WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 31 May 2016

HEALTH AND BEAUTY BENEFITS WITH PAPAYA / BOPPAYA SEEDS


బొప్పాయి విత్తనాల్లో దాగి ఉన్న ఆరోగ్యకర ప్రయోజనాలు

బొప్పాయి పండ్లే కాదు వాటి విత్తనాలు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. పలు అనారోగ్యాలను దూరం చేయడంలో ఇవి కూడా బాగానే పనిచేస్తాయి. బొప్పాయి విత్తనాలను పచ్చిగా అలాగే తినవచ్చు. వాటి రుచి అంతగా నచ్చని వారు సలాడ్స్ వంటి వాటిలో బొప్పాయి విత్తనాలను కలిపి తినవచ్చు. అయితే ఎలా తిన్నా బొప్పాయి విత్తనాల వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. ఆ ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
👉

1. ఐదు లేదా 6 బొప్పాయి విత్తనాలను తీసుకుని వాటిని నలిపి ఏదైనా పండ్ల రసం లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవాలి. నెల రోజుల పాటు ఇలా చేస్తే లివర్ శుభ్ర పడుతుంది. శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి.
👉

2. బొప్పాయి విత్తనాలను తరచూ తింటుంటే కిడ్నీ సంబంధ సమస్యలను దూరం చేసుకోవచ్చని పలువురు పరిశోధకులు వెల్లడించారు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో బొప్పాయి విత్తనాలు బాగా పనిచేస్తాయి.
👉

3. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ప్రధానంగా కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.
👉

4. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ధర్మాలు కూడా బొప్పాయి విత్తనాలకు ఉన్నాయి. ఈ-కొలి వంటి బాక్టీరియాలను నిర్మూలించడంలో ఇవి మెరుగ్గా పనిచేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
👉

5. క్యాన్సర్ కణాలు, ట్యూమర్లు వృద్ధి చెందకుండా చూస్తాయి. పలు క్యాన్సర్లను అడ్డుకునే శక్తి వీటికి ఉంది.
👉

6. కడుపు, పేగుల్లో వృద్ధి చెందే హానికర బాక్టీరియాలను నిర్మూలిస్తాయి.
👉

7. అప్పుడే సంతానం వద్దనుకునే వారికి ఇవి కాంట్రాసెప్టివ్ మాత్రల్లా ఉపయోగపడతాయి. జీర్ణక్రియను వృద్ధి చెందిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను పోగొడతాయి.

No comments:

Post a Comment