WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 6 July 2016

TIPS TO REDUCE HEAVY STOMACH - REDUCE OVER WEIGHT STOMACH WITH YOGA


పొట్ట తగ్గించుకుందాం!

పొట్ట ముందుకొచ్చి, జారినట్టుగా కాకుండా.. పల్చగా ఉంటే అంతకంటే ఏం కావాలి చెప్పండి? అయితే అందమైన పొట్టకావాలంటే ఆహారనియమాలు పాటించడం ఎంత అవసరమో చక్కని వ్యాయామం కూడా అంతే అవసరం. ఈ రెండూ కలిసినప్పుడే మీరు కోరుకున్న విధంగా ఆకృతి సాధ్యమవుతుంది.

* చాలామంది బరువు తగ్గాలనే తాపత్రయంలో మరీ తక్కువ ఆహారం తింటారు. కానీ 1200 కెలొరీల కంటే తక్కువ శక్తి అందితే కనుక... కొవ్వుని కరిగించే లెప్టిన్‌ అనే హార్మోను విడుదల తగ్గుతుంది. ఆ హార్మోను అసమతుల్యత వల్ల కొవ్వు పెరుగుతుంది. దాంతో బరువు పెరుగుతారు. కాబట్టి తగినంత ఆహారం తీసుకోవాలి.

* ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంతగా పొట్టచుట్టూ కొవ్వు చేరకుండా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కార్టిసాల్‌ అనే హార్మోను విడుదల అయి అది పొట్టు చుట్టూ కొవ్వు చేరడానికి కారణమవుతుంది. అందుకే రోజులో కనీసం పదినిమిషాలయినా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒత్తిడి తగ్గుతుంది.

* పీచు ఎక్కువగా ఉండే ఓట్‌మీల్‌తో మీ ఉదయాన్ని ప్రారంభించండి. ఓట్స్‌ ఒక్కటీ తినలేం అనుకుంటే దాంతో కాస్త గరంమసాలా పొడిని కలుపుకోవచ్చు. లేదంటే ఏదైనా పండ్ల మేళవింపుతో కూడా తినొచ్చు. అప్పుడు పీచుతోపాటూ వ్యాధి నిరోధకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు కూడా అందుతాయి.

* ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలని అదుపులో ఉంచడం, చీజ్‌, ఐస్‌క్రీం, పాలూ, క్యాలీఫ్లవర్‌ వంటి వాటిని కాస్త తగ్గించి తీసుకుంటే మంచిది. అలాగే మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే బాదం, ఆలివ్‌నూనె వంటివి చేర్చుకోవడం వల్ల పొట్టదగ్గర ఉండే కొవ్వు అదుపులో ఉంటుంది. చేపలూ, టోఫూ వంటి వాటిల్లో పొట్ట దగ్గర కొవ్వుని అదుపులో ఉంచే లీన్‌ ప్రొటీన్‌ ఉంటుంది. తరచుగా ఆహారంలో వీటిని చేర్చుకుంటే మంచిది.

* యోగాతో పాటూ పొట్టా, నడుమూ, కాళ్లలో కదలికలు పెంచే వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు శక్తిని పుంజుకుంటాయి. పొట్ట ఆకృతి కూడా తీరువుగా మారుతుంది.

No comments:

Post a Comment