WORLD FLAG COUNTER

Flag Counter

Monday 2 May 2016

SOLUTION TO DANDRUFF PROBLEMS IN TELUGU


చుండ్రు సమస్యకు పరిష్కారమార్గాలు

వేసవిలో దుమ్ము, దూళి, కారణంగా ఎంత వద్దనుకొన్నా వేధించే సమస్య చుండ్రు.. చిట్కా వైద్యాలు మొదలుకొని వైద్యుల సాయంతో చికిత్సలు తీసుకొన్నా సరే చుండ్రుని తప్పించుకోవడం కష్టమే! అనిపిస్తోందా? అయితే ఆహార నియమాలు.. చిన్నపాటి జాగ్రత్తలతో చుండ్రుని అరికట్ట వచ్చంటున్నారు నిపుణులు.

గుప్పెడు మెంతులని రాత్రంతా నానబెట్టి తెల్లారి మెత్తగా రుబ్బి తలకి పట్టించాలి. ఇరవై నిమిషాల య్యాక, కుంకుడుకాయ రసంతో తల స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.
తల స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసినా మంచిదే. చుండ్రుకి కొబ్బరి నూనె చక్కని పరిష్కారం.
తల పొడిబారి దురదతో సతమతమయ్యే వారికి నిమ్మనూనె చక్కని ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలిపి తలకు పట్టించడం వల్లా ఫలితం ఉంటుంది.
శిరోజాలు వత్తుని బట్టి గుడ్డులోని తెల్ల సొనలని తీసుకొని అరచెక్క నిమ్మరసాన్ని జోడించాలి. ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంటపాటు ఉంచి నిమ్మ సుగుణాలున్న సబ్బుతో తలస్నానం చెయ్యాలి. చుండ్రు నెమ్మదిగా నియంత్రణలోకి వస్తుంది.
చెంచా ఆలివ్‌ నూనె, చెంచా బాదం నూనె రెండింటిని కలిపి తలకు పట్టించాలి. పావుగంట తర్వాత కడిగి తలస్నానం చేస్తే కొన్ని వారాల్లోనే చుండ్రు బాధ తగ్గుతుంది.
వేపుళ్లని తగ్గించి ఆహారంలో తాజా పండ్లు, కాయగూరలని తినడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. నాణ్యతలేని రకరకాల జెల్‌లు, షాంపూల వాడకం కూడా చుండ్రు తీవ్రతను పెంచుతుందని గుర్తుంచు కోవాలి.

No comments:

Post a Comment