WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 28 October 2014

TIPS FOR REDUCING THE SIZE OF STOMACH

 
పొట్ట రాకూడదని అనుకునేవారు, వచ్చినా దాన్ని తగ్గించుకోవాలని అనుకునేవారు పాటించాల్సిన జాగ్రత్తలు

1. కప్పు గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకుని ఉదయాన్నే పరగడపున తాగాలి. రోజులో కూడా ఎక్కువ నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు వెళ్తాయి.
2. పకృతి సహజంగా లభించే తేయాకులతో చేసిన గ్రీన్‌టీని ఉదయం పూట తాగాలి. దానిమ్మ జ్యూస్ తప్ప మిగతా అన్ని రకాల జ్యూస్‌లను ఉదయ
ాన్నే తీసుకోవచ్చు. అయితే జ్యూస్ కంటే తాజా పళ్లు తీసుకోవడం మంచిది. జ్యూస్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.
3. కాఫీ తాగే అలవాటు ఉన్నవారు రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి. 
4· పంచదారను ఏ రూపంలోనూ తీసుకోకూడదు. అలాగే వైట్ పాస్తా, బ్రెడ్, బంగాళదుంపలు తినకూడదు.
5· గోధుమ పాస్తా, గోధుమ బ్రెడ్‌ను తీసుకోవచ్చు. ప్యాకెట్ లేబుల్స్ పైన ఏ పిండిని ఉపయోగించారు అనేది రాసి ఉంటుంది. చెక్ చేసుకుని తీసుకోవాలి.
6· అన్నిరకాల ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవచ్చు. మాంసాహారం తక్కువ తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారం తీసుకోవాలన్న కోరిక ఉంటే దానికి బదులు చేపలు తినవచ్చు.
7· రోజులో రెండు, మూడు సార్లు ఎక్కువ మోతాదులో కాకుండా అయిదుసార్లు కొద్ది మోతాదుల్లో ఆహారాన్ని తీసుకోవాలి.
8· రాత్రి ఏడు తర్వాత ఆహారం తీసుకోకూడదు.
9· తినే ఆహారంలో ఎక్కువగా ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. చిప్స్, పాప్‌కార్న్, కుకీస్, కేక్స్ మొదలైన జంక్‌ఫుడ్‌ని అస్సలు తినకూడదు. 
10· రోజుకు ఒక పండు తినాలి. దాన్ని ఉదయం 12గం.ల లోపు తినేలా చూసుకోవాలి. అవి కూడా బెర్రీ ఫ్యామిలీకి చెందిన బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, క్రాన్ బెర్రీస్‌కి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి.
11· రోజులో అరగంట, నలభై అయిదు నిమిషాలు కార్డియో ఎక్సర్‌సైజ్‌లు, వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. ఆరోగ్యసమస్యలున్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకు వ్యాయామాలు చేయాలి.
12· పొటీన్లు సమృద్ధిగా ఉన్న డ్రింక్‌ని రోజులో తప్పనిసరిగా ఒక్కసారైనా తీసుకోవాలి. క్యాలరీలు ఎక్కువగా ఉండి,
13· పోషకాలు అస్సలు ఉండని కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.
14· తినే ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ లేదా సీడ్స్‌ని తీసుకోవాలి. రోజులో ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.
15· మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే స్ట్రెస్ హార్మోన్లు రిలాక్స్ అయి పొట్టపైన ప్రభావం చూపకుండా ఉంటుంది. 
16· స్నాక్స్‌లో రోజులో నాలుగు సార్లు అయిదు బాదాంల చొప్పున తినాలి.
17· తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి.
18· స్వీట్స్ తక్కువగా తీసుకోవాలి.
19· వేపుడు పదార్థాలను తీసుకోకూడదు. కేవలం ఉడికించిన వాటినే తీసుకోవాలి.


IMPORTANCE OF VANABHOJANALU IN KARTHIKAMASAM - KARTHIKAMASAM SPECIAL TELUGU ARTICLES COLLECTION

 
కార్తీకమాసం : వనభోజన మహత్యం
 
వశిష్టుడు తిరిగి జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… ”ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయాలి. అలా చేసినవారి సర్వ పాపములును నివృతియగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్తారు. భగవద్గీత కొంత వరకు పఠించిన వారికీ విష్ణు లోకం ప్రాప్తిస్తుంది. ఒక్క శ్లోకములో ఒక్క పదమైననూ కంఠస్థం చేసినట్లయితే విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరి కాయలతో నిండిఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యదోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భోజనం చేయాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షణ తాంబూలములతో సత్కరించి నమస్కరించాలి. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణకాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మంపోయి నిజ రూపం కలిగింది” అని చెప్పారు. అది విన్న జనకుడు ”ముని వర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగింది? దానికి గల కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు…
కిరాతుడు, ఎలుకలకు మోక్షం
రాజా! కావేరి నదీ తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకో కొడుకున్నాడు. అతని పేరు శివశర్మ. చిన్నతనం నుంచి భయం భక్తి లేక గారాబంగా పెరిగాడు. దీనివల్ల నీచ సహవాసాలు అలవాటయ్యాయి. అతని దురాచారాలు చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి ”బిడ్డా…! నీ అపచారాలకు అంతు లేకుండా పోతోంది. నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పుకొంటున్నారు. నన్ను నిలదీస్తున్నారు. నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను. నలుగురిలో తిరగలేకపోతున్నాను. కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నువ్వు బుద్ధిగా ఉండు. నదిలో స్నానం చేయి. శివకేశవులను స్మరించి, సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి. నీ పాపాలు తొలగిపోయే అవకాశాలుంటాయి. నీకు మోక్షం ప్రాప్తిస్తుంది” అని చెప్పాడు. దానికి ఆ పిల్లాడు మూర్ఖంగా… ”స్నానం చేస్తే మురికి పోతుంది. అంతే…! దానికి వేరే ఏమైనా వస్తుందా? స్నానం చేసి పూజ చేస్తే దేవుడు కనిపిస్తాడా? గుళ్లో దీపం పెడితే లాభమేమిటి? ఇంట్లో పెడితే వెలుగైనా వస్తుంది కదా?” అని ఎదురు ప్రశ్నలు వేశాడు.
దాంతో ఆ బ్రాహ్మడు ”ఓరీ నీచుడా! కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేస్తున్నావు. నీ అంతటి కొడుకు నాకెందుకు? నీవు అడవిలో ఉన్న రావిచెట్టు తొర్రలో ఎలుక రూపంలో బదుకుదువుగాక” అని శపించాడు. ఆ శాపంతో గజగజా వణికిపోయిన శివశర్మ తండ్రి పాదాలపై పడి… ”నన్ను క్షమించండి. అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని, దైవకార్యాలను చులకన చేశాను. నాకు ఇప్పుడు పశ్చాత్తాపమైంది. నాకు శాపవిమోచనం చెప్పండి” అని కోరాడు. అంతట ఆయన ”బిడ్డా! నా శాపం అనుభవించక తప్పదు. అయితే నీవు ఎలుక రూపంలో ఉన్నా.. కార్తీక మహత్యాన్ని వింటే నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు” అని ఊరడించాడు.
తండ్రి శాపంతో శివశర్మ ఎలుక రూపాన్ని ధరించి, అడవికి పోయి, చెట్టు తొర్రలో నివసిఊ్త, పండ్లు తింటూ బతకసాగాడు. కావేరీ నదీతీరాన ఉన్న రావిచెట్టు తొర్రలో అతను నివాసమేర్పరుచుకోవడం వల్ల నదీస్నానానికి వచ్చేవారు అక్కడున్న వృక్షం కింద విశ్రమించేవారు. నదీ స్నానం చేసేవారు రామాయణ, మహాభారతాలు, పురాణగాథల్ని చెప్పుకొనేవారు. కార్తీకమాసంలో ఒకానొకరోజున మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు. ప్రయాణ బడలిక వల్ల ఆ రావిచెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో తన శిష్యులకు కార్తీకపురాణ విశేషాన్ని బోధిస్తున్నారు. చెట్టు తొర్రలో ఎలుక రూపంలో ఉన్న శివశర్మ కూడా ఆ కథను విన్నాడు. రుషిదగ్గర ఉన్న పూజా సామాగ్రిలో తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని చెట్టు మొదట నక్కి చూస్తున్నాడు.
అంతలో ఒక కిరాతకుడు చెట్టుకింద ఉన్నవారిని దూరం నుంచి చూసి ”ఓహో… ఈ రోజు నా పంట పండింది. ఈ బాటసారులను దోచుకుంటే డబ్బేడబ్బు” ఆలోచించసాగాడు. అతనలా ఆలోచిస్తూ దగ్గరకు వచ్చేసరికి మునులను చూశాడు. ఒక్కసారిగా అతని బుద్ధి మారిపోయింది. వారందరికీ నమస్కరించి ”మహానుభావులారా…! మీరెవరు? ఎందుకు ఇక్కడకు వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనసు పులకించిపోతోంది” అని అన్నాడు. అంతట విశ్వామిత్రుడు ”ఓ కిరాతకా! మేం కావేరీ నదీ స్నానమాచరించేందుకు ఇక్కడకొచ్చాం. ఇప్పుడు కార్తీక పురాణం పఠిస్తున్నాం. నువ్వుకూడా ఇక్కడ కూర్చొని వినవచ్చు” అన్నారు.
అటు ఎలుక, ఇటు కిరాతకుడు శ్రద్ధగా కథ వినసాగారు. కథ వింటుండగా… కిరాతకుడికి తన పూర్వజన్మ వృంతాతమంతా జ్ఞాపకమొచ్చింది. పురాణ శ్రవణం తర్వాత రుషులకు దండం పెట్టి, సాష్టాంగం చేసి, వెళ్లిపోయాడు. ఎలుక కూడా పురాణమంతా వినడం, చెట్టుకింద దొరికిన ఫలాలను బుజించడం వల్ల తన స్వరూపాన్ని పొందగలిగింది. ఎలుక రూపం నుంచి విముక్తి పొందిన శివశర్మ విశ్వామిత్రుడితో ”మునివర్యా! ధన్యుడనయ్యాను. మీ వల్ల నేను మూషిక రూపం నంచి విముక్తి పొందాను” అని తన వృత్తాంతమంతా చెప్పాడు.
”కాబట్టి జనకమహారాజా…! ఈ లోకంలో సిరిసంపదలు, పరమున మోక్షాన్ని కోరేవారు తప్పక ఈ కార్తీక పురాణాన్ని చదివి, ఇతరులకు వినిపించాలి. బంధుమిత్రులతో కలిసి వనభోజనమాచరించాలి” అని వివరించారు.


RAMAYANAM STORIES IN TELUGU - ARTICLE ABOUT FACTS ABOUT LORD SRI RAMA - VANAVASAM

 
శ్రీ రామ వనవాసం

శ్రీ రామ చరిత్రలో అతిముఖ్యమైనదీ సుదీర్ఘమైనదీ ఆయన చేసిన వనవాసం. పితృవాక్య పరిపాలనా కర్తవ్యదీక్షా కంకణధారుడై ఆయన తన 25వ ఏట ప్రారంభించి తనకు 39 ఏళ్లు వచ్చే వరకూ వనసీమలలోనే సంచరించాడు.శ్రీ రాముడు మనదేశంలో ఎంతోమందికి ఆరాధ్యదైవం కావడానికి ఆయన శూరత్వమే కాకుండా ఈ ధర్మ దీక్షయే ప్రధాన కారణం. 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన అయోధ్యలో ప్రారంభించి దక్షిణాదిన రామేశ్వరం వరకూ ప్రయాణం చేశాడు.ఆతరు
వాత సేతు నిర్మాణం గావించి లంకలో రావణ సంహారం చేసాడు.ఇంత కాలం పాటు ఆయన ఏయే చోట్ల తిరిగాడో తెలుసు కోవాలంటే మనం కూడా ఆయన నడచిన దారుల్లోనే ప్రయాణించి ఆయన అడుగు జాడలేమైనా గుర్తించగలమేమో చూడాలి. నాతో రండి. ఆయన నడచిన దారుల్లోనే మనమూ ప్రయాణించి వద్దాము.

* శ్రీ రాముడు తన వన వాస సమయంలో ఏఏ ప్రాంతాలలో తిరిగాడో తెలుసుకుందాం

అయోధ్య నుంచి రామేశ్వరం వరకూ విస్త్రృతంగా పర్యటించారు.ఆయాప్రాంతాలలో ప్రజలలో ఉండే ఐతిహ్యాలనూ ఇతర ఆధారాలనుబట్టి వారు మొదట 189 ప్రాంతాలనూ తరువాత మరోక 60 ప్రదేశాలనూ కనుగొన్నారట.ఈ వివరాలన్నీ శ్రీ రామావతార్ గారి “శ్రీ రాముని అడుగు జాడల్లో” శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యనుంచి బయలుదేరి మొదట అక్కడికి 20 కిలో మీటర్లు దూరం లోని తమసానదీ తటాన ఉన్న మాండా అనే ప్రాతాన్ని చేరుకున్నారు.ఆ తరువాత గోమతీ నదిని దాటి సరయూ తీరాన్ని చేరుకున్నారు. 

ఆతరువాత తమ కోసల దేశపు సరిహద్దులుదాటుతూ నిషాద రాజైన గుహుని సహాయంతో గంగను దాటి ప్రస్తుత అలహాబాదుకు 20 కిలో మీటర్ల దూరంలోని నిషాద రాజ్యం లోని శ్రింగవేరపురం చేరుకున్నారు.ఆ తర్వాత అక్కడనుండి బయలు దేరి త్రివేణీ సంగమ ప్రాంతంలో యమునా నదిని దాటి ఉత్తర-మధ్యప్రదేశ్ ల సరిహద్దుల్లోని చిత్రకూటాన్ని చేరుకున్నారు.ఈ ప్రాంతంలో వాల్మీకి ఆశ్రమం,మాండవ్య ఆశ్రమం,భరత్ కూప్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి. శ్రీ రామ పాదుకల్ని తీసుకు వెళ్లడానికి భరతుడు వచ్చివెళ్లాక వారు చిత్రకూటాన్ని వదలి మధ్యప్రదేశ్ లోని సతానా ప్రాంతంలో ఉన్నఅత్రి ఆశ్రమాన్ని చేరుకున్నారు.ఇక్కడనుండి శ్రీ రాముడు ఇప్పటిమధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న దండకారణ్యాన్ని చేరుకున్నారు.దండకారణ్యంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై దాదాపు పది సంవత్సరాలు విహరించాడు.

ఈ అరణ్యంలోని నదీనద తటాకాలు ఫలవృక్షసంపద వారినంతగా ఆకర్షించాయేమో? సత్నా ప్రాంతంలోని శర్భంగ, సుతీక్షణ మున్యాశ్రమాలను దర్శించుకుని నర్మదా మహానదీ తీరాల వెంబడి ప్రయాణిస్తూ అనేక మైన ఇతర మున్యాశ్రమాలను దర్శించుకుని వారు తిరిగి సుతీక్షణ ముని ఆశ్రమానికి చేరుకున్నారు.ఇప్పటికీ పన్నా, రాయపూర్,బస్తర్, జగదల్ పూర్ ప్రాంతాలలో మాండవ్య ఆశ్రమం, శ్రింగి ఆశ్రమం, రామలక్ష్మణ మందిరం కోటిమాహేశ్వర దేవాలయం వంటివి ఆ స్మృతి చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి. ఆ తరువాత అనేకమైనచిన్న చిన్న నదులూ వాగులూ సరస్సులూ కొండలూ దాటుకుంటూ శ్రీ రాముడు నాసిక్ ప్రాంతం లోని అగస్త్యముని ఆశ్రమం చేరుకున్నాడు.ఇక్కడి అగ్ని శాలలో తయారైన అనేకమైన శస్త్రాలను అగస్త్యుడు శ్రీరామునికి ఇచ్చాడని వాల్మీకి పేర్కొన్నాడు.

అగస్త్యాశ్రమం నుంచి బయల్దేరిన శ్రీ రాముడు నాసిక్ సమీపం లోని పంచవటి చేరుకున్నాడు.ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలుండడం వల్ల ప్రదేశానికా పేరు వచ్చింది.శూర్పణఖ వృత్తాతం, ఖరదూషణుల వధ జరిగిన ప్రాంతమిదే.(ఖరదూషణుల వధ క్రీ.పూ 5077 5077 అక్టోబరు 7 వ తేదీన జరిగిందని ఇంతకుముందే చెప్పుకున్నాం). ఈ ప్రాతంలో మారీచ వధ జరిగిన చోట మృగయాధీశ్వర్ వనేశ్వర్ అనే స్మృతి చిహ్నాలిప్పటికీ ఉన్నాయి. నాసిక్ పరిసరాల్లో రామాయణ గాథకు సంబంధించిన స్మృతి చిహ్నాలు—

సీతాసరోవరం రామకుండం,త్రయంబకేశ్వరం, జనస్థాన్ మొదలైనవి అనేకం ఉన్నాయి.సీతాపహరణం జరిగినదీ ప్రదేశం లోనే.సీతాపహరణం తర్వాత దారిలో తననడ్డగించిన జటాయువు రెక్కలను రావణుడు తృంచిన ప్రాంతం నేడు సర్వతీర్థమని పిలువబడుతోంది.ఇది నాసిక్ పట్టణానికి 56 కి.మీ. దూరంలోని తకేడ్ గ్రామం వద్ద ఉంది.

సీతాపహరణం తరువాత ఆమెను వెతుక్కుంటూ బయల్దేరిన రామ లక్ష్మణులు దారిలో జటాయువు కబంధులను కలుసుకున్నాక దక్షిణంగా పయనిస్తూ ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నారు. ఈ దారిలోనే వారు శబరి ఆశ్రమానికి రావడం, ఆమె ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. ఆ ఆశ్రమమున్న పంపాసరోవర ప్రాంతం నేడు కర్ణాటక రాష్ట్రం లోని బెల్గాం దగ్గరున్న సురేబన్ గా గుర్తించబడింది.ఈ ప్రాంతంలో ఇప్పటికీ రేగు చెట్లు అధికంగా ఉండడం విశేషం.(భక్త శబరి శ్రీ రాముని చేత తను కొరికి రుచి చూసిన రేగు పళ్ళను తినిపించిందన్నది ఐతిహ్యం). ఇక్కడినుండి మంచి మంచి గంధపు చెట్ల వనాలనూ మంచి సరస్సులనూ దాటుకుంటూ శ్రీ రామ లక్ష్మణులు ఋష్యమూకాన్ని చేరుకున్నారు. ఈ ఋష్యమూకం, కిష్కంధ ప్రస్తుత కర్నాటక బళ్ళారి జిల్లా లోని హంపీ ప్రాంతం.ఇక్కడే వారు హనుమాన్ సుగ్రీవులను కలుసుకోవడం వారు సీతమ్మ వారి నగలను చూపడం జరిగింది.

ఇక్కడ వాలిని సంహరించిన పిదప శ్రీ రాముడు వానర సేనతో కలసి దక్షిణ దిశగా సముద్రం వైపు ప్రయాణించాడు.మలయ పర్వతాన్నీ గంధపు వృక్షాల వనాల్నీ సరస్సులనూ దాటుకుంటూ కావేరీ తీరం చేరాడు.ఆ తర్వాత తిరుచ్చిరాపల్లి తంజావూరు రామనాథపురాల గుండా రామేశ్వరం చేరుకున్నాడు.

*****(చిత్రమైన విషయం ఏమిటంటే రామాయణంలో వాల్మీకి వర్ణించిన ప్రాంతాలన్నీ భౌగోళికం గా ఇప్పటికీ నిలిచి ఉన్న స్మృతి చిహ్నాలతో సరిగా సరి పోవడం. రామాయణంలో గంగా యమునల సంగమ ప్రాంతం గా చెప్పబడ్డ పరిసరాల్లో (కోల్డిహ్వా, ఝూసీ,హేటాపట్టి లలో) పురాతత్వ పరిశోధక శాఖ జరిపిన త్రవ్వకాల్లో ఈ ప్రాతం క్రీ.పూ. ఆరు ఏడు వేల సంవత్సరాలనుంచీ జనావాసాలుగా ఉండేవని గుర్తింపబడ్డాయి..త్రివేణీ సంగమ తీరంలో అలహాబాదులోని ఆనంద భవన్ (నెహ్రూ గారిఇల్లు) కి ఎదురుగా ఉండే ప్రాంతమే నాటి భరద్వాజ ఆశ్రమం. ఇక్కడా శృంగవేరపురాల్లోనూ జిరిపిన త్రవ్వకాల్లో రామాయణ గాథకు సంబందించిన ముఖ్య మైన ఆధారాలు లభ్యమయాయి.)


Friday 24 October 2014

WHEN AND HOW TO PREPARE ASTROLOGY CHART FOR NEW BORN


జాతకం ఎప్పుడు వేయించాలి?

ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. కొందరు అనేక అపోహలతో బిడ్డలకి 12 ఏళ్ళదాకా బాలారిష్టాలుంటాయి, అందుకే 12 ఏళ్ళు దాటితేగానీ జాతకం వేయించకూడదంటారు. కొందరు బిడ్డ పుట్టగానేనో, పురిటి స్నానం కాగానేనో, లేదా వీలయినంత తొందరగా వేయిస్తారు. 

బిడ్డ పుట్టిన తర్వాత 12 సంవత్సరాల వరకూ మాత్రమే బాలారిష్టాలుంటాయంటారు. నిజమే. మరి 12 సంవత్సరాలదాకా జాతకం వేయించకపోతే ఏమైనా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు వుంటే శాంతులు ఎప్పుడు చేయిస్తారు. అఫ్ కోర్స్ ఇవ్వన్నీ నమ్మకాలున్నవాళ్ళకేననుకోండి. కొన్ని సార్లు జన్మ నక్షత్రం బాగా లేదని శాంతి చేయిస్తారు.

అంతేకాదు. బిడ్డకి 12 సంవత్సరాలు వచ్చేదాకా ఏ చెడ్డ పని చేసినా దాని బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే బిడ్డ 12 సంవత్సరాలవరకు తల్లిదండ్రులపై ఆధారపడుతూ సొంత ఆలోచనావిధానం ఉండదు.అందుకే బిడ్డ పుట్టిన తర్వాత వీలయినంత త్వరలో జాతకం వేయిస్తే, ఏవైనా గ్రహ శాంతులు వగైరాలు అవసరమైతే చేయించవచ్చు. అదీగాక జాతకం ప్రకారం బిడ్డ ఎలాంటి మనస్తత్వం కలవాడై వుంటాడో కూడా తెలుస్తుంది. ఆ విషయాలు ముందు తెలుసుకోవటం ద్వారా ఆ బిడ్డని ఉత్తమ వ్యక్తిత్వం కల వ్యక్తిగా తీర్చి దిద్దటానికి తల్లిదండ్రులకి సహాయంగా వుంటాయి.

THE IMPORTANCE OF GARIKAMUNTHA IN ANDHRA MARRIAGE


"గరికె ముంత"

ఆంధ్ర దేశంలోనూ, రాయలసీమ లోనూ, తెలంగాణాలోనూ, కర్నాటక లోనూ కరగ అనే పేరుతోనూ తమిళంలో కరగం అనే పేరు తోనూ, ఇతర ఆంధ్ర ప్రాంత గరికె, గరిక, గరిగ,గరిగె అనే పేర్లు తోనూ ప్రచారంలో వుంది. 

ఈ గరగలను సేవించడం ద్వారా ఆమ్మవారిని సేవించి నట్లే భావింప బడుతుంది. గరిక అంటే కుండ అని అర్థం. ద్రౌపది తన వివాహ సమయంలో అనందావేశంతో ప్రక్క నున్న కలశాన్ని నెత్తిన పెట్టుకుని చిందులు వేసిందనీ, ఆ విధంగా అది పవిత్రం పొందిందనీ అంటారు. ఈ నాటికీ వివాహ సమయంలో అన్ని ప్రాంతాలలోనూ గరికె ముంత, గరిగె బుడ్డి (అలంకరించిన) ముంత, పెండ్లి సమయాలలో కుమ్మరి వారు అలివేణి కుండలతో పాటు ఈ గరిగె ముంతను కూడ అందంగా రంగులతో చిత్రిస్తారు. దీనిని ఎంతో పవిత్రంగా చూస్తారు. గరికె ముంత లేకుండా వివాహం జరపరు. ఆ ముంతతో పూజా విధాన ముగింపుతో దానిని తాకించి, మంత్రాలు చదువుతారు.

ఈ గరిక ముంత (బుడ్డి) ను పెండ్లికి ముందు రోజే కుమ్మరి ఇంటినుండి మేళ తాళాలతో వెళ్ళి కుమ్మరివారికి కానుకలు చెల్లించి ఇంటికి తెచ్చి ఒక గదిలో వుంచి దీపారాధన చేసి పూజిస్తారు. ముందుగా ఈ గరిగెలను పూజించటం గౌరి పూజగా భావిస్తారు. అంటే పెండ్లిండ్లలో గరిగె గౌరీమాతకు ప్రతీకగా పూజ నందుకుంటుంది. వివాహ సమయంలో గరిగెను దంపతుల ముందుంచి మరల పూజచేసి, వివాహాన్ని పూర్తి చేస్తారు. వివాహం జరిగినంత సేపూ గరిగె ముంత ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది. వధువు అత్తగారింటికి వెళ్ళే ముందు ఈ గరిగను వధువుతో పంపించి పెండ్లి తరువాత కూడ దానిని పవిత్రంగా చూస్తారు. గరిగ ముంతే గరగ గా మారిందంటారు.

GODDESS SRI MAHA LAKSHMI PRAYER FOR EACH RAASI HAVING SEPARATE MANTRAS - TELUGU ZODIAC SIGNS AND SYMBOLS


రాశిని బట్టి మంత్రాలు

లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, ఏ మంత్ర జపం చేయాలన్న విషయం వివరింపబడింది. శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం 
ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది. కొందరికి తమ జన్మరాశి తెలియక పోవచ్చు. వారి సౌకర్యార్థం, వారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా ఏ విధమైన మంత్రజపం చేసుకోవచ్చునన్న విషయం సూచించబడింది.

మేషం – చూ,చే,చో,లా,లీ,లూ,లె,లో,అ- ఓం ఏం క్లీం సోః

వృషభం – ఇ,ఉ,ఎ,ఓ,వా,వి,వూ,వె,వో- ఓం ఏం క్లీం శ్రీః:

మిథునం- కా,కీ,కూ,ఘ,చ,కె,కోహా -ఓం క్లీం ఏం సోః

కర్కాటకం- హీ,హో,హె,డా,డీ,డూ,డె,డో -ఓం ఏం క్లీం శ్రీ :

సింహం- మా,మీ, మూ,మె,మో,టా,టి,టూ,టె- ఓం హ్రీం ఏం సోః

కన్య- టో,పా,పీ,పూ,ప,ణ,ఠ,పె,పో- ఓం శ్రీం ఏం సోః

తుల- రా,రీ,రూ,రె,రో,తా,తీ,తూ,తె- ఓం హ్రీం క్లీం శ్రీం:

వృశ్చికం-తో,నా,నీ,నూ,నె,నో,యా,యీ,యూ- ఓం ఏం క్లీం సోః

ధనుస్సు-యె,యో,భా,భీ,భూ,ధా,ఫా,ఢా,భె – ఓం హ్రీం క్లీం సోః

మకరం- భో,జా,జీ,ఖీ,ఖూ,ఖె,ఖో,గా,గీ- ఓం ఏం క్లీం హ్రీం శ్రీం సోః

కుంభం-గూ,గె,గో,సా,సీ,సూ,సె,సో,దా- ఓం హ్రీం ఏం క్లీం శ్రీం :

మీనం- దీ,దూ,ధ,ఝ,దె,దో,చా,చీ- ఓం హ్రీం క్లీం సోః

Sunday 12 October 2014

KAMALA JUICE TASTE CHANGES AFTER BRUSHING WHY


రుచి మారిపోతుంది

పళ్లు తోముకోగానే కమలా పండు జ్యూస్‌ తాగితే నిమ్మకాయ కొరికిన రుచి ఉంటుంది. అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ అనే స్వచ్ఛందసంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ‘‘టూత్‌ పేస్ట్‌లో ఉండే సోడియం లౌరల్‌ సల్ఫేట్‌ అనే రసాయనమే ఇందుకు కారణం. ఈ రసాయనం టాయిలెట్‌లు శుభ్రం చేసే ఉత్పత్తుల్లో కూడా ఉంటుంది. టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకున్నాక ఈ రసాయనం రుచి మొగ్గలపై నిలిచి ఉంటుంది. అదలా ఉన్నప్పుడు కమలాపండు రసం తాగడం వల్ల ఇందులో ఉండే విటమిన్‌సితో రసాయనం కలిసి నిమ్మకాయను కొరికినప్పటి రుచి వస్తుంది’’ అని వివరించారు పరిశోధకులు.

LIST OF NAMES OF LORD SRI ANJANEYA SWAMY NINE AVATHARS


ఆంజనేయస్వామి అవతారాలెన్నో మీకు తెలుసా 
ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు.

1. ప్రసన్నాంజనేయస్వామి
2. వీరాంజనేయస్వామి
3. వింశతి భుజ ఆంజనేయస్వామి
4. పంచముఖ ఆంజనేయస్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి
6. సువర్చలాంజనేయస్వామి
7. చతుర్బుజ ఆంజనేయస్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.

నవ అవతార ఆంజనేయస్వామి ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం.

Sri Lalitha Trisati Stotram


Sri Lalitha Trisati Stotram - శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరత్నం
శ్రీలలితాత్రిశతీస్తోత్రం
సూత ఉవాచ-
అస్య శ్రీలలితాత్రిశతీస్తోత్రమహామంత్రస్య - భగవాన్ హయగ్రీవఋషిః - అనుష్టుప్ ఛందః శ్రీలలితామహాత్రిపురసుందరీ దేవతా - ఐం బీజం - సౌః శక్తిః - క్లీం కీలకం - మమ చతుర్విధ పురుషార్థఫలసిద్ధ్యర్థే జపే వినియోగః |
ఐమిత్యాదిభిరంగన్యాసకరన్యాసాః కార్యాః |

ధ్యానం-
అతిమధురచాపహస్తామ్ అపరిమితామోదబాణసౌభాగ్యామ్ |
అరుణామతిశయకరుణామ్ అభినవకులసుందరీం వందే |
శ్రీ హయగ్రీవ ఉవాచ-
కకారరూపా కళ్యాణీ కళ్యాణగుణశాలినీ |
కళ్యాణశైలనిలయా కమనీయా కళావతీ || ౧ ||
కమలాక్షీ కల్మషఘ్నీ కరుణామృతసాగరా |
కదంబకాననావాసా కదంబకుసుమప్రియా || ౨ ||
కందర్పవిద్యా కందర్పజనకాపాంగవీక్షణా |
కర్పూరవీటిసౌరభ్యకల్లోలితకకుప్తటా || ౩ ||
కలిదోషహరా కంజలోచనా కమ్రవిగ్రహా |
కర్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్మఫలప్రదా || ౪ ||
ఏకారరూపా చైకాక్షర్యేకానేకాక్షరాకృతిః |
ఏతత్తదిత్యనిర్దేశ్యా చైకానందచిదాకృతిః || ౫ ||
ఏవమిత్యాగమాబోధ్యా చైకభక్తిమదర్చితా |
ఏకాగ్రచిత్తనిర్ధ్యాతా చైషణారహితాద్దృతా || ౬ ||
ఏలాసుగంధిచికురా చైనఃకూటవినాశినీ |
ఏకభోగా చైకరసా చైకైశ్వర్యప్రదాయినీ || ౭ ||
ఏకాతపత్రసామ్రాజ్యప్రదా చైకాంతపూజితా |
ఏధమానప్రభా చైజదనేజజ్జగదీశ్వరీ || ౮ ||
ఏకవీరదిసంసేవ్యా చైకప్రాభవశాలినీ |
ఈకారరూపా చేశిత్రీ చేప్సితార్థప్రదాయినీ || ౯ ||
ఈద్దృగిత్యవినిర్దేశ్యా చేశ్వరత్వవిధాయినీ |
ఈశానాదిబ్రహ్మమయీ చేశిత్వాద్యష్టసిద్ధిదా || ౧౦ ||
ఈక్షిత్రీక్షణసృష్టాండకోటిరీశ్వరవల్లభా |
ఈడితా చేశ్వరార్ధాంగశరీరేశాధిదేవతా || ౧౧ ||
ఈశ్వరప్రేరణకరీ చేశతాండవసాక్షిణీ |
ఈశ్వరోత్సంగనిలయా చేతిబాధావినాశినీ || ౧౨ ||
ఈహావిరాహితా చేశశక్తిరీషత్స్మితాననా |
లకారరూపా లలితా లక్ష్మీవాణీనిషేవితా || ౧౩ ||
లాకినీ లలనారూపా లసద్దాడిమపాటలా |
లలంతికాలసత్ఫాలా లలాటనయనార్చితా || ౧౪ ||
లక్షణోజ్జ్వలదివ్యాంగీ లక్షకోట్యండనాయికా |
లక్ష్యార్థా లక్షణాగమ్యా లబ్ధకామా లతాతనుః || ౧౫ ||
లలామరాజదళికా లంబముక్తాలతాంచితా |
లంబోదరప్రసూర్లభ్యా లజ్జాఢ్యా లయవర్జితా || ౧౬ ||
హ్రీంకారరూపా హ్రీంకారనిలయా హ్రీంపదప్రియా |
హ్రీంకారబీజా హ్రీంకారమంత్రా హ్రీంకారలక్షణా || ౧౭ ||
హ్రీంకారజపసుప్రీతా హ్రీంమతీ హ్రీంవిభూషణా |
హ్రీంశీలా హ్రీంపదారాధ్యా హ్రీంగర్భా హ్రీంపదాభిధా || ౧౮ ||
హ్రీంకారవాచ్యా హ్రీంకారపూజ్యా హ్రీంకారపీఠికా |
హ్రీంకారవేద్యా హ్రీంకారచింత్యా హ్రీం హ్రీంశరీరిణీ || ౧౯ ||
హకారరూపా హలధృత్పూజితా హరిణేక్షణా |
హరప్రియా హరారాధ్యా హరిబ్రహ్మేంద్రవందితా || ౨౦ ||
హయారూఢాసేవితాంఘ్రిః హయమేధసమర్చితా |
హర్యక్షవాహనా హంసవాహనా హతదానవా || ౨౧ ||
హత్యాదిపాపశమనీ హరిదశ్వాదిసేవితా |
హస్తికుంభోత్తుంగకుచా హస్తికృత్తిప్రియాంగనా || ౨౨ ||
హరిద్రాకుంకుమాదిగ్ధా హర్యశ్వాద్యమరార్చితా |
హరికేశసఖీ హాదివిద్యా హాలామదాలసా || ౨౩ ||
సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగళా |
సర్వకర్త్రీ సర్వభర్త్రీ సర్వహంత్రీ సనాతనీ || ౨౪ ||
సర్వానవద్యా సర్వాంగసుందరీ సర్వసాక్షిణీ |
సర్వాత్మికా సర్వసౌఖ్యదాత్రీ సర్వవిమోహినీ || ౨౫ ||
సర్వాధారా సర్వగతా సర్వావగుణవర్జితా |
సర్వారుణా సర్వమాతా సర్వాభూషణభూషితా || ౨౬ ||
కకారార్థా కాలహంత్రీ కామేశీ కామితార్థదా |
కామసంజీవినీ కల్యా కఠినస్తనమండలా || ౨౭ ||
కరభోరుః కళానాథముఖీ కచజితాంబుదా |
కటాక్షస్యందికరుణా కపాలిప్రాణనాయికా || ౨౮ ||
కారుణ్యవిగ్రహా కాంతా కాంతిధూతజపావళిః |
కలాలాపా కంబుకంఠీ కరనిర్జితపల్లవా || ౨౯ ||
కల్పవల్లీసమభుజా కస్తూరీతిలకాంచితా |
హకారార్థా హంసగతిః హాటకాభరణోజ్జ్వలా || ౩౦ ||
హారహారికుచాభోగా హాకినీ హల్యవర్జితా |
హరిత్పతిసమారాధ్యా హఠాత్కారహతాసురా || ౩౧ ||
హర్షప్రదా హవిర్భోక్త్రీ హార్దసంతమసాపహా |
హల్లీహాలాస్యసంతుష్టా హంసమంత్రార్థరూపిణీ || ౩౨ ||
హానోపాదాననిర్ముక్తా హర్షిణీ హరిసోదరీ |
హాహాహూహూముఖస్తుత్యా హానివృద్ధివివర్జితా || ౩౩ ||
హయ్యంగవీనహృదయా హరికోపారుణాంశుకా |
లకారాఖ్యా లతాపూజ్యా లయస్థిత్యుద్భవేశ్వరీ || ౩౪ ||
లాస్యదర్శనసంతుష్టా లాభాలాభవివర్జితా |
లంఘ్యేతరాజ్ఞా లావణ్యశాలినీ లఘుసిద్ధిదా || ౩౫ ||
లాక్షారససవర్ణాభా లక్ష్మణాగ్రజపూజితా |
లభ్యేతరా లబ్ధభక్తిసులభా లాంగలాయుధా || ౩౬ ||
లగ్నచామరహస్తశ్రీశారదాపరివీజితా |
లజ్జాపదసమారాధ్యా లంపటా లకులేశ్వరీ || ౩౭ ||
లబ్ధమానా లబ్ధరసా లబ్ధసంపత్సమున్నతిః |
హ్రీంకారిణీ హ్రీంకరిది-ర్హ్రీంమధ్యా హ్రీంశిఖామణిః || ౩౮ ||
హ్రీంకారకుండాగ్నిశిఖా హ్రీంకారశశిచంద్రికా |
హ్రీంకారభాస్కరరుచిః హ్రీంకారాంభోదచంచలా || ౩౯ ||
హ్రీంకారకందాంకురికా హ్రీంకారైకపరాయణా |
హ్రీంకారదీర్ఘికాహంసీ హ్రీంకారోద్యానకేకినీ || ౪౦ ||
హ్రీంకారారణ్యహరిణీ హ్రీంకారావాలవల్లరీ |
హ్రీంకారపంజరశుకీ హ్రీంకారాంగణదీపికా || ౪౧ ||
హ్రీంకారకందరాసింహీ హ్రీంకారాంభోజభృంగికా |
హ్రీంకారసుమనోమాధ్వీ హ్రీంకారతరుమంజరీ || ౪౨ ||
సకారాఖ్యా సమరసా సకలాగమసంస్తుతా |
సర్వవేదాంతతాత్పర్యభూమిః సదసదాశ్రయా || ౪౩ ||
సకలా సచ్చిదానందా సాధ్యా సద్గతిదాయినీ |
సనకాదిమునిధ్యేయా సదాశివకుటుంబినీ || ౪౪ ||
సకాలాధిష్ఠానరూపా సత్యరూపా సమాకృతిః |
సర్వప్రపంచనిర్మాత్రీ సమనాధికవర్జితా || ౪౫ ||
సర్వోత్తుంగా సంగహీనా సద్గుణా సకలేష్టదా |
కకారిణీ కావ్యలోలా కామేశ్వరమనోహరా || ౪౬ ||
కామేశ్వరప్రాణనాడీ కామేశోత్సంగవాసినీ |
కామేశ్వరాలింగితాంగీ కామేశ్వరసుఖప్రదా || ౪౭ ||
కామేశ్వరప్రణయినీ కామేశ్వరవిలాసినీ |
కామేశ్వరతపస్సిద్ధిః కామేశ్వరమనఃప్రియా || ౪౮ ||
కామేశ్వరప్రాణనాథా కామేశ్వరవిమోహినీ |
కామేశ్వరబ్రహ్మవిద్యా కామేశ్వరగృహేశ్వరీ || ౪౯ ||
కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వరమహేశ్వరీ |
కామేశ్వరీ కామకోటినిలయా కాంక్షితార్థదా || ౫౦ ||
లకారిణీ లబ్ధరూపా లబ్ధధీర్లబ్ధవాంచితా |
లబ్ధపాపమనోదూరా లబ్ధాహంకారదుర్గమా || ౫౧ ||
లబ్ధశక్తిర్లబ్ధదేహా లబ్ధైశ్వర్యసమున్నతిః |
లబ్ధబుద్ధిర్లబ్ధలీలా లబ్ధయౌవనశాలినీ || ౫౨ ||
లబ్ధాతిశయసర్వాంగసౌందర్యా లబ్ధవిభ్రమా |
లబ్ధరాగా లబ్ధగతిర్లబ్ధనానాగమస్థితిః || ౫౩ ||
లబ్ధభోగా లబ్ధసుఖా లబ్ధహర్షాభిపూజితా |
హ్రీంకారమూర్తి-ర్హ్రీంకారసౌధశృంగకపోతికా || ౫౪ ||
హ్రీంకారదుగ్ధాబ్ధిసుధా హ్రీంకారకమలేందిరా |
హ్రీంకారమణిదీపార్చిః హ్రీంకారతరుశారికా || ౫౫ ||
హ్రీంకారపేటకమణిః హ్రీంకారాదర్శబింబికా |
హ్రీంకారకోశాసిలతా హ్రీంకారాస్థాననర్తకీ || ౫౬ ||
హ్రీంకారశుక్తికాముక్తామణి-ర్హ్రీంకారబోధితా |
హ్రీంకారమయసౌవర్ణస్తంభవిద్రుమపుత్రికా || ౫౭ ||
హ్రీంకారవేదోపనిషద్ హ్రీంకారాధ్వరదక్షిణా |
హ్రీంకారనందనారామనవకల్పకవల్లరీ || ౫౮ ||
హ్రీంకారహిమవద్గంగా హ్రీంకారార్ణవకౌస్తుభా |
హ్రీంకారమంత్రసర్వస్వా హ్రీంకారపరసౌఖ్యదా || ౫౯ ||