WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 25 May 2016

DEEPARADHANA PUJA SECRETS AND RESULTS


దీరాధనలో వత్తులను బట్టి ఫలితాలుంటాయా ?

దీపం జ్యోతిస్వరూపమైన భగవంతుడిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. తన చుట్టూ వెలుగును వెదజల్లుతూ చీకట్లను తరిమికొడుతూ ఉంటుంది. వెలుగు శుభానికి ప్రతీక కనుక ప్రతి శుభకార్యం ... దైవకార్యం దీపాన్ని వెలిగించడంతో ఆరంభమవుతుంది. అయితే పూజను ఆరంభిస్తూ చేసే ఈ దీపారాధనలో ఎన్నో నియమాలు ఉన్నాయి.

ప్రమిదలోని వత్తిని ఎలా వెలిగించాలి ? ... దీపారాధనకి ఏ నూనె వాడాలి ? ... ఎన్ని వత్తులువేయాలి ? ... ఎన్ని వత్తులు వేయడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి ? అనేవి ఈ నియమాలలో భాగంగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా కొంతమంది ప్రమిదలో ఒక వత్తి మాత్రమే వేసి దీపారాధన చేస్తుంటారు. అలాంటి సమయంలో ఆ వత్తికి అడ్డంగా మరో వత్తిని వేయాలని శాస్త్రం చెబుతోంది.

ప్రమిదలో అడ్డవత్తి వేయకుండా నిలువు వత్తి వెలిగించడం దోషాలను కలిగిస్తుంది. ఇక ప్రమిదలో ఎన్ని వత్తులు వేసి వెలిగించినా దానివలన వచ్చే ఫలితంలో ఎలాంటి మార్పు ఉండదని కొందరు భావిస్తుంటారు. కానీ నియమంగా చెప్పబడుతోన్న సంఖ్య ప్రకారం ఎన్ని వత్తులు వాడటం వలన అన్ని రకాల ఫలితాలు ఉంటాయని చెప్పబడుతోంది. ఒక వత్తిని మాత్రమే వెలిగించడం వలన ఫలితం నామమాత్రంగా ఉంటుంది.

రెండు వత్తులను వెలిగించడం వలన ఆరోగ్యం ... మూడు వత్తులను వెలిగించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతాయి. నాలుగు వత్తులతో దీపారాధన చేయడం వలన దుఃఖాలు దూరంకాగా ... ఐదు వత్తులను ఉపయోగించడం వలన సకల సంపదలు కలుగుతాయి. ఇక తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన సందలతో పాటు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయని చెప్పబడుతోంది.

No comments:

Post a Comment