WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 6 July 2016

BEAUTY HELATH BENEFITS WITH MENTHI


మెరిపించే మెంతి

కాస్త కంటికి నదురుగా....తాజాగా కనిపించడం కోసం అస్తమానం బ్యూటీపార్లర్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉండే మెంతులు, మెంతి ఆకులతో అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. 

కూరల్లో ఉపయోగించే దీన్ని సౌందర్య పోషకంగా ఎలా వాడాలి అంటారా? 

* మెంతిలో అధిక మోతాదులో లభించే ప్రొటీన్‌ జుట్టు రాలడాన్ని నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులోని నికోటినిక్‌, లెసిథిన్‌ కుదుళ్లు బలంగా మారేందుకు, జుట్టు ఎదగడానికీ సాయం చేస్తాయి. ఇక ఇందులోని పొటాషియం చిన్నవయసులోనే శిరోజాల రంగు మారడాన్ని అరికడుతుంది. ఈ ఫలితాలు అందాలంటే గుప్పెడు మెంతుల్ని ఓ రోజంతా నానబెట్టాలి. ఆ నీటిని వడకట్టి జుట్టుని తడపండి. జుట్టుని అలాగే మూడు నాలుగు గంటలపాటు ఆరనివ్వండి. ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేసి చూడండి. ఇలా వీలైతే రోజూ చేయండి.

* తాజాగా ఉండే మెంతిఆకులను ఎంచుకుని శుభ్రంగా కడిగి మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ ముద్దకు ఓ రెండు చెంచాల నిమ్మరసం కలిపి తలకు పెట్టుకోవాలి. అరగంటాగి స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.

* పావుకప్పు మెంతుల్ని నాలుగైదు గంటల ముందు పెరుగులో నానబెట్టుకోవాలి. దాన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే రుబ్బుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించి బాగా నలుగు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. చర్మంపై పేరుకున్న దుమ్ము,ధూళి, మురికి వదిలిపోతాయి. చర్మం నునుపుగా తయారవుతుంది. ఇలా కనీసం వారంలో ఒకసారి చేస్తే యుక్తవయసు అమ్మాయిల్లో మొటిమల సమస్య తగ్గుతుంది.

No comments:

Post a Comment