WORLD FLAG COUNTER

Flag Counter

Monday 2 May 2016

HEALTH BENEFITS WITH ThATI MUNJALU


ప్రకృతి ఇచ్చిన వేసవి వరం తాటి ముంజలు.
ప్రకృతి వరప్రసాదమైన ఈ ముంజలను ఐస్ ఆపిల్స్‌గా పిలుస్తుంటారు. ఎండాకాలంలో మాత్రమే లభించే ఈ ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మంచి చలువ కూడా. కేలరీలు, విటమిన్లు అధికంగా ఉన్న ఈ ముంజలను తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు.తాటి ముంజల్లో ఉండే పోషక విలువలు శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి. సహజ సిద్ధమైన ముంజలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని వైద్య నిఫుణులు చెబుతున్నారు. వేసవి వచ్చిందంటే తాటి ముంజలు కోసం అందరూ ఎదురుచూస్తూంటారు. కల్తీ లేకుండా ఉండే తాటిముంజలు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. మండు వేసవిలో ముంజలు తింటే ఉష్ణతాపానికి చెక్ పెట్టవచ్చు. ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పిని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.శరీరం కూడా ఎంతో చల్లగా , హాయిగా ఉంటుంది. అంటువంటి తాటిముంజలు ప్రజలకు దొరికే విధంగా నగరాల్లో దర్శనం ఇస్తున్నాయి….
తాటి ముంజను తొలవగానే మధ్యలో కొంత నీరు ఉంటుంది. ఆ నీరు మాత్రం నోరూరించే రుచిగా ఉంటుంది. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. తాటి ముంజ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది.
ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ముసలి వాళ్లకి చాలా మంచిది. వీటిలో అధికంగా తేమ, తక్కువ కొవ్వు పదార్థాలు కలిగి చిన్నారులకు, హుద్రోగులకు, షుగర్‌ వ్యాధి గ్రస్తులకు, స్థూల కాయులకు ఎంతాగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి దోహదం చేయడంతో పాటు దాహార్తికి కూడా మంచి విరుగుడు.ముంజల్లో ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటాయి. వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం శ్రేయస్కరం. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై మొటిమలు వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ముంజలను తినడం మంచిది.
తాటి ముంజులలో శరీరానికి కావాల్సిన ఏ , బీ , సీ విటమిన్లు ఐరన్ , జింక్ , పాస్ఫరస్ , పొటాషియం వంటి పోషకాలు అందుతాయి. శరీర బరువును తగ్గించడంలో కూడా ముంజులు తోడ్పడతాయి. వాటిలో అధికంగా నీరు ఉండడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ. తాటి ముంజలతో కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగించడంలో దోహదపడతాయి. వేసవిలో సహజ సిద్ధంగా వచ్చే అలసట , నీరసం ముంజల తినడం వల్ల తగ్గుతాయి. వేసవిలో ఎండలు కారణంగా కొంత మందికి విరేచనాలు , వాంతులు అయ్యే పరిస్థితి ఉంటుంది , వాటికి నిమ్మరసం ఇస్తారు , ఆ సమయంలో ముంజులు తినడం వల్ల శారీరక ఉపశమనం పొందవచ్చు. కేన్సర్ కణాల నిరోధానికి ముంజలు ఉపయోగపడతాయి. ట్యూమర్ , బ్రెస్ట్ కేన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రో కెమికల్స్ , ఆంథోసైనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావాల్సిన మినరాల్స్ , న్యూట్రిన్ లను బ్యాలెన్స్ చేయడంలో ముంజలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు..

No comments:

Post a Comment