’, ‘ఏ’ పోషకాల గల ఆహారాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన ఔషుధాలతో శరీరానికి ‘మసాజ్‌’ చేస్తే శరీరం పై మడతలు తొలగిపోతాయి. ఈ ‘ఆయిల్స్‌’ కోసం మీరు ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదు. అన్ని మీ ఇంట్లో దొరికేవే... ఒంటికి ఆయిల్‌ మసాజ్‌ను పట్టించటం వల్ల చర్మ మృదత్వాన్ని సంతరించుకోవటంతో పాటు రక్త ప్రసరణ వృద్థి చెందుతుంది. ఈ ప్రభావంతో మీరు ఎప్పుడు ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనబడుతుంటారు. మహిళలకు వయసుతో నిమిత్తం లేకుండా ఈ మడతలు వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా మహిళల్లో ప్రసవం అనంతరం ఈ సమస్యలు వేధిస్తుంటాయి. వీటిని సులువుగా నియంత్రించుకునేందుకు అందుకోండి పలు చిట్కాలు.. రెండు టీ స్పూన్ల ‘బాదం’ నూనెలో 1 టీ స్పూన్‌ ‘వీట్‌ జర్మ్‌’ ఆయిల్‌ని కలిపి, ఈ మిశ్రమంలో 5 చుక్కులు ’గులాబీ’ నూనెతో పాటు ’ఆరెంజ్‌’ ఫ్లవర్‌ నూనెను జోడించి మడతల భాగంలో 20 నిమిషాల పాటు సుతి మెత్తంగా మర్ధనా చేయించుకోండి. 

10 చుక్కల ’రోజ్‌ మ్యారీ’ (దవనము చెట్టు నూనె)ను, 2 టీ స్పూన్ల ‘బాదాం నూనె’లో కలిపి మడతలకు పట్టించండి. నూనెను చర్మం పీల్చుకునేంతవరకు మసాజ్‌ చేస్తూనే ఉండండి. 
5 చక్కుల ‘లావెండర్‌’ ఆయిల్‌లో, తగినంత ‘ఆలివ్‌’ ఆయిల్‌ను కలిపి మసాజ్‌ చేసకుంటే ఫలితం లభిస్తుంది, అదేవిధంగా మూడు టీ స్పూన్ల ‘జోజో బా’ ఆయిల్‌లో. 5 చుక్కల ‘లావెండర్‌’ ఆయిల్‌ను కలిపి మడతల భాగంలో పావుగంట పాటు మసాజ్‌ చేస్తే మడతలు మటుమాయమవుతాయి.

TOUCH THERAPY IS BEST FOR KIDS - KIDS LEARN STARTS TOUCH OF THEIR PARENTS



ఎక్కువమంది చిన్నపిల్లలు స్పర్శ ద్వారా ప్రేమను అనుభవిస్తారు. అది వారి మౌలికమైన కోరిక. పెద్దవాళ్ళయ్యాక అలా తండ్రితోగానీ, తల్లితోగానీ వుండేందుకు సిగ్గు పడవచ్చు. అందుచేత పిల్లలు స్పర్శ ద్వారానే తల్లిదండ్రులను, ఇతరులను గుర్తిస్తారని నిపుణులు అంటున్నారు. 
1. గుండెలకు హత్తుకున్నా, ముద్దులాడినా లేదా పరస్పర గిలిగింతలకు పిల్లలు ఇష్టపడతారు.
2. అనవసరంగా కొట్టడం, తిట్టడం వంటి పనుల వలన పిల్లలు నొచ్చుకుంటారు. 
3. తల్లిదండ్రుల మీద ప్రేమగా పడుకోవడానికి లేదా వారిని హత్తుకోవడానికి పిల్లలు ఇష్టపడతారు. 
4. పిల్లలను హత్తుకునేందుకు, ముద్దాడేందుకు, పక్కనే పడుకుని నిద్రించడానికి గల అవకాశాలన్నీ చక్కగా వినియోగించాలి

Monday 2 February 2015

ARTICLE AND HISTORY OF LEGENDARY ANDHRA FREEDOM FIGHTER - THE GREAT SRI ALLURI SITA RAMA RAJU IN TELUGU


మన ఆ౦ధ్రమహనీయులు

అల్లూరి సీతారామరాజు


సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించినమన్య‍౦విప్లవ‌ యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయినమన్య౦ప్రజలుఅనుచరులుగ‌, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
సీతారామరాజుస్వగ్రామ౦ పశ్చిమగోదావరిజిల్లాలోనిమోగల్లు.సీతారామరాజు అసలుపేరుశ్రీరామరాజు.కాలక్రమములో సీతారామరాజుగ మారి౦ది.సూర్యనారాయణమ్మ ,వెంకటరామరాజు ద౦పతులకు,సీతారామరాజు౧౮౯౭(1897)జూలై౪(4)న అనగా హేవళంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుద్ధ పంచమిన మాతామహుని యి౦ట విజయనగర౦ దగ్గరి పా‍‍‍౦డ్ర‍౦గిలో జన్మి౦చారు.రాజుత౦డ్రి 1908లోచనిపోగా,కుటు౦బముఅనేకప్రదేశములుతిరిగి తునిలో స్థిరపడి౦ది.రాజుకి చడువుసరిగ అబ్బలేదు.౧౯౧౬(1916),౧౯౧౮(1918)మథ్య రె౦డుసార్లు ఉత్తరదేశయాత్రలుపూర్తిచేసినతరువాత కృష్ణదేవిపేటచేరాడు.యాత్రలస౦దర్భమున‌అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. గృహవైద్య గ్రంధము, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంధాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరచుకొన్నాడు
ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు.మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది.దీనికితోడు, గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించే వారు. అడవుల్లో వారు ప్రయాణం చెయ్యాలంటే, గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై,వారుఅత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారుమన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు.150 మంది దాకాసాహస వీరులు ఇతని అజమాయిషీలో తయారయ్యారట. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవంప్రారంభమైంది.౧౯౨౨(1922)ఆగస్టు౧౯(19)నమహారుద్రాభిషేకంచేసిచింతపల్లిపోలీసుస్టేషనుదోపిడీకినిశ్చయించుకొన్నారు
౧౯౨౨(1922) ఆగష్టు ౨౨(22)నచింతపల్లి పోలీసుస్టేషన్ దోపిడీతోమన్యం విప్లవం ఆరంభమైంది.
౧౯౨౨(1922)ఆగష్టు ౨౩(23)న - కృష్ణదేవి పేట పోలీసు స్టేషనును ముట్టడి,
౧౯౨౨(1922)ఆగష్టు ౨౪(24)న - వరుసగా మూడవ రోజు - రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి
౧౯౨౨(1922)అక్టోబర్ ౧౫(15)న అడ్డతీగల పోలీసు స్టేషనుపైజరిపిన దాడిరామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది . మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది
౧౯౨౨(1922)అక్టోబర్ ౧౯(19)న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మేజిస్ట్రేటును, సబ్ ఇన్స్పెక్టరును పిలిచి మాట్లాడాడు.
౧౯౨౩(1923) ఏప్రిల్ ౧౭(17)నఅన్నవరంస్టేషనుముట్టడి
౧౯౨౩(1923) జూన్ ౧౦(10)నమల్కనగిరి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి
౧౯౨౩(1923)సెప్టెంబరు ౨౨(22)నపాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి
౧౯౨౩(1923)అక్టోబరు ౨౬(26)నగూడెం సైనిక స్థావరంపై దాడి
ఈదాడులతో బేజారెత్తి, వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవి పేట సభలోమన్య౦కలక్టర్ రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు.తన వల్ల మన్యంప్ర‌జలుచాలాబాధలుపడుతున్నారనితలచి వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నాడుఅల్లూరి. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట.
ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి అల్లూరిని బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును ఒక చెట్టుకు కట్టివేసి ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరిసీతారామరాజు అమరవీరుడయ్యాడు.
స్వరాజ్యసాధనకోస‍‍‍‍‍౦,ఈవిప్లవవీరుడుఅనుసరి౦చినప౦థాకొ౦దరికినచ్చకపోవచ్చు,కానిఆవీరునిదేశభక్తి,స్వాత౦త్ర్యపిపాస,మన్య‍౦ప్రజలవిముక్తి
కొరకుఅతనికార్యదీక్ష,పట్టుదల‌ఎవరుశ౦కి౦చలేరు.తనునమ్మినసిద్ధా౦త౦కొరకు,అమాయకమన్యప్రజలవిముక్తికొరకు చిరువయసులోనె తనజీవితాన్ని ఫణముగపెట్టిన త్యాగశీలి అల్లూరి మనకుఆదర్శప్రాయుడు.

ARTICLE AND HISTORY OF KOLLETI KOTA SRI SRI SRI PEDDINTAMMA THALLI TEMPLE - KOLLERU - ANDHRA PRADESH - INDIA


కొల్లేటికోట- శ్రీశ్రీపెద్దింటమ్మతల్లి

ఆంధ్రదేశం లో అందమైన ప్రదేశం కొల్లేరు. కొల్లేరు ప్రకృతి రామణీయకత కు శాశ్వత చిరునామా. దక్షిణ కాశ్మీరం గా పిలువబడే కొల్లేరు సరస్సు లో ఉన్న కోటదిబ్బ పేరే కొల్లేటి కోట. కొల్లేటి కోట లో కొలువైన అమ్మల గన్న యమ్మ మన పెద్దింటమ్మ. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్దదైన మంచినీటి సరస్సు కొల్లేరు. చరిత్ర ప్రసిద్ధి చెందిన ఈ సరస్సు పరిథి లోకి కృష్ణాజిల్లా లోని కైకలూరు , మండవల్లి మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదపాడు, ఏలూరు,దెందులూరు భీమడోలు నిడమర్రు, ఉంగుటూరు ఆకివీడు మండలాలు సరిహద్దులు గా ఉన్నాయి. 135 చ.కి.మీ .విస్తీర్ణం గల ఈ కొల్లేరు సరస్సు లో 145 గ్రామా లున్నాయి. వీటిలో 142 గ్రామాలు పశ్చిమ గోదావరి జిల్లా లోని 7మండలాల్లో ఉండగా, మిగిలిన మూడు గ్రామాలు కృష్ణాజిల్లా లోని కైకలూరు, మండవల్లి మండలాల్లో ఉన్నాయి.
శ్రీశ్రీ పెద్దింటి అమ్మవారు స్థానిక మత్స్యకారుల కులదైవం. వీరిలో ఎక్కువమంది ఒరిస్సా ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు గా చెపుతారు.

* దేవీదర్శనం

కొల్లేటి కోట లో కొలువు తీరిన పెద్దింటమ్మ తొమ్మిదడుగుల ఎత్తు కలిగి, విశాలమైన నేత్రాలతో వీరాసనం లో భక్తరక్షణోద్యుక్తురాలై దర్శన మిస్తుంది. డమరుకం త్రిశూలం మొదలైన ఆయుధాల తో, నాగాభరణాల తో, సూర్య చంద్రాభరణాలతో రక్తాంబర ధారియై రౌద్ర మనోహరం గా దర్శనమిస్తుంది తల్లి.

అమ్మవారి కి ఎడమ వైపు జలదుర్గా మాత విగ్రహం నయన మనోహరం గా , పద్మాసన స్థితయై, అభయ ముద్ర తో చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యక్ష మౌతుంది. శ్రీ పెద్దింటి అమ్మవారు పార్వతీదేవికి ప్రతిరూపమే నని భక్తులు భావిస్తారు. 101 మంది గ్రామ దేవతలలో ఈమె పెద్దది కాబట్టి ఈమె పెద్దింటమ్మ గా సేవించబడుతూ,.

యా దేవీ మధు కైటభ ప్రశమనీ యా మాహిషోన్మీలినీ !
యా ధూమ్రేక్షణ చండముండ దమనీయా రక్తబీజాశనీ ! యాశుంభాదినిశుంభ దైత్యదమనీయా శుద్ద లక్ష్మీపరా ! సా చండీ నవకోటి శక్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ !!

అంటూ భక్తుల చేత స్తుతించబడుతోంది.

* చారిత్రక ప్రాథాన్యం

కొల్లేటి కోట అతిప్రాచీన పట్టణంగా చారిత్రక ఆథారాలున్నాయి. తొలిసారి లాంగుళ్య గజపతి ఈ ఆలయాన్ని నిర్మించి నట్లు గా చెప్పబడుతోంది.ఇక్కడ ఒక పెద్దమట్టికోట ఉండేదని అది కాలక్రమేణ మట్టి దిబ్బ గా మిగిలి పోయినట్లు తెలుస్తోంది .11వ శతాబ్దానికి చెందిన అంబదేవరాయలు జలదుర్గ మైన కొల్లేటి కోటను జయించి, జలదుర్గాలయం లో పెద్దింటమ్మను ప్రతిష్ఠించినట్లు జనశృతి.

వేంగీ –చాళుక్యల కాలం నాటికే కొల్లేరు ప్రాంతం ఒక మండలం గా ఉండేది. ఈ కొల్లేటి కోటను “ కొలను విషయ,”” సాగరవిషయ,” గా పిలవబడినట్లు చారిత్రకాథారాలున్నాయి. నేటి కొల్లేటి కోటను” కొలను పురం, “ “కొలనువీడు,” గా వ్యవహరించినట్లు శాసనాథారాలు కన్పిస్తున్నాయి. క్రీ.శ 10-11 శతాబ్దాలలో వేంగీరాజులకు చాళక్యుల తో సంబంధ బాంధవ్యాలుండే వని 12-13 శతాబ్దాలలోని కమలాకర పుర వల్లభుల శాసనాల వలన తెలుస్తోంది. వీరి పురాలు కమలాకరపురం ( నెల్లూరు) పద్మినీపురం ( గణపవరం ) కొలనువీడు (కొల్లేటి కోట ) గా చరిత్రకారులు గుర్తించారు. క్రీ.శ 1076 లో విజయాదిత్యుని మరణం తో వేంగీసామ్రాజ్యం అంతరించింది. వేంగీరాజైన రాజరాజచోళుడు రాజరాజనరేంద్రుని కుమారుడు. తల్లితరపున వారసత్వం గా వచ్చిన చోళ సింహాసనాన్ని అధిష్ఠించి కుళోత్తుంగ చోళుడు గా రాజ్య పరిపాలన చేశాడు. ఈతని కుమారుడు వేంగిని పాలిస్తూ, యుద్ధభూమి లో వీరమరణం పొందటం తో వారసుడు లేని రాజ్యం లో సామంతులు తిరుగు బాటు చేసి, స్వాతంత్య్రాన్ని ప్రకటించు కున్నారు. ఈ సమయం లో రాజ్యం పరహస్త గతం కాకుండా ఉండటానికి వృద్ధరాజైన కుళోత్తుంగ చోళుడు వెలనాటి చోడవీరుని దత్తపుత్రుని గా స్వీకరించి, సర్వాథికారి గా ప్రకటించాడు.అది ఇష్టం లేని మండలేశ్వరులు తిరుగు బాటు చేశారు. ఆ తిరుగు బాటు చేసిన వారి లో కొలనువీడు మండలేశ్వరుడైన తెలుగు భీముడు కూడ ఉన్నాడు. దీనికోసమే ఇంత చరిత్ర చెప్పాల్సివచ్చింది.

ఈ తెలుగు భీముని పేరు తో వెలసిన గ్రామమే నేటి భుజబల ( భీమ) పట్నం గా చారిత్రకులు గుర్తించారు. బహు సాహసి గా పేరొందిన ఈ తెలుగు భీముడు మిగిలిన తిరుగు బాటు దారుల తో కలసి పితృపురం (నేటి పిఠాపురం ) చాళుక్యరాజుని విజయాదిత్య చక్రవర్తి గా, వేంగీశ్వరుని చేశాడు. తొలిసారి పార్వతీమాత ను పెద్దమ్మ గా కొలిచిన చక్రవర్తి ఈయనే. పిఠాపురం శాసనాన్ని బట్టి అగస్త్యుడు సముద్రాన్ని ఇంకించినట్లు, కొల్లేటి నీటి తోడించి,తోడించి, వంతెన వేయించి కొల్లేటి మథ్య లో ఒక అభేధ్యమైన జలదుర్గాన్ని నిర్మంచి నట్లు తెలుస్తోంది. ఈ దుర్గం చుట్టూ 150 రాజహస్తాల వెడల్పు, 7 నిలువుల లోతు,3 కోశాల చుట్టుకొలత గల అగడ్త ఉండేదని చరిత్ర కారులు వ్రాశారు. ( కోసు అనగా - రెండువేల విండ్లపట్టు – అని అర్థము ). ఈ కొల్లేటి సరస్సు లో ఇప్పుడు కన్పించే దిబ్బలే శిథిలమైన కోటకు ఆనవాళ్ల ని చారిత్రకుల అభిప్రాయం. దీనినే ప్రస్తుతం కొల్లేటి కోట గా పిలుస్తున్నాము. చైనా యాత్రికుడు హ్యుయన్ సాంగ్ ఈ కొల్లేటి సరస్సును ఒక గొప్ప మంచినీటి సరస్సు గా వర్ణించాడు.

దండి మహాకవి తన దశకుమారచరిత్ర లో కొల్లేటిసరస్సుని గురించి, భుజ బలవీరుడైన తెలుగు భీముని గురించి చాల గొప్పగా అభివర్ణించాడు. ఈ కొల్లేటి సరస్సు కు ప్రాచీన కాలం లో “కునాళ “సరస్సు అని పేరున్నట్లు తెలుస్తోంది. ప్రాచీన కాలం లో ఇక్కడున్న సౌధాలు ,మేడలు, మిద్దెలు కాలగర్భం లో కలసి పోయినా. అమ్మవారి ఆలయం మాత్రం ఆటుపోటులకు తట్టుకొని నిలబడింది.విజయనగర రాజులకు మహమ్మదీయులకు జరిగిన పోరులో విజయనగర సామ్రాజ్య సైన్యాధ్యక్షుడు విజయాన్ని ఆకాంక్షిస్తూ, తన కన్న కూతురును కొల్లేటిఒడ్డున బలి యిచ్చి,విజయాన్ని పొందాడని ,అప్పటినుండి ఆ ఒడ్డుకు” పేరంటాలు కనుమ “అని పేరు వచ్చిందని ఐతిహ్యం. జంతుబలి పై నిషేధం ఉన్నప్పటికీ ఇప్పటికి కూడ ఇక్కడ కోళ్లు, గొఱ్ఱెలు మొదలైన వాటిని బలి ఇవ్వడం సాథారణం గానే జరిగిపోతుంది. కోడిని అమ్మవారికి చూపించి తీసుకెళితే 1.00 రూ, గొర్రె, మేకను చూపించి తీసుకెళితే 10.రూ10 .యలు దేవస్థానానికి చెల్లించాలి. విశ్వాసాల ముందు చట్టాలు పని చేయవు కదా!

* కొల్లేటి అందాలు.:

కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం అభయారణ్యం గా ప్రకటించ బడింది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు , అక్టోబరు నెలలలో ఆష్ట్రేలియా, నైజీరియా ఫిజీ దీవులనుండి గూడకొంగలు వలస వస్తాయి .పరజపిట్టలు, నీటిబాతులు,మొదలైన అనేక అరుదైన పక్షిజాతులు ఈ సమయం లో కొల్లేరు ని ఒక విహారకేంద్రం గా, సందర్శనీయ స్థలం గా మార్ఛేస్తాయి. ఈరమణీయ దృశ్యాలను చూడటానికి,తమ కెమేరాల్లో బంధించుకోవడానికి ఆ నెలల్లో విదేశీ సందర్శకులు కొల్లలు గా కొల్లేటి సందర్శనకు వస్తారంటే ఆ దృశ్యాలు ఎంత నయన మనోహరాలో మనం అర్థం చేసుకోవచ్చు. బుర్రదోనె లో కూర్చొని చేపలు వేటాడే జాలరి దంపతుల తో పాటు,అప్పుడప్పుడు విదేశీ యులు కూడ ఆ దోనెల్లో కన్పిస్తుండటం చూడటానికి ముచ్చట గా ఉంటుంది.

* రవాణా సౌకర్యాలు.

పెద్దింటి అమ్మ ను దర్శించుకోవడానికి రెండు రవాణామార్గాలు ఉన్నాయి. ప్రయాణాన్ని మక్కువగా ఆస్వాదించ దలచిన వారు ఆకివీడు నుండి కొల్లేటిఒడ్డు వరకు సొంత వాహనం లో గాని, ఆర్టీసీ బస్సు లో గాని ప్రయాణించి అక్కడ నుండి కర్రలవంతెన మీదు గా నడుచుకుంటూ కొల్లేటి పాయను ( ఆనాటి అగడ్త ను ) దాటి అక్కడనుండి ఆటోలో 3.5 కి.మీ కచ్చా రోడ్డుమీద దుమ్ము తో కలిసి పోతూ ప్రయాణం చేసి అమ్మవారి ఆలయాన్ని చేరు కోవచ్చు. ఈ కర్రల వంతెన మీద ప్రయాణం ఒకవింత అనుభూతి. కర్రల వంతెన దాటి నందుకు తలకు మూడు రూపాయలు టోల్గేటు దగ్గర చెల్లించవలసిరావడం ఈ ప్రయాణం లో కొసమెరుపు. ఆటోకి పదిరూపాయల నుండి వసూలు చేస్తారు. ఇదికాక కొల్లేటి అందాలను దర్శిస్తూ, లాంచీలో ప్రయాణం చేసి ఆలయానికి చేరుకోవచ్చు.ఇదే కాకుండా సుఖప్రయాణం కోరుకునే వారు కైకలూరు, ఆలపాడు, ఏలూరు మీదు గా రోడ్డు మార్గం లో ప్రయాణించి అమ్మవారిని దర్శించు కొవచ్చు.

* ప్రత్యేక ఉత్సవాలు.

పెద్దింటమ్మ అమ్మవారి జాతర ఈ ప్రాంత ప్రజలకు గొప్పపండుగ. కొల్లేటి పరిసర ప్రాంతపు కార్మికులు, కర్షకులు కష్టాన్ని మరచి అధికోత్సాహం తో అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొని, ఆనందాన్నిపంచుకుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ద పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అమ్మవారి( తీర్థం ) జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవం లో భాగం గానే ఇక్కడ కు 2.5 కి మీ దూరం లో ఉన్న గోకర్ణేశ్వర స్వామి వారిని మేళ తాళాల తో గ్రామోత్సవం చేస్తూ తీసుకొని వచ్చి జలదుర్గా గోకర్ణేశ్వర స్వామి వార్ల కళ్యాణాన్ని వైభవోపేతం గా నిర్వహిస్తారు . కళ్యాణానంతరం రథోత్సవం కనుల పండువు గా జరుగుతుంది. పుణ్యాన్ని పురు షార్థాన్ని పొందడానికి ఇటువంటి తీర్థాలను తప్పని సరి గా దర్శించాలని పెద్దలు చెపుతారు .ఆథ్యాత్మిక ప్రదేశం గానే కాక విహారయాత్రా స్థలం గా కూడ ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది.

ARTICLE AND HISTORY OF MAHISHASURA MARDHANI SAMETHA BHIMESWARA SWAMY TEMPLE AT BHIMAVARAM - WEST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA


మహిషాసుర మర్థనీ సమేత భీమేశ్వర స్వామి భీమవరం 

భీమవరం ఆంధ్రదేశం లో ప్రసిద్ధి పొందిన పట్టణాల్లో ఒకటి. భీమవరానికి ఆ పేరు రావడానికి కారణభూతమైన దైవం ఈ భీమేశ్వరుడు. ఈ స్వామి ఇచ్చట మహిషాసుర మర్థనీ సమేత భీమేశ్వరుడు గా తెలుగు భీముడు గా కొనియాడబడుతున్న చాళుక్య భీముని చేత ప్రతిష్ఠించబడి, పూజలందుకుంటున్నాడు.

* చారిత్రక నేపథ్యం 

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇతి హాస కాలం లో దండకారణ్యం గా ఉండేదని, మౌర్యుల కాలం లో ఈ ప్రాంతాన్ని మానవ నివాసయోగ్యం గా తీర్చిదిద్దారని చరిత్రకారులు భావిస్తున్నారు. వారి పరిపాలనాకాలం లోనే బౌద్దమతం ఈప్రాంతం లో వ్యాప్తి చెందింది. మౌర్యసామ్రాజ్య పతనానంతరం ఈప్రాంతం వారి సామంతులగు ఆంధ్ర శాతవాహనుల ఏలుబడిలోకి వచ్చింది. శాతవాహనుల సామ్రాజ్యం క్షీణించిన తరువాత బృహల్పలాయనులవంశస్థులు శాలంకాయనులు అథికారం లోకి వచ్చారు. ప్రస్తుతము ఏలూరు వద్ద నున్న దెందులూరు రైల్వేష్టేషన్ సమీపంలోని పెదవేగి, చినవేగి ప్రాంతాలను కలిపి వేంగీపురం గా మార్చి ,దానిని రాజథాని గా చేసుకొని పాలన కొనసాగించారు. ఆ కారణం గానే ఈ గోదావరి కృష్ణానదుల మథ్య ప్రాంతానికి వేంగీమండలం అనే పేరు వచ్చింది. ఆ వేంగీమండలం లోనే ఈ భీమవరం ఉండేది. శాలంకాయనుల తర్వాత విష్ణుకుండినులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 7 వ శతాబ్ధి ప్రారంభం లో రెండవ పులకేశి విష్ణుకుండినులను ఓడించి, వేంగీమండలాన్ని వశపర్చు కున్నాడు. ఈ గోదావరీ ప్రాంతాన్నికైవసం చేసుకొని,పిఠాపురం ను రాజధాని గా ప్రకటించి, తన సోదరుడు కుబ్జవిష్ణువర్ధనుని తూర్పుప్రాంతానికి రాజప్రతినిథి గా ప్రకటించినట్లు చరిత్ర చెపుతోంది.రెండవపులకేశి మరణానంతరం కుబ్జవిష్ణువర్దనుడు స్వతంత్రుడై ,తూర్పు చాళుక్య రాజ్యాన్నిస్థాపించాడు. ఈ తూర్పు చాళుక్యులు 7 వ శతాబ్దం నుండి సుమారు పన్నెండు వందల సంవత్సరాలు ఆంధ్ర దేశాన్ని పాలించారు. ఈ రాజులు పిఠాపురం నుండి వేంగి అక్కడ నుండి రాజమహేంద్ర వరానికి రాజధానులను మార్చి పరిపాలనను విస్తరింపజేశారు. వీరిలో 9 వ శతాబ్దం లోపాలించిన చాళుక్య భీముడు మహావీరుడు. కళాపోషకుడు. హిందూమతాభిమాని యైన ఈ రాజు ఆంధ్రదేశం లో ఎన్నో దేవాలయాలను నిర్మించాడు. భీమేశ్వరుడు వీరి ఇలవేల్పు. వీరి బిరుద నామాలు కూడ" ముమ్మడి భీముడు," "బిరుదాంకభీముడు" అని ఉండేవి.

* శ్రీ భీమేశ్వర దర్శనం

ఈ చాళుక్య భీముడు నిర్మించిన నగరమే నేటి భీమవరం. ఈయన కట్టించిన ఆలయమే ఈ భీమేశ్వరాలయం గా చరిత్రకారులు చెపుతున్నారు. ఈ ఆలయ నిర్మాణం క్రీ.శ 890-918 మథ్య కాలం లో నిర్మించబడి ఉండవచ్చునని చారిత్రక అంచనా. ఈ దేవాలయ ప్రాంగణం లో లభించిన శిలా సాక్ష్యాలను బట్టి ఈ ఆలయం చాళుక్యుల కాలం నాటి నిర్మాణమని పురావస్తుశాఖ వారు ధృవపర్చారు.

ఈ ఆలయం లో స్వామి శ్రీ భీమేశ్వరుని మూలవిరాట్ 5 అడుగుల ఎత్తు ఉంటుంది. స్వామి కి ఎడమవైపున ఉన్న ఉపాలయం లో మహిషాసురమర్ధని చతుర్భుజాలతో వైష్ణవ రూపిణి గా దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిలోని ప్రత్యేకత ఎడమ కుడి హస్తాలలో చక్ర,శంఖాలను ధరించి ఉండటం. విష్ణువు శంఖ చక్రాలను ధరిస్తాడు. అది కూడ కుడి చేతి లో చక్రాన్ని, ఎడమచేతిలో శంఖాన్ని ధరిస్తాడు. చెన్నకేశవుడు మాత్రమే శంఖ చక్రాలను తారుమారు గా ధరిస్తాడు. ఇక్కడ అమ్మవారి చేతి లో శంఖ చక్రాలు ఉండటం, అవికూడ తారుమారు గా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత గా చెపుతారు. ఈ విథమైన మూర్తి మరి ఎక్కడా ఉండకపోవచ్చు. అందుకే అమ్మవారిని శక్తిస్వరూపిణి గా పూజిస్తారు. ఆలయ ప్రాంగణం లోనే శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ రాధాకృష్ణ ఆలయం ,శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలున్నాయి. గాలిగోపురానికి లోపలి వైపు భీమేశ్వరునికి అభిముఖం గా, బ్రహ్మ,దత్తాత్రేయుడు దర్శనమిస్తారు.

* ప్రత్యేక ఉత్సవాలు

మహాశివరాత్రి కి శ్రీ భీమేశ్వర,మహిషాసురమర్ధని అమ్మవార్ల కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవం గా, పాంచాహ్నిక దీక్ష తో ఐదు రోజులు మహావైభవం గా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో రథోత్సవం, తెప్పోత్సవం రోజుల్లో భక్తుల రద్దీ అధికం గా ఉంటుంది. కార్తీక మాసం లోను ,ధనుర్మాసం లోను స్వామివారికి గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఈ భీమేశ్వరాలయం ప్రాచీన ఆలయం అవడం, ఈ ప్రాంగణం లోనే మరి రెండు ఆలయాలుండటం తో దేవాలయ ప్రాంగణం నిత్యం భక్తుల తో కళకళ లాడుతూనే ఉంటుంది.

Sunday 1 February 2015

LORD SRI RAMA - LORD HANUMAN'S SUNDARA KANDA - RAMAYAN STORIES IN TELUGU


శ్రీ రామః
(సుందర కాండము)

రామాయణం
రామాయాః అయనమ్ = రాముని యొక్క చరిత్రము రామాయణము

రామః అయ్యతే ఇతి రామాయణమ్
అనగా దీనిని పఠించినవారు రాముని వలె ధర్మశీలురై జీవనము గడిపి
కడకు వైకుంఠ ప్రాప్తి పొందుదురు

శ్రీరాముడు మానవాళికి ఆవశ్యములగు పుత్ర ధర్మము, మిత్ర ధర్మము, భ్రాతృ ధర్మము(సోదర), భర్తృ ధర్మము(భర్త), శిష్య ధర్మము, క్షాత్ర ధర్మము, శతృ ధర్మము, మొదలగు అన్ని ధర్మములను తానే స్వయముగా ఆచరించి లోకానికి మార్గదర్శకుడాయెను
సీతా మాతయు స్త్రీలకు ఆచరణీయమగు సమస్త ధర్మములను నిజజీవితంలో ఆచరించి లోకమునకు ప్రకటించెను

రామాయణం కావ్యమగుటచేత ఇది ఒక ధర్మశాస్త్ర గ్రంథమైనది

మానవుని జీవితంలో ధర్మము, అర్థము, కామ్యము, అను మూడు పురుషార్థములను సాధింపదగినవి, ఈ త్రివర్గమునకు ధర్మము మూలమి,ధర్మ బద్ధము గాని రెండును అనర్ధ హేతువులు ధర్మమునకు విరుద్ధమైన పచ్చి స్వార్థముతో భరతునకు రాజ్యమును కట్టబెట్టచూసిన కైక నలుగురిలో నవ్వులపాలై లోక నిందకు గురియైనది అట్లే ధర్మమును వీడి కామాతురుడు పరసతులను ఆసించిన దుష్ట రావణుడు లోకమున అపకీర్తి పాలయ్యెను సపరివారముగా నశించెను
ధర్మ భద్ధుడై రాజ్యమునే పరిత్యజించిన శ్రీ రాముడు సకల లోకాలకు మార్ధర్శకుడే కాక లోకారాధ్యుడాయెను

కావుననే

"రామో విగ్రహవాన్ ధర్మః"
(శ్రీ రాముడు మూర్తీభవించిన ధర్మము)
అని వాల్మికి మహర్షి నుడివెను

అందువలననే

"ధర్మో రక్షతి రక్షితః"
(ధర్మమును ఆశ్రయించిన వానిని ఆ ధర్మమే కాపాడును)
అను సూక్తి ఏర్పడినది

శ్రీ రామాదుల బాల్యలీలలబు వర్ణించినందున అది "బాలాకాండము"గా
పట్టాభిషేక సన్నివేశాలు అయోధ్య నగరమున సంభవించేను కనుక అది "అయోధ్య కాండము"గా
సీతారాముల అరణ్యవాస విశేషాలను వివరించెను కనుక అది "అరణ్య కాండము"గా
రామ సుగ్రీవుల మైత్రి, వాలి వధ మొదలగునవి కిష్కంద యందు జరుగుటచే అది "కిష్కింధ కాండము" గా
రామ రావణుల యుద్ధ ప్రాముఖ్యముతో అది "యుద్ధ కాండము" గా ప్రసిద్ధిచెందగా
కిష్కందకాండము యుద్ధకాండమునకు మధ్యన కల వస్తు సౌందర్యము సీతా రామ హనుమదాదుల సౌందర్యము హనుమంతునకు సీతాన్వేషణలో ఎదురైన ఘట్టముల వైభవమును లంకా సౌందర్యము అశోకవన సౌందర్యము మున్నగు వర్ణములను "సుందరకాండము"గా అభివర్ణించిరి

సుందరాకాండము:

"సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం"

పురుష మోహనాకారుడు, సుగుణ సుందరుడు శ్రీరాముడు
సర్వ విధముల భువనైక సుందరీ సీతామాత
కాంచనాద్రి కమనీయ విగ్రహుడు పరమ సుందరుడు హనుమంతుడు
అతొలోక సుందరము అశోకవనము
శ్రీ సీతా రామ హనుమంతుల మంత్రముకు దివ్య పరమ సుందరములు
మహితాత్ముల కథ సర్వాద్భుత సుందరము
సుందరకాండము బహుముఖ వైభవ వర్ణన కల కవిత్వ కావ్యం అత్యంత సుందరము కనుక సుందర కాండము నందు "సుందరము" కానిదేది..??
సర్వము సుందరమే...

అంతటి మహత్తరమైన సుందరకాండము నియమ నిష్టతో పారయణము చేయుట వలన సుఖల దుఃఖములు నివారణమగును సకల మనోరథములు సిద్ధించును
హరిషడ్వర్గములు జయించును బ్రహ్మ జ్ఞానము పొందగలరు
అంతయే కాక అశ్వమేధ యాగఫలాన్ని పొందునని వాల్మీకి వాక్యము..

"శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష"

DAILY SIMPLE KITCHEN HEALTH TIPS WITH FRUITS AND VEGETABLES



మీకు తెలుసా

అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని

 అదుపులో ఉంచుతుంది.

గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే 

మలబద్దకం పోతుంది.


జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది. 

మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి. 

మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా

 కాపాడుతుంది.

బీట్ రూట్ రసం 'లో బీపీ ' సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి

 కాపాడుతుంది.

సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి

 దుర్వాసనను పోగోడుతాయి.

ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం 

సాఫీగా అయ్యేలా చేస్తుంది.

ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

HOW TO REDUCE HEAVY WEIGHT BY EATING GOOD PROTEINS FOOD - BE SLIM AND HEALTH ALWAYS AND FOREVER


అధికబరువు & డయాబెటిక్ ఉన్నవాళ్లు రాత్రి భోజనం 

కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేట్లు తీసుకోండి 

అధికబరువు & డయాబెటిక్ ఉన్నవాళ్లు రాత్రి భోజనం కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేట్లు తీసుకోండి

1) భోజనం చేసే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగండి.

2) భోజనం లో 2 నుండి 4 మల్టీ గ్రెయిన్ చపాతీలు , ఒక veg కర్రీ , ఒక గ్లాస్ పల్చని మజ్జిగ (మజ్జిగ లో పుదినా , కొత్తిమీర కట్ చేసి వేసుకోవచ్చు).

3) లేదంటే ఒక చిన్న బౌల్ రైస్ , 2 పుల్కాలు , 1 కర్రీ , 1 గ్లాస్ మజ్జిగ తీసుకోవచ్చు.

4) రాత్రి భోజనం 9 గంటల లోపే ఉండాలి , రాత్రి వేళ మాంసాహారం తీసుకోకపోవడమే మంచిది.ఒక వేళ తీసుకోవాలి 

అనుకొనే వారు 50-100 గ్రాములు మించి తీసుకోకూడదు. అది కూడా వారంలో రెండు సార్లు మాత్రమే.

5) రాత్రి బోజనం కాస్త ఎక్కువైంది అనిపిస్తే , 1/4 స్పూన్ జీలకర్ర పొడిని , ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో తీసుకోండి. 

పొట్ట ఉబ్బరం , గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది.