WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 6 July 2016

LORD HANUMAN BIRTH STORY IN TELUGU


”ఆన్జనేయః పూజితేస్చేత్ –పూజిత సర్వ దేవతాః ”
హనుమత్ప్రభువుల దివ్యచరితామృతము - హనుమద్గాదా తరంగిణి -01
ఆంజనేయ జననం 
”హనుమాన్ కల్ప వ్రుక్షోమే –హనుమాన్ మామ కామధు 
చిన్తామనిస్తూ హనుమాన్ –కో విచారః కుతో భయం .”

ఒక సారి రాక్షస బాధలు భరించ లేక దేవతలంతా బ్రహ్మ దేవుని వెంట పెట్టుకొని శివుని దగ్గరకు వెళ్ళారు .అప్పుడ్డు ఆయన వాళ్ళందర్నీ తీసుకొని బదరికా వనం లో వున్న శ్రీ మహా విష్ణు వును దర్శించాడు .రాక్షస బాధలనుంచి రక్షించ మని అందరు వేడుకొన్నారు విష్ణు మూర్తిని ..రాక్షసులు తప్పక నశిస్తారని చెప్పి ,బ్రహ్మ తో సహా అందరి దేవతల తేజస్సును ,తన తేజస్సును కలిపి ముద్దగా చేసి శివునికి ఇచ్చాడు .ఈ తేజస్సు నుంచి బలవంతుడైన వానరుడు పుట్టి ,భయం తీరుస్తాడని అభయం ఇచ్చాడు శ్రీ హరి .
కొంత కాలమ్ తర్వాత పరమేశ్వరుడు ,పార్వతీ దేవి తో కలిసి భూమండలం అంతా పర్యటిస్తూ ,ఆంద్ర దేశం లోని వెంకటాచలం చేరారు .శేష శైలం మీద చిత్ర వనం లో ఆనందం గా విహరిస్తున్నాడు .ఆయనా ,ఆమె కపి రూపం తో విహరించారు .విష్ణువు ఇచ్చిన సకల దేవతా తేజస్సును పార్వతి గర్భం లో నిక్షిప్తం చేశాడు .ఆమె దాన్ని భరించ లేక అగ్ని దేవునికిచ్చింది .ఆయనుకు శక్తి చాలక వాయుదేవునికి అందించాడు .
పూర్వం రాదంతర కల్పం లో కశ్యపుడు అనే వెద వేదాంగ పారీనుడైన బ్రాహ్మణోత్తముడు వుండే వాడు .ఆయన శివుని గురించి పంచాగ్ని మధ్యమం లో తపస్సు చేశాడు .శివుడు మెచ్చి ప్రత్యక్ష మయాడు .కోరిక ఏమిటో చెప్పమన్నాడు .”శివా !నువ్వు నాకు పుత్రుని గా జన్మించాలి ”అని ఆ బ్రాహ్మణుడు కోరాడు .”తధాస్తు ”అన్నాడు పరమేశ్వరుడు .అక్కడే వున్న అగ్ని ,వాయువుదేవులు కూడా తమకు కూడా శివుడు పుత్రుని గా జన్మించాలి అని కోరారు .అలాగే అన్నాడు .ఆ కశ్యపుడే కేసరి అనే వానర శ్రేష్టునిగా జన్మించాడు .ఆయన భార్య మహాసాద్వి అయిన సాధ్య ఈమె గౌతమ మహర్షి భార్య అహల్యకు అంజనా దేవిగా జన్మించింది .ఆమె దేవతల అభీష్టం మేరకు కేసరికి ధర్మ పత్ని అయింది .కేసరి అరవై వేలమంది వానరులకు నాయకుడు .
ఆకాలం లో ”శంక సాధనుడు ”అనే రాక్షసుడు ,దేవ వానర రుషి గణాలను చిత్ర హింసలు పెట్టె వాడు .వారంతా బ్రహ్మ దగ్గర మొర పెట్టుకొన్నారు .ఆయన కేసరి కి మాత్రమే అతన్ని చంపే శక్తి వుందని ,ఆయన్ను శరణు కోరమని హితవు చెప్పాడు ఆయన దగ్గరకు వెళ్లి రక్షించ మన్నారు .అభయం ఇచ్చాడు కేసరి .శంకసాధనునికి తెలిసి ఆయనపై యుద్ధానికి దిగాడు .అతన్ని సంహరించి వారందరినీకాపాడాడు కేసరి .కేసరి ఆంటే సింహం అని అర్ధం కదా డాని బలం ముందు ఏదీ ఆగలేదు

ఆకాలం లోనే వానర వీరులలో కున్జరుడు అనే గొప్ప వాడుండే వాడు. భార్య వింధ్యావళి సంతానం కలగలేదు .శివుని ధ్యానించాడు ,ఆయన కనిపించి సంతాన యోగం లేదనీ ,కొద్ది కాల౦ లో ఒక ఋషి పుత్రిక లభ్యం అవుతుందని ,ఆమెనే బిడ్డ గా పెంచుకొంటే ఆమె వల్ల సంతానం వృద్ధి చెందు తుందని హితవు చెప్పాడు .ఆ రోజు కోసం దంపతులు ఎదురు చూస్తున్నారు
గౌతమ మహర్షికి అహల్య వల్ల అంజనా దేవి అనే కుమార్తె పుట్టిందని చెప్పుకున్నాం వారికే శతానందుడు అనే కుమారుడు కూడా జన్మించాడు .అహల్యా శాపం సంగతి మనకు తెలిసిన కధే .ఆమె శిలగా మారింది .పిల్లల ఆలనా ,పాలనా చూసే వారు లేక పోయారు .నారదుని సలహాతో గౌతముడు శాతానండున్ని జనక మహా రాజు దగ్గరకు పంపాడు .ఆయన తర్వాత జనక ఆస్థానపురోహితుడు అయ్యాడు .అలాగే నారదుని మాట విని కున్జరునికి అంజనా దేవిని పెంచుకోవటానికి ఇచ్చాడు. ఆమె కున్జరుని పెంపుడు కూతురు అయిందన్న మాట .యుక్త వయస్సు వచ్చిందామెకు .తగిన వరుడి కోసం వెతుకు తున్నాడు ..శంబ సాధనుడి నుంచి తమల్ని రక్షించిన కేసరికి మేలు చేయాలని దేవతలు భావించారు .కేసరికి అన్జకు అంతా కలిసి వైభవం గా వివాహం చేశారు .
వారిద్దరికీ చాలా కాలం సంతానం కలగలేదు .కేసరి వంటి మహా వీరుణ్ణి కుమారునిగా పొందాలని అంజనా దేవి భావించింది .తాను వీర మాత అనిపించు కోవాలని ఆరాట పడింది .దైవానుకూలం కావాలని కేసరి ,అంజన తెలుసు కున్నారు భర్త అనుమతితో మన తిరుపతి దగ్గర వున్న వృషభాద్రి చేరింది .ఆకాశ గంగలో స్నానం చేస్తూ ,ఇంద్రియ నిగ్రహం తో తపస్సు ప్రారంభించింది. ఆమె యందు అనుగ్రహం తో వాయుదేవుడు రోజు ఒక ఫలాన్ని ఆమెకు అర్పించేవాడు .ఒక రోజు ,పార్వతి ,అగ్ని దేవుల ద్వారా తనలో చేరిన శివ తేజస్సును ఫల రూపం లో ఆమె ఒడిలో వేశాడు .ఆమె దాన్ని భక్తితో భుజించింది .ఆమె గర్భం ధరించింది .ధ్యానం మాన లేదు .ఒక రోజు ఆకాశవాణి “అంజన ! నీకు వ్రతభంగంలేదు దుఖిన్చవద్దు .భగవంతుని దయ వల్ల నీకు గొప్ప వ్యక్తీ జన్మిస్తాడు” .ఇది దేవతల అనుగ్రహం .నీ పాతివ్రత్యానికి భంగము వుండదు . కాల౦ గడిచింది వైశాఖ మాసం కృష్ణ పక్షం లో దశమి నాడు శనివారం పూర్వా భాద్ర నక్షత్రం లో వైద్రుతీ యోగం లో మధ్యాహ్న సమయం లో ,కర్కాటక లగ్నం లో అంజనా దేవికి ఆంజనేయుడు జన్మించాడు .బంగారు రంగు ,పింగళ వర్ణం గల నేత్రాలు ,స్వర్ణ హారం ,బంగారు యజ్ఞోపవీతం ,మణుల నూపురాలతో ,ధ్వజము ,వజ్రాయుధం ,అంకుశం ,గొడుగు ,పద్మం ,అనే శుభ చిహ్నాలు పాదాలలో వున్న వాడు ,పొడవైన తోక గల వాడు ,వజ్ర దేహంతో ప్రకాశించే వాడు పెద్ద దవడలు కలవాడు ,కటి సూత్రం కౌపెనం (గోచి) తో వున్న గొప్ప బాహువులతో విరాజిల్లు తున్న కపిరూపం లో ఆంజనేయ బాలుడు విరాజిల్లాడు .
దేవతలు పుష్ప వర్షం కురిపించారు .అంజనకు పుట్టిన వాడు కనుక ఆంజనేయుడు పేరు .కేసరి కుమారుడు కనుక కేసరినందనుడు .వాయువు వర ప్రసాదం తో పుట్టాడు కనుక వాయునందనుడు ,అనిల సుతుడు యాడు .అగ్ని తేజం కూడా వుండటం తో అగ్ని సంభవుడని శివ పార్వతుల తేజస్సు కల్గివుండటం తో పార్వతీ నందనుడనీ శంకర సుతుడని పిలువ బడు తున్నాడు .సకల దేవతల తేజస్సు తో జన్మించినందున సర్వ దేవాత్మకుడు అన్నారు .
”ఆన్జనేయః పూజితేస్చేత్ –పూజిత సర్వ దేవతాః ”అందుకే ఆన్జనేయుడిని పూజిస్తేసకల దేవతలను పూజించినట్లే నని బ్రహ్మ దేవుడు చెప్పాడు .


No comments:

Post a Comment