WORLD FLAG COUNTER

Flag Counter

Monday 16 May 2016

SKIN CARE BEAUTY TIPS WITH HONEY


తేనెతో చర్మం కాంతివంతం

చర్మం కాంతివంతంగా ఉండడానికి తేనె ఎంతో ఉపయోగపడుతుంది. తేనెలో యాంటిబ్యాక్టీరియల్‌ ప్రాపర్టీస్‌ పుష్కలంగా ఉన్నాయి. అందువల్లే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు రావు. తేనెను నేరుగా చర్మం మీద పూసుకోవచ్చు. అది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీళ్లతో చర్మాన్ని కడిగేసుకోవాలి. తేనెలోని నీరు చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అంతేకాదు స్కిన్‌ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. ఇలా రోజూ చేయొచ్చు లేదా రోజు విడిచి రోజు చేయొచ్చు. అలాగే రెండు టీస్పూన్ల పాలు, ఒక టీస్పూను తేనెలో ఒక టీస్పూను శనగపిండి కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖం ఎంతో కాంతివంతమవుతుంది.

No comments:

Post a Comment