WORLD FLAG COUNTER

Flag Counter

Sunday 1 February 2015

LORD SRI RAMA - LORD HANUMAN'S SUNDARA KANDA - RAMAYAN STORIES IN TELUGU


శ్రీ రామః
(సుందర కాండము)

రామాయణం
రామాయాః అయనమ్ = రాముని యొక్క చరిత్రము రామాయణము

రామః అయ్యతే ఇతి రామాయణమ్
అనగా దీనిని పఠించినవారు రాముని వలె ధర్మశీలురై జీవనము గడిపి
కడకు వైకుంఠ ప్రాప్తి పొందుదురు

శ్రీరాముడు మానవాళికి ఆవశ్యములగు పుత్ర ధర్మము, మిత్ర ధర్మము, భ్రాతృ ధర్మము(సోదర), భర్తృ ధర్మము(భర్త), శిష్య ధర్మము, క్షాత్ర ధర్మము, శతృ ధర్మము, మొదలగు అన్ని ధర్మములను తానే స్వయముగా ఆచరించి లోకానికి మార్గదర్శకుడాయెను
సీతా మాతయు స్త్రీలకు ఆచరణీయమగు సమస్త ధర్మములను నిజజీవితంలో ఆచరించి లోకమునకు ప్రకటించెను

రామాయణం కావ్యమగుటచేత ఇది ఒక ధర్మశాస్త్ర గ్రంథమైనది

మానవుని జీవితంలో ధర్మము, అర్థము, కామ్యము, అను మూడు పురుషార్థములను సాధింపదగినవి, ఈ త్రివర్గమునకు ధర్మము మూలమి,ధర్మ బద్ధము గాని రెండును అనర్ధ హేతువులు ధర్మమునకు విరుద్ధమైన పచ్చి స్వార్థముతో భరతునకు రాజ్యమును కట్టబెట్టచూసిన కైక నలుగురిలో నవ్వులపాలై లోక నిందకు గురియైనది అట్లే ధర్మమును వీడి కామాతురుడు పరసతులను ఆసించిన దుష్ట రావణుడు లోకమున అపకీర్తి పాలయ్యెను సపరివారముగా నశించెను
ధర్మ భద్ధుడై రాజ్యమునే పరిత్యజించిన శ్రీ రాముడు సకల లోకాలకు మార్ధర్శకుడే కాక లోకారాధ్యుడాయెను

కావుననే

"రామో విగ్రహవాన్ ధర్మః"
(శ్రీ రాముడు మూర్తీభవించిన ధర్మము)
అని వాల్మికి మహర్షి నుడివెను

అందువలననే

"ధర్మో రక్షతి రక్షితః"
(ధర్మమును ఆశ్రయించిన వానిని ఆ ధర్మమే కాపాడును)
అను సూక్తి ఏర్పడినది

శ్రీ రామాదుల బాల్యలీలలబు వర్ణించినందున అది "బాలాకాండము"గా
పట్టాభిషేక సన్నివేశాలు అయోధ్య నగరమున సంభవించేను కనుక అది "అయోధ్య కాండము"గా
సీతారాముల అరణ్యవాస విశేషాలను వివరించెను కనుక అది "అరణ్య కాండము"గా
రామ సుగ్రీవుల మైత్రి, వాలి వధ మొదలగునవి కిష్కంద యందు జరుగుటచే అది "కిష్కింధ కాండము" గా
రామ రావణుల యుద్ధ ప్రాముఖ్యముతో అది "యుద్ధ కాండము" గా ప్రసిద్ధిచెందగా
కిష్కందకాండము యుద్ధకాండమునకు మధ్యన కల వస్తు సౌందర్యము సీతా రామ హనుమదాదుల సౌందర్యము హనుమంతునకు సీతాన్వేషణలో ఎదురైన ఘట్టముల వైభవమును లంకా సౌందర్యము అశోకవన సౌందర్యము మున్నగు వర్ణములను "సుందరకాండము"గా అభివర్ణించిరి

సుందరాకాండము:

"సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం"

పురుష మోహనాకారుడు, సుగుణ సుందరుడు శ్రీరాముడు
సర్వ విధముల భువనైక సుందరీ సీతామాత
కాంచనాద్రి కమనీయ విగ్రహుడు పరమ సుందరుడు హనుమంతుడు
అతొలోక సుందరము అశోకవనము
శ్రీ సీతా రామ హనుమంతుల మంత్రముకు దివ్య పరమ సుందరములు
మహితాత్ముల కథ సర్వాద్భుత సుందరము
సుందరకాండము బహుముఖ వైభవ వర్ణన కల కవిత్వ కావ్యం అత్యంత సుందరము కనుక సుందర కాండము నందు "సుందరము" కానిదేది..??
సర్వము సుందరమే...

అంతటి మహత్తరమైన సుందరకాండము నియమ నిష్టతో పారయణము చేయుట వలన సుఖల దుఃఖములు నివారణమగును సకల మనోరథములు సిద్ధించును
హరిషడ్వర్గములు జయించును బ్రహ్మ జ్ఞానము పొందగలరు
అంతయే కాక అశ్వమేధ యాగఫలాన్ని పొందునని వాల్మీకి వాక్యము..

"శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష"

No comments:

Post a Comment