WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 17 May 2016

TURMERIC MILK HEALTH BENEFITS


పశ్చిమదేశాల్లో పసుపు పాల హవా
పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు మన బామ్మలు. అందులోనూ జలుబు, దగ్గులాంటివి చేస్తే పాలల్లో పసుపు కలిపి తాగమంటారు. అయితే ఇప్పుడు ఈ డ్రింకుకు సిడ్నీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకూ మంచి డిమాండ్‌ ఉందిట! ఆశ్చర్యపోతున్నారా? నిజం. పసుపు కలిపిన పాలను పశ్చిమదేశాల్లో గోల్డెన్‌ మిల్క్ ‌గా పిలుస్తారు. దీన్నే టర్మరిక్‌ లాటె అని కూడా అంటారు. పసుపు, పాల సమ్మేళనం ఇది. ఇందులో కొబ్బరి, బాదం , జీడిపప్పు పాలను కూడా కలిపి మరింత రుచికరంగా చేస్తారు. అక్కడ దొరికే లాటెలలో టాప్‌ లిస్టులో గోల్డెన్‌ మిల్క్‌ ఉండడం విశేషం. ఈ విషయం ఆన్‌లైన్‌ సర్చ్ ‌లో వెల్లడైంది.
ఈ పాల వల్ల ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాలు బోలెడు ఉండడంతో ఎంతోమంది వినియోగదారులు గోల్డెన్‌ మిల్క్ ‌పట్ల ఆసక్తిని చూపుతున్నారు. కెఫైన్‌ డ్రింక్స్ ‌తో పోలిస్తే గోల్డెన్‌ మిల్క్‌ పూర్తిగా యాంటిఇన్‌ఫ్లమేటరీ డ్రింకు. ఉదయం పూట వీటి అమ్మకాలు బాగా ఉంటాయని లండన్‌లోని నాటిగ్‌ హిల్‌లో ఉన్న నామా అనే వేగాన్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు చెప్తున్నారు. ఆక్‌ ్సఫర్డ్‌లోని మోడరన్‌ బేకర్‌లో ఇతర ఎక్స్‌ప్రెసో షాట్స్‌, ఐస్‌ లాటేస్‌, టర్మరిక్‌ బిస్కట్స్‌తోపాటు గోల్డెన్‌ మిల్క్‌ను కూడా అమ్ముతారట. వారిదగ్గర ఉన్న అన్ని రకాల లాటే్‌సలోనూ టర్మరిక్‌ లాటె ఎక్కువగా అమ్ముడుపోతోందట. చూశారా మన పసుపుకున్న ప్రాధాన్యత. ఇక కొద్ది రోజుల్లో ఇది గ్లోబల్‌ ప్రాడెక్టుగా ప్రసిద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు.

No comments:

Post a Comment