WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 6 July 2016

BEAUTY WITH HOT WATER


 అందానికి గోరువెచ్చని నీళ్లు

ముఖాన్ని అందంగానే కాదు, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఇంతకీ అవేంటంటే..

* వాతావరణం ఏ మాత్రం చల్లగా ఉన్నా.. వేణ్నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటాం. అలాగే ఏ మాత్రం ఎండగా అనిపించినా చల్లనినీళ్లను ముఖంపై చల్లుకుంటాం. నిపుణుల ప్రకారం రెండూ సరికావు. మరీ వేడిగా, అలాగని చల్లగా కాకుండా ఏ రుతువులోనైనా గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవడం శ్రేయస్కరం.

* సున్నితమైన చర్మాన్ని అదేపనిగా రుద్దడం వల్ల ఎర్రగా కందిపోతుంది. చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగించేందుకు అదేపనిగా రుద్దాలని లేదు. కేవలం మునివేళ్లతో మర్దన చేసుకుని, తరవాత కడిగేస్తే చాలు.

* ముఖంలో పేరుకున్న మురికీ, క్రిములు పూర్తిగా తొలగిపోవాలంటే ముందుగా మేకప్‌ని పూర్తిగా తుడిచేయాలి. క్లెన్సర్లు మేకప్‌ని తొలగించవు కాబట్టి మేకప్‌ రిమూవర్‌ని ఎంచుకుంటే మంచిది. ఆ తరవాతే ముఖాన్ని కడుక్కోవాలి.

* సబ్బులు చేతులూ, శరీరానికి మేలు చేస్తాయి కానీ, ముఖానికి కాదు. వాటి గాఢత చర్మం బరకగా మారేలా చేస్తుంది. అందుకే ముఖానికి మాత్రం ఫేషియల్‌ క్లెన్సర్‌ని వాడాల్సి ఉంటుంది. అది కూడా మన చర్మతత్వానికి నప్పేదై ఉండాలి.

* ముఖాన్ని శుభ్రం చేసుకునే ముందు చేతుల్ని కడుక్కోవాలి. లేదంటే చేతుల్లోని మురికీ, క్రిములు ముఖంలోకి చేరతాయి. దాంతో మొటిమలు మొదలవుతాయి.

* కొందరు రోజంతా అదేపనిగా ముఖాన్ని కడుక్కుంటూ ఉంటారు. కానీ అది సరైన పనికాదు. అలా చేయడం వల్ల చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అతిగా శుభ్రం చేయడం వల్ల కూడా చర్మంలో అధిక నూనెలు విడుదలై ఇబ్బంది పెడతాయి.

No comments:

Post a Comment