WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 31 May 2016

HAPPY LIFE TIPS IN TELUGU


ఆరొగ్యవంతమైన జీవితానికి నియమాలు

1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి
జ. గోరు వెచ్చనివి.
2.నీరు త్రాగేవిధానము
జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి
జ.32 సార్లు.
4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి
జ. ఉదయం.
5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి
జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.
6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి
జ. ఫల రసాలు(fruit juice).
7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి
జ. లస్సీ, మజ్జిగ.
8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి
జ. పాలు.
9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు
జ. రాత్రి.
10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి
జ. ఎప్పుడూ తినకూడదు.
11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను
జ. గంట తర్వాత.
12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )
జ. త్రాగకూడదు.
13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి
జ. 40 ని.
14.రాత్రి పూట ఎంత తినాలి
జ. చాలా తక్కువగా, అసలు తిననట్టు.
15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి
జ. సూర్యాస్తమయం లోపు.
16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి
జ. 48 ని.
17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా
జ. త్రాగకూడదు.
18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి
జ. పని.
19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. విశ్రాంతి తీసుకోవాలి.
20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. 500 అడుగులు నడవాలి.
21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి
జ. వజ్రాసనం వేయాలి.
22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి
జ. 5 - 10 ని.
23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి
జ. లాలాజలం,( saliva ).
24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి
జ. 9 - 10 గం.
25. 3 విషముల పేర్లు
జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.
26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి
జ. వాము.
27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా
జ. తినరాదు.
28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి
జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి .
29. విదేశీ వస్తువులను కోనవచ్చునా
జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .‌
30. టీ ఎప్పుడు త్రాగాలి
జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.
31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి
జ. పసుపు.
32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి
జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.
33. ఏ చికిత్సా విధానం మంచిది
జ. ఆయుర్వేదం.
34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో).
35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).
36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).
37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి
జ. సుమారు 2,3 గ్లాసులు.
38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి
జ. సూర్యోదయాని 1.30 ముందుగా.

WASHING MACHINE USAGE TIPS - HOW TO USE WASHING MACHINE PROPERLY AND PERFECTLY


వాషింగ్ మెషీన్‌లో దుస్తులు ఉతికేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో తెలుసుకోండి..!
ఒక‌ప్పుడంటే స‌బ్బు పెట్టి రుద్ది రుద్ది బ‌ట్ట‌లు ఉతుక్కునే వారు కానీ ఇప్పుడు దాదాపు ఎక్క‌డా చూసినా ప్ర‌తి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్‌నే వాడుతున్నారు. దుస్తుల‌న్నింటినీ మెషీన్‌లో వేయ‌డం, డిట‌ర్జెంట్ క‌ల‌ప‌డం, ఉత‌కడం, డ్రై చేయ‌డం ఇలా అన్నీ ఇప్పుడు ఆటోమేటిక్‌గా అయిపోతున్నాయి. ఈ క్ర‌మంలో చాలా మంది వాషింగ్ మెషీన్ ద్వారా సుల‌భంగా బ‌ట్ట‌ల‌ను ఉతుకుతున్నారు కానీ, కొన్ని చిన్న చిన్న పొర‌పాట్లు చేస్తున్నారు. దీని వ‌ల్ల దుస్తులు త్వ‌ర‌గా పాడైపోవ‌డ‌మో, పోగులు బ‌య‌టికి వ‌చ్చి రంగు పోవ‌డ‌మో జ‌రుగుతోంది. అయితే కింద ఇచ్చిన ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే దుస్తుల‌ను ఎంతో కాలం మ‌న్నికగా, శుభ్రంగా ఉంచుకోవ‌చ్చు. ఆ జాగ్ర‌త్త‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రెడీమేడ్‌గా కొన్న దుస్తులైనా, కుట్టించుకున్న వైనా వాటి మీద లేబుల్స్ క‌చ్చితంగా ఉంటాయి. ఆ లేబుల్స్‌పై స‌ద‌రు దుస్తుల‌ను ఎలా ఉత‌కాలో రాసి ఉంటుంది. ఆ ప్ర‌కారం దుస్తుల్ని ఉతికితే చాలు. అవి ఎంతో కాలం మ‌న్నిక‌గా ఉంటాయి. రంగు కూడా పోవు.
2. సాధార‌ణంగా ప్యాంట్ల‌ను ఉతికేట‌ప్పుడు వాటిని వాషింగ్ మెషీన్‌లో అలాగే వేస్తారు. దీని వ‌ల్ల ఆ ప్యాంట్ల‌కు ఉండే జిప్పులు ఇత‌ర దుస్తుల‌కు ఇరుక్కుని అవి కూడా పాడైపోతాయి. దీన్ని నివారించాలంటే ప్యాంట్ జిప్‌ను పూర్తిగా పైకి లాగి జిప్‌ను పై వైపుకు వ‌చ్చేలా ఉంచాలి. దీని వ‌ల్ల ఆ జిప్ అలాగే ఉండి ఇత‌ర దుస్తుల‌కు అంటుకోదు.
3. వాషింగ్ మెషీన్‌లో దుస్తుల‌ను వేసేట‌ప్పుడు వాటి లోప‌లి వైపు బ‌య‌టికి వ‌చ్చేలా దుస్తుల‌ను తిప్పి మెషీన్‌లో వేయాలి. దీని వ‌ల్ల అవి మెషీన్‌లో సుల‌భంగా తిరుగుతాయి. మురికి కూడా సుల‌భంగా వ‌దిలిపోతుంది.
4. వాషింగ్ మెషీన్‌లో డిటర్జెంట్‌ను స‌రైన మోతాదులోనే వాడాలి. త‌క్కువ‌గా వాడితే దుస్తులు శుభ్రం అవ‌వు. అదే డిటర్జెంట్ ఎక్కువైతే అది దుస్తుల నుంచి అంత సుల‌భంగా వ‌ద‌లదు. దీంతో ఎక్కువ సేపు దుస్తుల‌ను ఉత‌కాల్సి వ‌స్తుంది. దీని వల్ల దుస్తులు పాడ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.
5. మ‌ర‌క‌లు అంటిన దుస్తుల‌ను విడిగా ఉతికితేనే మంచిది. లేదంటే ఆ మ‌ర‌క‌లు ఇత‌ర దుస్తులకు అంటుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.
6. డిట‌ర్జెంట్‌తోపాటు ఫ్యాబ్రిక్ సాఫ్టెన‌ర్‌ను కూడా వాడ‌డం ఉత్త‌మం. ఎందుకంటే అది దుస్తుల రంగును పోనివ్వ‌దు. దీనికి తోడు దుస్తులు ఎక్కువ కాలం మ‌న్నుతాయి. పోగులు కూడా అంత త్వ‌ర‌గా రావు.
7. వాషింగ్ మెషీన్‌పై ఉన్న సెట్టింగ్స్‌ను క‌చ్చితంగా పాటించాలి. ఏయే ర‌క‌మైన దుస్తుల‌కు ఎలాంటి సెట్టింగ్స్ స‌రిపోతాయో చూసుకుని వాడితే దుస్తులు ఎక్కువ కాలం మ‌న్నుతాయి.
8. వాషింగ్ మెషీన్‌లో ఉన్న డ్రైయ‌ర్ కంటే దుస్తుల‌ను స‌హ‌జ సిద్ధంగా ఆరుబ‌య‌ట ఆరేయ‌డం మంచిది. దీని వల్ల కూడా దుస్తులు ఎక్కువ కాలం మ‌న్నుతాయి.
9. దుస్తులను ఒక‌సారి వేసుకున్న త‌రువాత చెమ‌ట వాస‌న రావ‌డం లేదు కదా అని వాటిని కొంద‌రు మ‌ళ్లీ మ‌ళ్లీ వేసుకుంటుంటారు. అయితే అలా చేయ‌కూడ‌దు. మ‌న శ‌రీరం నుంచి చెమ‌ట వ‌చ్చినా, రాకున్నా దుస్తుల‌ను ఒకసారి వేసుకున్నాక క‌చ్చితంగా ఉత‌కాల్సిందే. అలా చేస్తేనే అవి ఎక్కువ రోజులు వ‌స్తాయి.

LORD SIVA WITH KAPALAM STORY IN TELUGU


శంకరుడు కాపాలమును ధరించిన కథ ?

.దేవాడిదేవుడగు ఈశ్వరుడు కాపాలమును ధరించి బిచ్చం ఎత్తుకోవడానికి కారణం ఏమిటి మాకు తెలుపవాలిసినది అని పులస్త్య మునీంద్రుని నారదుడు అడుగగా ఈ విధముగా వివరించెను లోకమంతా ఏకార్ణవమై నశించి కాఱు చీకట్లు కమ్ముకొని ఉండెను వేయిసంవత్సరములు గడిచిన తదుపరి ఆ రాత్రి విష్ణువు నిదరించెను అతడు కొన్ని సంవత్సరాల తరువాత నిద్రనుండి లేచి బ్రహ్మ ను సృజించేను అతడు వేదవేదాంగములను తెలుసుకొని సృష్టికర్తగా అయిదు ముఖములతోఉదయించేను అతని తరువాత మరియొక విచిత్రమైన పురుషుడు ఉదయించేను అతడే త్రినేత్రుడు త్రిశూలాధారి జటాదారి తమొగుణమయుడు జపమాలను ధరించి కనిపించేను అతని వెంటనే విష్ణువు అహంకారమును పుట్టించేను బ్రహ్మయు హరుడు ఆ అహంకారమునకు లొంగిపోయెను అంతట శంకరుడు బ్రహ్మయు నివెవరావు అంటే నివేవారవని వాదులాడుకోసాగిరి అప్పుడే కదరా నీవు వీణతో కూడా పుట్టి మధురంగా.గానము చేయుచు ఆకాశమునా సంచరించితివి అట్లు వాడులాడుకొనుచు శంకరునికి నిలపడిపోయేను బ్రహ్మ అపుడు నీవు తమొగుణమూర్తివి దిగంబరుడవు విషమనేత్రుడవు ఎద్దునెక్కి తిరుగువాడవు లోకములను సంహరింతువు అని శివుణ్ణి గూర్చి పలుకగా ఆ రుద్రుడు కన్నులెర్రచేసి లోకాన్ని భస్మం చేయుదునని బ్రహ్మ వంక చూసేనుఅపుడు ఈశ్వరుడు అయిదు ముఖములు వరుసగా తెలుపు ఎరుపు బంగారంరంగు అవాదాతాము నలుపు అయిదు రంగులుగ మారెను అది ఎవరుచూడటానికి విలుకాకుండా ఉండెను అంతటా ఆ బ్రహ్మ ఓరి నీవు బుద్ధి హినుడవు బలహీనుడవు నీకు పరాక్రమము ఉన్నదా ఏది చూపుము అని అనినంతనే ఆ రుద్రుఁడు కోపముతో తన గోటికొనచే బ్రహాయోక్క శిరస్సును చిదిమివేసేను అట్లు గిల్లపడినా ఆ తల శంకరునిచేతికి అంటుకొనిపోయేను తరువాత ఆ బ్రహ్మ మరల ఒక విచిత్రమైన పురుషుడుని సృష్టించినాడు అతడు బాణములు విల్లు శక్తియునిదాల్చి నాలుగు బాహువులు కల్గి అమ్ములపొదిని తగిలించుకొని సూర్యతేజుడయి వెలుగులు చిమ్ముచు రుద్రుని చూసి ఓరి నీవు బ్రహ్మహత్య పాతకుడివి కాబట్టి నిన్నెవ్వరు చంపరు. నేను నిన్నుతాకను అని పలికేను ఆ మాటలు విన్న రుద్రరూపియగు శంకరుడు భార్యతో బాదరికా అను ఆశ్రమమునకు వెళ్లి నారాయణుని భజించి నాకు బిక్ష పెట్టుమని ప్రార్ధించేను నారాయణుడు ఓ,, కపర్ది ,,నీ త్రిశులంచే నా ఎడమ చేతిమీద కొట్టుమనేను అట్లు శివుడు విష్ణువు చేయిమీద కొట్టడంతో మూడు రక్తపుధారలుగా పడెను అందు ఒక ధారా నక్షత్ర మండలముపై ఉండెను రెండవ దార భూమిపై ప్రవహించెను దానిని ఋషులు గ్రహించిరి అందునుండి అత్రి శంకరుని అంశచే దుర్వాసుడు ఉదయించిరి మూడవది రౌద్రరూపమైమహేశుని చేతిలోని కాపాలంలో పడేను అందునుండి కవచముపూని యొక్కవీరుడు నవయవ్వనమూర్తియై తెలుపు నలుపు రంగులతో కూడిన ధనుర్భానములు తీసుకోని ఆ వీర పురుషులు ఇద్దరుకుడా వేయి దివ్య సంవత్సరములు యుద్ధం జరిగినది తుదకు నారాయణుని బాహువునుండి పుట్టిన పురుషుడు ఒడి పోయెను బ్రహ్మ తో జన్మించిన పురుషుని సూర్యమండలమున ఉంచెను ఈశ్వరుని నుండి పుట్టిన వానిని నారాయణునియందు చేర్చేను..

BRIEF ANALYSIS OF HINDU PURANAS


పురాణాలలో విడ్డూరాలు - నిజానిజాలు
ముందుగా ఒక చిన్న కధ చెప్పుకుందాం. (పాపం శమించు గాక )

ఏదో చిన్న గొడవ వలన క్రీ.శ.12090లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇంచుమించు అన్ని బలవత్తరమైన దేశాల వద్ద అణ్వాస్త్ర సంపద వున్నాయి. అందరూ యుద్ధంలో పాల్గొని ఒకరి మీదకొకరు ఈ అస్త్రాలు సంధించుకున్నారు. కొన్ని ఉత్తర దక్షిణ ధ్రువాల మీద కూడా పడ్డాయి. అక్కడున్న మంచుకొండలన్నీ కరిగిపోయి ఒక్కసారి మొత్తం ప్రపంచమంతా జలప్రళయంలో మునిగిపోయాయి. దాదాపు అన్ని దేశాలు నీటమునిగిపోయాయి. అన్ని భవనాలు అగ్నికీలలో దగ్ధమయి తరువాత జల ప్రళయం వలన మునిగిపోయి, ఎక్కడనుండో కొట్టుకువచ్చిన మట్టితో కప్పబడిపోయాయి. ఈ భీభత్సం ఒక పది రోజులు జరిగాక మరల మామూలుగా నీరు తీసేసింది.వాతావరణం అంతా మారిపోయింది. దేవుని దయ వలన కొందరు మాత్రం ఎత్తైన కొండ గుహలలో, కొన్ని జీవ జంతుజాలం గుహలలోనో ఎక్కడో నక్కి ప్రాణం దక్కించుకున్నారు. వారు బయటకు వచ్చి చూస్తె కొత్త ప్రపంచం, మొత్తం మారిపోయి కనబడుతోంది. ఆకలేస్తోంది. వారు చెట్టులు, పుట్టలు వెతికి వారికేమైనా దొరికితే తింటూ బ్రతుకుతున్నారు. వారిలో కొంతమంది కొన్ని గుహలలోను, లేదా వారిదగ్గరున్న పుస్తకాలలోనూ వారు చూసిన ప్రపంచం గురించి రాసారు. అప్పుడు రాకెట్స్ ఉండేవని, ఎలా ఉండేవో నమూనాలు రాసుకున్నారు, దూరంగా వున్నవాళ్ళతో ఫోన్లో మాట్లాడేవారని, టీ వీలు, ఇంటర్నెట్, వగైరా, వగైరా గురించి రాసుకున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి, ఎలా చికిత్స చేసేవారో, ఆపరేషన్లు, ఇతర జీవన ఆరోగ్యం గురించి ఎన్నో రాసుకున్నారు. అవన్నీ ఒక చోట భద్రంగా దాచుకున్నారు. నేడు వారికి తిండి దొరకడమే ప్రధానం. అన్నీ పోవడంతో వారు కేవలం కొన్ని ఆకులు కప్పుకుని బతుకుతున్నారు. వారికున్న జ్ఞానంతో కొన్ని ఇళ్ళు కట్టుకున్నారు. వారి సంతానానికి విషయం చెప్పారు. కానీ తిండి కోసం వారు మరిన్ని ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
ఇలా ఒక పది తరాలు గడచి పోయాయి. అప్పుడు వారిలో ఒకడు వీరు ముందున్న ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కొన్ని పాడుబడ్డ ఆవాసాలు కనబడ్డాయి, శిధిలమై. వాటిలో వాడికొక పుస్తకం దొరికింది. దానిలో ఎలా జీవించాలో రాసుంది, అంతకు ముందు ఎలా జీవిన్చారో రాసుంది. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ తెగలో కొంతమందికి చెప్పాడు. భగవంతుడిని ఎలా ఆరాదిన్చేవారో తెలుస్కుని, వారు కూడా ఆ పద్ధతి పాటించారు. ఇదే భూగోళానికి అటువైపు కూడా కొంత మంది బ్రతికి బట్ట కట్టారు. వాళ్ళు ఎప్పుడో వీళ్ళను కలుసుకున్నారు. వాళ్ళు వీళ్ళ దగ్గరున్న పుస్తకాలలో విషయాల గురించి విన్నారు. అప్పట్లో గాల్లో వేల్లెవారట, ఇది నమూనా అంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. తిండే దొరకని మనకు ఈ కట్టు కధలు అవసరమా అంటూ గేలి చేసారు. ఈ తెగ వాళ్ళనందరినీ పిట్టకధల దొరలూ అని ముద్ర వేసారు. వారి జీవన విధానాన్ని వెక్కిరించారు. వారి గ్రంధాలను తిట్టారు. అప్పుడు విమానాలుంటే ఇప్పుడెక్కడికి పోయాయి. ఏది నువ్వొకటి తయారు చెయ్యి అన్నారు. కానీ అప్పుడు కరెంటు లేదు, ఎలక్ట్రానిక్స్ లేదు, ఏమి లేదు. వారికి ఆ జ్ఞానం లేదు. వీళ్ళు ఇప్పుడు ఆ పుస్తకాలలో విషయాన్ని ప్రాక్టికల్ గా చూపలేకపోతున్నారు కాబట్టి వీళ్ళవన్నీ కాకమ్మ కబుర్లు అని, వీళ్ళు వట్టి వెధవలోయ్ అని ముద్ర వేసారు. అవును నిజమే అని ఈ తెగలో కొంతమంది మిగతా వారిని ఎద్దేవా చేస్తున్నారు. ఆస్తిక నాస్తిక మతాలు పుట్టాయి. ఆ పుస్తకాలు నమ్మిన వాళ్ళు వెర్రి వెంగలప్పలు నమ్మనివాళ్ళు ఆధునీకులు అని పేర్లు పెట్టుకున్నారు.
పైదంతా చదివితే మీకేమైనా గుర్తుకొస్తోందా? ఈ రోజున జరుగుతున్న విషయం స్ఫురిస్తోందా? మన వాంగ్మయంలో చెప్పారు ఒకప్పుడు పుష్పక విమానంలో విహరించారట అంటే అదొక కట్టు కధ. ఒకప్పుడు రాజ్యాలలో ఈ విధంగా రాజ్యం చేసారట అంటే మరొక పిట్ట కధ. అస్త్ర, శాస్త్రాలతో యుద్ధం చెయ్యగలిగేవారట. సమయం ఇలా గణించారు, శస్త్రచికిత్సలు చేసారు, కుంభ సంభవులు పుట్టారు అంటే ఇవన్నీ mythology అని కొట్టి పారేస్తున్నారు. మంత్రప్రభావం, ప్రాభవం ఇదంటే దాని మీద నమ్మకం లేక చింతకాయలు రాల్చమంటున్నారు. జలప్రళయం వచ్చి అందరూ మునిగిపోతే ఒక మనువు బ్రతికాడని, తరువాత ఎందరో మహర్షులు వచ్చి మనకొక జీవన విధానం నేర్పారు అని మన పురాణం చెబుతోంది.. నిత్యసత్యాలన్నీ మన వాంగ్మయంలో, గ్రంథాలలో ఉన్నాయంటే నమ్మి పాటించిన వారు ఒక 8000 ఏళ్ళ క్రితం ఎలా వుండేవారో నేడు కొన్ని తవ్వకాలలో బయట పడ్డాయి. అదే మనకు అవతలి వైపు వాళ్ళు అప్పటికి అడవి పందులు వేటాడుకుంటూ వుండేవారు కనీసం 1000 సంవత్సరాల క్రితం వరకు. కాలక్రమేణా వారు కొన్ని కనిపెట్టారు, మనం అందరం వాడుకుంటున్నాం. అది నిజం, ఇదీ నిజం. కానీ పురాతన గ్రంథాలలో ఎలా ఉండేదో అప్పటి మన మనుష్యుల జీవనం, న్యాయం, ధర్మం జీవన విధానం, శాస్త్ర దృక్పధం ఆరోగ్య పరిరక్షణ విధానం అన్నీ రాసి వుంది. దేవుడిని ఎలా చేరాలని రాసి వుంది. దాన్ని నమ్మి పట్టుకున్న మనం తప్పక సాధించగలం. కావలసినదల్లా దాని మీద నమ్మకం. వారు చెప్పిన విషయాలను పూర్తిగా అర్ధం చేసుకోగల సామర్ధ్యం కావాలి. వాటి గురించి మనం మరింత లోతుగా పరిశీలించాలి. శోధించాలి, సాధించాలి. అంతేకానీ మనకు మనం తక్కువ అంచనా వేసుకుని మనం ఆత్మన్యూనతా భావం పనికిరాదు. మన మీద, మన గ్రంథాలపై, మన పురాణాల మీద మనకు నమ్మకం, గౌరవం వుండాలి. కాదంటారా?
మీకోసం ఈ లంకె.
http://timesofindia.indiatimes.com/…/articlesh…/52485332.cms

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!


I WANT COOL DRINK DEAR

ఎండాకాలం

"ముసలోడా ఆగు ...'' అడవిదారిలో అడ్డుపడి అంది పులి. 

"ఈ దారిలో యువకులు చాలామంది వస్తుంటారు. వాళ్లది వేడి రక్తం'' తెలివిగా 

తప్పించుకోబోయాడు ముసలాయన. 

"నా కెందుకో ఈ రోజు కూల్‌డ్రింక్ తాగాలని ఉంది మరి'' చెప్పింది పులి.

(మల్లి జాజి శర్మ గారే.)

LORD ANJANEYA SWAMY PANCHARATNA STHOTRAM


శ్రీ శంకరభగవత్పాదాచార్య కృత శ్రీ హనుమత్ పంచరత్న స్తోత్రం II
వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులక మత్యచ్ఛమ్ I
సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ II 1 II

తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్ I
సంజీవనమాశాసే మంజులమహిమాన మంజనాభాగ్యమ్ II 2 II

శంబరవైరి శరాతిగ మంబుజదలవిపులలోచనోదారమ్ I
కంబుగళమనిలదిష్టం బింబజ్వలి తోష్ఠమేకమవలంబతే II 3 II

దూరీకృతసీతార్తిః ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తిః I
దారితదశముఖ కీర్తిః పురతోమమభాతు హనుమతో మూర్తిః II 4 II

వానరనికరాధ్యక్షం దానవకులకుముదర వికరసదృక్షమ్ I
దీనజనావనదీక్షం పవన తపః పాకపుంజమద్రాక్షమ్ II 5 II

ఏతత్ పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్ I
చిరమిహ నిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి II 6 II
II ఇతి శ్రీ శంకరభగవత్పాదాచార్య కృత శ్రీ హనుమత్ పంచరత్న స్తోత్రం సంపూర్ణం II

HELL 2 HELL PHONE CALLS FREE

నరకాలు

నరకంలో ఒహాయన : నా భార్యకి ఫోన్ చేసుకోవాలి " అన్నాడు 

అక్కడున్న చిత్రగుప్తుడు : "చేసుకో !" అని ఫోన్ ఇచ్చాడు. 

కాసేపు మాట్లాడి " ఎంతివ్వాలి " అన్నాడు చిత్రగుప్తుడితో హాయన.

చిత్రగుప్తుడు : " నరకం టు నరకం కాల్స్ ఉచితం " అన్నాడు

(సంగ్రహణ....జాజి శర్మ గారి వద్ద.)

WHAT HAPPENED TO ME DOCTOR

అప్ !
ఒకామె ఒంట్లో బాలేక డాక్టర్ దగ్గరకి వెళ్ళింది.
డాక్టర్ ఆమెను పరీక్షించి " మీరు ఈ ఎర్రగోలీ ఒక గ్లాసు నీళ్ళతో ఉదయమే పరగడుపున వేసుకోండి."
"అలాగేనండీ "
"మధ్యాహ్నం భోజనము కాగానే ఈ పచ్చగోలీ రెండు గ్లాసుల నీళ్ళతో వేసుకోండి"

"అలాగేనండీ"
" రాత్రి భోజనము కాగానే ఈ తెల్లగోలీ మూడు గ్లాసుల నీళ్ళతో వేసుకోండి."
ఆవిడ కంగారుగా " డాక్టర్ నాకేమైంది" అనడిగింది.
" మీరు మీ శరీరానికి కావలిసినన్ని నీళ్ళు తాగటంలేదు. అంతే "

PURANA STORY ABOUT LORD HANUMAN MARRIAGE WITH SUVARCHALA


శాస్త్రమునందు హనుమకు వివాహం అయింది. ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు ప్రవర ఉన్నది. తండ్రిగారు కేసరి, తాతగారి పేరు, ముత్తాతగారిపేరు కళ్యాణంలో చెప్తారు. హేమగర్భుడు అని వారి ముత్తాతగారి పేరు. ఒకతండ్రి కడుపున పుట్టిన పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రులు దేహములు చాలించిన తరువాత వారి శరీరాలను చెట్లకి త్రిప్పి కట్టేస్తారు. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంసార భ్రష్టుడిని కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు. అలా చేయడం తల్లిదండ్రులయొక్క ప్రధానమైన బాధ్యత. నవ వ్యాకరణపండితులు, మహా బుద్ధిమంతుడైన హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసం తీసుకోకుండా ఉండరు కదా! మీకు అందుకే భారతీయ సంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకొని ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రమునకు సంబంధించినంతవరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కాపురం చేసినట్లు, పిల్లల్ని కన్నట్లు లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని. అందుచేత సువర్చలను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ యోగమును అనుసంధానం చేశారు.

HEALTH AND BEAUTY BENEFITS WITH PAPAYA / BOPPAYA SEEDS


బొప్పాయి విత్తనాల్లో దాగి ఉన్న ఆరోగ్యకర ప్రయోజనాలు

బొప్పాయి పండ్లే కాదు వాటి విత్తనాలు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. పలు అనారోగ్యాలను దూరం చేయడంలో ఇవి కూడా బాగానే పనిచేస్తాయి. బొప్పాయి విత్తనాలను పచ్చిగా అలాగే తినవచ్చు. వాటి రుచి అంతగా నచ్చని వారు సలాడ్స్ వంటి వాటిలో బొప్పాయి విత్తనాలను కలిపి తినవచ్చు. అయితే ఎలా తిన్నా బొప్పాయి విత్తనాల వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. ఆ ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
👉

1. ఐదు లేదా 6 బొప్పాయి విత్తనాలను తీసుకుని వాటిని నలిపి ఏదైనా పండ్ల రసం లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవాలి. నెల రోజుల పాటు ఇలా చేస్తే లివర్ శుభ్ర పడుతుంది. శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి.
👉

2. బొప్పాయి విత్తనాలను తరచూ తింటుంటే కిడ్నీ సంబంధ సమస్యలను దూరం చేసుకోవచ్చని పలువురు పరిశోధకులు వెల్లడించారు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో బొప్పాయి విత్తనాలు బాగా పనిచేస్తాయి.
👉

3. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ప్రధానంగా కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.
👉

4. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ధర్మాలు కూడా బొప్పాయి విత్తనాలకు ఉన్నాయి. ఈ-కొలి వంటి బాక్టీరియాలను నిర్మూలించడంలో ఇవి మెరుగ్గా పనిచేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
👉

5. క్యాన్సర్ కణాలు, ట్యూమర్లు వృద్ధి చెందకుండా చూస్తాయి. పలు క్యాన్సర్లను అడ్డుకునే శక్తి వీటికి ఉంది.
👉

6. కడుపు, పేగుల్లో వృద్ధి చెందే హానికర బాక్టీరియాలను నిర్మూలిస్తాయి.
👉

7. అప్పుడే సంతానం వద్దనుకునే వారికి ఇవి కాంట్రాసెప్టివ్ మాత్రల్లా ఉపయోగపడతాయి. జీర్ణక్రియను వృద్ధి చెందిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను పోగొడతాయి.

Friday 27 May 2016

SIDE EFFECTS OF COOL DRINKS


అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? మీ శరీరానికి ఎలాంటి హాని తలబెడుతుందో తెలుసా?

*కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాలకు:*
కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చెక్కర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్ లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది.
*కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు:*
కూల్ డ్రింక్ లో ఉన్న షుగర్ ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వు గా మారి బరువు పెరుగుతారు.
*కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు:*
రక్తంలోకి షుగర్ ను పంపియడం కొనసాగుతుంది. కోల్ డ్రింక్ లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా మీ శరీరంలో నిండుతుంది. దీనితో మీ రక్త పోటు పెరిగి, మీ కంటి పాపలు చిన్నగవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చేయదు, అలా అని ఎక్కువ మోతాదులో దీనిని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్న పిల్లలను కూల్ డ్రింకులకు ఎంత దూరం పెడితే అంత మంచిది.
*కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు:*
ఇప్పుడు మీ శరీరం డోపమైన్ అనే ఓ కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టే.
*కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు:*
గంట తరువాత, మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మీ చిన్న పేగులలో చేరడంతో, అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డు కట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్రవిసర్జన జరడంతోపాటు, డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి.
మన శరీరానికి ఇంతలా హాని తలబెట్టే కూల్ డ్రింక్ తాగడం మనకు మన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండడమే మంచిది.


GOD AND THE FARMER - MORAL MESSAGE TELUGU STORY


పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు.
"నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. ఆ కాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకి అప్పగించారాదూ!” అన్నాడు.
భగవంతుడు వెంటనే "అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండ అన్నీ నీ అజమాయిషిలోనే ఉంటాయి” అంటూ వరమిచ్చి చక్కాపోయాడు.
ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.

ఋతువులు మారాయి. "వానా! కురవాలి" అన్నాడు రైతు.
కురిసింది. ఆగమనగానే ఆగింది.
తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో గాలిని విసరమన్నాడు. విసిరింది.
విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి.
పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది.
కోతల కాలం వచ్చింది.
రైతు ఒక కంకి కోశాడు. గింజ నులిమి చూ శాడు. అదిరిపడ్డాడు. లోపల ధాన్యం లేదు. ఉత్తి ఊక, మరొకటి, మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ ధాన్యం లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమే ఉంది.
"హారి దేవుడా!" అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు. "వాన,ఎండ,గాలి అన్ని తగిన మోతాదుల్లోనే వాడాను. కాలానుగుణంగా, ఋతువులకి తగట్టుగా. అయితే పైరు పాడైపోయిందే! ఏం? ఎందుకు?"
భగవంతుడు నవ్వాడు. "నా ఆధీనంలో గాలి బలంగా వీచేది. అప్పుడు అమ్మను కౌగిలించుకొనే పిల్లల్లా నారు వేళ్ళు భూమిలోకి లోతుగా జోచ్చుకొని గట్టిగా పట్టుకొనేవి. వాన తక్కువైనా నీటికోసం వేళ్లను నాలుగు పక్కలకు పాకించేది. పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి.
అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి పైరు సోమరిదయ్యింది. నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలీదు.
"నాకు నీ గాలి, వాన,ఎండ వద్దు. నువ్వే ఉంచుకో". అంటూ రైతు దేవుడిచ్చిన వాటిని తిరిగిచ్చేశాడు.
జీవితం లో అన్నీ చక్కగా అమరిపోతే, అంతకన్నా విసుగు, శూన్యం వేరే ఉండదు. కష్టాలు మిమ్మల్ని అదిమేసటప్పుడే మీలో చాకచక్యం మరింత పెరుగుతుంది. సావాళ్ళే మనిషికి పరిపూర్ణతను ఇస్తాయి.

STOMACH INFECTION IN KIDS - AYURVEDIC HEALTH TIPS


చిన్న పిల్లల కడుపులో నులి పురుగుల నివారణ 

కడుపులో క్రిములు , నులిపురుగులు వంటివి ఉంటే చిన్న పిల్లలు నిద్రలో పండ్లు కోరుకుతారు. అందువల్ల ఆవాలని దోరగా వేయించి దంచి జల్లించి నిలువ ఉంచుకోవాలి . ఈ ఆవాల పొడి అరగ్రాము మోతాదుగా అరకప్పు పెరుగులో ఉదయం పూట సాయంత్రం పూట కలిపి తినిపిస్తుంటే పిల్లల కడుపులో ఉండే క్రిములు మూడు రొజుల్లొ మలం ద్వారా పడిపోయి పిల్లలు నిద్రలో పండ్లు కొరకడం ఆపివేస్తారు.

WHAT IS THE MEANING OF "VEDHAMU"


అసలు వేదమనగానేమి ?

వేదమంటే ’ జ్ఞానము ’ అని అర్థము. పరమాత్మ , జీవులు , దేవతలు , ప్రకృతి , ధర్మము మొదలగు విషయములను గురించిన జ్ఞానము. అతి పవిత్రమై , అత్యంత ప్రామాణికమై , మన ధర్మములు , దర్శనము , సమాజము మొదలగు వాటిపై అంతిమ నిర్ణయమును చెప్పు అధికారమున్న గ్రంధమే వేదమని చెప్పవచ్చును. అది అతీంద్రియ సత్యములను తెలియగోరు అందరు సాధకుల పవిత్ర గ్రంధము.
వేదమను పదము , ’ జ్ఞానము ’ అథవా ’ పొందుట ’ యను అర్థమును ఇచ్చు ’ విద్ ’ అను ధాతువు నుండీ ఏర్పడ్డ శబ్దము.

|| వే॒దేన॒ వై దే॒వా అసు॑రాణాం వి॒త్తం వేద్య॑మవిన్దన్త॒ తద్వే॒దస్య॑ వేద॒త్వమ్ ||
అనే తైత్తిరీయ సంహితలోని ఈ మంత్రము వలన ఈ విధముగా తెలియుచున్నది: అసురులు పొందిన , మరియు ఉపయోగించనున్న ద్రవ్యములను దేవతలు దేనివలన తెలుసుకొని పొందినారో , అది వేదము.
వేదమంటే జ్ఞానము మాత్రమే కాదు. అది , మానవుడు కాంక్షించు అనేక విషయములను అతనికి తెచ్చి ఇవ్వగల సామర్థ్యము కలిగినది.

|| ఇష్ట ప్రాప్త్యనిష్ట పరిహారయోః అలౌకికం ఉపాయం యో గ్రంధో వేదయతి స వేదః ||
కోరిన ఇష్టములను పొందుటకును , కీడు ను తప్పించుకొనుటకును గల అలౌకిక ఉపాయమును తెలుపు గ్రంధమే వేదము అని ఆచార్య సాయణులు తమ ’ కృష్ష్ణ యజుర్వేద సంహితా భాష్యము ’ లో చెప్పినారు.

Wednesday 25 May 2016

REMOVE UPPER LIP HAIR WITH POTATO JUICE


అప్పర్ లిప్ హెయిర్ తొలగించడంలో బంగాళదుంప రసం గ్రేట్ గా సహాయపడుతుంది 

అంతే కాదు డార్క్ స్పాట్స్ ను నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. 

పొటాటోను పేస్ట్ చేసి, అందులోని రసాన్ని తీసి అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేయాలి. 

రాత్రి నిద్రించే ముందు అప్లై చేసి, ఉదయం కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

MY DEAR LOVE


వస్తున్నా ప్రియా...

నీలోనే నేను కలిసిపోవడానికై....

వేచి చూస్తున్నా ప్రియా...!

నీ ప్రేమ కోవెలలో కర్పూర హారతినై 

కరిగిపోవడానికై...!!


Bengali Style Fish Curry Recipe


కావల్సిన పదార్థాలు: రఘుఫిష్ (కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి) - 4 pieces బంగాళదుంపలు - 2 medium sized (cut into quarters) ఉల్లిపాయలు - 2 (finely chopped) టమోటోలు - 1 (finely chopped) నిమ్మరసం - 1 teaspoon పెరుగు - 1 teaspoon అల్లం పేస్ట్ - 2 teaspoon వెల్లుల్లిపేస్ట్ - 2 teaspoon పచ్చిమిర్చిపేస్ట్ - 2 teaspoon ఆవనూనె - 4-5 teaspoon టమోటో గుజ్జు - 1 teaspoon పసుపు - 1/4 teaspoon జీలకర్ర పొడి - 1 teaspoon కారం - According to taste ఉప్పు - According to taste పంచదార - 1 teaspoon గరం మసాలా - 1/2 teaspoon బిర్యానీ ఆకు- 2 మసాలా దినుసులు - (దాల్చిన చెక్క: 1 small piece, లంగాలు: 2, యాలకలు: 2) ఎండుమిర్చి - 1 (optional) ఫ్లేవర్ కోసం (జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు) - 1/4 teaspoon నెయ్యి - ½ TSP నీళ్ళు కొత్తిమీర గార్నిష్ కోసం

తయారుచేయు విధానం: 1. ముందుగా చేపముక్కలను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. 2. తడి ఆరిన తర్వాత వాటికి ఉప్పు, పసుపు, పెరుగు, మరియు నిమ్మరసం చేర్చి బాగా మిక్స్ చేసి 20 నిముషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3. తర్వాత పాన్ లో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి 5నిముషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 3.ఇప్పుడు బంగాళదుంపలను బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి పెట్టుకోవాలి . 4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. 5. ఇప్పుడు అందులోనే జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు, ఎండు మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. 6. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో పసుపు, జీలకర్ర, మరియు కారం , సరిపడా నీళ్ళు సోయాలి. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద బాయిల్ చేయాలి . తర్వాత అందులోనే టమోటో గుజ్జు కూడా వేసి ఉడికించుకోవాలి. దాంతో ఆయిల్ వేరుపడుతుంది. 7. ఈ మసాలాలతోనే బంగాళదుంప చేర్చి బాగా ఉడికించుకోవాలి . దాంతో మసాలన్నీ కూడా బంగాళదుంపలకు బాగా పడుతాయి . తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. 8. బంగాళదుంప మెత్తగా ఉడికిన తర్వాత 1/2 వాటర్ వేసి ఉడికించుకోవాలి. 9. బంగాళదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో చేపముక్కలు మరియు సన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసి 5నిముషాలు ఉడికించుకోవాలి. 10.చేపముక్కలు మీడియంగా ఉడికినట్లు తెలియగానే స్టౌ ఆఫ్ చేయాలి . తర్వాత గరం మసాలా కొద్దిగా చిలకరించి బాగా మిక్స్ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బెంగాలి ట్రెడిషినల్ ఫిష్ కాలీ రిసిపి రెడీ.

Healthy Kesar Pista Milk Shake


కావల్సిన పదార్థాలు: పిస్తాచో(పిస్తాపప్పు)-1cupకేసర్(కుంకుమపువ్వు)- కొద్దిగా బాదం:1/2cup పంచదార: 11/2cup యాలకలు: 4-5 పాలు: 1ltr 

తయారుచేయు విధానం: 1. ముందుగా బాదం మరియు పిస్తాలను రెండు డిఫరెంట్ బౌల్స్ లో విడివిడిగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2. 6 గంటల తర్వాత , గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. 3. పాలను బాగా మరిగించి , మంట తగ్గించి మరికొంత సేపే బాగా పాలు కాచాలి. 4. ఇప్పుడు ఒక మిక్స్ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకొన్న బాదం, పిస్తా మరియు యాలకలు వేసి మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి . మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 5.ఇప్పుడు ఈ పేస్ట్ ను కాగుతున్న పాలలో వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు అదే పాలలో పంచదార వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత చివరగా కొద్దిగా కుంకుపువ్వు చిలకరించాలి. 6. పాలను తక్కువ మంటలోనే ఉడికించుకోవాలి. 7. పాలు కొద్దిగా చిక్కపబడుతున్నప్పుడు స్టౌ ఆఫ్ చేసి, ఈ మిల్క్ షేక్ గది ఉష్ణోగ్రతలో చల్లారనివ్వాలి.

SIMPLE AND SPICY MANGO PICKLE RECIPE MAKING TIPS


నోరూరించే పుల్లటి మామిడికాయ పచ్చడి 

పచ్చిమామిడియ- 1 cup (chopped) బెల్లం: 1/2 cup ఎండు మిర్చి: 5 to 6 ఆవాలు:1tps కరివేపాకు : 8 to 10 కొబ్బరి తురుము: 1/2 cup కొత్తిమీర : 4 to 5 ఉప్పు రుచికి సరిపడా 

తయారుచేయు విధానం: 1. ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో పచ్చిమామిడికాయ ముక్కలు వేయాలి. 2. ఈ బౌల్ స్టౌ మీద పెట్టి మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి. 3. అంతలోపు , మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసి, బెల్లం తురము వేసి చిక్కటి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాిలి. 4. ఇప్పుడు మెత్తగా ఉడికిన మామిడి ముక్కలనుండి అదనపు నీరు పక్కకు వంపేసుకోవాలి. తర్వాత ముక్కలను మిక్సీ జార్లో వేయాలి. 5. ఇప్పుడు అందులోనే ముందుగా వేగించి పెట్టుకొన్న ఎండు మిర్చి , కొబ్బరి తురుము వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి. 6. ఇప్పుడు స్టౌ మీద మరో పాన్ పెట్టి అందులో బెల్లం నీటినివేసి కొద్దిగా సేపు ఉడికించుకోవాలి. 7. కొద్దిసేపటి తర్వాత అందులో మిక్సీ చేసి పెట్టుకొన్ని మామిడికాయ పచ్చడి వేయాలి మొత్తం మిశ్రమాన్ని కలగలుపూత ఉడికించాలి. 8. అవసరం అయితే కొద్దిగా నీరు, ఉప్పు వేసి బాగా ఉడికించి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.

REMOVE UNWANTED HAIR WITH SENAGAPINDI


కొన్ని వందల సంవత్సరాల నుండి శెనగపిండిని బ్యూటీ ప్రొడక్ట్ గా ఉపయోగిస్తున్నారు.

 ఫేషియల్స్ కోసం ఉపయోగిస్తున్నారు . 

శెనగపిండిలో కొద్ది పసుపు, సరిపడా నీరు పోసి పేస్ట్ చేసి 

అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి మర్ధన చేయాలి. 

15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

DEEPARADHANA PUJA SECRETS AND RESULTS


దీరాధనలో వత్తులను బట్టి ఫలితాలుంటాయా ?

దీపం జ్యోతిస్వరూపమైన భగవంతుడిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. తన చుట్టూ వెలుగును వెదజల్లుతూ చీకట్లను తరిమికొడుతూ ఉంటుంది. వెలుగు శుభానికి ప్రతీక కనుక ప్రతి శుభకార్యం ... దైవకార్యం దీపాన్ని వెలిగించడంతో ఆరంభమవుతుంది. అయితే పూజను ఆరంభిస్తూ చేసే ఈ దీపారాధనలో ఎన్నో నియమాలు ఉన్నాయి.

ప్రమిదలోని వత్తిని ఎలా వెలిగించాలి ? ... దీపారాధనకి ఏ నూనె వాడాలి ? ... ఎన్ని వత్తులువేయాలి ? ... ఎన్ని వత్తులు వేయడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి ? అనేవి ఈ నియమాలలో భాగంగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా కొంతమంది ప్రమిదలో ఒక వత్తి మాత్రమే వేసి దీపారాధన చేస్తుంటారు. అలాంటి సమయంలో ఆ వత్తికి అడ్డంగా మరో వత్తిని వేయాలని శాస్త్రం చెబుతోంది.

ప్రమిదలో అడ్డవత్తి వేయకుండా నిలువు వత్తి వెలిగించడం దోషాలను కలిగిస్తుంది. ఇక ప్రమిదలో ఎన్ని వత్తులు వేసి వెలిగించినా దానివలన వచ్చే ఫలితంలో ఎలాంటి మార్పు ఉండదని కొందరు భావిస్తుంటారు. కానీ నియమంగా చెప్పబడుతోన్న సంఖ్య ప్రకారం ఎన్ని వత్తులు వాడటం వలన అన్ని రకాల ఫలితాలు ఉంటాయని చెప్పబడుతోంది. ఒక వత్తిని మాత్రమే వెలిగించడం వలన ఫలితం నామమాత్రంగా ఉంటుంది.

రెండు వత్తులను వెలిగించడం వలన ఆరోగ్యం ... మూడు వత్తులను వెలిగించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతాయి. నాలుగు వత్తులతో దీపారాధన చేయడం వలన దుఃఖాలు దూరంకాగా ... ఐదు వత్తులను ఉపయోగించడం వలన సకల సంపదలు కలుగుతాయి. ఇక తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన సందలతో పాటు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయని చెప్పబడుతోంది.

HEALTH BENEFITS WITH USING GUAVA LEAVES IN TEA - GUAVA LEAVES TEA HEALTH TIPS


జామ ఆకుల ‘టీ’ని త్రాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల

- గుప్పెడు జామాకులని తీసుకొని, వాటిని కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేసి చల్లార్చితే జామాకుల టీ తయారు అవుతుంది. ఈ టీని సేవించడం ద్వారా బోలెడు మంచి ఫలితాలు ఉంటాయి.

- ఈ టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

- శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే అత్యున్నత శక్తి ఉంది. దీని ఫలితంగా చాలా సులువుగా బరువు తగ్గుతారు.

- జామాకుల టీని త్రాగితే శ్వాస సంబంధిత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.

- జామాకులను శుభ్రంగా కడిగి నమిలి తింటూ ఉంటే పంటి నొప్పులు తగ్గుతాయి. నోటి పూత కూడా తగ్గుతుంది.

- ఇందులో ఉండే యాంటి యాక్సిడెంట్లు నొప్పులు, వాపులు నివారించే గుణాన్ని కలిగి ఉంటాయి.

Tuesday 24 May 2016

MEANING OF LORD MURUGAN - STORY OF LORD SRI SUBRAHMANYESWARA SWAMY


శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే
"శరవణభవ"...ఓం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.
శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు
షదాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య
నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే. -
శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు
అని ‘శరవణభవ’కు గూఢార్థం.
పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద 'బ్రహ్మదండం' అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.
ఆ స్వామివారికి, స్కందుడు, సేనాని, మహాసేనుడు, శరవణభవ, కార్తికేయుడు, గాంగేయుడు, కుమారదేవుడు, వేలాయుధుడు, మురుగన్ అనే పేర్లున్నాయి

FAT 2 SLIM - HOW TO REDUCE FAT IN OUR BODY - HEALTH TIPS TO REDUCE BODY FAT


కొవ్వు’ పేరుకోకుండా! 

మనం తీసుకునే ఆహారం శక్తిగా మారి ఖర్చయ్యే విధానమే ‘మెటబాలిజం’. ఇది ఒక్కొకరిలో ఒక్కోలా ఉంటుంది. ఏ సమయంలోనైనా దీని వేగం పెరగొచ్చు, తగ్గొచ్చు. పెరిగితే ఫర్వాలేదు. తగ్గితే శక్తి కొవ్వుగా పేరుకుపోతుంది. కాబట్టి మెటబాలిజంను నీరసించిపోకుండా పరుగులు పెట్టించాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు పాటించాలి. 

• ఈ కొవ్వులు తినాలి: డార్క్‌ చాక్లెట్‌, అవకాడో, ఆలివ్‌ ఆయిల్‌, పీనట్‌ బటర్‌, వాల్‌నట్స్‌, ఫ్లాక్స్‌ సీడ్‌, చేపలు, సోయాబీన్స్‌...వీటిలో హెల్దీ ఫ్యాట్స్‌ ఉంటాయి. కాబట్టి ఆహారంలో వీటిని చేర్చుకుని యానిమల్‌ ఫ్యాట్స్‌ను కట్‌ చేయాలి.

• స్మాల్‌ మీల్స్‌: రోజుకి మూడు సార్లు కాకుండా ప్రతి మూడు గంటలకు కొద్ది పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. ఇలా అలవాటు చేసుకుంటే గంటలపాటు కొవ్వు కరుగుతూ ఉంటుంది.

• లీటర్లకొద్దీ నీళ్లు: రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. నీరు తాగిన పది నిమిషాల్లోనే మెటబాలిజం 30 శాతం పెరిగి 30 నిమిషాలకు స్పీడు అందుకుంటుందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి.

• 8 గంటల నిద్ర: శరీరం రోజంతా సమర్ధంగా పనిచేయటానికి నిద్ర ఉపకరిస్తుంది. నిద్రలేమి మెటబాలిజంను కుంటుపరుస్తుంది. దాంతో తక్కువ శక్తి ఖర్చవటంతోపాటు ఆకలి పెరుగుతుంది. కాబట్టి మెటబాలిజం స్పీడవ్వాలంటే కంటినిండా నిద్ర పోవాలి.

• డైటింగ్‌ రూల్స్‌: డైటింగ్‌ పేరుతో శరీరానికి అందే క్యాలరీలలో కోత వేస్తే నష్టమే ఎక్కువ. డైటింగ్‌ చేసేవాళ్లు ఎత్తును బట్టి రోజుకి 1350 నుంచి 1500 క్యాలరీలకు తగ్గకుండా ఆహారం తీసుకోవాలి.

• తప్పనిసరి పదార్థాలు: కొన్ని పదార్థాలు మెటబాలిజం వేగాన్ని పెంచుతాయి. చేపలు, గ్రీన్‌ టీ, పచ్చిమిర్చి, పుచ్చకాయ, బాదం, యాపిల్స్‌, సోయాబీన్‌ అలాంటివే! వీటిలో కొన్నిటినైనా ప్రతిరోజూ తీసుకోవాలి.

SUMMER DIET HEALTH TIPS IN TELUGU


ఆరోగ్యానికీ మధురం

వేసవిలో ఏం తినాలన్నా కష్టంగానే ఉంటుంది. పనిలో పనిగా సులభంగా జీర్ణమవ్వడమే కాకుండా.. బరువు తగ్గించే తిండి తింటే.. బావుంటుంది కదూ! సమ్మర్‌డైట్‌లో అలాంటి విశేషాలు.. 

• కొత్తిమీరను చూడగానే రోజూ వాడుకునేదే కదాని తీసిపారేస్తుంటాం. కానీ ఎండాకాలం మీ డైట్‌లో కొత్తిమీర ప్రధానంగా ఉండేలా చూసుకోండి. అందులో పీచు, ఇనుము, జింక్‌, ఫొలేట్‌, పాస్ఫరస్‌, విటమిన్‌ కె, థియామైన్‌ ఇన్నేసి ఉంటాయి మరి. వేసవిలో అరోమాలా పనిచేసే గుణాలు కొత్తిమీరలో మెండు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు అవసరమయ్యే రసాయనాలను ఉత్పత్తి చేసే గుణం కూడా ఎక్కువ. శరీరంలోని వ్యర్థాలను తరిమేసేందుకు చక్కగా ఉపకరిస్తుంది కొత్తిమీర. వీటన్నిటికంటే శక్తివంతమైన గుణం.. బరువు తగ్గించగలగడం. వేసవిలో క్రమం తప్పకుండా కొత్తిమీర తింటే ఉహించని ఫలితాలు లభిస్తాయి.

• పులపుల్లగా, తీయగా అదోరకమైన రుచిని అందించే పైనాపిల్‌ను తినడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇందులోని విశేషాలు తెలుసుకుంటే మాత్రం ఈ సమ్మర్‌లో కూల్‌గా లాగించేయాలనిపిస్తుంది. ఇంట్లో చేసుకునే స్మూతీలు, జ్యూస్‌లలో పైనాపిల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో ఎండలవేడికి జీర్ణవ్యవస్థ అదుపు తప్పుతుంది. అటువంటి పరిస్థితులను చక్కదిద్దే ఎంజైమ్‌లను వృద్ధి చేసే మంచి గుణం పైనాపిల్‌కు ఉంది. బ్లడ్‌క్లాట్స్ ‌ను రాకుండా కాపాడేందుకు ఉపకరిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్‌గాను ప్రముఖపాత్ర పోషిస్తుంది. శరీరంలోని వాపులను తగ్గించే శక్తి దీనికి ఉంది. ఇందులోని అత్యధిక పీచు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. తద్వార కొవ్వు బాగా తగ్గుతుంది.

• వేసవిలో మామిడిపండు సంగతి చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు మామిడిపండ్ల మాధుర్యాన్ని ఆస్వాదించకుండానే వేసవి వెళ్లిపోతుంది. అలామాత్రం మీరు మిస్‌ అవ్వకండి. సీజన్‌లో మామిడి చేసే మంచి అంతాఇంతా కాదు. మైమరపించే రుచిని ఆస్వాదించడమూ ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒక పండును తింటున్నప్పుడు దొరికే సంతృప్తిని కనక లెక్కగడితే.. మామిడి మాధుర్యం ముందు మరొక పండు నిలబడదు. ఇందులో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్‌ పుష్టిని కలుగజేస్తాయి. జీర్ణప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది మామిడి.

• వేసవిలో దొరికే అద్భుత పోషకవిలువలున్న పండ్లలో అంజూర కూడా ఒకటి. వేసవితాపానికి శరీరంలో పోటాషియం నిల్వలు తగ్గిపోవడం సహజం. అదే సమస్య రోజూ కొనసాగితే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లినట్లే. అంజూరతో అత్యధిక పొటాషియం లభిస్తుంది. ప్రతి రోజు ఒక అంజూరను తింటే వేసవితో వచ్చే సగం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

Tuesday 17 May 2016

ANNAM PARABRAHMA SWAROOPAM - FOOD DIVINE ITEM OF GOD


అన్నం పరబ్రహ్మ స్వరూపం........!!

ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. 
దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?’’ అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ‘‘పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?’’ అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ‘‘అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను’’ అని.నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో’’ అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తేఅద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికితోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి, తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి. బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు. భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దో షాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.


BRIEF INFORMATION ABOUT LORD SIVA'S MADHUKESWARALAYAM TEMPLE - SRIKAKULAM


మహాశివుడు వెలసిన మధుకేశ్వరాలయం విశేషాలు

భారతదేశంలో కొలువైవున్న అత్యంత పురాతన దేవాలయాల్లో ‘మధుకేశ్వరాలయం’ ఒకటి! శ్రీకాకుళం జిల్లాలో వంశధారానదికి ఎడమ గట్టున వుండే ముఖలింగం గ్రామంలో ఈ ఆలయం వుంది. మహాశివుడు కొలువై వున్న ఈ ఆలయానికి ‘మధుకేశ్వరుడు’ అనే పేరు రావడానికి ఓ పురాణకథనం వుంది.

స్థలపురాణం :
పూర్వం ఒకనాడు హిమాలయాలమీద ‘వైష్ణవయాగం’ జరిగింది. ఆ యాగాన్ని చూసేందుకు గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. అలాగే.. ఆ హిమాలయాలమీద వుండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు. అప్పుడు శబరకాంతల సౌందర్యాన్ని చూసిన గంధర్వులు కామవశీభూతులయ్యారు. ఆ సమయంలో అక్కడే వున్న వామదేవ మహర్షి వారిలో రగులుతున్న కామాన్ని గ్రహించి ఒక్కసారిగా కోపాద్రిక్తుడయ్యాడు. అప్పుడు ఆయన కోపంతో.. ‘సభామర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరజాతిలో జన్మించండి’ అని గంధర్వులు శపించాడు. అతని శాపంతో గంధర్వులంతా శబరులుగా జన్మించారు. ఇక వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు.
చిత్రగ్రీవుడికి ఇద్దరు భార్యలు వుండేవారు. ఒక భార్య పేరు చిత్తి కాగా.. రెండవ భార్య పేరు చిత్కళ. ఈమె శివభక్తురాలు. వీరిద్దరికీ ఒక్క క్షణం పడేదికాదు. ప్రతిసారీ ఏదో ఒక విషయంపై కీచులాడుకునేవారు. ఈ క్రమంలోనే ఒకరోజు చిత్తి తన భర్త చిత్రగ్రీవుడి దగ్గరకు చేరి.. ‘నీతో ఉంటే నేనైనా ఉండాలి... లేదా చిత్కళైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చి చెప్పు’ అని నిలదీసింది. దీంతో అయోమయంలో పడిపోయిన అతడు.. పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవరాణి అయిన ఛిత్కళను వదులుకోవడానికి సిద్ధమవుతాడు. అప్పుడు అతడు ఛిత్కళను పిలిచి... ‘మన వాకిలిలో వున్న ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి, రాలిన పువ్వులు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతుక్కో’మని అన్నాడు. అది విన్న ఛిత్కళ తీవ్ర మనోవేదనకు గురవుతుంది. అయితే మహాసాధ్వి అయిన ఆమె తన భర్త మాటకు ఎదురు చెప్పలేక, అతను చెప్పినట్లుగానే జీవితాన్ని కొనసాగించేది.
అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను అమ్ముకుంటూ కాలం గడిపేది. ఈ సంగతి తెలుసుకున్న చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది. అప్పుడు విసుగు చెందిన చిత్రగ్రీవుడు... సవతుల గొడవకు ఆ ఇప్పచెట్టే కారణమని తలచి, ఆ చెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు ముందు ప్రత్యక్షమయ్యాడు. అది చూసి చిత్రగ్రీవుడు ఒక్కసారిగా మూర్ఛబోయాడు. అప్పుడు అతడు ఈ వివాదానికి కారణం చిత్కళయేనని గ్రహించి.. అతనితోపాటు శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధబడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబరరూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధూక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలసాడు.