WORLD FLAG COUNTER

Flag Counter

Monday 30 November 2015

OM NAMAH SIVAYA TELUGU PRAYER


ఓం శివయ ఓం శివాయ ఓం నమశ్శివాయ
చిదంబరాన చిరువనాన
నగరాజ తనయ నాన రత్న విభూషితయై
నటనమాడె నటరాజు నాగభూషణుని కూడి
శివజ్యోతి తత్వమై అఖండ జ్యోతియై అనంతమంత ఆక్రమించె
అర్ధనారీశ్వరియై సృష్టికి నాందిపలికె
ఆనంద స్వరూపునితో కూడి అంబ అమృతవర్షిణియై
శుద్ధ విద్యా సమన్వితుని శక్తియై ఙ్ఞానసముదాయినియై
మాయాశక్తిసంభూతిని మాయాశక్తియై కాలచక్రము త్రిప్పె
పంచాక్షరుని ప్రణవనాదమై శూన్యమెల్లనిండె
నటన సాగె శివ శక్తులేకమయి
పావన సురగంగ పరవళ్ళతొ పద్మముఖి పార్వతిపై ముత్యాలొలికె
భవుని నాగాభరణాలు భవాని కంఠాభరణాలతొ వింత వింత రంగులొలికె
వ్యాఘ్ర చర్మధారి కదలికలు మహా వ్యాఘ్రమై తోచె
కనకాంబరధారి కనక మణిమయ కాంతులతొ కలసిపోయె
మహా భయంకర ఢమరుక ధ్వనులను తన హస్తవిన్యాసములతొ శ్రుతి జేసె
శివకామసుందరి శివకామియై సుందరేశుని కూడి
అసురశక్తులను తనపాదముల నణచి నటనమాడే
వాణి వీణ మీట నారాయణుండు నాదమూద
బ్రహ్మ తాళమేయ నారదుని సామగానములొ
సుర గంధర్వ కిన్నెరాదులు వంతపాడ
సత్యం శివం సుందరమై నటనమాడె
ఓం నమశ్శివాయ ఓం శివాయ ఓం శివయ

ఓం నిధన పతయే నమ ! ఓం నిధన పతాంతికాయ నమః !! 
ఓం ఊర్దాయ నమః ! ఓం ఊర్ధలింగాయ నమః!!
ఓం హిరణ్యాయ నమః ! ఓం హిరణ్య లింగాయ నమః!! 
ఓం సువర్ణాయ నమః ! ఓం సువర్ణలింగాయ నమః!!
ఓం దివ్యాయ నమః! ఓం దివ్యలింగాయ నమః!! 
ఓం భవాయ నమః ! ఓం భవలింగాయ నమః !!
ఓం సర్వాయ నమః! ఓం సర్వలింగాయ నమః !! 
ఓం శివాయ నమః ! ఓం శివలింగాయ నమః !!
ఓం జ్వాలాయ నమః ! ఓం జ్వలలింగాయ నమః !! 
ఓం ఆత్మయ నమః! ఓం ఆత్మలింగాయ నమః !!
ఓం పరమాయ నమః ! ఓం పరమలింగాయ నమః
ఓం భవాయ దేవయ నమః ! ఓం శర్వాయ దేవాయ నమః !
ఓం ఈశానాయ దేవాయ నమః ! ఓం పశుపతయే దేవాయ నమః !!
ఓం రుద్రాయ దేవాయ నమః 1 ఓం ఉగ్రాయ దేవాయ నమః !!
ఓం భీమాయ దేవాయ నమః ! ఓం మహాతే దేవాయ నమః !!
ఓం భవస్య దేవస్య పత్న్యై నమః! ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ! ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః !!
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ! ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ! ఓం మహతో దేవస్య పత్న్యై నమః !!
(శివయ్య అభిషేక ప్రియుండు, ఆయనకు చేసే అభిషేక ఫలితాలు) 
శివుని శిరమున కాసిన్ని నీళ్లుజల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేనువతడి గాడి పసర
మల్ల సురశాభి వానింట మల్లెచెట్టు
నెయ్యి - కీర్తి, ఆరోగ్యం
తేనె - తేజస్సు
చెరకు రసం - ధన సంవృధ్ది
పంచదార - దుఃఖ నాశనం
కొబ్బరి నీళ్ళు - సర్వసంపదలవృద్ది
భస్మజలం - మహాపాప వినాశం
నవరత్న జలం - ధనధాన్య బహుపుత్రలాభం
మామిడి పళ్ల రసం - చర్మవ్యాదుల నిర్మూలనం
పసుపు నీళ్లు - సౌభాగ్యం
నువ్వుల నూనె - అపమృత్యు భయ నాశనం
పుష్పోదకం - భూలాభం
బిల్వజలం - భోగభాగ్యాలు
రుద్రాక్షోదకం - ఐశ్వర్య ప్రాప్తి
గరిక, వట్టివేరు జలం - ధన కనక వస్తువాహనం

No comments:

Post a Comment